ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే అఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్. ఈ సారి తన వినియోగదారుల కోసం ఒకే ప్లాన్‌లో బోలెడు ప్రయోజనాలను అందివ్వాలని నిర్ణయించుకుంది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లో.. డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, DTH ప్రయోజనాలను ఒక రీచార్జ్‌తో కస్టమర్లకు సొంతం చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్‌ను ఎయిర్‌టెల్ బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది.
ఇప్పటికే ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌పై ఒకే బిల్లులో ఫైబర్, డీటీహెచ్ మొబైల్‌తో సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్‌టెల్ సర్వీసులను కలిపేందుకు ఎయిర్‌టెల్ బ్లాక్ యూజర్లకు అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ ద్వారా జీరో-స్విచింగ్ ఇన్‌స్టాలేషన్ ఖర్చులతో పాటు జీవితకాలపు ఉచిత సర్వీస్ కూడా పొందవచ్చు. వీటిని రూ. 699 నుంచి 2,999 వరకు వివిధ రకాల ప్లాన్‌లతో అందిస్తోంది. వీటిపై ఓ లుక్కేద్దాం!
రూ. 699 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్: ఇది ఎయిర్‌టెల్ అందించే ఎంట్రీ-లెవల్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఫైబర్ ద్వారా 40Mbps అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు DTH కనెక్షన్‌లో రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar), సోనీ లివ్( Sony Liv), Airtel XStream యాప్‌తో పాటు మరో 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్లాన్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందించదు, కాబట్టి దీనిని ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా కొనుగోలు చేయవచ్చు.
రూ. 899 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 105 GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో రెండు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లను అందిస్తోంది ఎయిర్‌టెల్. ఈ ఆఫర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీంతో పాటు 12 ఇతర యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్, రూ. 350 విలువైన (డీటీహెచ్) DTH టీవీ ఛానెల్‌లు ఉన్నాయి.
రూ. 1098 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 100Mbps స్పీడ్‌తో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తుంది. 75 GB ఇంటర్నెట్‌తో పాట అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
రూ. 1099 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్: ఈ సబ్‌స్క్రిప్షన్ ల్యాండ్‌లైన్ ద్వారా అపరిమిత కాలింగ్, ఫైబర్‌పై 200Mbps వరకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, మరో 13 యాప్‌లతో సహా రూ.350 విలువైన OTT ఛానెల్‌లకు కూడా కస్టమర్లు యాక్సెస్ పొందుతారు.
రూ. 1599 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్: అన్‌లిమిటెడ్ కాలింగ్, 300Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో వస్తుంది. ఇందులో రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో డీటీహెచ్ కనెక్షన్ వస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, మరిన్ని OTT ప్రయోజనాలు ఉంటాయి.
రూ. 1799 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌లో ఫైబర్, అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో కూడిన ల్యాండ్‌లైన్ వస్తుంది అది కూడా గరిష్టంగా 200Mbps స్పీడ్‌తో ఉపయెగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 190GB డేటా , 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లతో అపరిమిత కాలింగ్ ఉంది. అదనంగా OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ఇతర సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్నాయి.
రూ. 2299 ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ : ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, 300 Mbps డేటాతో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందించే అత్యంత ఖరీదైన ప్లాన్. 240 GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లు పొందవచ్చు. అంతేనా ఇంకా రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH కనెక్షన్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, (Airtel Xstream) మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment