DTH services
-
ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే అఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. ఈ సారి తన వినియోగదారుల కోసం ఒకే ప్లాన్‌లో బోలెడు ప్రయోజనాలను అందివ్వాలని నిర్ణయించుకుంది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లో.. డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, DTH ప్రయోజనాలను ఒక రీచార్జ్‌తో కస్టమర్లకు సొంతం చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్‌ను ఎయిర్టెల్ బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇప్పటికే ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌పై ఒకే బిల్లులో ఫైబర్, డీటీహెచ్ మొబైల్‌తో సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్టెల్ సర్వీసులను కలిపేందుకు ఎయిర్టెల్ బ్లాక్ యూజర్లకు అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ ద్వారా జీరో-స్విచింగ్ ఇన్స్టాలేషన్ ఖర్చులతో పాటు జీవితకాలపు ఉచిత సర్వీస్ కూడా పొందవచ్చు. వీటిని రూ. 699 నుంచి 2,999 వరకు వివిధ రకాల ప్లాన్లతో అందిస్తోంది. వీటిపై ఓ లుక్కేద్దాం! రూ. 699 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఇది ఎయిర్టెల్ అందించే ఎంట్రీ-లెవల్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఫైబర్ ద్వారా 40Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు DTH కనెక్షన్లో రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లకు యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar), సోనీ లివ్( Sony Liv), Airtel XStream యాప్‌తో పాటు మరో 12 ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్లాన్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందించదు, కాబట్టి దీనిని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా కొనుగోలు చేయవచ్చు. రూ. 899 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 105 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో రెండు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లను అందిస్తోంది ఎయిర్టెల్. ఈ ఆఫర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీంతో పాటు 12 ఇతర యాప్‌లకు సబ్స్క్రిప్షన్, రూ. 350 విలువైన (డీటీహెచ్) DTH టీవీ ఛానెల్‌లు ఉన్నాయి. రూ. 1098 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 100Mbps స్పీడ్‌తో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తుంది. 75 GB ఇంటర్నెట్తో పాట అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. రూ. 1099 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ సబ్స్క్రిప్షన్ ల్యాండ్‌లైన్ ద్వారా అపరిమిత కాలింగ్, ఫైబర్‌పై 200Mbps వరకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, మరో 13 యాప్‌లతో సహా రూ.350 విలువైన OTT ఛానెల్‌లకు కూడా కస్టమర్లు యాక్సెస్ పొందుతారు. రూ. 1599 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: అన్లిమిటెడ్ కాలింగ్, 300Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌తో వస్తుంది. ఇందులో రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో డీటీహెచ్ కనెక్షన్ వస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, మరిన్ని OTT ప్రయోజనాలు ఉంటాయి. రూ. 1799 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్‌లో ఫైబర్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో కూడిన ల్యాండ్‌లైన్ వస్తుంది అది కూడా గరిష్టంగా 200Mbps స్పీడ్‌తో ఉపయెగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 190GB డేటా , 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లతో అపరిమిత కాలింగ్ ఉంది. అదనంగా OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ఇతర సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. రూ. 2299 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ : ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, 300 Mbps డేటాతో ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందించే అత్యంత ఖరీదైన ప్లాన్. 240 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్‌తో 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు పొందవచ్చు. అంతేనా ఇంకా రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లతో DTH కనెక్షన్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, (Airtel Xstream) మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
టీవీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్...!
టీవీ ప్రేక్షకులకు షాకింగ్ న్యూస్..! ఈ ఏడాది డిసెంబరు నుంచి డీటీహెచ్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు నెట్వర్క్ కంపెనీలు టీవీ ఛానళ్ల రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. న్యూ టారిఫ్ ఆర్డర్ 2.0 (ఎన్టీవో)లో భాగంగా జీ, స్టార్, సోనీ, వైకామ్18 వంటి సంస్థలు అందించే ఛానళ్లను ఆయా ప్యాకేజ్ నుంచి తీసివేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీవీ ప్రేక్షకులపై అదనంగా 35 నుంచి 50 శాతం మేర ఛార్జీల మోత మోగనుంది. 2017లో ట్రాయ్ ఎన్టీఓ పాలసీను తీసుకువచ్చింది. ఎన్టీఓ 2.0 తో టీవీ ప్రేక్షకులకు నచ్చిన ఛానల్‌కు మాత్రమే ఛార్జీలను చెల్లించే సదుపాయాలను కల్పించింది. ట్రాయ్ తెచ్చిన ఎన్టీవో 2.0 పాలసీ మేరకు పలు నెట్వర్క్ కంపెనీలకు భారీగా గండి పడుతోంది.దీంతో అత్యధిక ప్రాచుర్యం పొందిన ఛానళ్లను బండిల్ ఆఫర్ల నుంచి తీసివేయాలని నెట్వర్కింగ్ కంపెనీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి మాత్రం పండగే..! డీటీహెచ్ సేవల పెంపు నిర్ణయం ఓటీటీ సేవలకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 రాకతో దేశవ్యాప్తంగా ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డీటీహెచ్ సేవలకు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఎందుకు డబుల్ చెల్లించాలనే భావనతో ప్రేక్షకులు ఉండగా....వీటీలో ఎదో ఒక దానికి మాత్రమే సబ్‌స్రైబ్ చేసుకునే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, సోనీ లివ్, వూట్ సెలక్ట్, జీ5, సన్‌నెక్ట్స్ వంటి ఓటీటీలు ఏడాదికి రూ.3645 ఖర్చు అవుతోంది. అదే డీటీహెచ్ బేస్ సేవలకు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Revolt Motors: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు రివోల్ట్ శుభవార్త..! -
ఎయిర్టెల్ బ్లాక్ ... సరికొత్త ప్లాన్ !
ముంబై: వినియోగదారులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఎయిర్టెల్ రెడీ అయ్యింది. మొబైల్ రీఛార్జీ, డైరెక్ట్ టూ హోం, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ మూడు సర్వీసులకు ఒకే బోకేగా అందిస్తూ ఎయిర్టెల్ బ్లాక్ పేరుతో సరికొత్త ప్లాన్ అమల్లోకి తేనుంది. ఎయిర్టెల్ బ్లాక్ ఎయిర్ టెల్ అందిస్తున్న మొబైల్, డీటీహెచ్, ఫైబర్ సర్వీసుల్లో ఏవైనా రెండు సర్వీసులు పొందుతున్న వారు ‘ఎయిర్ బ్లాక్’ పొందేందుకు అర్హులు. ఎయిర్ టెల్బ్లాక్ పథకంలో సింగిల్ బిల్, సింగిల్ కస్టమర్ కేర్ సెంటర్, ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్, కస్టమైజ్డ్ ప్లాన్స్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. అంతేకాదు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎయిర్టెల్ ఎక్స్ట్రీం బాక్స్ సర్వీసులు పొందవచ్చు. ఈ పథకం వల్ల కస్టమైజ్డ్ ప్లాన్స్ లభించడంతో పాటు ఎయిర్ టెల్ సర్వీసులకు వేర్వేరుగా బిల్లులు చెల్లించే ఇబ్బంది తొలగి పోతుందని కంపెనీ చెబుతోంది. ఉపయోగాలు వేర్వేరు బిల్లలు కట్టే శ్రమ తప్పుతుంది. సమయం ఎక్కువగా పట్టే ఐవీఆర్ పద్దతిలో కాకుండా ఒక నిమిషం వ్యవధిలోనే కస్టమర్ కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడవచ్చు. రెండు వేర్వేరు సేవలకు సంబంధించి ప్లాన్స్‌ను ఒకే బండిల్లో పొందవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్‌ను డౌన్లోడు చేసుకుంటే అందులో ఎయిర్టెల్ బ్లాక్‌కి సంబంధించిన పూర్తి సమాచారం , ప్లాన్ వివరాలు ఉంటాయి. చదవండి : వోడాఫోన్ ఐడియా మూతపడనుందా? -
రూ. 22 వేల కోట్లకు డీటీహెచ్ ఆదాయాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాల కారణంగా ప్రజలు ఇంటిపట్టునే ఉంటుండటం డీటీహెచ్ సంస్థలకు లాభించనుంది. టీవీ ప్రసారాల వీక్షణ గణనీయంగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్–టు–హోమ్ బ్రాడ్కాస్టర్ల ఆదాయం 6 శాతం మేర వృద్ధి చెంది రూ. 22,000 కోట్లకు చేరనుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అయితే, ఆదాయం పెరిగినప్పటికీ వృద్ధి రేటు మాత్రం గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో ఉండకపోవచ్చని పేర్కొంది. దేశీయంగా మొత్తం టీవీ సబ్‌స్క్రయిబర్స్‌లో డీటీహెచ్ వాటా 37 శాతం దాకా ఉంటుంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధి నమోదైంది. (ఐటీ ఆదాయ వృద్ధిపై కరోనా పడగ) ఇందులో 9 శాతం వాటా.. యూజర్ల సంఖ్య పెరగడం ద్వారా రాగా, ప్రతి యూజరుపై సగటు ఆదాయాలు (ఏఆర్పీయూ) పెరగడం వల్ల మరో 5 శాతం వచ్చిందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ గుప్తా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో యూజర్ల సంఖ్య మరో 6–7 శాతం పెరిగి 6.8 కోట్లకు చేరవచ్చని, తద్వారా ఆదాయ 4–6 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. కానీ, బహుళ టీవీలున్న యూజర్లకు చార్జీలు తగ్గించడం తదితర అంశాల కారణంగా ఏఆర్పీయూ మాత్రం 1–2 శాతం మేర క్షీణించి రూ. 310–315 స్థాయికి రావచ్చని తెలిపారు. (రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..) దీపక్ ఫెర్టిలైజర్స్ రైట్స్ ఇష్యూ: రూ.133 న్యూఢిల్లీ: దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ రైట్స్ ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.133గా ఖరారు చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.180 కోట్ల సమీకరణకు కంపెనీ ఈ ఏడాది మే నెలలో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఇందుకు సంబంధించి నిబంధనలకు బోర్డు ఆమోదం తెలిపిందని, రూ.10 ముఖ విలువ కలిగిన షేరు రైట్స్ ఇష్యూ ధరగా రూ.133ను నిర్ణయించినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రికార్డు తేదీగా సెప్టెంబర్17ను ఖరారు చేసింది. ఆ తేదీ నాటికి కంపెనీ వాటాలను కలిగిన వారు రైట్స్ ఇష్యూకు అర్హులవుతారు. ప్రతీ 20 షేర్లకు మూడు షేర్ల చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చు. -
బుల్లితెర వినోదం ఇక భారమే..!
సత్తెనపల్లి: కేబుల్ కనెక్షన్ పేదలకు ఇక భారం కానుం ది. ఇప్పటివరకు కేబుల్ కనెక్షన్ ఉంటే నెల పూర్తయిన తరువాత ఆయా ప్రాంతాలను బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. కేబుల్ కనెక్షన్ ద్వారా 200 నుంచి 250 చానళ్లు ప్రసారం అయ్యేవి. ఇందులో 80 వరకు పే చానళ్లు ఉండేవి. వీటిలో వార్తా చానళ్లు, స్పోర్ట్స్ చానళ్ళు, వినోద చానళ్ళు, హిందీ, ఇంగ్లిషు, ఒరియా, తమిళం, మళయాళం తదితర భాషల చానళ్లు ఉండేవి. ప్రస్తుతం నూతన నిబంధనల ప్రకారం 150 ఎయిర్ ఫ్రీ చానళ్లు (జనరల్)కు రూ.130తో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు కావాలనుకునే పే చానళ్లను ఎంపిక చేసుకుని వాటి రుసుం చెల్లిస్తే వారు కోరుకున్న చానళ్ల ప్యాకేజీలు మాత్రమే ప్రసారం అవుతాయి. ప్రస్తుతం కేబుల్ కనెక్షన్ ద్వారా ప్రసారం అవుతున్న చానళ్లన్నీ ఫిబ్రవరి ఒకటి నుంచి చూడాలంటే రూ.300 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సి వస్తుంది. గతంలో ఇంత పెద్ద మొత్తం డీటీహెచ్‌ల ద్వారా వినియోగదారులు చెల్లించేవారు. తాజాగా దేశవ్యాప్తంగా డీటీహెచ్, కేబుల్ వినియోగదారులందరూ తాము చూస్తున్న చానళ్లకు చెల్లింపులు జరిపే సౌలభ్యాన్ని కల్పించినా, దీని వల్ల వినియోగదారులపై భారం పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. రూ.250 నుంచి రూ.300 వరకు... ఉదాహరణకు కేబుల్ కనెక్షన్ ఉన్న వినియోగదారుడు ఎయిర్ ఫ్రీ చానళ్ల కోసం రూ.130, దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా జీటీవీ, మాటీవీ, జెమిని, ఈటీవీ వంటి చానళ్లు చూడాలనుకుంటే ఆయా ప్యాకేజీలకు ఆయా యాజమాన్యాలు నిర్దేశించిన మొత్తాన్ని జోడించి దానికి జీఎస్టీని కలిపి ఆపరేటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన కేవలం తెలుగు చానళ్లనే ఎంపిక చేసుకుంటే నెలకు రూ.250 నుంచి రూ.280 వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్పోర్ట్స్, ఇతర చానళ్లు కావాలంటే మరికొంత డబ్బు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కాకుండా ఇతర చానళ్లు కావాలంటే మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ నిర్ణయంపై సుప్రీం కోర్టులో కేసు వేసినప్పటికీ సుప్రీం కోర్టు తీర్పు ట్రాయ్ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి కచ్చితంగా కొత్త రేట్లు, కొత్త విధానం అమలులోకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేబుల్ ఆపరేటర్ల సంఘం, దేశంలోని కొన్ని కేబుల్ ఆపరేటర్ల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు ఆరు నెలలు గడువు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చి వినియోగదారులకు భారం అయ్యే పరిస్థితి ఉంటుంది. -
ఇక సామాన్యుడు టీవీ చూడలేడా..
దైనందిన జీవితంలో టీవీ ఒక భాగంగా.. విడదీయలేని బంధంగా మారింది. ఉదయం నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు ఇంట్లో టీవీ నడుస్తూనే ఉంటుంది. టీవీలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తించి ఆస్పత్రులు, దుకాణాలు, చివరకు టీ షాపుల్లో కూడా టీవీ పెడుతున్నారు యజమానులు. మారుతున్న లైఫ్ స్టైల్‌కు తోడుగా కొత్త కొత్త చానళ్లు పుట్టుకోస్తున్నాయి. ఒక్కో వయస్సు వారు ఒక్కో తీరు చానల్‌కు అలవాటు పడిపోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈనెల 29 నుంచి టారిఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారి బిల్లు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అల్లిపురం(విశాఖ దక్షిణం): బుల్లితెర(టీవీ) ప్రేక్షకులకు కొత్త సంవత్సరం నుంచి వినోదం మరింత భారం కానుంది. కేబుల్ టీవీతో పాటు డీటీహెచ్‌ల ద్వారా ప్రసారం అవుతున్న ప్రసారాలను వీక్షించే వినియోగదారులు ఇక అదనపు భారం మోయకతప్పదు. కేబుల్ ప్రసారాలపై టెలికామ్ రెగ్యూలెటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారీఫ్‌ను ప్రకటించింది. కొత్త ఎమ్మార్పీ ప్రకారం టెలివిజన్ ప్రేక్షకులు ప్రస్తుతం ప్రతి నెలా చెల్లిస్తున్న బిల్లుల కన్నా ఎక్కువగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడనుంది. దీంతో విశాఖ నగర పరిధిలో సుమారు 5 లక్షలు, రూరల్ పరిధిలో దాదాపు 4 లక్షల మంది మొత్తం 9 లక్షల మంది వినియోగదారులపై భారం పడనుంది. కొత్త విధానంతో బాదుడు ఇప్పటి వరకు అన్ని చానళ్లు ఒకే ప్యాకేజీలో తక్కువ ధరకే వచ్చేవి. ట్రాయ్ కొత్త నింబంధనలతో ఇక చానళ్ల ధరలు కొండెక్కనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెలనెలా చెల్లిస్తున్న రూ.150 నుంచి రూ.200 దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. డీటీహెచ్ ధరలు కూడా అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త కేబుల్ విధానం ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్‌కు ప్రీపెయిడ్ పద్ధతిలో ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఉచితంగా ప్రసారమవుతున్న చానళ్లకు మాత్రమే కేబుల్ టీవీ సంస్థలకు రూ.130తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా చానళ్లు చూడాలనుకుంటే అదనంగా డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం విధానం ప్రకారం వచ్చే చానళ్లన్నీ ఈనెల 29తో నిలిచిపోనున్నాయి. 30 నుంచి ఫ్రీ టూ ఎయిర్ చానళ్లు మాత్రమే వస్తాయి. కేబుల్ టీవీ ప్రసారం చేస్తున్న చానళ్లలో ఉచితంగా వార్తా చానళ్లు, వినోదభరితమైన చానళ్లు, కొన్ని స్పోర్ట్స్ చానళ్లు వీక్షించవచ్చు. ప్రస్తుతం నెలకు రూ.200 నుంచి రూ.250 వరకు చార్జీలు తీసుకుంటున్న తరుణంలో..మారిన టారిఫ్ ప్రకారం రూ.130తో పాటు జీఎస్టీ 18శాతం చెల్లిస్తే ఫ్రీ ఎయిర్ చానళ్లు వస్తాయి. మిగతా చానళ్ల ప్రసారానికి ట్రాయ్ నిర్ధేశింంచిన నింబంధనల ప్రకారం చార్టీలు చెల్లించి రీచార్జ్ చేసుకుంటేనే వీక్షించే అవకాశం ఉంటుంది. నిరసన బాటలో కేబుల్ ఆపరేటర్లు కొత్త టారిఫ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని, దీనిని మరికొద్ది రోజులు వాయిదా వేయాలని కేబుల్ ఆపరేటర్లు డిమాండ్ చేస్తూ ఈ నెల 29న నిరసనకు సిద్ధమవుతున్నారు. ప్రజల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఒకేసారి భారం వేయకుండా, ప్రస్తుతం వస్తున్న చానళ్లను వెంటనే నిలిపివేయకుండా కొద్ది రోజులు ప్రసారం చేయడానికి కేబుల్ ఆపరేటర్లు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. చానళ్ల వారీగా రుసుములు స్టార్ మా చానెల్ ప్యాకేజీ : మా మూవీస్, మా గోల్డ్, మా మ్యూజిక్, స్టార్‌స్పోర్ట్స్, మరో ఎంటర్టైన్మెంట్ చానల్(నెల ఖర్చు): రూ.39 జెమిని చానెల్ ప్యాకేజీ : జెమిని మూవీస్, జెమిని కామెడీ, జెమిని మ్యూజిక్, ఖుషి టీవీ, జెమిని లైఫ్, జెమిని న్యూస్ : రూ.30 జీ తెలుగు ప్యాకేజీ : జీ తెలుగు, జీ సినిమా : రూ.20 కేవలం మా టీవీ, జెమిని, జీ తెలుగు, ఈ టీవీ చానళ్లను చూడాలంటే ఒక్కో చానల్ ప్రసారానికి రూ.19 ఈ విధంగా స్టార్ మా, సోనీ, స్పోర్ట్సు చానళ్లకు ప్యాకేజీలు నిర్ణయించారు. వాటికి 18 శాతం జీఎస్టీ అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఆ పైన ప్రతి చానల్‌కు ఒక రేటు పెట్టి దానిపై కూడా జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితి. ఈ విధంగా జీఎస్టీ భారం ప్రతి చానల్‌కు కట్టడం వల్ల ఎక్కువ శాతం జీఎస్టీ కట్టాల్సిందే. చానళ్ల వారీగా వసూలు దారుణం ప్రజలు వినోదం, ప్రశాంతత కోసం టీవీ చూస్తుంటారు. దీనిని కూడా కేంద్రం ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. ప్రజలకు టీవీ వినోదాన్ని దూరం చేస్తున్నాయి. ట్రాయ్ కొత్త నిబంధనలతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. చానళ్లకు రేటు, ప్యాకేజీలకు డబ్బులు చెల్లించే పరిస్థితులు చాలా దారుణం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి పెంచిన ధరలు సడలించాలి.– మద్దాల వెంకటవరలక్ష్మి,గృహిణి, పాత వెంకోజిపాలెం -
జియో మరో సంచలనం
టెలికాం మార్కెట్, ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, ఇక డీటీహెచ్ స్పేస్‌లోనూ తన హవా చాటేందుకు వచ్చేస్తోంది. జియోహోమ్ టీవీ సర్వీసు కింద జియో ఎస్డీ, హెచ్డీ ఛానల్స్‌ను రూ.400కే అందించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టెలికాంటాక్ రిపోర్టు ప్రకారం జియో రూ.200కు ఎస్డీ ఛానల్స్‌ను, రూ.400కు ఎస్‌డీప్లస్‌హెచ్‌డీ ఛానల్స్‌ను జియోహోమ్ టీవీ సర్వీసుతో ఆఫర్ చేయనున్నట్టు తెలిసింది. అయితే జియోహోమ్ టీవీ సర్వీసులను ప్రత్యేకంగా అందించనుందని రిపోర్టు చెబుతోంది. కంపెనీ ఎప్పటి నుంచో సొంతంగా డీటీహెచ్ సర్వీసులను భారత్‌లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. జియోహోమ్ టీవీ సర్వీసులు, ఎప్పటి నుంచో మార్కెట్లో రూమర్లు కొడుతున్న జియో సెటాప్ బాక్స్ సర్వీసులను రీప్లేస్ చేయనున్నాయా? లేదా వీటిని వేరుగా లాంచ్ చేయనుందా? అనేది క్లారిటీగా తెలియరాలేదు. రిపోర్టుల ప్రకారం మెరుగైన మల్టీమీడియా బ్రాడ్కాస్ట్ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్) కింద జియోహోమ్ టీవీ రన్ అవనున్నట్టు తెలిసింది. ఈఎంబీఎంఎస్ అనేది హైబ్రిడ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఒకే సారి పెద్ద మొత్తంలో యూజర్లను పొందగలదు. గత రెండేళ్లుగా ఈ సర్వీసులను జియో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో క్వార్టర్లో రానున్నట్టు సమాచారం. -
బిగ్ టీవీని విక్రయించిన ఆర్‌కామ్
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సోమవారం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) సర్వీసుల రంగంలో ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమించిన సంస్థగా పేరొందిన బిగ్ టీవీ విక్రయాన్ని కూడా ఆర్ కాం పూర్తి చేసింది. నష్టాలను తగ్గించుకునే పనిలో ఇప్పటికే 2,3జీ సేవలకు గుడ్ బై చెప్పిన ఆర్‌కాం బిగ్ టీవీని అమ్మేసింది. తన ప్రత్యక్ష-హోం (డిటిహెచ్) అనుబంధ సంస్థ రిలయన్స్ బిగ్ టీవీని వీకాన్ మీడియాకు విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీకాన్ మీడియా అండ్ టెలివిజన్ లిమిటెడ్ (VMTL)తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. రిలయన్స్ బిగ్ టీవీలోని మొత్తం వాటా వీకాన్ సొంతమవుతుందని వెల్లడించింది. అన్ని వర్తక బాధ్యతలతో పాటు కాంట్రాక్ట్ రుణాలు కూడా కొనుగోలు సంస్థకే చెందుతాయని ఆర్‌కాం ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ బిగ్ టీవీ మొత్తం వాటాతో పాటు, దాదాపు 500 మంది ఉద్యోగులను కూడా వీకాన్ సొంతం చేసుకుటుందని భరోసా ఇచ్చింది. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ సంస్థలు, ఆర్‌కామ్ లెండర్లు, ఇతర సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని చెప్పింది. అవసరమైన బ్యాంకు హామీలను సమర్పించిన తరువాత ప్రస్తుత డీటీహెచ్ లైసెన్స్ సమాచార మరియు బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా పునరుద్ధరించబడుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. 1.2 మిలియన్ల కస్టమర్ల బిగ్ టీవీ సేవలను వినియోగదారులు నిరంతరాయంగా సేవలను పొందుతారనీమ వివరించింది. ఈ విక్రయం ద్వారా వచ్చే నిధుల ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోనున్నట్టు తెలిపింది. అలాగే కంపెనీ రుణదాతలు, వాటాదారులతో సహా షేర్ హోల్డర్స్ అందరికి లబ్ది చేకూరుతుందని చెప్పింది. మరోవైపు ఈ వార్తలతో ఆర్‌కాం ఇవాల్టి మార్కెట్లో 6శాతానికిపైగా నష్టపోయింది. -
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ అన్లిమిటెడ్ డేటా
జియోతో పోటీకి అనుగుణంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన ప్లాన్లను రివ్యూ చేస్తోంది. మై హోం పథకంలో మరో బంపర్ఆఫర్ తో ముందుకువవచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్లో మునుపటి 5 జీబీ డేటా ఆఫర్‌ను రెట్టింపు చేసింది. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రకారం ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ తోపాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ , డిజిటల్టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మై ఎయిర్టెల్ ఆప్‌లో మై హోమ్ ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది. మై హోం యాప్‌లో ప్రస్తుతం అందుబాటులోఉందనీ, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ లేదా ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ లేదా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సర్వీస్ కలిగిన వినియోగదారులు ఈ అవకాశాన్నివినియోగించుకోవచ్చని తెలిపింది. గతంలో 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జులై 1, 2016కి ముందు ప్రారంభించిన వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడంతోపాటు, బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల (ఇప్పటివరకు 25 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, 25డీటీహెచ్ కనెక్షన్లకు పరిమితం) పరిమితులను కూడా తొలగించింది. కాగా మూడు నెలల ఉచిత ఆఫర్ తో జియో డీటీహెచ్ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చాయి. సెట్ టాప్ బాక్సుల సాయంతో 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలనూ పొందవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారనే పలు అంచనాలతో పాటు సెట్ టాప్ బాక్సుల ఫోటోలు వీటి స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
మరో సంచలనానికి రెడీ అవుతున్న జియో
టెలికాం మార్కెట్లో దూకుడుగా ఉన్న రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయబోతుందట. డీటీహెచ్ సర్వీసు స్పేస్ లోకి రిలయన్స్ జియో అరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. జియో డీటీహెచ్ లకు సంబంధించిన సెటాప్ బాక్స్ ఇమేజ్ లు ప్రస్తుతం ఆన్ లైన్ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న ఈ సెటాప్ బాక్స్ ల మాదిరిగానే దీర్ఘచతురస్రాకారంలో ఇవి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ లో యూఎస్బీ పోర్టు కూడా ఉంది. బ్లూ రంగులో ఉన్న ఈ బాక్స్ లపై రిలయన్స్ జియో బ్రాండు ముద్రించి ఉంది.యూఎస్బీ తో పాటు స్టాండర్డ్ కేబుల్ కనెక్టర్, హెచ్డీఎంఐ, వీడియో, ఆడియో అవుట్ పుట్ లు దీనిలో ఉన్నట్టు తెలుస్తోంది.. 360 పైగా చానళ్లను జియో టీవీ ఆఫర్ చేయనుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. వాటిలో 50 హెచ్డీ ఛానల్స్ ఉండబోతున్నాయట. వాయిస్ తోనే ఛానల్స్ ను సెర్చ్ చేసుకునే విధంగా యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. హీరో, హీరోయిన్ పేరు చెబితే చాలు, వారి సినిమాలు ఏ ఛానలో వస్తాయో తెలుస్తుందట. డేటా సర్వీసుల మాదిరిగానే డీటీహెచ్ విభాగంలోనూ జియో సంచలనాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తుందని ఈ ఆన్ లైన్ ఇమేజ్ ల బట్టి వెల్లడవుతుందని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. ప్రత్యర్థి డీటీహెచ్ సర్వీసుల కంటే చాలా తక్కువ రేటుకు ఛానళ్లను అందుబాటులోకి తేనుందని చెబుతున్నారు. తొలుత ముంబాయిలో ప్రారంభించిన అనంతరం ఈ సేవలను దేశవ్యాప్తంగా కంపెనీ విస్తరించనుందని టాక్. -
ఐపీవో ప్రణాళికల్లో టాటా స్కై
రూ. 2,000 కోట్ల సమీకరణపై దృష్టి ముంబై: డీటీహెచ్ సర్వీసులు అందించే టాటా స్కై దాదాపు రూ. 2,000 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సన్నద్ధమవుతోంది. వచ్చే వారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు కంపెనీ ఇన్వెస్టర్లు, యాజ మాన్యం, అండర్‌రైటల్లు మొదలైన వారు భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లయిన టాటా సన్స్, టెమాసెక్‌లకు ప్రస్తుతమున్న షేర్లను విక్రయంచడంతో పాటు కొత్తగా మరిన్ని షేర్లను జారీ చేయనున్నట్లు వివరించాయి. మోర్గాన్ స్టాన్లీ, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ సంస్థలు ఈ ఇష్యూని నిర్వహించనున్నాయి. టాటా గ్రూప్‌నకు సంబంధించి చివరిగా టీసీఎస్ 2004లో లిస్టయింది. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత టాటా స్కై లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. టాటా గ్రూప్‌లో లిస్టయిన కంపెనీల జాబితాలో ఇది 30వది కానుంది. గ్రూప్ చైర్మన్‌గా 2012లో వచ్చిన సైరస్ మిస్త్రీ చొరవతో టాటా స్కై ఐపీవో అంశం తెరపైకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల లాభం రూ. 1,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. టాటా స్కైలో టాటా సన్స్‌కు 51%, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కి చెందిన ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు 30%, సింగపూర్‌కి చెందిన టెమాసెక్‌కు 10%, టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌కు 9% వాటాలు ఉన్నాయి.