ఐపీవో ప్రణాళికల్లో టాటా స్కై | Tata Group's Cyrus Mistry plans Rs 2000 crore IPO for Tata Sky | Sakshi
Sakshi News home page

ఐపీవో ప్రణాళికల్లో టాటా స్కై

Mar 26 2016 12:42 AM | Updated on Sep 3 2017 8:34 PM

ఐపీవో ప్రణాళికల్లో టాటా స్కై

ఐపీవో ప్రణాళికల్లో టాటా స్కై

డీటీహెచ్ సర్వీసులు అందించే టాటా స్కై దాదాపు రూ. 2,000 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సన్నద్ధమవుతోంది.

రూ. 2,000 కోట్ల సమీకరణపై దృష్టి
ముంబై: డీటీహెచ్ సర్వీసులు అందించే టాటా స్కై దాదాపు రూ. 2,000 కోట్ల   పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సన్నద్ధమవుతోంది. వచ్చే వారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు కంపెనీ ఇన్వెస్టర్లు, యాజ మాన్యం, అండర్‌రైటల్లు మొదలైన వారు భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్‌లో భాగంగా ప్రమోటర్లయిన టాటా సన్స్, టెమాసెక్‌లకు ప్రస్తుతమున్న షేర్లను విక్రయంచడంతో పాటు కొత్తగా మరిన్ని షేర్లను జారీ చేయనున్నట్లు వివరించాయి. మోర్గాన్ స్టాన్లీ, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ సంస్థలు ఈ ఇష్యూని నిర్వహించనున్నాయి.

టాటా గ్రూప్‌నకు సంబంధించి చివరిగా టీసీఎస్ 2004లో లిస్టయింది. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత టాటా స్కై లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. టాటా గ్రూప్‌లో లిస్టయిన కంపెనీల జాబితాలో ఇది 30వది కానుంది. గ్రూప్ చైర్మన్‌గా 2012లో వచ్చిన సైరస్ మిస్త్రీ చొరవతో టాటా స్కై ఐపీవో అంశం తెరపైకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల లాభం రూ. 1,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. టాటా స్కైలో టాటా సన్స్‌కు 51%, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్‌కి చెందిన ట్వెంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు 30%, సింగపూర్‌కి చెందిన టెమాసెక్‌కు 10%, టాటా ఆపర్చూనిటీస్ ఫండ్‌కు 9% వాటాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement