హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ ఐపీవో 12న  | Hexaware seeks Rs 8,750 crore in trimmed listing | Sakshi
Sakshi News home page

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ ఐపీవో 12న 

Published Fri, Feb 7 2025 6:34 AM | Last Updated on Fri, Feb 7 2025 6:34 AM

Hexaware seeks Rs 8,750 crore in trimmed listing

ధర శ్రేణి రూ. 674–708 

రూ. 8,750 కోట్ల ఇష్యూ 

న్యూఢిల్లీ: డిజిటల్, టెక్నాలజీ సర్వీసుల సంస్థ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ఫిబ్రవరి 12న ప్రారంభమై 14న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 674–708గా ఉంటుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఉండే ఈ ఇష్యూ కింద ప్రమోటరు సీఏ మాగ్నమ్‌ హోల్డింగ్స్‌ రూ. 8,750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కార్లైల్‌ గ్రూప్‌లో భాగమైన మ్యాగ్నంకు ప్రస్తుతం కంపెనీలో 95.03 శాతం వాటాలు ఉన్నాయి. 

అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ ప్రకారం చూస్తే హెక్సావేర్‌ విలువ రూ. 43,000 కోట్లుగా ఉంటుంది. ఐటీ సరీ్వసుల రంగంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇది భారీ ఐపీవో కానుంది. అప్పట్లో టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్‌ రూ. 4,700 కోట్లు సమీకరించింది. హెక్సావేర్‌ ప్రధానంగా డేటా..ఏఐ, క్లౌడ్‌ సరీ్వసులు తదితర అయిదు రకాల సేవలు అందిస్తోంది. కంపెనీని గత ప్రమోటరు బేరింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఏషియా 2020లో డీలిస్ట్‌ చేసింది. దాదాపు సంవత్సరం తర్వాత 2021లో హెక్సావేర్‌లో బేరింగ్‌ వాటాలను కార్లైల్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో కంపెనీ నికర లాభం రూ. 853 కోట్లు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement