
ఈ వారం రెండు కొత్త ఐపీవోలు ప్రారంభం కానుండగా, మెయిన్‌బోర్డ్, ఎస్‌ఎంఈ విభాగంలో కలిపి 10 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ కానున్నాయి. మెయిన్ బోర్డ్‌లో 17న అజాక్స్ ఇంజనీరింగ్, 19న హెక్సావేర్ టెక్నాలజీస్, 21న క్వాలిటీ పవర్ లిస్ట్ కానున్నాయి. ఎస్‌ఎంఈ కంపెనీ హెచ్‌పీ టెలికామ్ ఐపీవో 20న ప్రారంభం కానుంది.
ఒక్కో షేరు ధర రూ.108. ప్రమోటర్లే 34.28 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో యాపిల్ ఉత్పత్తులను ఈ సంస్థ పంపిణీ చేస్తుంటుంది. సివిల్ కన్‌స్ట్రక్షన్ కార్యకలాపాల్లోని బీజాసాన్ ఎక్స్‌ప్లోటెక్ అనే మరో ఎస్‌ఎంఈ ఐపీవో 21న మొదలు కానుంది. 34.24 లక్షల తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో కంపెనీ రూ.60 కోట్లు సమీకరించాలనుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment