IPOs
-
లాభాల ‘ఆఫర్లు’.. క్యూకట్టిన ఇన్వెస్టర్లు
సరిగ్గా మూడేళ్ల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. భారీ లాభాలతో కళకళలాడాయి. ఈ క్యాలండర్ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను (IPO) చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ (Record) కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్‌స్థాయిలో క్యూకట్టారు. ఫలితంగా లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలవగా.. 17 మాత్రం నష్టాలతో ముగిశాయి.వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ మరుగున పడింది. ఇందుకు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీస్థాయిలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, సులభతర లావాదేవీల నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో అధిక శాతం కంపెనీలు లాభాలతో లిస్టయ్యి ఇన్వెస్టర్ల ఆసక్తిని మరింత పెంచాయి.వెరసి కొత్త ఏడాది (2025)లోనూ మరిన్ని కొత్త రికార్డులకు వీలున్నట్లు మార్కెట్నిపుణులు భావిస్తున్నారు. మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్‌డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది!భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai IPO)రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ (Swiggy IPO) రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజినీర్స్, బీఎల్ఎస్ ఈసర్వీసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి.మరింత స్పీడ్ డిసెంబర్ చివరి వారంలో స్పీడ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల ప్యాకేజింగ్ మెషినరీ తయారీ కంపెనీ మమతా మెషినరీ లిస్టింగ్‌లో ఇష్యూ ధర రూ.243తో పోలిస్తే 147% ప్రీమియంతో రూ.600 వద్ద నమోదైంది. రూ.630 వద్ద ముగిసింది. ఈ బాటలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఎంఏ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇష్యూ ధర రూ.283తో పోలిస్తే 39% అధికంగా రూ.393 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 61% ఎగసి రూ.457 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 47% లాభంతో రూ.415 వద్ద స్థిరపడింది.విద్యుత్ ప్రసారం, పంపిణీల ఈపీసీ కంపెనీ ట్రాన్స్‌రైల్ లైటింగ్ షేరు ఇష్యూ ధరరూ.432తో పోలిస్తే 35% ప్రీమియంతో రూ.585 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 40% ఎగసి రూ.604 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 28% లాభంతో రూ.553 వద్ద ముగిసింది. విభిన్న యార్న్ తయారీ సనాతన్ టెక్స్టైల్స్ ఇష్యూ ధర రూ.321తో పోలిస్తే 31% అధికంగా రూ.419 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 31% పెరిగి రూ.423 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 21% లాభంతో రూ.389 వద్ద స్థిరపడింది.వాటర్ ప్రాజెక్టుల కంపెనీ కంకార్డ్ ఎన్విరో ఇష్యూ ధర రూ.701తో పోలిస్తే 19% అధికంగా రూ.832 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 23% ఎగసి రూ.860 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 18% లాభంతో రూ.828 వద్ద స్థిరపడింది. సోమవారం(30న) వెంటివ్ హాస్పిటాలిటీ, సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్, కారారో ఇండియా లిస్ట్‌కానుండగా.. 31న యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ నమోదుకానుంది. -
ఐపీవో బూమ్!
స్టాక్ మార్కెట్లో ఐపీఓలు దుమ్ముదులిపేస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్నాయి. కేవలం లిస్టింగ్ మాత్రమే కాదు బంపర్ లాభాలతో ఇన్వెస్టర్లను రారమ్మని ఊరిస్తున్నాయి. ఈ ఏడాది (2024)లో మొత్తం 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్ కాగా.. వీటిలో అధిక శాతం ఇష్యూలకు ఇన్వెస్టర్లు రికార్డ్ స్థాయిలో క్యూ కట్టారు. వెరసి 2021లో 63 కంపెనీలు సమకూర్చుకున్న రూ. 1.2 లక్షల కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూసినప్పటికీ ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్ (బీఎస్ఈ) తొలిసారి సెపె్టంబర్ 27న 85,978 పాయింట్లకు చేరగా.. నిఫ్టీ (ఎన్ఎస్ఈ) 26,277ను తాకింది. ఈ బాటలో ఐపీవో మార్కెట్ మరింత కళకళలాడింది. ప్రధాన విభాగంలో ఏకంగా 91 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. తద్వారా మొత్తం రూ. 1,60,500 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందుకు ఆరి్థక వ్యవస్థ పురోభివృద్ధి, కంపెనీల ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు, నగదు లభ్యత, భారీగా పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడులు, లావాదేవీల సులభతర నిర్వహణకు వీలు తదితర అంశాలు తోడ్పాటునిచ్చాయి. దీంతో పలు ఐపీవోలకు గరిష్ట స్థాయిలో బిడ్డింగ్ లభించగా.. లిస్టింగ్ రోజు 64 కంపెనీలు లాభాలతో నిలిచాయి. 17 మాత్రమే నష్టాలతో ముగిశాయి. భారీ ఇష్యూల తీరిలా... 2024లో కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27,870 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీవోగా రికార్డులకెక్కింది. ఇదేవిధంగా ఫుడ్ అగ్రిగేటర్ యాప్ స్విగ్గీ రూ. 11,327 కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ. 10,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 6,560 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 6,145 కోట్లు అందుకున్నాయి. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ ఐపీవోకు 200 రెట్లు అధిక బిడ్స్ లభించాయి. ఇక వన్ మొబిక్విక్, యూనికామర్స్ ఈసొల్యూషన్స్, డిఫ్యూజన్ ఇంజనీర్స్, బీఎల్ఎస్ ఈసరీ్వసెస్, ఎక్సికామ్ టెలి ఇష్యూలకు 100 రెట్లుపైగా స్పందన నమోదైంది. విభోర్ స్టీల్, బీఎల్ఎస్, బజాజ్ హౌసింగ్, కేఆర్ఎన్ లిస్టింగ్ రోజు 100 శాతం లాభపడ్డాయి. వచ్చే ఏడాదీ మెరుపుల్... సెబీకి దాఖలైన 89 కంపెనీల ఐపీవో దరఖాస్తుల ప్రకారం 2025లో రూ. 2.5 లక్షల కోట్ల సమీకరణకు వీలున్నట్లు అంచనా. వీటిలో ఇప్పటికే 34 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. ఈ జాబితాలో రిలయన్స్ జియో, ఎన్ఎస్ఈ ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా, టాటా క్యాపిటల్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, హీరో ఫిన్‌కార్ప్, ఎన్ఎస్డీఎల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, కెనరా రోబెకో, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ వంటివి . దీంతో కొత్త ఏడాది ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయనే ఆసక్తి నెలకొంది!సగటు పరిమాణం అప్...ఈ ఏడాది చిన్న, మధ్యతరహా, భారీ కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగాయి. దీంతో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,700 కోట్లను దాటింది. 2023లో ఇది కేవలం రూ. 867 కోట్లుగా నమోదైంది. ఏడాది చివరి నెల (డిసెంబర్)లోనూ 15 కంపెనీలు ఐపీవోలకు రాగా.. సెకండరీ మార్కెట్లో నికర అమ్మకందారులుగా నిలుస్తూనే విదేశీ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కట్టడం విశేషం! ఈ నెల 24 వరకూ ముగిసిన 90 ఇష్యూల ద్వారా అన్‌లిస్టెడ్ కంపెనీలు రూ.1.6 లక్షల కోట్లను సమీకరించాయి.సోమవారం (23న) ప్రారంభమైన యూనిమెక్ ఏరోస్పేస్ మరో రూ. 500 కోట్లు అందుకోనుంది. గతేడాది (2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు మాత్రమే సమీకరించాయి. ఈ బాటలో మరోపక్క ఎస్ఎంఈ విభాగం సైతం రికార్డ్ నెలకొల్పడం గమనార్హం! ప్రైమ్‌డేటా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 238 ఎస్ఎంఈలు రూ. 8,700 కోట్లు సమకూర్చుకున్నాయి. 2023లో లిస్టింగ్ ద్వారా ఎస్ఎంఈలు అందుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది! -
పబ్లిక్ ఆఫర్ల వెల్లువ!
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇష్యూల ద్వారా కంపెనీలు దాదాపు రూ. 12,000 కోట్లు సమీకరించనున్నాయి. సెబీ ఆమోదం పొందిన వాటిల్లో ఈకామ్ ఎక్స్‌ప్రెస్, స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్ బయోఎనర్జీ, ఇంట్రర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ), కెరారో ఇండియా, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్టు–సెపె్టంబర్ మధ్య తమ ముసాయిదా పత్రాలను సమరి్పంచగా, నవంబర్ 26–29 మధ్య సెబీ.. అబ్జర్వేషన్లను జారీ చేసింది. సెబీ పరిభాషలో అబ్జర్వేషన్ల ను ఐపీవో ప్రతిపాదనకు ఆమోదంగా పరిగణిస్తారు. ఐజీఐ.. 4,000 కోట్లుఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం రూ. 1,250 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌లో భాగమైన ప్రమోటరు, బీసీపీ ఆసియా టూ టాప్కో రూ. 2,750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. సహజసిద్ధమైన వజ్రాలు, ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాలు మొదలైన వాటికి సరి్టఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. ఇతర కంపెనీల వివరాలు.. ⇒ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈకామ్ ఎక్స్‌ప్రెస్ రూ. 1,284.50 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు..ఇతర షేర్హోల్డర్లు రూ. 1,315.50 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. ⇒ బ్లాక్‌స్టోన్ గ్రూప్, పంచశీల్ రియల్టీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన వెంటివ్ హాస్పిటాలిటీ ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలో ఉండనుంది. సంస్థకు భారత్, మాల్దీవుల్లో బిజినెస్, లీజర్ విభాగాల్లో ఆతిథ్య రంగ లగ్జరీ అసెట్స్ ఉన్నాయి. వెంటివ్లో పంచశీల్కు 60 శాతం, బ్లాక్‌స్టోన్‌కు మిగతా 40 శాతం వాటాలు ఉన్నాయి. ⇒ స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించనుండగా, ప్రమోటర్లు 67.59 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. ⇒ కెరారో ఇండియా రూ. 1,812 కోట్లు సమీకరించేందుకు ఐపీవో తలపెట్టింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం సెల్లింగ్ షేర్‌హోల్డరయిన కెరారో ఇంటర్నేషనల్ సంస్థ.. తమ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. కెరారో ఇండియా 1997లో ఏర్పాటైంది. ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, యాక్సిల్స్ తయారీతో కార్యకలాపాలు ప్రారంభించింది. ⇒ బయోఫ్యుయెల్ తయారీ దిగ్గజం ట్రూఆల్ట్ బయోఎనర్జీ ప్రతిపాదిత ఐపీవో ఇటు కొత్త షేర్ల జారీ, అటు ఓఎఫ్ఎస్ రూపంలో ఉండనుంది. రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు 36 లక్షల షేర్లను విక్రయించనున్నారు. బెంగళూరుకు చెందిన ట్రూఆల్ట్ బయోఎనర్జీ ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది.రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 1,400 కిలోలీటర్లుగా ఉంది⇒ ఎని్వరాన్మెంటల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ తలపెట్టిన ఇష్యూలో భాగంగా రూ. 192.3 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. ప్రమోటర్లు, ఇన్వెస్టరు.. ఓఎఫ్ఎస్ కింద 51.94 లక్షల షేర్లను విక్రయించనున్నారు. 2025లో జెప్టో ఐపీవో...క్విక్‌కామర్స్ దిగ్గజం జెప్టో వచ్చే ఏడాది (2025) పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్ పాలిచా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల 35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,950 కోట్లు) సమీకరణతో జెప్టో పూర్తిస్థాయిలో దేశీ కంపెనీగా ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు సమకూర్చడం దీనికి కారణమని తెలియజేశారు. కంపెనీ నికర లాభాలు ఆర్జించే బాటలో సాగుతున్నట్లు వెల్లడించారు. క్విక్‌కామర్స్ విధానాలు సంప్రదాయ కిరాణా స్టోర్ల వృద్ధిని దెబ్బతీస్తున్నట్లు వెలువడుతున్న ఆరోపణలను కొట్టిపారేశారు. -
ఐపీవోలు.. అదే స్పీడ్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతూనే ఉన్నాయి. వచ్చే నెల(డిసెంబర్)లో 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. ఈ జాబితాలో సూపర్‌మార్ట్ దిగ్గజం విశాల్ మెగా మార్ట్తోపాటు.. బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్(ఇండియా), విద్యారుణాలందించే ఎన్బీఎఫ్సీ అవాన్సే ఫైనాన్షియల్ సరీ్వసెస్, టీపీజీ క్యాపిటల్ సంస్థ సాయి లైఫ్ సైన్సెస్, ఆసుపత్రుల చైన్ పారస్ హెల్త్‌కేర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా, ప్యాకేజింగ్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ మమతా మెషినరీ, ట్రాన్స్‌రైల్ లైటింగ్ ఉన్నాయి.వివిధ రంగాలు, విభిన్న పరిమాణంలో కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు స్టాక్ మార్కెట్లో సానుకూల సెంటిమెంటుకు తెరతీయనున్నట్లు ఆన్లైన్ బ్రోకరేజీ ట్రేడ్జినీ సీవోవో త్రివేష్.డి. అభిప్రాయపడ్డారు. దీంతో ప్రైమరీ మార్కెట్ మరింత కళకళలాడే వీలున్నట్లు అంచనా వేశారు. ఈ ఏడాది(2024) ఐపీవోలకు అత్యంత ప్రోత్సాహకరంగా సాగినప్పటికీ ఇటీవల కొంతమేర ప్రతికూల ధోరణి నెలకొన్నట్లు తెలియజేశారు. ఇష్యూల వివరాలు విశాల్ మెగా మార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రమోటర్ సమయత్ సరీ్వసెస్ ఎల్ఎల్పీ వాటాను విక్రయించనుంది. ఇక జెమ్మలాజికల్ ఇన్స్టిట్యూట్ రూ. 4,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. దీనిలో భాగంగా రూ. 1,250 కోట్లు తాజా ఈక్విటీ జారీసహా.. రూ. 2,750 కోట్ల విలువైన షేర్లను బ్లాక్‌స్టోన్ సంస్థ, ప్రమోటర్ బీసీపీ ఏషియా–2 టాప్కో పీటీఈ ఆఫర్ చేయనుంది. కాగా.. వార్బర్గ్ పింకస్ సంస్థ ఒలివ్ వైన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసిన అవాన్సే ఫైనాన్షియల్ రూ. 3,500 కోట్లు సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా రూ. 1,000 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్ల విక్రయం ద్వారా రూ. 2,500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ నిధులను మూలధన పటిష్టతకు వెచి్చంచనుంది. రికార్డ్ సమీకరణ ఈ ఏడాది ఇప్పటికే 75 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. ఇది రికార్డ్ కాగా.. జాబితాలో హ్యుందాయ్ మోటార్ ఇండియా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై), ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ చేరాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ ద్వారా గతేడాది(2023)లో 57 కంపెనీలు రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి. సుమారు 236 కంపెనీలు 2021–25 మధ్య కాలంలో ఐపీవోలకు వచ్చాయి. సగటున 27 శాతం లిస్టింగ్ లాభాలను అందించడం గమనార్హం.సురక్ష: రూ. 420–441 సమీకృత డయాగ్నోస్టిక్ చైన్ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూ శుక్రవారం(29న) ప్రారంభంకానుంది. డిసెంబర్ 3న ముగియనున్న ఇష్యూకి రూ. 420–441 ధరల శ్రేణిని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు 1,91,89,330 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 846 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే ఈక్విటీ జారీ లేనందున ఇష్యూ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు లభించబోవు. -
4 ఐపీవోలకు సెబీ ఓకే.. లిస్ట్‌లో హైదరాబాదీ కంపెనీ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3,000 కోట్ల సమీకరణకు సంబంధించి నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయి లైఫ్ సైన్సెస్, రూబికాన్ రీసెర్చ్, సనాతన్ టెక్స్టైల్స్, మెటల్‌మ్యాన్ ఆటో వీటిలో ఉన్నాయి. ఇవి జూలై–ఆగస్టు మధ్యకాలంలో తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించాయి. అక్టోబర్ 31న సెబీ ఆమోదం లభించింది.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రమోటరు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతరత్రా షేర్హోల్డర్లు 6.15 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 600 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతా నిధులను కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు .. ఔషధాల ఫార్ములేషన్ కంపెనీ రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 585 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్‌కు రూబీకాన్ రీసెర్చ్‌లో 57 శాతం పైగా వాటాలు ఉన్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 310 కోట్ల మొత్తాన్ని, రుణాల చెల్లింపు కోసం, మిగతాది ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం రూబీకాన్ వినియోగించుకోనుంది.మరోవైపు, సనాతన్ టెక్స్టైల్స్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 300 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నాయి. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 210 కోట్ల మొత్తాన్ని .. అనుబంధ సంస్థ సనాతన్ పాలీకాట్కి సంబంధించి దీర్ఘకాలిక మూలధన అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే రూ. 175 కోట్లను రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.అటు మెటల్‌మ్యాన్ ఆటో సంస్థ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ విధానంలో ప్రమోటర్లు 1.26 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 25 కోట్ల మొత్తాన్ని మధ్యప్రదేశ్‌లోని పిథంపూర్‌లో 2వ యూనిట్లో యంత్రపరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. -
మెగా ఐపీఓ వేవ్!
స్టాక్ మార్కెట్లో బుల్ రంకెల నేపథ్యంలో పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 62 కంపెనీలు దాదాపు రూ.64,513 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాయి. ఇందులో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 6,550 కోట్లు), ఫస్ట్‌క్రై (రూ. 4,194 కోట్లు), ఓలా ఎలక్ట్రిక్ (రూ.6,146 కోట్లు), డిజిట్ ఇన్సూరెన్స్ (2,165 కోట్లు) తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది మొత్తంమీద 57 కంపెనీలు కలిపి రూ.49,436 కోట్ల నిధులను మార్కెట్ నుంచి దక్కించుకున్నాయి. దీంతో పోలిస్తే ఈ ఏడాది 29 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, మరో 75 కంపెనీలు రూ.1.5 లక్షల కోట్ల నిధుల వేట కోసం ఆవురావురుమంటూ వేచిచూస్తున్నాయి. ఇందులో 23 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. హ్యుందాయ్ ఇండియా, స్విగ్గీకి ఇప్పటికే సెబీ ఇప్పటికే ఓకే చెప్పగా... తాజాగా విశాల్ మెగామార్ట్, ఆక్మే సోలార్, మమతా మెషినరీకి కూడా ఆమోదం లభించింది. సెబీ లైన్ క్లియర్ చేసిన ఐపీఓల విలువ దాదాపు రూ.72,000 కోట్లు! మిగా 53 కంపెనీలు రూ.78 వేల కోట్ల నిధుల సమీకరణ బాటలో ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కాగా, రూ. 1,19,882 కోట్ల నిధుల సమీకరణతో 2021 ఏడాది అత్యధిక ఐపీఓల రికార్డును దక్కించుకుంది. మార్కెట్ రికార్డు పరుగుల నేపథ్యంలో మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆమోదం లభించినవి డిసెంబర్‌లోపు గనుక ఐపీఓలను పూర్తి చేసుకుంటే 2024 గత రికార్డును బ్రేక్ చేసే చాన్సుంది!! -
ఈ వారం ఐపీఓల ఇన్వెస్టర్లకు పండగే
-
దిగ్గజ ఐపీవోలకు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. రూ. 5,500 కోట్లకు రెడీ ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్అండ్డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్‌కు, రూ. 1,600 కోట్లు ఆర్‌అండ్‌డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఎమ్క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281 ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. -
Tata Group: ఇన్వెస్టర్లకు పండగే.. టాటా గ్రూప్ నుంచి వరుస ఐపీఓలు
-
IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..
ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒక్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్‌కి వచ్చాయి. 2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే.. ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఫోన్‌పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది. ఆకాష్: బైజూస్ అనుబంధ సంస్థ అయిన ఎడ్టెక్ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా. ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్ చేసింది. ఫార్మ్ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు. మొబీక్విక్: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌తో కలిసి సుమారు 84 మిలియన్ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్‌కు వస్తోంది. పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్‌కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది. -
రికార్డు స్థాయిల్లో స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలకు చేరడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఇదే వారంలో 11 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన తరుణంలో మార్కెట్ వర్గాలు పబ్లిక్ ఇష్యూలపై కన్నేయోచ్చు. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. ‘‘అధిక వాల్యుయేషన్లు, ఎల్‌నినో ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక మందగమనం పరిణామాల నేపథ్యంలో స్వల్ప కాలం పాటు స్టాక్ సూచీలు రికార్డు స్థాయిల వద్ద స్థిరీకరణకు లోనవచ్చు. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 21,700 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,000 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లు స్థిరీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21500 – 21600 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సానుకూలతలు, ఫెడ్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచన, ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు నేపథ్యంలో గతవారం సూచీలు 2.32% ర్యాలీ చేశాయి. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయం, యరోజోన్ నవంబర్ ద్రవ్యల్బోణ డేటా డిసెంబర్ 19న(మంగళవారం) విడుదల కానున్నాయి. అదే రోజున భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అమెరికా దిగ్గజ ఐటీ కన్సలి్టంగ్ సంస్థ యాక్సెంచర్ ఆర్థిక సంవత్సరం 2024 తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. జపాన్ నవంబర్ వాణిజ్య లోటు, బ్రిటన్ నవంబర్ ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ అక్టోబర్ కరెంట్ ఖాతా, అమెరికా నవంబర్ గృహ అమ్మకాలు బుధవారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రస్తుత సంవత్సరపు మూడో క్వార్టర్ జీడీపీ డేటా గురువారం వెలువడుతుంది. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ ద్రవ్యోల్బణం, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల అవుతాయి. కీలక ఈ స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించే వీలుంది. ప్రథమార్థంలో రూ.29,700 కోట్ల కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్ ప్రథమార్థంలో రూ.27,000 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘మూడు ప్రధాన రాష్ట్రాల్లో అధికార పార్టీ బీజేపీ గెలుపుతో రాజకీయ స్థిరత్వం రావొచ్చనే అంచనాలు, మెరుగైన ఆర్థిక వృద్ధి, మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడ్ సరళతర ద్రవ్య విధాన అమలు యోచనలు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లను ప్రోత్సహించాయి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీప్ హెడ్ విజయకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఐటీ, ఇన్ఫ్రా, పారిశ్రామిక రంగాల షేర్లను కొనుగోళ్లు చేశారు. రానున్న రోజుల్లో లాభాల స్వీకరణకు పాల్పడొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 పబ్లిక్ ఇష్యూలు 8 లిస్టింగులు ఈ వారంలో ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు 12 కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్‌కు రానున్నాయి. ఇందులో ప్రధాన విభాగం(8 కంపెనీలు)తో పాటు చిన్న మధ్య తరహా స్థాయి(4 కంపెనీలు) విభాగానికి చెందినవి ఉన్నాయి. ముత్తూట్ మైక్రో ఫిన్, మోతీసన్స్ జ్యువెలర్స్, సురజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఐపీఓలు సోమవారం ప్రారంభమై బుధవారం ముగుస్తాయి. హ్యాపి ఫోర్జ్, ఆర్బీజెడ్ జ్యువెలర్స్, క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఐపీఓలు డిసెంబర్ 19–21 మధ్య జరగునున్నాయి. అజాద్ ఇంజనీరింగ్స్ పబ్లిక్ ఇష్యూ 20–22 తేదీల్లో, ఇన్నోవా క్యాప్‌ట్యాబ్ ఐపీఓ 21–26 తేదీల్లో జరగనుంది. ఎస్ఎంఈ విభాగం నుంచి సహారా మారిటైం, శాంతి స్పిన్టెక్స్, ఎలక్ట్రో ఫోర్స్, ట్రిడెంట్ టెక్‌ల్యాబ్‌లు కంపెనీలు ఐపీఓకు సిద్ధమయ్యాయి. డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీల షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐనాక్స్ ఇండియా లిస్టింగ్ గురువారం ఉంది. చిన్న మధ్య తరహా స్థాయి విభాగం నుంచి 5 కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. -
IPO: పబ్లిక్ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్ ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ ఇండియా, మోతిసన్స్ జ్యుయలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా గ్రూప్ నుంచి 2004 తర్వాత (టీసీఎస్) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్ బాగా సందడిగా ఉందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐపీవోలు ఇవీ.. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ (ఐఎస్ఎఫ్), డోమ్స్ ఇండస్ట్రీస్ ఇష్యూలు డిసెంబర్ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్ సీవీఏ పూర్తిగా ఓఎఫ్ఎస్ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్ ఇ ష్యూ డిసెంబర్ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్ లీజర్ (మలీ్టప్లెక్స్ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్ గ్రూ ప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్ లీజర్.. పీవీఆర్ గ్రూప్‌లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మోతీసన్స్ జ్యుయలర్స్ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. -
IPOs: మరో రికార్డ్ దిశగా.. 28 కంపెనీలు.. రూ.38 వేల కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) లోనూ ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. తొలి అర్ధభాగం (ఏప్రిల్–సెప్టెంబర్) లో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకురాగా.. ద్వితీయార్థంలోనూ 28 కంపెనీలు నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. తద్వారా రూ.38,000 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికలు ప్రకటించాయి. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఐపీవోల ద్వారా 31 కంపెనీలు రూ. 26,300 కోట్లు సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. సెకండాఫ్‌లో మరింత అధికంగా నిధుల సమీకరణకు తెరలేవనుంది. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం మరో 41 కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. తద్వారా ఏకంగా రూ. 44,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. నిజానికి గతేడాది(2022–23) తొలి అర్ధభాగంతో పోలిస్తే ఇష్యూలు 14 నుంచి 31కు జంప్ చేసినప్పటికీ నిధుల సమీకరణ రూ. 35,456 కోట్ల నుంచి రూ. 26,300 కోట్లకు తగ్గింది. లిస్టింగ్ సన్నాహాలలో ఉన్న మొత్తం 69 కంపెనీలలో మూడు కొత్తతరం సాంకేతిక సంస్థలుకాగా.. ఉమ్మడిగా రూ. 12,000 కోట్ల సమీకరణపై కన్నేసినట్లు ప్రైమ్ డేటాబేస్ ఎండీ ప్రణవ్ హాల్దియా వెల్లడించారు. గతంలో జోరుగా ఈ ఏడాది తొలి అర్ధభాగం(సెప్టెంబర్)లో న్యూటెక్ సంస్థ యాత్రా మాత్రమే లిస్టయ్యింది. రూ.775 కోట్లు సమీకరించింది. అయితే గతేడాది దిగ్గజాలు పేటీఎమ్, జొమాటో, నైకా లిస్ట్‌కావడం గమనార్హం! ప్రస్తుతం మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ద్వితీయార్థంలో పలు కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు హాల్దియా అభిప్రాయపడ్డారు. సుమారు రెండు దశాబ్దాల తదుపరి టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ లిస్ట్‌కానుంది. ఇంతక్రితం 2004లో బాంబే హౌస్ కంపెనీ.. ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన విషయం విదితమే. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్ హై ఎండ్ టెక్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఆటోమోటివ్ ఈఆర్అండ్డీ సర్వీసులు సమకూర్చుతున్న కంపెనీ ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ టాటా మోటార్స్ 8.11 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు అంచనా. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్‌లలోనే అత్యధికంగా 21 కంపెనీలు ఐపీవోలు చేపట్టాయి. వీటిలో మ్యాన్‌కైండ్ ఫార్మా రూ.4,326 కోట్లు, జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.2,800 కోట్లు, ఆర్ఆర్ కేబుల్ రూ.1,964 కోట్లు సమీకరించాయి. అతితక్కువగా ప్లాజా వైర్స్ రూ. 67 కోట్లు అందుకుంది. ఓయో భారీగా ఆతిథ్య రంగ సేవలందించే ఓయో రూముల బ్రాండ్ కంపెనీ ఒరావెల్ స్టేస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 8,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ బాటలో టాటా టెక్నాలజీస్, జేఎన్‌కే ఇండియా, డోమ్ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, ఈప్యాక్ డ్యురబుల్స్, బీఎల్ఎస్ ఈ సర్వీసెస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సెల్లో వరల్డ్, ఆర్కే స్వామి, ఫ్లెయిర్ రైటింగ్ ప్రొడక్ట్స్, గో డిజిట్ ఇన్సూరెన్స్, క్రెడో బ్రాండ్ మార్కెటింగ్ తదితరాలున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ పేర్కొంది. -
ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు జోష్‌నిస్తున్నాయి. దీంతో తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇండో ఫామ్ ఎక్విప్మెంట్, విభోర్ స్టీల్ ట్యూబ్స్, సరస్వతీ శారీ డిపో.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. తద్వారా నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిని కోరుతున్నాయి. ఇండో ఫామ్ ఐపీవోలో భాగంగా ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ 1.05 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 35 లక్షల షేర్లను సైతం కంపెనీ ప్రమోటర్ రణ్‌బీర్ సింగ్ ఖడ్వాలియా విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పిక్ అండ్ క్యారీ క్రేన్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు పెట్టుబడులుగా వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, ఎన్బీఎఫ్సీ అనుబంధ సంస్థ బరోటా ఫైనాన్స్‌కు మూలధనాన్ని సమకూర్చేందుకు సైతం వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా ట్రాక్టర్లు, పిక్ అండ్ క్యారీ క్రేన్లతోపాటు ఇతర వ్యవసాయ సంబంధ పరికరాలను తయారు చేస్తోంది. విభోర్ స్టీల్ వివిధ భారీ ఇంజినీరింగ్ పరిశ్రమల్లో వినియోగించే స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ, ఎగుమతుల కంపెనీ విభోర్ స్టీల్ ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 66.47 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను వర్కింగ్ క్యాపిటల్‌సహా.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. సరస్వతీ శారీ మహిళా దుస్తుల టోకు మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే సరస్వతీ శారీ డిపో ఐపీవోలో భాగంగా 72.45 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వీటికి జతగా మరో 35.55 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. చీరలతోపాటు కుర్తీ, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాలు తదితర మహిళా దుస్తుల హోల్‌సేల్ బిజినెస్‌నూ కంపెనీ నిర్వహిస్తోంది. -
ఐపీవోల జోరు
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్ స్పేస్ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో.. కోవర్కింగ్ కార్యాలయ సంస్థ కాంటార్ స్పేస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్ స్పేస్‌లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 55 శాతమే బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్పీజీ టెర్మినల్ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రెండు కంపెనీలు రెడీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లాజిస్టిక్స్ సంస్థ వెస్టర్న్ క్యారియర్స్(ఇండియా) లిమిటెడ్ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్‌కేర్ ఎస్ఎఫ్బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్‌సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్ క్యారియర్స్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్ రాజేంద్ర సేథియా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వాప్కోస్ వెనకడుగు కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్స్ట్రక్షన్ సర్వి సుల పీఎస్‌యూ.. వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
వైభవ్ జెమ్స్, కంకార్డ్ బయోటెక్ ఐపీవోలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్‌తోపాటు రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు పెట్టుబడులున్న కంకార్డ్ బయోటెక్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆగస్ట్‌లో కంకార్డ్, సెప్టెంబర్‌లో వైభవ్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. వైభవ్ జెమ్స్ బంగారు ఆభరణాల విక్రేత వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ గ్రంధి భారత మల్లికా రత్న కుమారి(హెచ్‌యూఎఫ్) 43 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 12 కోట్లను 8 కొత్త షోరూముల ఏర్పాటుకు వినియోగించనుంది. రెండేళ్లపాటు ఇన్వెంటరీ కొనుగోలుకి మరో రూ. 160 కోట్లు కేటాయించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలను కంపెనీ విక్రయిస్తోంది. అంతేకాకుండా విశేష బ్రాండు ద్వారా ప్రీమియం జ్యువెలరీని అందిస్తోంది. కంకార్డ్ బయోటెక్ ఫెర్మంటేషన్ ఆధారిత బయోఫార్మాస్యూటికల్ ఏపీఐల తయారీ కంపెనీ కంకార్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగంగా పీఈ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్‌కు చెందిన హెలిక్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ రూ. 2.09 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంకార్డ్లో దివంగత రాకేశ్ జున్‌జున్‌వాలా, ఆయన భార్య రేఖ ఏర్పాటు చేసిన రేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సైతం పెట్టుబడులున్నాయి. కంపెనీ ప్రధానంగా అంకాలజీ, యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ తదితర ప్రత్యేక విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గుజరాత్లో మూడు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2022 మార్చికల్లా కంపెనీ 56 బ్రాండ్లతో 65 ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిలో 22 ఏపీఐలు, 43 ఫార్ములేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా వివిధ దేశాలలో 120 డీఎంఎఫ్‌లను దాఖలు చేసింది.వైభవ్ జెమ్స్ ఐపీవోకు ఓకేకంకార్డ్ బయోటెక్‌కూ సెబీ అనుమతి -
ఆర్కియన్ కెమ్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ మెరైన్ రసాయనాల తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. రూ. 386–407 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 32 రెట్లు అధిక స్పందన లభించింది. కంపెనీ 1.99 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 64.31 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల నుంచి 49 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 15 రెట్లు అధికంగా బిడ్స్ లభించగా.. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 10 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. 11న ముగిసిన ఇష్యూ ద్వారా రూ. 1,462 కోట్లకుపైగా సమకూర్చుకుంది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 658 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 805 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.61 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయించారు. తాజా ఈక్విటీ నిధులను కంపెనీ జారీ ఎన్సీడీల చెల్లింపునకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా బ్రోమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, పొటాష్ సల్ఫేట్ తయారీతోపాటు, ఎగుమతులను సైతం చేపడుతోంది. -
మళ్లీ ఐపీవోల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ 8 కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. తాజాగా రెండు కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో మూడు సంస్థలు లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు అనుగుణంగా సెబీ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్ ఇష్యూ ఆలోచనకు స్వస్తి పలుకుతున్నట్లు స్టెరిలైట్ పవర్, ముక్కా ప్రొటీన్ పేర్కొనడం గమనార్హం. వివరాలు చూద్దాం.. డెల్టాటెక్ రెడీ రియల్ మనీ గేమింగ్ విభాగంలో తొలి దశలోనే కార్యకలాపాలు విస్తరించిన డెల్టాటెక్ గేమింగ్‌కు తాజాగా సెబీ నుంచి అనుమతి లభించింది. మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను లిస్టెడ్ ప్రమోటర్ సంస్థ డెల్టా కార్ప్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 150 కోట్లను బిజినెస్ విస్తరణకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతకు కేటాయించనుంది. ప్రిస్టీన్.. సై ప్రధానంగా రైల్ రవాణా నెట్‌వర్క్‌కు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయ సర్వీసులందించే ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిస్టింగ్ కోసం జూన్‌లో సెబీని ఆశ్రయించింది. తాజాగా ఇందుకు అనుమతి లభించింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 2 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, కంపెనీలోని ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కంటెయినర్, నాన్కంటెయినర్ తదితర వివిధ రైల్, రోడ్ రవాణా సంబంధ వివిధ సర్వీసులు అందిస్తోంది. ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 750 కోట్లు సమీకరించేందుకు అనుమతించమంటూ ఎయిరాక్స్ టెక్నాలజీస్ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రమోటర్లు సంజయ్ భరత్‌కుమార్ జైస్వాల్(రూ. 525 కోట్లు), ఆషిమా సంజయ్ జైస్వాల్(రూ. 225 కోట్లు) విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ప్రధానంగా పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్లను తయారు చేస్తోంది. ప్రయివేటరంగ పీఎస్ఏ మెడికల్ ఆక్సిజన్ మార్కెట్లో కంపెనీ 50–55 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2022 మార్చికల్లా దేశీయంగా దాదాపు 872 స్థాపిత పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్లు నిర్వహణలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి అనువైన మెషీనరీ, విడిభాగాలు రూపొందించే కాన్పూర్ కంపెనీ.. లోహియా కార్ప్ ఐపీవో చేపట్టేందుకు సెబీని ఆశ్రయించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా దాదాపు 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, శాక్స్ తయారు చేసేందుకు వీలైన మెషీనరీని ప్రధానంగా రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 2,000 మంది కస్టమర్ల బేస్‌ను కలిగి ఉంది. గతేడాది(2021–22)లో ఆదాయం రూ. 1,334 కోట్ల నుంచి రూ. 2,237 కోట్లకు జంప్ చేసింది. నికర లాభం రూ. 119 కోట్ల నుంచి రూ. 161 కోట్లకు ఎగసింది. ఐకియో ఐపీవోకు లెడ్ లైటింగ్ సొల్యూషన్స్ అందించే ఐకియో లైటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 237 కోట్లు సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్‌కు, కొత్త యూని ట్ ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. కంపెనీ నాలుగు తయారీ యూనిట్లను కలిగి ఉంది. స్టెరిలైట్ పవర్ గతేడాది(2021) ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన ప్రయివేట్ రంగ కంపెనీ స్టెరిలైట్ పవర్ సందిగ్ధంలో పడింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ ప్రస్తుత ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇష్యూ చేపట్టడం సరికాదని భావిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఐపీవోను వాయిదా వేసేందుకు నిర్ణయించుకున్నట్లు విద్యుత్ ప్రసారం, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ తాజాగా వెల్లడించింది. వెరసి ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలియజేసింది. అయితే మార్కెట్లు కుదురుకుంటే భవిష్యత్‌లో సెబీకి తిరిగి ప్రాథమిక పత్రాలను దాఖలు చేయనున్నట్లు వివరించింది. ముక్కా ప్రొటీన్ ఈ ఏడాది మార్చిలో సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన ముక్కా ప్రొటీన్ వెనకడుగు వేసింది. తాజాగా ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. చేపల ఆహారం, చేప నూనె, ఆక్వా, పౌల్ట్రీ రంగాలలో ఫీడ్‌గా వినియోగించే ఫిష్ సొల్యూబ్ పేస్ట్ తదితరాలను కంపెనీ ప్రధానంగా తయారు చేస్తోంది. సబ్బుల తయారీ, లెదర్, పెయింట్ల పరిశ్రమల్లోనూ కంపెనీ ప్రొడక్టులను ఉపయోగిస్తారు. -
28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్‌షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్ఇండియా, భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్ క్లినిక్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. సెంటిమెంట్ డౌన్: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్‌ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ భారీగా కరెక్షన్కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్‌లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. క్యూలో మరిన్ని కంపెనీలు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్‌యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎండీ అభిజిత్ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. -
'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్!
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. 7.8 శాతం వాటాల అమ్మకంతో ఉబర్‌కు రూ.3,305 కోట్ల వస్తాయని అంచనా వేస్తుంది. తక్కువలో తక్కువ డీల్ పరిమాణం రూ.2,938.6 కోట్లు ఉండనుంది. భారత్‌లో ఉబర్ తన ఫుడ్ డెలివరీ విభాగమైన ఉబెర్ ఈట్స్‌ను జొమాటోకు అమ్మేసింది. ఆ సమయంలో ఉబర్..జొమాటోలో వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్టాక్ లావాదేవీ డీల్ విలువ రూ.1,376 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ స్టేక్‌ను ఉబర్ అమ్మేయడంతో ఉబర్‌కు కనీసం 2.5శాతం లాభం పొందవచ్చని భావిస్తోంది. పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలు జొమాటోలో ఉన్న తన వాటాను ఆగస్ట్ 5కి క్లోజ్ చేయాలని ఉబర్ భావిస్తుంది. ఈ తరుణంలో జొమాటోలోని తన షేర్లను ఉబర్ ఎవరికి అమ్మేస్తుందని అంశంపై టర్మ్ షీట్లో వెల్లడించలేదు. అయినప్పటికీ ఉబర్ అమ్మే 7.8% వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారులు పోటీ పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వెయ్యి కోట్లు లాస్ జొమాటో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ జులై 23న ముగిసింది. లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన వారం తర్వాత ఉబర్ తన జొమాటోలోని తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత మార్కెట్ ప్రారంభమైన జులై 25 ఒక్కరోజే జొమాటో సుమారు వెయ్యి కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. -
ఐపీవో తర్వాత,తొలిసారి ఎల్ఐసీ కొత్త ప్లాన్..అదేంటో తెలుసా?
హైదరాబాద్: జీవిత బీమా పరిశ్రమలో అదిపెద్ద కంపెనీ అయిన ఎల్ఐసీ కొత్తగా బీమా రత్న పేరుతో ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది. మే 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీలతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమాతో కూడిన ప్లాన్ అని ఎల్ఐసీ తెలిపింది. ఇందులో పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించడం, మనీ బ్యాక్ ప్లాన్, గ్యారంటీడ్ అడిషన్ సదుపాయాలు ఉన్నాయి. 15, 20, 25 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. వీటిల్లో ఎంపిక చేసుకున్న ప్లాన్ కాల వ్యవధికి నాలుగేళ్లు ముందు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి ప్లాన్ తీసుకుంటే 11 ఏళ్లు ప్రీమియం చెల్లింపుల టర్మ్ ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే పాలసీ ప్లాన్ గడువు ముగిసే చివరి రెండు సంవత్సరాల్లో ఏటా 25 శాతం బేసిక్ సమ్ అష్యూర్డ్ వెనక్కి వస్తుంది. గడువు తీరిన తర్వాత మిగిలిన 50 శాతం సమ్ అష్యూర్డ్ (బీమా)తోపాటు గ్యారంటీడ్ అడిషన్స్‌ను ఎల్ఐసీ చెల్లిస్తుంది. ఈ ప్లాన్‌ను కనీసం రూ.5 లక్షల కవరేజీ, అంతకంటే ఎక్కువకు తీసుకోవచ్చు. పాలసీపై రుణం తీసుకోవచ్చు. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత కాకుండా ఐదేళ్లపాటు తీసుకునే సదుపాయం కూడా ఉంది. చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
కంపెనీల ఐపీవోకి సెబీ గ్రీన్ సిగ్నల్, టార్గెట్ రూ.7వేల కోట్లు!
న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ఇండియా, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ ఏథర్ ఇండస్ట్రీస్ సహా మొత్తం ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, సనాతన్ టెక్స్టైల్స్, క్యాపిలరీ టెక్నలజీస్ ఇండియా, హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలు దాదాపు రూ. 9,865 కోట్ల వరకూ నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇవి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో దరఖాస్తు చేసుకున్నాయి. ఏప్రిల్ 27–30 మధ్యలో సెబీ అనుమతులు మంజూరు చేసింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం ఫ్యాబ్ఇండియా .. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల వరకూ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.5 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనుంది. ఈ ఇష్యూ సుమారు రూ. 4,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అటు ఏథర్ ఇండస్ట్రీస్ ఆఫర్ ప్రకారం రూ. 757 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ మార్గంలో 27.51 లక్షల షేర్లను విక్రయించనుంది. మొత్తం మీద రూ. 1,000 కోట్ల వరకూ సమీకరించవచ్చని తెలుస్తోంది. మిగతా సంస్థలు.. ►ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏషియానెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ రూ. 765 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, హాథ్‌వే ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ రూ. 465 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనుంది. ►ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీస్ దాదాపు రూ. 1,000–1,200 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. రూ. 926 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ వీణా కుమారి టాండన్ 33.69 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. ► యార్న్ తయారీ సంస్థ సనాతన్ టెక్స్టైల్స్ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,200–1,300 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల మేర కొత్త షేర్లు, ఓఎఫ్ఎస్ కింద 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ►ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూష న్స్ అందించే క్యాపిలరీ టెక్నాలజీస్ .. ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమకూర్చుకోనుంది. పబ్లిక్ ఇష్యూ కింద తాజాగా రూ. 200 కోట్ల విలువ చేసే షేర్లు, అలాగే ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 650 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ►హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ రూ. 750 కోట్లు సమీకరిస్తోంది. రూ. 455 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రస్తుత షేర్హోల్డర్లు రూ. 300 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నారు. -
ఎల్ఐసీ ఐపీవో.. ఈ వారంలో కేంద్రం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే అంశంపై ఈ వారంలో ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే వీలున్నట్లు తెలుస్తోంది. మార్చి ముగిసేలోగా ఐపీవో పూర్తిచేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో వాయిదా పడింది. ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించే యోచనలో ఉంది. తద్వారా బీమా దిగ్గజాన్ని స్టాక్ ఎక్ఛేంజీలో లిస్ట్ చేయాలని ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇష్యూకి మే 12వరకూ గడువు ఉంది. దీంతో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిన అవసరంలేదని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇష్యూని చేపట్టే అంశం క్లిష్టంగా మారినట్లు తెలియజేశారు. రిటైల్, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల డిమాండు సానుకూలంగా ఉన్నప్పటికీ ఎఫ్‌పీఐలు తిరిగి పెట్టుబడుల బాటలోకి మళ్లేవరకూ వేచిచూసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...! -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ, నగదు లాజిస్టిక్స్ కంపెనీ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ చోటు చేసుకున్నాయి. డెల్హివరీ.. సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 7,460 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగం గా కంపెనీ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,460 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కార్లయిల్ గ్రూప్, సాఫ్ట్‌బ్యాంక్‌తోపాటు కంపెనీ సహవ్యవస్థాపకులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ 2021 నవంబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా కార్లయిల్ గ్రూప్ రూ. 920 కోట్లు, సాఫ్ట్‌బ్యాంక్ రూ. 750 కోట్లు విలువైన షేర్లను విక్రయించనున్నాయి. రేడియంట్ క్యాష్ క్యాష్ లాజిస్టిక్స్ సంస్థ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి సెబీ క్లియరెన్స్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3 కోట్ల షేర్లను ప్రమోటర్ డేవిడ్ దేవసహాయం, పీఈ సంస్థ ఎసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఆఫర్ చేయనున్నాయి. 2021 అక్టోబర్‌లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసింది. రేడియంట్‌లో ఎసెంట్ 37.2 శాతం వాటాను 2015లో కొనుగోలు చేసింది. వెరండా లెర్నింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, ఎడ్యురెకా కొనుగోలు అవసరాలు, వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. కంపెనీ 360 డిగ్రీ సమీకృత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌గా సర్వీసులు సమకూర్చుతోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ హైబ్రిడ్, ఆఫ్‌లైన్ బ్లెండెడ్ విధానాల్లో సేవలందిస్తోంది. -
2 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఇటీవల స్టాక్ మార్కెట్లు కొంతమేర ఒడిదుడుకులు చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్ మాత్రం ఉత్సాహంతో కదం తొక్కుతోంది. తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. డేటా అనలిటిక్స్, ఇన్సైట్స్ సేవల కంపెనీ కోర్స్5 ఇంటెలిజెన్స్ తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వివరాలు చూద్దాం.. ఫైవ్‌స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఎన్బీఎఫ్సీ.. ఫైవ్‌స్టార్ బిజినెస్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా సెబీ నుంచి అనుమతిని పొందింది. టీపీజీ, మ్యాట్రిక్స్ పార్టనర్స్, నార్వెస్ట్ వెంచర్స్, సీక్వోయా, కేకేఆర్‌లకు పెట్టుబడులుగల కంపెనీ సెప్టెంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,752 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఐపీవోలో భాగంగా ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా టీపీజీ ఏషియా 7 ఎస్ఎఫ్ పీటీఈ రూ. 1,350 కోట్లు, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ రూ. 569 కోట్లు, నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్ మారిషస్ రూ. 386 కోట్లు ఎస్సీఐ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 257 కోట్లు, ప్రమోటర్ గ్రూప్ రూ. 181 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్, సొంత ఆదాయం కలిగిన వ్యక్తులకు సెక్యూర్డ్ బిజినెస్ రుణాలను కంపెనీ అందిస్తుంటుంది. వారీ ఎనర్జీస్... సౌర ఇంధన రంగ కంపెనీ.. వారీ ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీ నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 40 లక్షలకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తాజా ఈక్విటీ నిధుల్లో రూ. 1,162 కోట్లను 2 గిగావాట్ల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ సెల్ తయారీ యూనిట్‌తోపాటు, 1 జీడబ్ల్యూ వార్షిక సామర్థ్యంతో గుజరాత్‌లోని చిక్లీలో నెలకొల్పనున్న సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ యూనిట్‌కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఇప్పటికే సూరత్, టంబ్, నందిగ్రామ్‌లలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. ఐపీవోకు కోర్స్5 ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్, ఇన్సైట్స్ సేవల కంపెనీ కోర్స్5 ఇంటెలిజెన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.