రెండు ఐపీఓలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ | SEBI Green Signal for two IPOs | Sakshi
Sakshi News home page

రెండు ఐపీఓలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, May 14 2018 11:46 PM | Last Updated on Tue, May 15 2018 12:13 AM

SEBI Green Signal for two IPOs - Sakshi

న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ రెండు కంపెనీల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్లకు ఆమోదం తెలిపింది. దేవీ సీ ఫుడ్స్, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓలకు పచ్చజెండా ఊపటంతో ఈ ఏడాది సెబీ ఆమోదం పొందిన ఐపీఓల సంఖ్య 18కు చేరింది.

దేవీ సీఫుడ్స్‌: విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.900 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చు. ఐపీఓలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు కొంత వాటా షేర్లను విక్రయిస్తారు.  1992లో ఆరంభమైన ఈ కంపెనీ సీఫుడ్‌ను (ముఖ్యంగా రొయ్యలు) ఎగుమతి చేస్తోంది.
ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.500 కోట్లని అంచనా. ఐపీఓలో భాగంగా 76.65 లక్షల షేర్లను ఆపర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఆఫర్‌ చేయనున్నది. 1970లో ప్రారంభమైన ఈ కంపెనీ ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్స్, రబ్బర్లు, పెయింట్స్, ఇంక్‌లు, కాస్మోటిక్స్, కోటింగ్స్, ల్యూబ్స్‌ తదితర ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలను తయారు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement