7 ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
మొత్తం రూ. 12,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదనలు
లిస్టులో ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ట్రూఆల్ట్ బయోఎనర్జీ
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇష్యూల ద్వారా కంపెనీలు దాదాపు రూ. 12,000 కోట్లు సమీకరించనున్నాయి. సెబీ ఆమోదం పొందిన వాటిల్లో ఈకామ్ ఎక్స్‌ప్రెస్, స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్ బయోఎనర్జీ, ఇంట్రర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ), కెరారో ఇండియా, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్టు–సెపె్టంబర్ మధ్య తమ ముసాయిదా పత్రాలను సమరి్పంచగా, నవంబర్ 26–29 మధ్య సెబీ.. అబ్జర్వేషన్లను జారీ చేసింది. సెబీ పరిభాషలో అబ్జర్వేషన్ల ను ఐపీవో ప్రతిపాదనకు ఆమోదంగా పరిగణిస్తారు.
ఐజీఐ.. 4,000 కోట్లు
ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం రూ. 1,250 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌లో భాగమైన ప్రమోటరు, బీసీపీ ఆసియా టూ టాప్‌కో రూ. 2,750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. సహజసిద్ధమైన వజ్రాలు, ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాలు మొదలైన వాటికి సరి్టఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది.
ఇతర కంపెనీల వివరాలు..
⇒ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈకామ్ ఎక్స్‌ప్రెస్ రూ. 1,284.50 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు..ఇతర షేర్‌హోల్డర్లు రూ. 1,315.50 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్‌ఎస్ కింద విక్రయించనున్నారు.
⇒ బ్లాక్‌స్టోన్ గ్రూప్, పంచశీల్ రియల్టీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన వెంటివ్ హాస్పిటాలిటీ ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలో ఉండనుంది. సంస్థకు భారత్, మాల్దీవుల్లో బిజినెస్, లీజర్ విభాగాల్లో ఆతిథ్య రంగ లగ్జరీ అసెట్స్ ఉన్నాయి. వెంటివ్‌లో పంచశీల్‌కు 60 శాతం, బ్లాక్‌స్టోన్‌కు మిగతా 40 శాతం వాటాలు ఉన్నాయి.
⇒ స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించనుండగా, ప్రమోటర్లు 67.59 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్ కింద విక్రయించనున్నారు.
⇒ కెరారో ఇండియా రూ. 1,812 కోట్లు సమీకరించేందుకు ఐపీవో తలపెట్టింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం సెల్లింగ్ షేర్‌హోల్డరయిన కెరారో ఇంటర్నేషనల్ సంస్థ.. తమ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. కెరారో ఇండియా 1997లో ఏర్పాటైంది. ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్, యాక్సిల్స్ తయారీతో కార్యకలాపాలు ప్రారంభించింది.
⇒ బయోఫ్యుయెల్ తయారీ దిగ్గజం ట్రూఆల్ట్ బయోఎనర్జీ ప్రతిపాదిత ఐపీవో ఇటు కొత్త షేర్ల జారీ, అటు ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉండనుంది. రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు 36 లక్షల షేర్లను విక్రయించనున్నారు. బెంగళూరుకు చెందిన ట్రూఆల్ట్ బయోఎనర్జీ ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది.రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 1,400 కిలోలీటర్లుగా ఉంది
⇒ ఎని్వరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ తలపెట్టిన ఇష్యూలో భాగంగా రూ. 192.3 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. ప్రమోటర్లు, ఇన్వెస్టరు.. ఓఎఫ్‌ఎస్ కింద 51.94 లక్షల షేర్లను విక్రయించనున్నారు.
2025లో జెప్టో ఐపీవో...
క్విక్‌కామర్స్ దిగ్గజం జెప్టో వచ్చే ఏడాది (2025) పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్ పాలిచా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల 35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,950 కోట్లు) సమీకరణతో జెప్టో పూర్తిస్థాయిలో దేశీ కంపెనీగా ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు సమకూర్చడం దీనికి కారణమని తెలియజేశారు. కంపెనీ నికర లాభాలు ఆర్జించే బాటలో సాగుతున్నట్లు వెల్లడించారు. క్విక్‌కామర్స్ విధానాలు సంప్రదాయ కిరాణా స్టోర్ల వృద్ధిని దెబ్బతీస్తున్నట్లు వెలువడుతున్న ఆరోపణలను కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment