నేటి నుంచి మూడు ఐపీఓలు | Busy week ahead with 3 IPOs | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మూడు ఐపీఓలు

Published Tue, Sep 29 2020 5:42 AM | Last Updated on Tue, Sep 29 2020 5:42 AM

Busy week ahead with 3 IPOs  - Sakshi

ప్రైమరీ మార్కెట్‌ మళ్లీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లతో కళకళలాడుతోంది. గతవారమే మూడు కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ వారం... అదీ...నేటి(మంగళవారం) నుంచి మరో మూడు ఐపీఓలు (–మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) సందడి చేయనున్నాయి. గతవారం ఐపీఓలకు  మంచి స్పందన వచ్చినట్లే ఈ ఐపీఓలకు కూడా ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభించవచ్చని అంచనా. గురువారం (అక్టోబర్‌ 1న) ముగిసి వచ్చే నెల 12న స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే ఈ ఐపీఓలకు సంబంధించి మరిన్ని వివరాలు...

మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇది. రూ.135–145 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ సైజు రూ.444 కోట్లు. కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేయాలి.  లిస్టింగ్‌ లాభాలు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చని పలు బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి.  గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌(జీఎమ్‌పీ) 90  శాతం(రూ.125–130) రేంజ్‌లో ఉండటంతో లిస్టింగ్‌లో మంచి లాభాలు వస్తాయని నిపుణులంటున్నారు.  
యూటీఐ ఏఎమ్‌సీ  
ఈ వారంలో వస్తున్న అతి పెద్ద ఐపీఓ ఇదే. రూ.552–554 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,260 కోట్లు సమీకరించగలదని  అంచనా. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌ రూ.40–42 రేంజ్‌లో ఉంది.  

లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  
ఆయిల్, గ్యాస్‌పైప్‌లైన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలందించే ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ. 117–120గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 125 షేర్లకు  దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌ రూ.20 రేంజ్‌లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement