Primary market
-
ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. ఎక్స్ లేదా వై లేదా జెడ్.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్‌లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్‌గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్‌లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్ ఉన్న ఐపీవోలో అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం. ఒకటికి మించిన దరఖాస్తులు ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్‌కు బిడ్ వేయాలి. ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఒక లాట్ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్ వేసినా కానీ, ఒక్కటే లాట్ అలాట్ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు. జాక్పాట్డిమాండ్ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్ (30) ఇటీవలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో జాక్‌పాట్ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్‌హోల్డర్ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్ఎన్ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్ రోజున బజాజ్ ఫైనాన్స్ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు. వాటాదారుల కోటా.. ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్) అప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ. అలాగే, బజాజ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫిన్సర్వ్ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్‌హోల్డర్స్ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.బిడ్స్ ఇలా...త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం లిస్టెడ్ సంస్థ హీరో మోటోకార్ప్ వాటాదారులకు కోటా రిజర్వ్ చేసింది. ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రుణం తీసుకుని మరీ..వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలు, ఒక హెచ్‌యూఎఫ్ డీమ్యాట్ ఖాతా ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్బీఎఫ్సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్ఎన్ఐ విభాగంలో బిడ్ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు. వాటాదారుల కోటాలో..ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్ మెహ్రా (43) ముందుగానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్ హోల్డర్స్ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్ అయ్యాయి. తిరస్కరణకు దూరంగా..కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోని పేరు, డీమ్యాట్ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% మేర సబ్‌్రస్కిప్షన్ రావాల్సి ఉంటుంది. కసరత్తు అవసరం.. లిస్టింగ్ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్ లాభం కోసం దరఖాస్తుచేసుకుంటే.. లిస్టింగ్ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్ నాటికి మార్కెట్ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో నష్టాలను మిగల్చవచ్చు.ఎస్ఎంఈ ఐపీవోలు మెయిన్‌బోర్డ్ ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్) కాగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.జాగ్రత్త అవసరం..ఇక ఎస్ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్‌్కను తగ్గించుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్సాల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనే ఎస్ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్‌ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్‌బోర్డ్ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్ఎంఈలకు అయితే బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. రుణంతో దరఖాస్తు... పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్‌కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్ సాయపడుతుంది. ఒక్కో పాన్‌పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్ఎన్ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు. రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్‌ను ఇన్వెస్టర్ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ ఖాతాకు ఎన్బీఎఫ్సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్బీఎఫ్సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్బీఎఫ్సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ వెనక్కి తీసుకోవచ్చు.నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్ఐఐ) అధిక నెట్‌వర్త్ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్ హెచ్ఎన్ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్స్కిప్షన్ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్ హెచ్ఎన్ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్ హెచ్ఎన్ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లో మరో నాలుగు కంపెనీలు సందడి చేయనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ జాబితాలో ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్, జేఎన్‌కే ఇండియా, ఎక్సికామ్ టెలీసిస్టమ్స్, అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) చేరాయి. 2023 జూన్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ నాలుగు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. కాగా.. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ ఐపీవో దరఖాస్తును మాత్రం సెబీ తిప్పిపంపింది. వివరాలు చూద్దాం.. ఎంటెరో హెల్త్‌కేర్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను అందుకుంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 85.57 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఎంటెరో హెల్త్‌ను 2018లో ప్రభాత్ అగర్వాల్, ప్రేమ్ సేథీ ఏర్పాటు చేశారు. జేఎన్‌కే ఇండియా పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు జేఎన్‌కే ఇండియా సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 84.21 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అక్మే ఫిన్‌ట్రేడ్ ఐపీవోలో భాగంగా అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎక్సికామ్టెలీ టెలికం రంగ కంపెనీ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 74 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ నెక్ట్స్‌వేవ్ కమ్యూనికేషన్స్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం నెక్ట్స్‌వేవ్‌కు కంపెనీలో 71.45 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను తెలంగాణలోని తయారీ యూనిట్లో ప్రొడక్షన్ లైన్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను పరిశోధన, అభివృద్ధి, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. -
ఐపీవో.. హాట్ కేక్ - తొలి రోజే మంచి స్పందన
దేశీ స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులు చవిచూస్తున్నప్పటికీ ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కళకళలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో పలు కంపెనీలు లిస్టింగ్ బాట పడుతున్నాయి. తాజాగా టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకాగా.. తొలి రోజే అధిక స్థాయిలో స్పందన లభించడం గమనార్హం! వివరాలు ఇలా.. టాటా టెక్నాలజీస్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ ఐపీవో తొలి రోజే అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో ప్రారంభమైన వెంటనే భారీగా బిడ్స్ దాఖలయ్యాయి. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 6.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 29.43 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. వెరసి 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 4 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 11.7 రెట్లు, రిటైలర్ల నుంచి 5.4 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. మొత్తం 6.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 4.63 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఫ్లెయిర్ రైటింగ్ పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో తొలి రోజే పూర్తి సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. షేరుకి రూ. 288–304 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 2.17 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 1.44 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 3.13 కోట్లకుపైగా షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 53%, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.78 రెట్లు, రిటైలర్ల నుంచి 2.86 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా రూ. 292 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 301 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచాయి. 24న ముగిసే ఇష్యూ ద్వారా రూ. 501 కోట్ల వరకూ అందుకోనుంది. గాంధార్ ఆయిల్ ప్రైవేట్ రంగ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ(ఇండియా) ఐపీవో తొలి రోజే అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 5.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 2.12 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 11.72 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 1.3 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.7 రెట్లు, రిటైలర్ల నుంచి 6.9 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 501 కోట్లవరకూ అందుకోనుంది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. -
ఐపీవోల జోరు
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్ స్పేస్ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో.. కోవర్కింగ్ కార్యాలయ సంస్థ కాంటార్ స్పేస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్ స్పేస్‌లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 55 శాతమే బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్పీజీ టెర్మినల్ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రెండు కంపెనీలు రెడీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లాజిస్టిక్స్ సంస్థ వెస్టర్న్ క్యారియర్స్(ఇండియా) లిమిటెడ్ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్‌కేర్ ఎస్ఎఫ్బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్‌సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్ క్యారియర్స్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్ రాజేంద్ర సేథియా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వాప్కోస్ వెనకడుగు కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్స్ట్రక్షన్ సర్వి సుల పీఎస్‌యూ.. వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
సెకండరీ మార్కెట్లోనూ అస్బా
ముంబై: సెకండరీ మార్కెట్ లావాదేవీల్లోనూ ఏఎస్బీఏ(అస్బా) తరహా సౌకర్యాలకు తెరతీసే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ప్రైమరీ మార్కెట్‌కు ఇదెంతో ప్రయోజనకారిగా ఉన్నప్పుడు సెకండరీ మార్కెట్లోనూ ఎందుకు ప్రవేశపెట్టకూడదంటూ ప్రశ్నించారు. అప్లికేషన్‌కు మద్దతుగా బ్యాంక్ ఖాతాలో ఇన్వెస్టర్ సొమ్ము తాత్కాలిక నిలుపుదల చేసే అస్బా తరహా సౌకర్యాలను సెకండరీ మార్కెట్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు హాజరైన మాధవీ పురీ వెల్లడించారు. అస్బాలో భాగంగా ఐపీవోకు దరఖాస్తు చేసే ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరిగాకే సొమ్ము బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయ్యే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో ఇన్వెస్టర్ల సొమ్ము బ్రోకర్లవద్ద ఉంటున్నదని, అస్బా తరహా సౌకర్యముంటే ఇందుకు తెరపడుతుందని తెలియజేశారు. లోపాలకు చెక్ సెకండరీ మార్కెట్లో వ్యవస్థాగత లోపాలను తగ్గించే లక్ష్యంతో అస్బా ఆలోచనకు తెరతీసినట్లు మాధవీ పురీ వెల్లడించారు. ఫిన్‌టెక్ సంస్థలను తమ వ్యాపార విధానాల(బిజినెస్ మోడల్)లో ఇలాంటి వాటికి తావీయకుండా చూడాలంటూ ఈ సందర్భంగా సూచించారు. లోపాలకు ఆస్కారమిస్తే నియంత్రణ సంస్థల చర్యలకు లోనుకావలసి వస్తుందని హెచ్చరించారు. ఆడిటెడ్ లేదా వేలిడేటెడ్కాని బ్లాక్ బాక్స్తరహా బిజినెస్ మోడళ్లను అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. -
షం‘షేర్’ అంటున్న సీఎస్కే.. స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో మరో రికార్డు
స్పోర్ట్స్ ప్రపంచంలో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలో మరే ఇతర ఫ్రాంచైజీకి సాధ్యం కానీ రీతిలో షేర్ వాల్యూను పెంచుకోగలిగింది. ఆటలో సీఎస్కే సాధిస్తున్న నిలకడతో పాటు సీఎస్కే ఆదాయ వనరులు బాగా ఉండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది సీఎస్కే ఒక్కో షేరు ధర రూ. 160 నుంచి 160 దగ్గర లభించాయి. ప్రస్తుతం రూ. 200 నుంచి రూ. 205 దగ్గర ఈ షేర్ల ధర ట్రేడవుతోంది. కేవలం ఏడాది కాలంలోనే ఈ ఫ్రాంచైజీ షేరు ధర రికార్డు స్థాయిలో 25 శాతం వృద్ధి సాధించింది. దీంతో సీఎస్కే మార్కెట్ క్యాప్ విలువ రూ. 6,300 కోట్లకు చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 356 కోట్ల రెవెన్యూపై రూ. 50 కోట్ల లాభాన్ని సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 253 కోట్ల రెవెన్యూపై రూ. 40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నిలకడగా లాభాలు ప్రకటిస్తోంది సీఎస్కే. దీంతో రాధకృష్ణ దమానీ వంటి వారు భారీ ఎత్తున సీఎస్కేలో షేర్లు కొన్నారు. సీఎస్కే జట్టుకు వన్నె తగ్గని ధోని నాయకత్వం లభించడంతో పాటు ఆ జట్టు విజయాలు 60 శాతంగా నమోదు అయ్యాయి. ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈ జట్టుకు ప్లే ఆఫ్‌లో చోటు ఖాయంగా ఉంటూ వస్తోంది. దీంతో అనేక కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం సీఎస్కేను ఎంచుకుంటున్నాయి. ఫలితంగా లాభాల బాటలో ఉంది ఈ ఫ్రాంచైజీ -
క్యూ3లో ఐపీవో స్పీడ్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. దీంతో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 60,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. ఈ ప్రభావంతో మరోపక్క ప్రైమరీ మార్కెట్ సైతం స్పీడందుకుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. మరిన్ని సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు సై అంటున్నాయి. వెరసి 2017లో ప్రైమరీ మార్కెట్ సాధించిన నిధుల సమీకరణ రికార్డ్ తుడిచిపెట్టుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. ముంబై: గతేడాదిని మించుతూ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనూ పలు సుప్రసిద్ధ కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటోసహా పలు కంపెనీలు విజయవంతంగా లిస్ట్‌కాగా.. ఇకపైనా మరిన్ని సంస్థలు ప్రైమరీ మార్కెట్ తలుపు తట్టనున్నాయి. తద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్నాయి. సుమారు 35 కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూలకు రానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడిగా ఈ కంపెనీలు రూ. 80,000 కోట్లను సమకూర్చుకోనున్నట్లు అంచనా వేశారు. ఫలితంగా 2017లో ఐపీవోల ద్వారా 35 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 67,147 కోట్ల రికార్డు మరుగున పడనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాదిలో లిస్టింగ్‌ను సాధిస్తే చరిత్రాత్మక రికార్డు నమోదవుతుందని తెలియజేశారు. పేటీఎమ్ భారీగా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో పలు ప్రయివేట్ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్‌గా ఆవిర్భవించనున్నాయి. మార్కెట్లు నిలకడగా కొనసాగితే డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా 35 కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. క్యూ3లో ఐపీవోకు రానున్న జాబితాలో రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన పేటీఎమ్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అధిక స్థాయిలో నిధులను ఆశిస్తున్న ఇతర కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ (రూ. 7,300 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇ న్సూరెన్స్(రూ. 7,000 కోట్లు), పాలసీ బజార్(రూ. 6,000 కోట్లు), హెల్త్‌కేర్ సంస్థ ఎమ్క్యూర్ ఫార్మా (రూ. 5,000 కోట్లు), వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), బ్యూటీ ప్రొడక్టుల సంస్థ నైకా(రూ. 4,000 కోట్లు) తదితరాలున్నాయి. 14 కంపెనీలు రెడీ క్యూ3లో లిస్టింగ్ బాట పట్టనున్న ఇతర సంస్థలలో పారదీప్ ఫాస్ఫేట్స్, వేదాంత్ ఫ్యాషన్స్, సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, నార్తర్న్ ఆర్క్ సైతం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు రూ. 2,000–2,500 కోట్ల స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టే వీలున్నట్లు తెలియజేశాయి. ఇప్పటికే 14 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్, గో ఎయిర్‌లైన్స్, రుచీ సోయా ఇండస్ట్రీస్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ చేరాయి. ఇవి రూ. 22,000 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఈ బాటలో ఇప్పటికే మరో 64 కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడం గమనార్హం! నాణ్యమైన కంపెనీలు చేపట్టే ఐపీవోల కోసం కొంతమంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్ఐసీ వంటి భారీ ఇష్యూల సమయంలో సెకండరీ మార్కెట్లో కొంతమేర లిక్విడిటీ కొరత నెలకొనవచ్చని వివరించారు. -
రేసు గుర్రాల్లా యూనికార్న్‌లు
ముంబై: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్‌లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్‌ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల (రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు 60కు చేరాయి. వీటిని యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ ఎన్నడూలేని విధంగా కళకళలాడుతోంది. ఈ బాటలో స్టార్టప్ యూనికార్న్‌లు సైతం పబ్లిక్ ఇష్యూల బాటపడుతున్నాయి. రానున్న రెండేళ్లలో 18 పెద్ద స్టార్టప్‌లు ఐపీవోలకు రానున్నట్లు వాల్‌స్ట్రీట్ బ్రోకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవో ఎఫ్ఏ) ఒక నివేదికలో పేర్కొంది. 12 బిలియన్ డాలర్లు... ఈ ఏడాదిలోనే దేశీయంగా 20 స్టార్టప్‌లు కొత్తగా యూనికార్న్ హోదాను అందుకున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య 60ను తాకింది. స్టార్టప్‌లలో కొద్ది నెలలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 100 మార్క్‌ను చేరవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ సైతం ఈ మార్చిలో ఇదే తరహా అంచనాలు వెలువరించడం గమనార్హం! రానున్న 24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు దిగ్గజాలు బైజూస్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, ఓలా, ఓయో తదితరాలు ప్రణాళికలు వేశాయి. అంతేకాకుండా పాలసీబజార్, పెప్పర్ఫ్రై, ఇన్మోబి, గ్రోఫర్స్, మొబిక్విక్, నైకా, ఫ్రెష్‌వర్క్స్, పైన్‌ల్యాబ్స్, ఫార్మ్ఈజీ, డెలివరీ, డ్రూమ్, ట్రాక్సన్ సైతం ఇదే బాటలో నడవనున్నాయి. తద్వారా సుమారు 18 కంపెనీలు 12 బిలియన్ డాలర్లు(రూ. 88,000 కోట్లు) వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు బీవోఎఫ్‌ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ గౌరవ్ సింఘాల్ తెలియజేశారు. భారీ ఇష్యూలు.. ఇప్పటికే సెబీ వద్ద పలు స్టార్టప్ దిగ్గజాలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో పేటీఎం(రూ. 16,600 కోట్లు), ఓలా(రూ. 11,000 కోట్లు), పాలసీబజార్ (రూ. 6,000 కోట్లు), నైకా(రూ. 4,000 కోట్లు), మొబిక్విక్(రూ. 1,900 కోట్లు) ఉన్నాయి. ఇటీవల రూ. 6,300 కోట్లు సమీకరించిన జొమాటో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. దేశీయంగా యూనికార్న్‌లు ఐపీవోలు చేపట్టడం ద్వారా సంప్రదాయ కుటుంబ బిజినెస్‌ల ట్రెండ్‌లో మార్పులను తీసుకువచ్చే వీలున్నట్లు సింఘాల్ అభిప్రాయపడ్డారు. దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల వాటా 1 శాతానికంటే తక్కువేనని పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను ఇవి ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువ రూ. 250 లక్షల కోట్లను తాకిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేళ్ల కాలంలో యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపుకావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది యూనికార్న్ హోదాకు చేరిన కంపెనీలలో షేర్‌చాట్, గ్రో, గప్‌షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, ఆఫ్‌బిజినెస్, క్రెడ్, మోగ్లిక్స్, జెటా, మైండ్టికిల్, బ్రౌజర్‌స్టాక్, ఆప్‌గ్రేడ్ తదితరాలున్నాయి. త్వరలో మరో 32... ఫ్యూచర్ యూనికార్న్ జాబితాలో చేరగల మరో 32 కంపెనీలను హురున్ ఇండియా తాజాగా ప్రస్తావించింది. ఇవి ఇప్పటికే 50 కోట్ల డాలర్ల విలువను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 20 కోట్ల డాలర్ల విలువను సాధించిన మరో 54 సంస్థలు సైతం జోరు మీదున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల కంపెనీల విలువను 36 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దేశీయంగా 60 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నట్లు తెలియజేసింది. 2025కల్లా ఈ సంఖ్య 90 కోట్లను తాకనున్నట్లు వివరించింది. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్‌లున్న దేశాల జాబితాలో అమెరికా(396), చైనా(277) తదుపరి మూడో ర్యాంకులో భారత్ నిలుస్తున్నట్లు పేర్కొంది. -
2021లో 15 ఐపీవోలు- ఈ నెలలోనే 6
ముంబై, సాక్షి: గతేడాది జోష్‌ను కొనసాగిస్తూ 2021లోనూ దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ట రికార్డులను సాధిస్తున్నాయి. తాజాగా సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని సైతం అధిగమించింది. కోవిడ్-19 సంక్షోభం తలెత్తినప్పటికీ గత కేలండర్ ఏడాది(2020)లో ప్రైమరీ మార్కెట్ పలు ఇష్యూలతో కళకళాడింది. ప్రధానంగా గతేడాది లిస్టయిన పలు కంపెనీల షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతానికి 15కుపైగా కంపెనీలు ఐపీవో బాట పట్టగా.. ఈ నెల(జనవరి)లో కనీసం 6 కంపెనీలు మార్కెట్లను తాకనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది మార్చిలో కోవిడ్-19 దెబ్బకు మార్కెట్లు పతనమైనప్పటికీ ద్వితీయార్థంలో వేగంగా పుంజుకున్నాయి. దీంతో అత్యధిక శాతం కంపెనీలు ద్వితీయార్థంలోనే పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ఇందుకు భారీ లిక్విడిటీ పరిస్థితులు సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి గతేడాది ప్రైమరీ మార్కెట్ ద్వారా 16 కంపెనీలు రూ. 31,000 కోట్లను సమీకరించగలిగాయి. జాబితా తీరిలా ఈ ఏడాది సైతం మార్కెట్లు ర్యాలీ బాటలోసాగే వీలున్నట్లు నిపుణలు భావిస్తున్నారు. దీంతో 2021లోనూ పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ జాబితాలో పీఎస్‌యూలు, ప్రయివేట్ రంగ సంస్థలున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ బ్యాంక్(ఐఆర్ఎఫ్సీ), కళ్యాణ్ జ్యువెలర్స్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండిగో పెయింట్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్, బార్బిక్యు నేషన్ హాస్పిటాలిటీ, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రైల్‌టెల్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. వీటితోపాటు.. క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, సంహీ హోటల్స్, శ్యామ్ స్టీల్ తదితర పలు కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు దిగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెలలోనే జనవరిలో ఇండిగో పెయింట్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, ఐఆర్ఎఫ్సీ, బ్రూక్‌ఫీల్డ్ ఆర్ఈఐటీ, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఐపీవో ద్వారా ఐఆర్ఎఫ్సీ రూ. 4,600 కోట్లు, కళ్యాణ్ జ్యువెలర్స్ రూ. 1,700 కోట్లు, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,000 కోట్లు, ఇండిగో పెయింట్స్ రూ. 1,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ రూ. 4,000-4,500 కోట్లు, బార్బిక్యు నేషన్ రూ. 1,000-1200 కోట్లు, ఏపీజే సురేంద్ర పార్క్ రూ. 1,000 కోట్లు, హోమ్ ఫస్ట్ కంపెనీ రూ. 1,500 కోట్లు, సంహీ హోటల్స్ రూ. 2,000 కోట్లు చొప్పున నిధుల సమీకరణ చేపట్టే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటితో జోష్ గతేడాది ఐపీవోలు చేపట్టాక పలు కంపెనీలు లిస్టింగ్‌లో భారీ లాభాలు ఆర్జించాయి. లిస్టింగ్ తదుపరి బర్గర్ కింగ్, హ్యాపీయెస్ట్ మైండ్స్, బెక్టర్స్ ఫుడ్, రోజారీ బయోటెక్, రూట్ మొబైల్ 100-200 శాతం స్థాయిలో జంప్ చేశాయి. ఈ బాటలో కెమ్‌కాన్ స్పెషాలిటీ, కంప్యూటర్ ఏజ్, గ్లాండ్ ఫార్మా, మజగావ్ డాక్ సైతం రెండంకెల లాభాలు ఆర్జించాయి. దీంతో ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు విజయవంతమయ్యే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
2020: ఐపీవో నామ సంవత్సరం
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)ని ఐపీవో నామ సంవత్సరంగా పేర్కొనవచ్చునంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ఏడాది ఇప్పటివరకూ 15 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా రూ. 30,000 కోట్లకుపైగా సమీకరించాయి. 2019లో ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు సమకూర్చుకున్న నిధులు రూ. 20,300 కోట్లు. వీటితో పోలిస్తే ప్రస్తుత ఏడాది ఇప్పటికే 50 శాతానికిపైగా ఫండ్స్‌ను కంపెనీలు సమీకరించగలిగాయి. అంతేకాకుండా 14 కంపెనీలూ ప్రస్తుతం ఐపీవో ధరలతో పోలిస్తే లాభాలతో ట్రేడవుతుండటం విశేషం! వెరసి 2020ను ఐపీవో ఏడాదిగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి కోవిడ్-19 సంక్షోభం నుంచి మార్కెట్లు ఫీనిక్స్‌లా పుంజుకోవడం విశేషమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మార్చి కనిష్టాల నుంచి ఎన్ఎస్ఈ నిఫ్టీ 79 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. కొత్త సంవత్సరం(2021)లోనూ ప్రైమరీ మార్కెట్ ఇదేవిధంగా కళకళలాడే వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ భావిస్తోంది. ఇందుకు ప్రధానంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుండటాన్ని ప్రస్తావిస్తోంది. కొత్త ఏడాదిలో ఐపీవోకు రాగల కంపెనీలలో కళ్యాణ్ జ్యువెలర్స్(రూ. 1750 కోట్లు), ఇండిగో పెయింట్స్(రూ. 1,000 కోట్లు), స్టవ్ క్రాఫ్ట్, సంహి హోటల్స్, ఏజీజే సురేంద్ర పార్క్ హోటల్స్, జొమాటో తదితరాలున్నాయి. ఎల్‌ఐసీకాకుండా 30 కంపెనీలు సుమారు రూ. 30,000 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఎల్ఐసీ భారీ ఇష్యూకావడంతో రూ. 50,000 కోట్లకు మించి నిధుల సమీకరణకు వీలున్నట్లు కొటక్ ఇన్వెస్ట్మెంట్ అంచనా వేస్తోంది. (వచ్చే వారం మార్కెట్ల పయనమెటు?) బెక్టర్స్ ఫుడ్ రికార్డ్ ఈ ఏడాది 15వ కంపెనీగా గురువారమే ఐపీవో పూర్తిచేసుకున్న బెర్టర్స్ ఫుడ్ గత ఐదేళ్లలోలేని విధంగా 198 రెట్లు అధిక బిడ్స్‌ను పొందింది. ఇంతక్రితం 2018లో అపోలో మైక్రోసిస్టమ్స్ మాత్రమే ఇంతకంటే అధికంగా 248 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. వెరసి బెక్టర్స్ ఫుడ్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇక ట్రేడింగ్ ప్రారంభం రోజు లాభాలకు వస్తే.. కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రెట్టింపునకుపైగా లాభంతో రూ. 731 వద్ద లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 340 మాత్రమే. ఇదేవిధంగా హ్యాపియెస్ట్ మైండ్స్ ఐపీవో ధర రూ. 166కాగా.. రూ. 351 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ బాటలో రూ. 350 ధరలో ఐపీవోకు వచ్చిన రూట్ మొబైల్ రూ. 708 వద్ద లిస్టయ్యింది. బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 60కాగా.. 115 వద్ద లిస్టయ్యింది. రోజారీ బయోటెక్ ఐపీవో ధర రూ. 425తో పోలిస్తే రూ. 670 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. కాగా.. ఈ ఏడాది 16వ కంపెనీగా వచ్చే వారం నుంచీ ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) వెనకడుగులో ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన కంపెనీలలో ఇష్యూ ధర కంటే దిగువన లిస్టయిన కంపెనీల జాబితా చూస్తే.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏంజెల్ బ్రోకింగ్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ చోటు చేసుకున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ లాభాల బాట పట్టడం గమనార్హం. ఇక ఐపీవో ధరను మించి లాభాలతో లిస్టయిన కంపెనీలలో బర్గర్ కింగ్, గ్లాండ్ ఫార్మా, లిఖిత ఫైనాన్స్, మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్, కెమ్‌కాన్ స్పెషాలిటీ, రూట్ మొబైల్, హ్యాపియెస్ట్ మైండ్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, రోజారీ బయోటెక్ నిలుస్తున్నాయి. -
ఐపీవోలు కళకళ
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లు జూలై–సెప్టెంబర్ కాలంలో ర్యాలీ చేయడం ప్రైమరీ మార్కెట్‌కు కలిసొచ్చింది. సుమారు ఎనిమిది కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. 850 మిలియన్ డాలర్ల (రూ.6,290 కోట్ల) నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఏడాది రెండో అర్ధభాగం (జూలై–డిసెంబర్)లో ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ మెరుగ్గా ఉండొచ్చని ఈవై నివేదిక తెలియజేసింది. ఈ సంస్థ 2020 సంవత్సరం మూడో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) ఐపీవో ధోరణులపై సోమవారం నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్, ఆతిథ్యం, నిర్మాణం, టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు నిధుల సమీకరణలో చురుగ్గా ఉన్నాయి. 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో 12 ఐపీవోలు రాగా, ప్రస్తుత ఏడాది ఇదే కాలంలో ఇవి ఎనిమిదికి పరిమితం కావడం గమనార్హం. అయితే, ఐపీవోలు సంఖ్యాపరంగా తక్కువగానే కనిపించినా సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్లో 12 ఐపీవోలు కలసి సమీకరించిన మొత్తం 652 మిలియన్ డాలర్లు (రూ.4,824 కోట్లు)గానే ఉంది. బడా ఐపీవో ఒక్కటే... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్ ఆర్ఈఐటీ ఐపీవో అతిపెద్దదిగా ఉంది. ఈ సంస్థ 602 మిలియన్ డాలర్లను (రూ.4,320 కోట్లు) సమీకరించింది. ‘‘ప్రధాన మార్కెట్లలో (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) 2020 క్యూ3లో నాలుగు ఐపీవోలు వచ్చాయి. కానీ 2019 క్యూలో 3 ఐపీవోలే వచ్చాయి. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లో ఒక్క ఐపీవో లేదు. దీంతో 2020 సెప్టెంబర్ క్వార్టర్లో 33 శాతం వృద్ధి కనిపిస్తోంది’’ అని ఈవై ఇండియా తెలిపింది. ఇక ఎస్ఎంఈ మార్కెట్లలో నాలుగు ఐపీవోలు నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నాయి. 2020లో ఇప్పటి వరకు ఐపీవోల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా తొమ్మిదో స్థానంలో ఉన్నట్టు ఈవై ఇండియా తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవో కార్యకలాపాలు 14 శాతం పెరిగాయని.. 872 ఐపీవోలు 43 శాతం అధికంగా 165.3 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయని ఈ నివేదిక వివరించింది. కల్యాణ్ జువెల్లర్స్ ఐపీవోకి గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదముద్ర లభించింది. ఈ ఐపీవో ద్వారా సుమారు రూ. 1,750 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. కల్యాణ్ జువెల్లర్స్ ప్రమోటర్ టీఎస్ కల్యాణరామన్ దాదాపు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను, హైడెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సుమారు రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనున్నాయి. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కల్యాణ్ జువెల్లర్స్ నిర్వహణ మూలధన అవసరాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగించనుంది. ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి కంపెనీకి దేశవ్యాప్తంగా 107, మధ్యప్రాచ్య దేశాల్లో 30 షోరూమ్‌లు ఉన్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ ఆఫర్ ప్రారంభం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మంగళవారం(అక్టోబర్ 20న) ఐపీఓ ప్రారంభం కానుం ది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఇష్యూ గురువారం(అక్టోబర్ 22న)ముగిస్తుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.517.6 కోట్లు సమీకరించనుంది. ఈ ఏడాదిలో 12వదైన ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.32–33 మధ్య ఉంది. -
నేటి నుంచి మూడు ఐపీఓలు
ప్రైమరీ మార్కెట్ మళ్లీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో కళకళలాడుతోంది. గతవారమే మూడు కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ వారం... అదీ...నేటి(మంగళవారం) నుంచి మరో మూడు ఐపీఓలు (–మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్) సందడి చేయనున్నాయి. గతవారం ఐపీఓలకు మంచి స్పందన వచ్చినట్లే ఈ ఐపీఓలకు కూడా ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభించవచ్చని అంచనా. గురువారం (అక్టోబర్ 1న) ముగిసి వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే ఈ ఐపీఓలకు సంబంధించి మరిన్ని వివరాలు... మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్న తొలి ప్రభుత్వ రంగ ఐపీఓ ఇది. రూ.135–145 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ సైజు రూ.444 కోట్లు. కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేయాలి. లిస్టింగ్ లాభాలు, దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఐపీఓకు దరఖాస్తు చేయవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) 90 శాతం(రూ.125–130) రేంజ్లో ఉండటంతో లిస్టింగ్‌లో మంచి లాభాలు వస్తాయని నిపుణులంటున్నారు. యూటీఐ ఏఎమ్‌సీ ఈ వారంలో వస్తున్న అతి పెద్ద ఐపీఓ ఇదే. రూ.552–554 ప్రైస్‌బాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,260 కోట్లు సమీకరించగలదని అంచనా. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.40–42 రేంజ్లో ఉంది. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయిల్, గ్యాస్పైప్లైన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలందించే ఈ కంపెనీ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ. 117–120గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.20 రేంజ్లో ఉంది. -
ఈ ఐపీఓలకు ఏమైంది..?
(సాక్షి, బిజినెస్ విభాగం) : ప్రైమరీ మార్కెట్లో సందడి చేసిన అనేక కంపెనీల ఐపీఓలు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) సెకండరీ మార్కెట్‌కు వచ్చే సరికి చతికిలపడిపోతున్నాయి. పలు సంస్థల ప్రకటనలు మూలధన సమీకరణకే పరిమితమైపోతున్నాయి. ఐసీఓ సమయంలో అది చేస్తాం, ఇది చేస్తాం.. కంపెనీ సమర్థత ఓ స్థాయిలో ఉందని చెప్పి ఓవర్ వాల్యుయేషన్స్ కట్టుకున్న అనేక కంపెనీల అసలు రంగు నెమ్మదిగా బయటపడుతోంది. గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ.500 కోట్లకు మించి నిధులను సమీకరించిన కంపెనీల జాబితాలో 33 సంస్థలుండగా వీటిలో ఏకంగా 17 కంపెనీల ప్రస్తుత మార్కెట్ ధరలు ఇష్యూధర కంటే కూడా దిగువకు పడిపోయాయి. వీటిలో 3 కంపెనీలు ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగానికిపైగా హరించేశాయి. మార్కెట్ పైకి.. షేరు ధర కిందకి గడిచిన ఏడాదికాలంలో సెన్సెక్స్ 12 శాతం వృద్ధిని నమోదుచేసింది. గతేడాదిలో అయితే ఏకంగా 28 శాతం ర్యాలీ చేసింది. మధ్యలో భారీ పతనాలున్నప్పటికీ మొత్తంగా చూస్తే మేజర్ గ్లోబల్ మార్కెట్ల కంటే అధిక లాభాలనే పంచింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, రష్యా మార్కెట్లతో పోలిస్తే అవుట్ పెర్ఫార్మర్గానే నిలిచింది. ప్రధాన సూచీలు ఇలా ఉంటే.. తాజాగా ఐపీఓకు వచ్చి సెకండరీ మార్కెట్లోకి అడుగుపెట్టిన పలు కంపెనీలు ఇష్యూ ధర కంటే 11– 69 శాతం శాతం దిగువన ట్రేడవుతున్నాయి. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. దేశంలోనే అతి పెద్ద సాధారణ బీమా సంస్థగా ప్రైమరీ మార్కెట్లో సందడిచేసిన ‘న్యూ ఇండియా అష్యూరెన్స్’ ఐపీఓ ఆ తరువాత కాలంలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రూ.770– 800 ధరల శ్రేణినితో వచ్చి రూ.800 వద్ద 1.19 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ రూ.9,600 కోట్లు సమీకరించింది. లిస్టింగ్ రోజునే 6.39 శాతం డిస్కౌంట్‌తో షాకిచ్చి.. క్రమంగా పడిపోతూ ఏడాది కూడా పూర్తికాకముందే 70 శాతం పెట్టుబడిని ఆవిరిచేసింది. ప్రస్తుతం రూ.244 వద్ద ఉంది. ప్రభుత్వ రంగ సంస్థే ఇంతటి ఓవర్ వాల్యుయేషన్స్‌తో వచ్చి తమను దెబ్బతీస్తుందని ఎలా ఊహిస్తామన్నది రిటైల్ ఇన్వెస్టర్ల మాట. జనరల్ ఇన్సూరెన్స్దీ అదే దారి... ప్రభుత్వ రంగంలోని మరో బీమా సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఐపీఓ సైతం ఇదే తీరును ప్రదర్శించింది. రూ.11,373 కోట్ల సమీకరణ లక్ష్యంతో అతిపెద్ద ఐపీఓగా సందడి చేసి చివరకు భారీ నష్టాలను మిగిల్చిందీ సంస్థ. ఇష్యూ ధర రూ.912 కాగా, మంగళవారం నాటి మార్కెట్ ముగింపు సమయానికి రూ.354 వద్ద నిలిచింది. గతేడాది అక్టోబరులో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఇప్పటివరకు షేరు ధరలో 63 శాతం పతనాన్ని నమోదు చేసింది. ఇక ఐపీఓ ద్వారా రూ.515 కోట్లను సమీకరించిన పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ ఎస్ చాంద్ అండ్ కంపెనీ కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడిని సగం చేసింది. ఇష్యూ ధర రూ.670 ఉండగా, ప్రస్తుతం రూ.300 స్థాయిలో కొనసాగుతోంది. షేరు ధర 54 శాతం కరిగిపోయింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్వర్క్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ సహా పలు కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అధిక విలువలే అసలు కారణం..! కొనేవారు ఉండాలే కానీ, కొన్ని పరిమితులకు లోబడి షేరు ప్రీమియంను నిర్ణయించుకునే వెసులుబాటు కంపెనీలకు ఉంది. ఈ పరిమిత స్వేచ్ఛను ఆసరాగా తీసుకునే పలు కంపెనీలు ఐపీఓ ధరల శ్రేణిని అధిక వాల్యుయేషన్స్ వద్ద ప్రకటించేస్తున్నాయి. ఇలా అధిక విలువతో ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్లను ఊదరగొడుతున్నప్పటికీ... సెకండరీ మార్కెట్లో క్రమంగా అసలు విలువ బయటపడుతోంది. ఈ క్రమంలోనే తాజా 17 కంపెనీల షేరు ధరలో పతనం నమోదైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సత్తా చూపిన అవెన్యూ సూపర్ మార్ట్స్ వాల్యుయేషన్స్ పక్కాగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పదిలంగా ఉండడమే కాకుండా, లాభాలు వందల శాతాల్లోనే ఉంటాయనే దానికి ‘డీ మార్ట్’ రిటైల్ చైన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ ఐపీఓ అద్ధం పట్టింది. ఈ కంపెనీ ఇష్యూ ధర కేవలం రూ.299 కాగా, ప్రస్తుతం రూ.1,534 స్థాయిలో కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంలోనే 413 శాతం రాబడిని అందించింది. 2017 ఐపీఓ మార్కెట్ వేడిలోనే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 94 శాతం, బంధన్ బ్యాంక్ 66 శాతం లాభాలను అందించాయి. విలువ సరిగ్గా ఉండడం, నిర్వహణ సజావుగా కొనసాగడం, వ్యాపార ధోరణిలో సత్తా ఉండడం వంటి అంశాల కారణంగా ఇదే తరహాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఐపీఓలు ఇష్యూ ధర కంటే 45 శాతానికి మించి రాబడిని అందించాయి. -
ఐపీఓకు ఐదు కంపెనీలు
న్యూఢిల్లీ : ఈ నెలలో ఐదు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నాయి. ఈ ఐదు కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.1,551 కోట్ల నిధులు సమీకరించనున్నాయి. కాగా నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నవ్కార్ కార్ప్ తన ఐపీఓకు ధరల శ్రేణిని రూ.147-155గా నిర్ణయించింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పెన్సార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ తన ఐపీఓకు ధరల శ్రేణిని రూ.170-178గా నిర్ణయించింది. ప్రభాత్ డెయిరీ ధరల శ్రేణి రూ.140-147. 2014లో అంతంతమాత్రంగానే ఉన్న ప్రైమరీ మార్కెట్ ఈ ఏడాది జోరందుకుంది. ఇప్పటికే పదికి పైగా కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.4,700 కోట్లు సమీకరిం చాయి. ఇండిగో, కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ వంటివి త్వరలో ఐపీఓకు రానున్నాయి. ఐపీఓల ద్వారా 2014లో6 కంపెనీలు రూ.1,261 కోట్లు సమీకరించాయి. -
ప్రైమరీ మార్కెట్‌కు మళ్లీ కళ
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్: సెకండరీ మార్కెట్ జోరు ప్రైమరీ మార్కెట్లో కన్పిస్తుందా? నిధుల్లేక నీరసపడ్డ భారీ ప్రాజెక్టులకు మళ్లీ చలనం రానుందా? ఇన్వెస్టర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇష్యూ మార్కెట్ మళ్లీ పుంజుకోనుందా? బుల్ మార్కెట్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు తాజా మార్కెట్లో ప్రస్పుటంగా కనిపిస్తుండటంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారత్‌లో భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. దీంతో సెకండరీ మార్కెట్లో అనూహ్యంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఐతే రిటైల్ ఇన్వెస్టర్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకా తటపటాయిస్తూనే ఉన్నాడు. కంపెనీ యాజమాన్యాలు కూడా మార్కెట్ గమనాన్ని అంచనా వేయలేకపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఎస్సీపీఎల్ (బి. శీనయ్య అండ్‌కో) మార్కెట్ బాగా లేదని సెబీలో దాఖలు చేసిన రెడ్హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఉపసంహరించుకోగా జీఎంఆర్ ఎనర్జీ తాజాగా సెబీలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. భిన్న వైరుధ్యాల నేపథ్యంలో గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ప్రైమరీ మార్కెట్‌పై మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయాలు ఇవి.... అరుణ్ కేజ్రీవాల్, కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ... ‘‘గత రెండేళ్లుగా ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన క్యాపిటల్ ఫార్మేషన్ (మూలధన నిర్మితి) దాదాపు శూన్యం. భారీ ప్రాజెక్టులు (రూ.1,000 కోట్లకు పైబడ్డవి) ఇప్పట్లో మార్కెట్‌కు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. అయితే చిన్న మధ్య తరహా కంపెనీలు (ఎస్ఎంఈ సెక్టార్) ఎన్నికల తర్వాత మార్కెట్లో పోటెత్తనున్నాయి. వంద కోట్ల మూలధన పరిమితికి మించని ఇష్యూలు కనీసం వంద కంపెనీల మేర మార్కెట్‌ను తాకనున్నాయి. నిధుల దాహంతో పరితపిస్తున్న కంపెనీలు ఇన్వెస్టర్లకు ప్రైమరీ మార్కెట్లో మంచి పెట్టుబడి అవకాశాల్ని కలిగించనున్నాయి. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వ కార్యాచరణపై ఇష్యూ జారీ ఆధారపడి ఉంటుంది. శైలేష్, జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్... ‘‘భారీ ఈక్విటీలతో వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ రంగాల్లోని కంపెనీలు మార్కెట్లో మదుపరుల నుంచి సరైన ఆదరణ పొందలేకపోతున్నాయి. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రూ. 650 కోట్ల నిధుల సమీకరణకు సెబీ వద్ద రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే ప్రైమరీ మార్కెట్లో స్తబ్దత నెలకొనడంతో కంపెనీ యాజమాన్యం ప్రాస్పెక్టస్‌ను ఉపసంహరించుకుంది. దీనికి జేఎం ఫైనాన్షియల్ బుక్న్న్రింగ్ లీడ్మేనేజర్గా వ్యవహరించింది. ఎన్నికల తర్వాత స్థిర ప్రభుత్వం ఏర్పడితే ప్రైమరీ మార్కెట్ పుంజుకోవచ్చన్నది నా అభిప్రాయం.’’ డాక్టర్ వీవీఎల్ఎన్ శాస్త్రి, ఫస్ట్‌కాల్ ఈక్విటీ రీసెర్చ్.. ‘‘ఎన్నికల తర్వాత ప్రైమరీ పుంజుకోనుంది. మర్చంట్ బ్యాంకులు కళకళలాడుతున్నాయి. రానున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని భారీగా రిక్రూమెంట్లు కూడా జరుపుతున్నాయి. కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో సెబీ మార్గదర్శకాలు మరింత కఠినతరం కావడంతో నాణ్యమైన ఇష్యూలే మార్కెట్లోకి రానున్నాయి. హైనెట్వర్త్ ఇండివిజువల్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, బులియన్లో పెట్టుబడి పెట్టే వాళ్లు క్రమంగా వారి ఎక్స్పోజర్ తగ్గించుకుంటున్నారు. ప్రైమరీలో లిస్టింగ్ ప్రాఫిట్ చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. భారీ ఇష్యూలకన్నా ఎస్ఎంఈ ఇష్యూలపై దృష్టి పెడితే బాగుంటుంది’’. ఇకపై పబ్లిక్ ఆఫర్ల జోరు : ప్రైమ్ డేటాబేస్ న్యూఢిల్లీ: గడచిన ఏడాది నిరుత్సాహపరచినప్పటికీ 2014-15లో పబ్లిక్ ఇష్యూలకు జోష్‌రానున్నట్లు ప్రైమ్ డేటాబేస్ అంచనా వేసింది. 2013-14లో దేశీ కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 1,205 కోట్లను మాత్రమే సమీకరించగలిగాయని తెలిపింది. ఐపీవోల ద్వారా 2012-13లో కంపెనీలు సమీకరించిన రూ. 6,289 కోట్లతో పోలిస్తే ఇవి 81% క్షీణతగా తెలిపింది. ప్రస్తుతం బుల్ ధోరణి కొనసాగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూలకు డిమాండ్ పుంజుకుంటుందని ప్రైమ్ డేటాబేస్ ఎండీ పృథ్వీ చెప్పారు. వెరసి సుమారు 900 కంపెనీలు ఐపీవోలను చేపట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించాయని తెలిపారు. ప్రస్తుతం 14 కంపెనీలు రూ. 2,796 కోట్లను సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి కోసం చూస్తున్నాయని తెలిపారు. మరో నాలుగు కంపెనీలు రూ. 2,700 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(వైజాగ్ స్టీల్), హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్), మహానగర్ గ్యాస్, కొచిన్ షిప్‌యార్డ్స్ తదితర అన్‌లిస్టెడ్ ప్రభుత్వ సంస్థలు ఐపీవోలు చే పట్టే అవకాశముందని పేర్కొన్నారు.