స్పోర్ట్స్ ప్రపంచంలో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలో మరే ఇతర ఫ్రాంచైజీకి సాధ్యం కానీ రీతిలో షేర్ వాల్యూను పెంచుకోగలిగింది. ఆటలో సీఎస్‌కే సాధిస్తున్న నిలకడతో పాటు సీఎస్‌కే ఆదాయ వనరులు బాగా ఉండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు.
గతేడాది సీఎస్‌కే ఒక్కో షేరు ధర రూ. 160 నుంచి 160 దగ్గర లభించాయి. ప్రస్తుతం రూ. 200 నుంచి రూ. 205 దగ్గర ఈ షేర్ల ధర ట్రేడవుతోంది. కేవలం ఏడాది కాలంలోనే ఈ ఫ్రాంచైజీ షేరు ధర రికార్డు స్థాయిలో 25 శాతం వృద్ధి సాధించింది. దీంతో సీఎస్‌కే మార్కెట్ క్యాప్ విలువ రూ. 6,300 కోట్లకు చేరుకుంది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 356 కోట్ల రెవెన్యూపై రూ. 50 కోట్ల లాభాన్ని సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 253 కోట్ల రెవెన్యూపై రూ. 40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నిలకడగా లాభాలు ప్రకటిస్తోంది సీఎస్‌కే. దీంతో రాధకృష్ణ దమానీ వంటి వారు భారీ ఎత్తున సీఎస్‌కేలో షేర్లు కొన్నారు.
సీఎస్‌కే జట్టుకు వన్నె తగ్గని ధోని నాయకత్వం లభించడంతో పాటు ఆ జట్టు విజయాలు 60 శాతంగా నమోదు అయ్యాయి. ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈ జట్టుకు ప్లే ఆఫ్‌లో చోటు ఖాయంగా ఉంటూ వస్తోంది. దీంతో అనేక కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం సీఎస్‌కేను ఎంచుకుంటున్నాయి. ఫలితంగా లాభాల బాటలో ఉంది ఈ ఫ్రాంచైజీ
Comments
Please login to add a commentAdd a comment