Share Marketing
-
ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్!
ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్ 29న పెరిగిన స్టాక్ విలువ ఏకంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోనే ఖరీదైన స్టాక్‌గా మారింది. ఈ స్టాక్ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్‌గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.1.2 లక్షలును మించిపోయింది.షేర్ ధర రూ.3.53 వద్ద ఎందుకుందంటే..2011 నుంచి ఒక్కో షేరు ధర దాదాపు రూ.3గా ఉంది. కానీ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కో షేర్ పుస్తక విలువ(వాస్తవ విలువ) రూ.5,85,225గా ఉంది. ఇలా కంపెనీ స్టాక్‌ల వాస్తవ విలువ ఆకర్షణీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు ఎవరూ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో షేర్ల ట్రేడింగ్ కొరత ఎక్కువైంది. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ల కారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపేశారు. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు స్టాక్ ధర సింగిల్ డిజిట్‌లోనే ఉంది.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’ఎందుకు అంత పెరిగిందంటే..ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాల్యుయేషన్‌కు అనుగుణంగా ప్రత్యేక సెషన్‌ను నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. దాంతో ఎల్సిడ్ వాటాదారుల పంట పండినట్లయింది. కొత్త మెకానిజంలో భాగంగా లిక్విడిటీని మెరుగుపరచడం, సరసమైన ధరల ఆవిష్కరణను సులభతరం చేయడం లక్ష్యంగా హోల్డింగ్ కంపెనీలకు ఎటువంటి ప్రైస్ బ్యాండ్లు విధించలేదు. దాంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నిర్వహించిన ప్రత్యేక కాల్ ఆక్షన్ సెషన్లో స్టాక్ ధర భారీగా పెరిగింది. మంగళవారం కొన్ని షేర్లు చేతులు మారిన తర్వాత, బుధవారం ఉదయం ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగలేదు. -
సాక్షి మనీ మంత్ర: లాభాల్లో కదలాడుతున్న దేశీయ మార్కెట్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్ల లాభంతో 66413 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,787 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమై.. చివరకు అవే లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు మాత్రం స్పష్టమైన లాభాలతో స్థిరపడ్డాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ భయాల నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటాన్నాయినే సంకేతాలు ఉన్నాయి. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం కలవరపెడుతోంది. మంగళవారం బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 87.91 డాలర్లకు చేరింది. -
షం‘షేర్’ అంటున్న సీఎస్కే.. స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో మరో రికార్డు
స్పోర్ట్స్ ప్రపంచంలో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు సాధించింది. ప్రపంచంలో మరే ఇతర ఫ్రాంచైజీకి సాధ్యం కానీ రీతిలో షేర్ వాల్యూను పెంచుకోగలిగింది. ఆటలో సీఎస్కే సాధిస్తున్న నిలకడతో పాటు సీఎస్కే ఆదాయ వనరులు బాగా ఉండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది సీఎస్కే ఒక్కో షేరు ధర రూ. 160 నుంచి 160 దగ్గర లభించాయి. ప్రస్తుతం రూ. 200 నుంచి రూ. 205 దగ్గర ఈ షేర్ల ధర ట్రేడవుతోంది. కేవలం ఏడాది కాలంలోనే ఈ ఫ్రాంచైజీ షేరు ధర రికార్డు స్థాయిలో 25 శాతం వృద్ధి సాధించింది. దీంతో సీఎస్కే మార్కెట్ క్యాప్ విలువ రూ. 6,300 కోట్లకు చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 356 కోట్ల రెవెన్యూపై రూ. 50 కోట్ల లాభాన్ని సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 253 కోట్ల రెవెన్యూపై రూ. 40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నిలకడగా లాభాలు ప్రకటిస్తోంది సీఎస్కే. దీంతో రాధకృష్ణ దమానీ వంటి వారు భారీ ఎత్తున సీఎస్కేలో షేర్లు కొన్నారు. సీఎస్కే జట్టుకు వన్నె తగ్గని ధోని నాయకత్వం లభించడంతో పాటు ఆ జట్టు విజయాలు 60 శాతంగా నమోదు అయ్యాయి. ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈ జట్టుకు ప్లే ఆఫ్‌లో చోటు ఖాయంగా ఉంటూ వస్తోంది. దీంతో అనేక కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం సీఎస్కేను ఎంచుకుంటున్నాయి. ఫలితంగా లాభాల బాటలో ఉంది ఈ ఫ్రాంచైజీ -
సంపన్నుల సీఈఓ జాబితాలో స్లూట్‌మ్యాన్
క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ స్నోఫ్లేక్ ఊహించని లాభాలను ఆర్జిస్తోంది. క్లౌడ్-కంప్యూటింగ్ సంస్థ మూడవ త్రైమాసిక ఆదాయం వివరాలను ఇటీవల వెల్లడించింది. సంస్థ ఆదాయం గత ఏడాది కంటే రెట్టింపు అయినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 15న తొలిసారి ఈ కంపెనీ పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లినప్పటి నుండి ఇప్పటి వరకు దాని షేర్ ధర 223 శాతం పెరిగింది. సంస్థ ఆదాయం భాగా పెరగడంతో కంపెనీ సీఈఓ ఫ్రాంక్ స్లూట్మ్యాన్ను ఆదాయం కూడా బాగా పెరిగింది. దీంతో స్లూట్‌మ్యాన్ ఒక్కసారిగా ప్రపంచంలోనే ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం తన నెల ఆదాయం వచ్చేసి 108 మిలియన్ డాలర్ల(795 కోట్లు) కంటే ఎక్కువగా ఉంది. ఈ మొత్తమంతా షేర్ల రూపంలో ఆయన ఖాతాలో జమవుతోంది.(చదవండి: జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!) షేర్ల రూపంలోనే కాకుండా మిస్టర్ స్లోట్మాన్ ఏడాదికి $3,75,000 వార్షిక మూల వేతనం కూడా పొందుతారు. 2019 ఏప్రిల్‌లో సంస్థలో చేరినప్పటి నుంచీ నాలుగేళ్ల వరకు షేర్ ద్వారా వచ్చిన డబ్బులు తన అకౌంట్ లోకి వచ్చి చేరుతుంటాయి. 2023 ప్రారంభంలో తాజా వాటా ధర ఆధారంగా అయన ఖాతాలో షేర్ ద్వారా వచ్చిన డబ్బులను లెక్కిస్తే తన ఆదాయం 5.2 బిలియన్ డాలర్లు(రూ.38 వేల కోట్లు)గా ఉండనుంది. ఆయన కంపెనీలో చేరడానికి ఆరు నెలల ముందు ఆ సంస్థ విలువ 3.5 బిలియన్ల డాలర్లు. ఇప్పుడు సంస్థ యొక్క విలువ110 బిలియన్ డాలర్లు. స్లూట్‌మ్యాన్ గత 20 సంవత్సరాలలో డేటా స్టోరేజ్ సంస్థ డేటా డొమేన్(2003-2009), క్లౌడ్ సర్వీస్ సంస్థ సర్వీస్నవ్(2011-2017) ఐఎన్సీలకు కూడా సీఈవోగా పని చేశారు. -
విప్రో లాభం రూ. 2,465 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,465 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ప్రకటించిన రూ. 2,553 కోట్లతో పోలిస్తే లాభం 3.4 శాతం క్షీణించింది. మరోవైపు, ఆదాయం దాదాపు గత క్యూ2 స్థాయిలోనే రూ. 15,114 కోట్లుగా నమోదైంది. ఇక డిసెంబర్ క్వార్టర్లో ఐటీ సేవల విభాగం ఆదాయం 202.2–206.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండొచ్చని, సీక్వెన్షియల్‌గా చూస్తే 1.5–3.5 శాతం వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు విప్రో తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 199.24 కోట్ల డాలర్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా చూస్తే 3.7 శాతం వృద్ధి సాధించింది. ‘ఆదాయాలు, మార్జిన్లపరంగా ఈ త్రైమాసికం అద్భుతంగా గడిచింది. మా ముందు అనేక ఆసక్తికరమైన వ్యాపారావకాశాలు ఉన్నాయి‘ అని విప్రో సీఈవో థియెరి డెలాపోర్ట్ తెలిపారు. ప్రాధాన్యతా రంగాలు, మార్కెట్లపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. కన్జూమర్, ఆర్థిక సేవల విభాగాలు మెరుగైన పనితీరు కనబపర్చగలవని డెలాపోర్ట్ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్తగా 3,400 మంది సిబ్బందిని తీసుకోవడంతో ఉద్యోగుల సంఖ్య 1,85,243కి చేరింది. అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు 11 శాతంగా ఉంది. ఎగ్జిమియస్ డిజైన్ కొనుగోలు.. అమెరికాకు చెందిన ఇంజనీరింగ్ సేవల సంస్థ ఎగ్జిమియస్ డిజైన్‌ను కొనుగోలు చేయనున్నట్లు విప్రో వెల్లడించింది. ఇందుకోసం సుమారు 8 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 586.3 కోట్లు) వెచ్చించనున్నట్లు వివరించింది. తమ ఇంజనీరింగ్‌ఎన్‌ఎక్స్‌టీ విభాగం అందించే సేవలకు ఎగ్జిమియస్ మరింత విలువ చేకూర్చగలదని విప్రో పేర్కొంది. వీఎల్ఎస్ఐ, సిస్టమ్ డిజైన్ సర్వీసుల మార్కెట్లో విప్రో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు, కొత్త విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించేందుకు తోడ్పడగలదని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్మీత్ చౌహాన్ తెలిపారు. 2020 డిసెంబర్ 31తో ముగిసే త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని వివరించారు. విప్రోతో చేతులు కలపడం తమ కస్టమర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఎగ్జిమియస్ డిజైన్ సీఈవో జయ్ ఆవుల తెలిపారు. 2013లో అమెరికాలో ఏర్పాటైన ఎగ్జిమియస్ డిజైన్‌కు భారత్‌తో పాటు మలేసియాలో కూడా డిజైన్ సెంటర్లు ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో సొల్యూషన్స్ అందిస్తోంది. కంపెనీలో 1,100 మంది ఉద్యోగులు ఉండగా, 2019లో 3.52 కోట్ల డాలర్ల ఆదాయం నమోదు చేసింది. బుధవారం బీఎస్ఈలో విప్రో షేరు స్వల్పంగా అర శాతం క్షీణించి రూ.375.75 వద్ద ముగిసింది. బైబ్యాక్ రేటు రూ. 400.. మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ తరహాలోనే విప్రో కూడా షేర్ల బైబ్యాక్ ప్రణాళిక ప్రకటించింది. ఇందుకోసం రూ. 9,500 కోట్ల దాకా వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 400 ధరను నిర్ణయించింది. సుమారు 23.75 కోట్ల దాకా షేర్లను కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. సెప్టెంబర్ 30 ఆఖరు నాటికి గల పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో ఇది దాదాపు 4.16 శాతమని వివరించింది. మంగళవారం బీఎస్ఈలో విప్రో షేరు ముగింపు ధర రూ. 375.75తో పోలిస్తే బైబ్యాక్ రేటు సుమారు 6% అధికం. షేర్హోల్డర్లకు నిలకడగా రాబడులు అందించాలన్న తమ సిద్ధాంతానికి అనుగుణంగా కంపెనీ షేర్ల కొనుగోలు చేపట్టినట్లు విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో గతేడాది రూ. 10,500 కోట్లు, 2017లో రూ. 11,000 కోట్లు, 2016లో రూ. 2,500 కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు కూడా తాజా బైబ్యాక్‌లో పాల్గొంటాయని విప్రో వివరించింది. షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9నాటి గణాంకాల ప్రకారం ప్రమోటర్, ప్రమోటరు గ్రూప్‌నకు కంపెనీలో 74.02 శాతం వాటాలు ఉన్నాయి. -
యస్ బ్యాంక్ లాభం 28% అప్
క్యూ4లో రూ.551 కోట్లు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ యస్ బ్యాంక్ మార్చి క్వార్టర్లో(2014-15, క్యూ4) రూ.551 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.430 కోట్లతో పోలిస్తే 28.1 శాతం వృద్ది చెందింది. వడ్డీ ఆదాయం జోరు.. డిపాజిట్లు, రుణాల్లో ప్రగతి ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. క్యూ4లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.3,014 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పెరిగింది. 22 శాతం వృద్ధి నమోదైంది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 35 శాతం పెరిగి రూ.977 కోట్లకు, వడ్డీయేతర ఆదాయం 32% వృద్ధితో రూ.590 కోట్లకు చేరాయి. మొండిబకాయిల విషయానికొస్తే.. నికర నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) అంతక్రితం ఏడాది క్యూ4లో 0.05% కాగా, ఈ క్యూ4లో 0.41%కి ఎగబాకాయి. స్థూల ఎన్పీఏలు కూడా 0.31% నుంచి 0.41 శాతానికి పెరిగాయి. విదేశీ, స్వదేశీ మార్కెట్లలో షేర్ల విక్రయం ద్వారా బిలియన్ డాలర్ల మేరకు(దాదాపు రూ.6,200 కోట్లు) నిధులను సమీకరించడంపై దృష్టిసారించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. క్విప్/జీడీఆర్‌లు/ఏడీఆర్‌ల రూపంలో ఒకటి లేదా పలు విడతల్లో షేర్ల విక్రయం ఉండొచ్చని తెలిపింది. బుధవారం బీఎస్ఈలో బ్యాంక్ 1.43% పెరిగి రూ.796 వద్ద ముగిసింది.