ఐపీఓకు ఐదు కంపెనీలు
న్యూఢిల్లీ : ఈ నెలలో ఐదు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నాయి. ఈ ఐదు కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.1,551 కోట్ల నిధులు సమీకరించనున్నాయి. కాగా నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నవ్‌కార్ కార్ప్ తన ఐపీఓకు ధరల శ్రేణిని రూ.147-155గా నిర్ణయించింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పెన్సార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ తన ఐపీఓకు ధరల శ్రేణిని రూ.170-178గా నిర్ణయించింది. ప్రభాత్ డెయిరీ ధరల శ్రేణి రూ.140-147. 2014లో అంతంతమాత్రంగానే ఉన్న ప్రైమరీ మార్కెట్ ఈ ఏడాది జోరందుకుంది. ఇప్పటికే పదికి పైగా కంపెనీలు ఐపీఓకు వచ్చాయి.
రూ.4,700 కోట్లు సమీకరిం చాయి. ఇండిగో, కేఫ్ కాఫీ డే, మ్యాట్రిక్స్ వంటివి త్వరలో ఐపీఓకు రానున్నాయి. ఐపీఓల ద్వారా 2014లో6 కంపెనీలు రూ.1,261 కోట్లు సమీకరించాయి.