Initial Public Offer
-
ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. ఎక్స్ లేదా వై లేదా జెడ్.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్‌లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్‌గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్‌లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్ ఉన్న ఐపీవోలో అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం. ఒకటికి మించిన దరఖాస్తులు ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్‌కు బిడ్ వేయాలి. ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఒక లాట్ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్ వేసినా కానీ, ఒక్కటే లాట్ అలాట్ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు. జాక్పాట్డిమాండ్ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్ (30) ఇటీవలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో జాక్‌పాట్ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్‌హోల్డర్ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్ఎన్ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్ రోజున బజాజ్ ఫైనాన్స్ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు. వాటాదారుల కోటా.. ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్) అప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ. అలాగే, బజాజ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫిన్సర్వ్ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్‌హోల్డర్స్ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.బిడ్స్ ఇలా...త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం లిస్టెడ్ సంస్థ హీరో మోటోకార్ప్ వాటాదారులకు కోటా రిజర్వ్ చేసింది. ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రుణం తీసుకుని మరీ..వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలు, ఒక హెచ్‌యూఎఫ్ డీమ్యాట్ ఖాతా ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్బీఎఫ్సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్ఎన్ఐ విభాగంలో బిడ్ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు. వాటాదారుల కోటాలో..ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్ మెహ్రా (43) ముందుగానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్ హోల్డర్స్ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్ అయ్యాయి. తిరస్కరణకు దూరంగా..కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోని పేరు, డీమ్యాట్ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% మేర సబ్‌్రస్కిప్షన్ రావాల్సి ఉంటుంది. కసరత్తు అవసరం.. లిస్టింగ్ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్ లాభం కోసం దరఖాస్తుచేసుకుంటే.. లిస్టింగ్ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్ నాటికి మార్కెట్ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో నష్టాలను మిగల్చవచ్చు.ఎస్ఎంఈ ఐపీవోలు మెయిన్‌బోర్డ్ ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్) కాగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.జాగ్రత్త అవసరం..ఇక ఎస్ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్‌్కను తగ్గించుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్సాల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనే ఎస్ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్‌ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్‌బోర్డ్ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్ఎంఈలకు అయితే బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. రుణంతో దరఖాస్తు... పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్‌కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్ సాయపడుతుంది. ఒక్కో పాన్‌పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్ఎన్ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు. రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్‌ను ఇన్వెస్టర్ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ ఖాతాకు ఎన్బీఎఫ్సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్బీఎఫ్సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్బీఎఫ్సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ వెనక్కి తీసుకోవచ్చు.నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్ఐఐ) అధిక నెట్‌వర్త్ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్ హెచ్ఎన్ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్స్కిప్షన్ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్ హెచ్ఎన్ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్ హెచ్ఎన్ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వేగంగా అనుమతులు
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు అనుమతులను వేగవంతం చేసే దిశగా కొత్త విధానంపై పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ముందుగా రూపొందించిన టెంప్లేట్‌లోని ఖాళీలను నింపడం ద్వారా కంపెనీలు ఐపీవో పత్రాలను సులభంగా సమరి్పంచొచ్చని చెప్పారు. అలాగే, కంపెనీలు సమరి్పంచిన ఐపీవో పత్రాలను వేగంగా తనిఖీ చేసేందుకు కృత్రిమ మేథ ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ నాటికి దీన్ని సిద్ధం చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐపీవో ప్రక్రియను వేగవంతం చేయడం తన ముందున్న కీలక లక్ష్యంగా పేర్కొన్నారు. ఎనిమిది ఐపీవో దరఖాస్తుల అనుమతులకు గరిష్ట గడువు అయిన మూడు నెలలు దాటినట్టు వివరించారు. న్యాయపరమైన జోక్యం, నిబంధనల అమలు లేమిని కారణాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీవో విషయంలో సంక్లిష్ట ముసాయిదా పత్రాల దాఖలు ప్రకియ ఉన్నట్టు చెప్పారు. దీన్ని సులభతరం చేసేందుకు టెంప్లేట్‌ను తీసుకొస్తామన్నారు. ఈ విధానంలో కేవలం ఖాళీలు నింపడం ద్వారా ఐపీవో డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకోవచ్చని చెప్పారు. నిరి్ధష్ట అంశాల్లో వైరుధ్యాలను, సంక్లిష్టతలను వివరించేందుకు ప్రత్యేక కాలమ్ ఉంటుందన్నారు. కాకపోతే కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది ప్రకటించలేదు. రైట్స్, ప్రిఫరెన్షియల్కూ కొత్త విధానంలిస్టెడ్ కంపెనీలు సైతం వేగంగా నిధులు సమీకరించేందుకు కొత్త విధానంపై సెబీ కసరత్తు చేస్తోంది. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కలయికతో ఇది ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 42 రోజుల సమయం తీసుకుంటుండగా, 23 రోజులకు తగ్గించనున్నట్టు సెబీ చైర్పర్సన్ తెలిపారు. సెబీ అనుమతులు, మర్చంట్ బ్యాంకర్ల అవసరాన్ని తొలగించనున్నట్టు, నిధుల సమీకరణకు సంబంధించి కేవలం రెండు పేజీల డాక్యుమెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దీనివల్ల మర్చంట్ బ్యాంకర్ల ఫీజుల బెడద తొలగిపోతుందన్నారు. ఈ ఆవిష్కరణను అమల్లోకి తీసుకురావడానికి ముందు సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఐపీవో పత్రాలు వెనక్కి.. మర్చంట్ బ్యాంకర్లకు వైపు నుంచి ప్రయోజనాల వైరుధ్యం, డైరెక్టర్లు మోసాల్లో నిందితులుగా ఉన్నప్పుడు, ఇష్యూకి సంబంధించి ఉద్దేశ్యాలు స్పష్టంగా లేనప్పుడు ఐపీవో పత్రాలను వెనక్కి తిప్పి పంపాలని సెబీ నిర్ణయించినట్టు మాధవి పురి బుచ్ తెలిపారు. నష్టాల్లోని కంపెనీలు లిస్ట్ అయ్యే విషయంలో వెల్లడించాల్సిన సమాచారాన్ని క్రమబదీ్ధకరించడంపైనా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు నెలలో పరిష్కారాలను తీసుకొస్తామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇని్వట్‌లు), రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లు (రిట్లు) పనితీరు పోల్చి చూసుకునేందుకు వీలుగా బెంచ్‌మార్క్ ఏజెన్సీని రూపొందిస్తున్నట్టు తెలిపారు.గ్యారంటీ హామీలతో జాగ్రత్త ఇన్వెస్టర్లకు హెచ్చరిక కాగా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ తరఫున ఓ అ«దీకృత వ్యక్తి ఇస్తున్న హామీపూర్వక రిటర్నుల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. ‘‘మా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ఒకరికి సంబంధించి అ«దీకృత వ్యక్తి అమిత్ లిహారే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచి్చంది. ఈ తరహా హామీపూర్వక రాబడులపై కమీషన్లను సైతం తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంటున్నట్టు తెలిసింది’’అని సెబీ తెలిపింది. సంబంధిత ట్రేడింగ్ సభ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. భారీ రాబడులు ఇస్తామంటూ హామీలు గుప్పించే గుర్తింపు లేని సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం. -
రూ. 480 కోట్ల సమీకరణలో హెచ్ఎంఏ ఆగ్రో
న్యూఢిల్లీ: ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 480 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 330 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ పేర్కొంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రమోటర్లయిన వాజిద్ అహ్మద్ రూ. 120 కోట్లు విలువ చేసే షేర్లు, గుల్జార్ అహ్మద్, మెహ్మూద్ ఖురేషి తదితరులు తలో రూ. 49 కోట్లు విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 135 కోట్లను .. వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ దాదాపు 40 దేశాలకు మాంసం ఎగుమతి చేస్తోంది. ఆదాయంలో 90 శాతం వాటా ఎగుమతులదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,720 కోట్లు కాగా రూ. 73 కోట్ల లాభం నమోదు చేసింది. -
ఫ్యాబ్ ఇండియా బంపరాఫర్..వారికి 7 లక్షల షేర్లు ఉచితం..!
న్యూఢిల్లీ: లైఫ్‌స్టయిల్ రిటైల్ దుకాణాల సంస్థ ‘ఫ్యాబ్ ఇండియా’ కళాకారులకు సముచిత గౌరవం ఇవ్వనుంది. త్వరలో ఈ సంస్థ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను చేపట్టనుంది. దీంతో 7 లక్షల షేర్లను కళాకారులకు (చేతి వృత్తుల వారు), రైతులకు ఉచితంగా ఇవ్వాల ని నిర్ణయించింది. ఐపీవోకు సంబంధించి ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) ఈ సంస్థ సెబీ వద్ద శనివారం దాఖలు చేసింది. రూ.500 కోట్ల తాజా ఇష్యూతోపాటు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్/ప్రస్తుత వాటాదారులు) రూపంలో 2,50,50,543 షేర్లను విక్రయించనుంది. ‘‘కంపెనీ, కంపెనీ అనుబంధ సంస్థలతో అనుబంధం కలిగిన కళాకారులు, రైతులను గౌరవించడంతోపాటు, వారికి ప్రయోజనం కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్ ఇండియా ప్రమోటర్లు బిమ్లానంద బిస్సెల్ 4,00,000 షేర్లు, మధుకర్ ఖేరా 3,75,080 షేర్లను కళాకారులకు డీఆర్‌హెచ్‌పీ దాఖలు తర్వాత బదిలీ చేయనున్నారు’’ అంటూ కంపెనీ ప్రకటించింది. -
టార్సన్స్ ప్రోడక్ట్స్‌కు 77 రెట్లు సబ్స్క్రిప్షన్
న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ సంస్థ టార్సన్స్ ప్రోడక్ట్స్ ఇనీ షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఆఖరు రోజు నాటికి 77.49 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం 1.08 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా 84.02 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల కేటగిరీ దాదాపు 185 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 116 రెట్లు, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ)కేటగిరీ 11 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. షేరు ధర శ్రేణి రూ. 635–662గా ఉంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ రుణాలను తీర్చేందుకు, ఇతరత్రా పెట్టుబడి అవసరాలకు ఉపయోగించుకోనుంది. ప్రయోగ శాలల్లో, ఫార్మా సంస్థల్లో, డయాగ్నోస్టిక్ కంపెనీల్లో ఉపయోగించే ల్యాబ్ వేర్‌ను టార్సన్స్ ప్రోడక్ట్స్ తయారు చేసి, విక్రయిస్తోంది. -
పబ్లిక్ ఇష్యూకి ఫార్మ్ఈజీ
న్యూఢిల్లీ: ఫార్మసీ ప్లాట్‌ఫాం ఫార్మ్ఈజీ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్ తాజాగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 6,250 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఈ ఇష్యూ పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలోనే ఉంటుందని, ప్రస్తుత వాటాదారులెవరూ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లు విక్రయించడం లేదని సంస్థ తెలిపింది. సుమారు రూ. 1,250 కోట్లకు ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద షేర్లు కేటాయిస్తే.. ఇష్యూ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో కొంత భాగాన్ని రూ. 1,929 కోట్ల రుణభారాన్ని తిరిగి చెల్లించేందుకు, వ్యాపార వృద్ధికి రూ. 1,259 కోట్లు, ఇతరత్రా అవసరాలకు రూ. 1,500 కోట్లు వినియోగించనున్నట్లు ఫార్మ్ఈజీ పేర్కొంది. జొమాటో, నైకా, పాలసీబజార్ తదితర ఐపీవోలు విజయవంతమైన నేపథ్యంలో ఫార్మ్ఈజీ కూడా పబ్లిక్ ఇష్యూకి వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీఐ హోల్డింగ్స్ సంస్థ టెలీకన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, రేడియాలజీ టెస్టులు వంటి సర్వీసులు కూడా అందిస్తుంది. -
పేటీఎం విలువ రూ. 1.48 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 18,300 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం కంపెనీ వేల్యుయేషన్ దాదాపు రూ. 1.48 లక్షల కోట్లుగా ఉండనుంది. 2010లో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా ఐపీవో (రూ. 15,200 కోట్లు) కన్నా పేటీఎం మరింత భారీ స్థాయిలో ఉండనుండటం గమనార్హం. నవంబర్ 8న ప్రారంభమై 10న పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోకు ముందస్తు నిర్వహించిన కార్యక్రమంలో వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాలు తెలిపారు. ‘పేటీఎం నిర్ణయించిన షేరు ధర శ్రేణిని చూస్తే కంపెనీ విలువ సుమారు 19.3–19.9 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ప్రస్తుత మారకం రేటు బట్టి ఇది రూ. 1.44 లక్షల కోట్లు–1.48 లక్షల కోట్లుగా ఉండవచ్చు‘ అని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్ ఎండీ సుదర్శన్ రామకృష్ణ తెలిపారు. ఇది భారత దశాబ్దం..: 2010–20 దశాబ్దం.. ఆసియాలోని చైనా, జపాన్ తదితర దేశాలకు చెందినదైతే.. 2020–30 దశాబ్దం మాత్రం పూర్తిగా భారత్‌దేనని శర్మ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత యుగం. మీది ప్రైవేట్ కంపెనీ కావచ్చు, కొత్త స్టార్టప్ కావచ్చు, లిస్టెడ్ కంపెనీ లేదా లిస్టయ్యే అవకాశాలు ఉన్న సంస్థ కావచ్చు. ప్రస్తుత తరుణంలో ప్రపంచం మీకు నిధులు అందిస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. తాము ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించినప్పటి నుంచి దేశ, విదేశ బ్లూ చిప్ ఇన్వెస్టర్లు .. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని పేటీఎం ప్రెసిడెంట్ మధుర్ దేవరా తెలిపారు. ఐపీవోలో భాగంగా శర్మ రూ. 402.65 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన యాంట్‌ఫిన్ హోల్డింగ్స్ రూ. 4,704 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నాయి. -
నవంబర్ 8 నుంచి పేటీఎం ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ 18న లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఇప్పటికే సమర్పించిన పత్రాల్లో ధర శ్రేణి, ఏ ఇన్వెస్టరు ఎంత విక్రయించనున్నారు, ఇతర వివరాలను తర్వాత అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు, పేటీఎం ఐపీవో పరిమాణం రూ. 18,300 కోట్లకు పెరిగింది. కంపెనీలో అతి పెద్ద వాటాదారు అయిన ఆలీబాబా గ్రూప్ సంస్థ యాంట్ ఫైనాన్షియల్తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ తదితర ఇతర ఇన్వెస్టర్లు మరిన్ని వాటాలు విక్రయించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ద్వారా సుమారు రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎం తొలుత ప్రణాళికలు వేసుకుంది. సుమారు రూ. 8,300 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయాలని, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు సుమారు రూ. 8,300 కోట్ల షేర్లను విక్రయించాలని భావించింది. కానీ తాజాగా ప్రస్తుత షేర్హోల్డర్లు మరిన్ని వాటాలు విక్రయిస్తుండటంతో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి ఉంచే షేర్ల పరిమాణం మరో రూ. 1,700 కోట్లు పెరిగి రూ. 10,000 కోట్లకు చేరినట్లవుతుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే వాటాల్లో దాదాపు సగం వాటా యాంట్ ఫైనాన్షియల్‌ది కానుండగా, మిగతాది ఆలీబాబా, ఎలివేషన్ క్యాపిటల్, సాఫ్ట్‌బ్యాంక్, ఇతర షేర్‌హోల్డర్లది ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించినప్పుడు వాటాలు విక్రయించే ఇన్వెస్టర్ల జాబితాలో సాఫ్ట్‌బ్యాంక్ పేరు లేదు. స్విస్ రీఇన్సూరెన్స్‌కి వాటాలు.. పేటీఎం బీమా విభాగం పేటీఎం ఇన్సూర్టెక్ (పీఐటీ)లో స్విట్జర్లాండ్‌కి చెందిన రీఇన్సూరెన్స్ వ్యాపార దిగ్గజం స్విస్ రీఇన్సూరెన్స్ 23 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 920 కోట్లుగా ఉండనుంది. దీని కింద ముందస్తుగా రూ. 397 కోట్లు, మిగతాది విడతలవారీగా స్విస్ రీఇన్సూరెన్స్ చెల్లించనుంది. దేశీ బీమా మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్విస్ రీఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని ఈ సందర్భంగా పేటీఎం చైర్మన్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఆయన వ్యక్తిగతంగా కూడా పీఐటీలో పెట్టుబడి పెట్టనున్నారు. అయితే, శర్మ ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయనున్నదీ వెల్లడి కాలేదు. -
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో మార్పులు
న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్ తన డైరెక్టర్ల బోర్డ్‌ను పునర్వ్యస్థీకరించింది. ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్, సీఈఓ, కేకీ మిస్త్రీలకు డైరెక్టర్ల బోర్డ్‌లో స్థానం కల్పించింది. నలుగురిని డైరెక్టర్ల బోర్డ్ నుంచి తప్పించింది. త్వరలో ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానుండటంతో ఈ మార్పులు జరిగాయని సమాచారం. డైరెక్టర్ల బోర్డ్ పునర్వ్యస్థీకరణను ఫ్లిప్‌కార్ట్ ధ్రువీకరించింది. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కృష్ణమూర్తి డైరెక్టర్ల మార్పులు, చేర్పుల వివరాలను వెల్లడించారు. నలుగురు డైరెక్టర్లు–రాజేశ్ మాగౌ, రోహిత్ భగత్, స్టూవార్ట్ వాల్టన్, డిర్క్‌వాన్ డెన్ బెరేలను డైరెక్టర్లుగా తొలగిస్తున్నామని పేర్కొన్నారు. వీరి స్థానంలో కళ్యాణ్ కృష్ణమూర్తి, కేకీ మిస్త్రీలతో పాటు వాల్‌మార్ట్ నుంచి సురేశ్ కుమార్, లే హాప్కిన్స్ను డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు వివరించారు. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కంపెనీ 1,600 కోట్ల డాలర్లకు 2018లో కొనుగోలు చేసింది. ఈ వాటా కొనుగోలుకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ సంస్థ 120 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
ఆఫర్.. సూపర్!
న్యూఢిల్లీ: కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)ల జోరు మొదలైంది. సోమవారం మొదలై బుధవారం ముగిసిన రెండు ఐపీఓలకు మంచి స్పందనే లభించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి మరో మూడు కంపెనీలు–యూటీఐ ఏఎమ్‌సీ, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, లిఖితా ఇన్ఫ్రా ఐపీఓలు రానున్నాయి. మరిన్ని వివరాలు.... క్యామ్స్ ఐపీఓ.. 47 రెట్లు స్పందన మ్యూచువల్ ఫండ్స్‌కు రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా వ్యవహరించే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్(క్యామ్స్) ఐపీఓ 47 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.1,229–1,230 ప్రైస్‌బాండ్‌తో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.2,242 కోట్లు సమీకరించనున్నది. ఈ కంపెనీ ఈ వారంలోనే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.666 కోట్లు సమీకరించింది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.340–360 రేంజ్లో ఉంది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. 29 నుంచి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైస్ బ్యాండ్ రూ.117–120 ఆయిల్, గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల సేవలందించే లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలై అక్టోబర్ 1న ముగుస్తుంది. రూ.117–120 ప్రైస్‌బ్యాండ్ ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.61 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో భాగంగా 25.86 శాతం వాటాకు సమానమైన 51 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి. వచ్చే నెల 12న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. శ్రీనివాసరావు గడ్డిపాటి, లిఖిత గడ్డిపాటిలు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ భారత్–నేపాల్‌ల మధ్య పైప్‌లైన్ నిర్మాణాన్ని ఇటీవలనే పూర్తి చేసింది. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా యూనిస్టోన్ క్యాపిటల్ వ్యవహరిస్తోంది. వచ్చే వారమే మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఇష్యూ! ప్రభుత్వ రంగ రక్షణ కంపెనీ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఐపీఓ కూడా ఈ నెల 29 నుంచే మొదలయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450–550 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. ప్రైస్‌బ్యాండ్‌ను ఇంకా కంపెనీ నిర్ణయించలేదు. రూ.140–150 రేంజ్లో ఉండొచ్చని అంచనా. మార్కెట్ లాట్ 90–100 షేర్ల రేంజ్లో ఉండొచ్చు. ఈ షేర్లు వచ్చే నెల 12న స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల రిపేర్లు నిర్వహిస్తోంది. ఇతర క్లయింట్ల వాణిజ్య నౌకల రిపేర్లను కూడా చేస్తోంది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,566 కోట్ల ఆదాయంపై రూ. 415 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఐపీఓకు వస్తోన్న తొలి ప్రభుత్వ రంగ కంపెనీ ఇది. కెమ్‌కాన్ ఐపీఓ...149 రెట్లు కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్ ఐపీఓ 149 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.338–340 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.318 కోట్లు సమీకరించనున్నది. వచ్చే నెల 1న ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.310–320 రేంజ్లో ఉంది. ఈ కంపెనీ గత శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.95 కోట్లు సమీకరించింది. కాగా ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓ ఒకటిన్నర రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ నేడు (గురువారం) ముగుస్తోంది. యూటీఐ ఏఎమ్‌సీ 29 నుంచి.. యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ ఈ నెల 29 నుంచి మొదలవుతుందని సమాచారం. వచ్చే నెల 1న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ప్రైస్‌బ్యాండ్ రూ.750–760 రేంజ్లో ఉండొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియమ్ రూ.170–180 రేంజ్లో ఉంది. వచ్చే నెల 12న యూటీఐ ఏఎమ్‌సీ షేర్లు స్టాక్మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా వ్యవహరిస్తున్నాయి. -
ఎల్ఐసీలో వాటా విక్రయం 25%
జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోందన్న వార్తలు రాగానే భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ అనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే అందరి అంచనాలను మించిన ఐపీఓ ఇదే కానున్నదని సమాచారం. ఐపీఓ ద్వారా 10% వాటాను కేంద్రం విక్రయించగలదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఐపీఓ ద్వారా 25% వాటా విక్రయించే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒకేసారి 25 శాతాన్ని విక్రయిస్తారా, లేక 2–3 దఫాలుగా విక్రయిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. అయితే రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి షేర్ ధరలో డిస్కౌంట్‌ను ఇవ్వాలని, బోనస్ షేర్లను కూడా జారీ చేయాలని ఒక ముసాయిదా కేబినెట్ నోట్ సిఫార్సు చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల విభాగం ఇటీవలే ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను రూపొందించింది. ఎల్ఐసీలో ప్రభుత్వానికున్న 100% వాటాను 75%కి తగ్గించుకోవాలని, 25 శాతాన్ని దశలవారీగా విక్రయించాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించారు. కరోనా కల్లోలంతో ప్రభుత్వానికి రాబడి తగ్గింది. బడ్జెట్ లోటు మరింతగా పెరిగింది. ఈ సమస్యను ఎల్ఐసీ ఐపీఓతో అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముసాయిదా కేబినెట్ నోట్లో ఏముందంటే... ► ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి ఒక ముసాయిదా కేబినెట్ నోట్‌ను ఆర్థిక శాఖ ఆధ్వర్వంలోని ఆర్థిక సేవల విభాగం రూపొందించింది. సంబంధిత కేంద్ర మంత్రులు, సెబీ, నీతి ఆయోగ్, ఐఆర్డీఏఐ పరిశీలన నిమిత్తం ఈ ముసాయిదాను తయారు చేసింది దీని ప్రకారం... ► ఎల్ఐసీలో ప్రభుత్వానికున్న వంద శాతం వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలనుకుంటున్న 25 శాతం వాటాను ఒకేసారి గానీ, దశలవారీ గానీ విక్రయించాలి. ► ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించిన ఇష్యూ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసీ ఉద్యోగులకు 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇవ్వాలి. ► ఎల్ఐసీ లిస్టయిన తొలి రోజుల్లోనే బోనస్ షేర్లను జారీ చేయాలి. ► దీనికి సంబంధించి 1956 నాటి ఎల్ఐసీ చట్టంలో మొత్తం ఆరు సవరణలను చేయాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదిస్తే రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎల్ఐసీ చట్ట సవరణల బిల్లును కేంద్ర ం తెచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్నందున దీన్ని ద్రవ్యబిల్లుగా ప్రవేశపెట్టి ఆమోదం పొందాలనేది సర్కారు ప్రణాళిక. 10 శాతం డిస్కౌంట్!! ఎల్ఐసీ ఐపీఓలో 10 శాతం వాటానే విక్రయించి, ఆ తర్వాత ఒకటి లేదా రెండు దఫాల్లో మిగిలిన 15 శాతం మేర వాటాను విక్రయించే అవకాశాలే అధికంగా ఉన్నాయని నిపుణులంటున్నారు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత కనీస ప్రజా వాటాను మూడేళ్లలో 25 శాతం మేర తగ్గించుకోవాలన్న సెబీ నిర్ణయమే దీనికి ఆధారమని వారంటున్నారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇష్యూ ధరలో 10 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఇచ్చే అవకాశాలున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా ఈ డిస్కౌంట్ లభించవచ్చు. బోనస్ షేర్ల బొనంజా...! ఎల్ఐసీ చెల్లించిన మూలధనం రూ.100 కోట్లు. ఇంత పెద్ద కంపెనీకి ఇంత చిన్న మూలధనం సమంజసం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే బోనస్ షేర్లు జారీ చేయడం ద్వారా కంపెనీ రిజర్వ్‌లను పాక్షికంగానైనా మూలధనంగా మార్చుకునే వీలు కలుగుతుందని, ఆ విధంగా చెల్లించిన మూలధనం పునర్వ్యస్థీకరించుకునే వీలు కలుగుతుందని ప్రభుత్వ ఆలోచన. బోనస్ షేర్లను జారీ చేయడం వల్ల రిజర్వ్(మిగులు నిధుల)ను మూలధనంగా మార్చుకునే వెసులుబాటుతో పాటు, రిటైల్ ఇన్వెస్టర్లను ఇట్టే ఆకర్షించవచ్చు కూడా ! ఐపీఓ సైజు ఎంత? ఎల్ఐసీ సంస్థ విలువ రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల రేంజ్లో ఉండొచ్చని ఒక అంచనా. 10% వాటా విక్రయం ప్రకారం.. ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్లో ఉండొచ్చనేది గత అంచనా. తాజా వార్తల ప్రకారం ఇష్యూ సైజు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. -
‘ఉజ్జీవన్’ ఐపీఓ... అదుర్స్
న్యూఢిల్లీ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 114 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 486 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 50 రెట్లు చొప్పున ఓవర్ సబ్స్క్రైబయ్యా యి. మొత్తం మీద ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఏడాదిలో ఇన్వెస్టర్ల నుంచి అత్యధిక స్పందన వచ్చిన ఇష్యూ ఇదే. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.36–37ను కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12న ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. అప్పర్ ప్రైస్‌బ్యాండ్(రూ.37) ధరకు దాదాపు రెట్టింపు ధరకు ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని అంచనా. -
30 నుంచి ఐఆర్సీటీసీ ఐపీఓ
ముంబై: ప్రభుత్వ రంగ ఐఆర్సీటీసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నది. వచ్చే నెల 3న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ను రూ.315–320గా నిర్ణయించామని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వెల్లడించింది. ఈ ఐపీఓ ఇష్యూ సైజు రూ.645 కోట్లు. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 2.01 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ మొత్తంలో 1,60,000 షేర్లను ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.10 డిస్కౌంట్ ఇవ్వనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఈ షేర్లు వచ్చే నెల 14న లిస్టవుతాయి. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ సర్వీసెస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యస్ సెక్యూరిటీస్ (ఇండియా) వ్యవహరిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా లభించే సొమ్ములను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రుణాల చెల్లింపునకు, ఇతర కంపెనీలను కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు. -
ఐపీఓకు... ఆరు ప్రభుత్వ సంస్థలు
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నాయి. ఈ ఆరు పీఎస్‌యూలు ఐపీఓకు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అంతే కాకుండా కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐఓసీఎల్) ఫాలో ఆన్ ఆఫర్‌కు (ఎఫ్‌పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ఆరు పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం వల్ల వాటి విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఐపీఓకు రానున్న ఆరు పీఎస్‌యూలు ఇవే... ►రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా ►టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్(ఇండియా) (టీసీఐఎల్) ►నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్సీ) ►తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్,) ►వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) ►ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్ (ఇండియా)(ఎఫ్‌ఏజీఎమ్‌ఐఎల్) అయితే ఈ ఐపీఓ, ఎఫ్పీఓలు ఈ ఆర్థిక సంవత్సరంలోనా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనా అనే విషయాన్ని రవి శంకర్ ప్రసాద్ వెల్లడించలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల లిస్టింగ్ అర్హత నిబంధనలను కేంద్రం మరింతగా విస్తరించింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం సాధించిన సీపీఎస్‌యూలు స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టింగ్‌కు అర్హత పొందుతాయని స్పష్టంచేసింది. -
పీఎన్బీ మెట్‌లైఫ్ ఐపీఓకు సెబీ ఆమోదం
పీఎన్బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓలో భాగంగా 24.64 శాతం వాటాకు సమానమైన 49.58 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ భాగస్వామ్య సంస్థలు విక్రయిస్తాయి. దీంట్లో పీఎన్బీ 8 కోట్ల షేర్లను, మెట్‌లైఫ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ఎల్ఎల్సీ 12.90 కోట్ల షేర్లను, ఎం పల్లోంజీ అండ్ కంపెనీ 10.76 కోట్ల షేర్లను, ఎల్ప్రో ఇంటర్నేషనల్ సంస్థ 7.66 కోట్ల షేర్లను, 7.65 కోట్ల షేర్లను జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్‌లు విక్రయిస్తాయి. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, డీఎస్పీ మెరిల్లించ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, పీఎన్బీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవహరిస్తున్నాయి. కాగా స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎప్సీ స్డాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు లిస్టయ్యాయి. -
పెన్నా సిమెంట్స్ ఐపీఓ త్వరలో
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్స్ సంస్థ త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయటంతో పాటు ఆఫర్ ఫర్ సేల్‌లో (ఓఎఫ్ఎస్) భాగంగా కంపెనీ ప్రమోటర్ పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ రూ.250 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, జేఎం ఫైనాన్షియల్, యస్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. దక్షిణ భారత దేశంలో ప్రముఖ సిమెంట్ కంపెనీల్లో పెన్నా సిమెంట్ ఒకటి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో నాలుగు సిమెంట్ తయారీ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్ యూనిట్లు ఉన్నాయి. ఏడాదికి ఈ కంపెనీ 10 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా గత నెలలోనే ఇమామి సిమెంట్స్ సంస్థ రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఐపీఓకు అనుమతివ్వాలంటూ సెబీకి దరఖాస్తు చేసింది. -
నాలుగైదేళ్లలో ఐపీవోకి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నాలుగైదేళ్లలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి (ఐపీవో) రావాలని శ్రీనివాస ఫారమ్స్ యోచిస్తోంది. ప్రస్తుతం రూ. 750 కోట్లుగా ఉన్న టర్నోవర్ అప్పటికి రూ. 2,000 కోట్లకు చేరగలదని సంస్థ ఎండీ సురేష్ చిట్టూరి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.1,000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ‘వరల్డ్ ఎగ్ డే’ సందర్భంగా శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) తమ సంస్థలో సుమారు రూ.150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోందని, దాదాపు 17–18 శాతం వాటాలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోవడం, ప్రకాశం జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు తదితర కార్యకలాపాలకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు. ఒంగోలులో రెండో ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 4 కోట్ల లేయర్లు, 3 కోట్ల బ్రాయిలర్స్‌గా ఉన్న సంస్థ ఉత్పత్తి సామర్ధ్యం .. 2020 నాటికి 7.5 కోట్ల లేయర్లు, 5 కోట్ల బ్రాయిలర్స్‌కి చేరగలదని సురేశ్ చెప్పారు. గుడ్ల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు టాప్.. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం అత్యధికంగా ఉంటోందని ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ వైస్–చైర్మన్ కూడా అయిన సురేష్ చెప్పారు. తెలంగాణలో తలసరి వార్షిక వినియోగం 130 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 120, తమిళనాడులో 110గా ఉంటోందని తెలియజేశారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో రోజూ 9 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మార్కెట్ ఏటా 6–7 శాతం మేర వృద్ధి చెందుతోంది. దేశీ పౌల్ట్రీ పరిశ్రమ పరిమాణం దాదాపు రూ. 1,20,000 కోట్లు. దీన్లో గుడ్ల మార్కెట్ వాటా 33 శాతం’’ అని వివరించారు. గుడ్ల ప్రాధాన్యంపై అవగాహన పెంచే దిశగా తెలంగాణలో 20 ప్రభుత్వ పాఠశాలలకు వారంలో మూడు రోజులు పాటు గుడ్ల పంపిణీ చేస్తున్నట్లు సురేష్ తెలిపారు. -
హడ్కో ఐపీఓ...మే 8 నుంచి
ధరల శ్రేణి రూ.56–60 ముంబై: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న పీఎస్‌యూ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే నెల 11న ముగిసే ఈ ఐపీఓ ద్వారా హడ్కో రూ.1,200 కోట్లు సమీకరించనుంది. 2012 తర్వాత ఐపీఓకు వస్తున్న తొలి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇదే. షేర్ ముఖ విలువ రూ.10 అని, ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.56–60గా నిర్ణయించామని హడ్కో సీఎండీ ఎం. రవికాంత్ చెప్పారు.. ఈ ఐపీఓలో భాగంగా 10.19 శాతం వాటాను విక్రయించనున్నామని పేర్కొన్నారు. ఈ ఐపీఓలో భాగంగా 20.40 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నామని, వీటిల్లో 20.01 కోట్ల షేర్లను ఇన్వెస్టర్లకు, 38.68 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించామని వివరించారు. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, నొముర, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. ఈ కంపెనీ పట్టణ మౌలిక, హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు రుణాలందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా రూ.72,500 కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిల్లో సగానికి పైగా ఐపీఓల ద్వారానే సమీకరించాలనేది ప్రభుత్వం ఆలోచన. -
ఐపీఓకు రెండు రైల్వే ఇంజనీరింగ్ కంపెనీలు
ఇష్యూ ధరలో రైల్వే ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు డిస్కౌంట్ న్యూఢిల్లీ: రెండు రైల్ ఇంజనీరింగ్ కంపెనీలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నాయి. ఆర్ఐటీఈఎస్, ఆర్వీఎన్ఎల్.. ఈ రెండు కంపెనీల ఐపీఓల నిర్వహణకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేయనుంది. ఐదు రైల్వే పీఎస్‌యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని గత వారం కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆర్ఐటీఈఎస్, ఆర్వీఎన్ఎల్లతో పాటు ఇర్కాన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొ(ఐఆర్ఎఫ్సీ), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్సీటీసీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా ఈ రైల్వే ఐపీఓలకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్తో సహా తొమ్మిది సంస్థలు ముందుకు వచ్చాయని సమాచారం. కొన్ని షేర్లను రైల్వే ఉద్యోగులకు కేటాయించనున్నారు. రైల్వే ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో కొంత డిస్కౌంట్ లభించనున్నది. ఆర్ఐటీఈఎస్: ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. గతేడాది రూ.339 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కంపెనీ నెట్‌వర్త్ రూ.1,803 కోట్లుగా ఉంది. ఆర్వీఎన్ఎల్: అధిక వేగమున్న రైలుకు సంబంధించిన మౌలిక సదుపాయాల కార్యకలాపాలను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.288 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కంపెనీ నెట్‌వర్త్ రూ.2,828 కోట్లుగా ఉంది. -
ఈ ఏడాది జోరుగా ఐపీఓ మార్కెట్
న్యూఢిల్లీ: భారత ఐపీఓ మార్కెట్ ఈ ఏడాది జోరుగా ఉంది. ఈ ఏడాది 83 కంపెనీలు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా 380 కోట్ల డాలర్ల నిధులు సమీకరించాయి. ఇన్వెస్టర్ల విశ్వాసం అధికంగా ఉండడం, నిబంధనల్లో సంస్కరణల కారణంగా ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ జోరుగా ఉందని ఎర్నస్ట్ అండ్ యంగ్(ఈవై) తాజా నివేదిక పేర్కొంది. మదుపు వాతావరణంలో మార్పులు కొనసాగుతుండడం, జీఎస్టీ అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, సానుకూల రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సెంటిమెంట్ బలపడడం, వ్యాపార విశ్వాసం మెరుగుపడడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులు తగ్గడం, విదేశీప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం నిలకడగా ఉండడం.. వీటన్నింటి ఫలితంగా వచ్చే ఏడాది ఐపీఓ మార్కెట్ మరింత జోరుగా ఉండనున్నదని ఈ నివేదిక వివరించింది. ఈవై గ్లోబల్ ఐపీఓ ట్రెండ్స్: 2016 (క్యూ4) పేరుతో ఎర్నస్ట్ యంగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో ఐపీఓల పనితీరు జోరుగా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే, ఐపీఓ మార్కెట్ సమస్యాత్మకంగానే ఉంది. రాజకీయ, ఆర్థిక అనితులే దీనికి కారణం. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకూ ఐపీఓల సంఖ్య 16 శాతం తగ్గి 1,055కు పడిపోయింది. ఈ ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు గత ఏడాది నిధులతో పోల్చితే 33 శాతం తగ్గి 13,250 కోట్ల డాలర్లకు పడిపోయాయి. రంగాల వారీగా చూస్తే, పారిశ్రామిక, టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో అత్యధికంగా ఐపీఓలు వచ్చాయి. -
19 నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ
పదేళ్ల తర్వాత అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐపీఓ ధరల శ్రేణి రూ.224-225 ముంబై: ఆర్బీఎల్ బ్యాంక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,230 కోట్లు సమీకరించనున్నట్లు ఆర్బీఎల్ బ్యాంక్ తెలిపింది. దాదాపు పదేళ్ల తర్వాత ఒక ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐపీఓ రావడం ఇదే మొదటిసారి. ఒక దేశీయ బ్యాంక్ ఈ రేంజ్లో నిధులు సమీకరించడం కూడా ఇదే తొలిసారి. ఈ ఐపీఓలో భాగంగా తాజా షేర్ల జారీ ద్వారా రూ.832.5 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించడం ద్వారా రూ.380 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నామని పేర్కొంది. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.224-225గా నిర్ణయించామని ఇక్కడ జరిగిన ఐపీఓ రోడ్‌షోలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ తెలిపారు. ఈ రోడ్ షోలో ఆర్బీఎల్ బ్యాంక్‌లో స్వల్పమొత్తంలో వాటా ఉన్న హెచ్డీఎఫ్సీ దీపక్ పరేఖ్, ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా పాల్గొన్నారు. -
నేడే థైరోకేర్ లిస్టింగ్
న్యూఢిల్లీ: డయాగ్నస్టిటిక్ సర్వీసుల చెయిన్ థైరోకేర్ టెక్నాలజీస్ నేడు(సోమవారం) బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నది. రూ.480 కోట్ల థైరోకేర్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 73.55 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ కంపెనీ ఐపీఓ గత నెల 27న ప్రారంభమై, 29న ముగిసిన ఈ ఐపీఓకు ఇష్యూ ధర రూ. 446. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ వంటి కంపెనీలతో థైరోకేర్ పోటీపడుతోంది. -
భారీ ఐపీఓ బాటలో వొడాఫోన్!
రూ.13,200-16,500 కోట్ల రేంజ్లో హాంకాంగ్: భారత్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రావడానికి వొడాఫోన్ రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించడానికి సిటిగ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్, యూబీఎస్ గ్రూప్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి దిగ్గజ సంస్థలను వొడాఫోన్ గ్రూప్ ఆహ్వానించిందని సమాచారం. ఐపీఓ వ్యవహారాలను చూడడానికి రెండు వారాల్లో ఆరు సంస్థలను ఎంపిక చేయనున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆరు సంస్థలను ఈ ఐపీఓ విలువ 200 కోట్ల డాలర్ల నుంచి 250 కోట్ల డాలర్ల(రూ.13,200 కోట్ల నుంచి రూ.16,500 కోట్లు) రేంజ్లో ఉంటుందని ఆ వర్గాల అంచనా. 2010లో ప్రభుత్వ రంగ కోల్ ఇండియా కంపెనీ ఐపీఓ ద్వారా 350 కోట్ల డాలర్లు సమీకరించింది. దాని తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. విశ్లేషకుల అంచనా ప్రకారం వొడాఫోన్ ఇండియా విలువ 2,000 కోట్ల డాలర్లు(రూ.1,32,000 కోట్లు) ఉంటుందని అంచనా. -
ఐపీఓకు హెచ్డీఎఫ్సీ స్టాండర్ట్ లైఫ్...
ముంబై: హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రయత్నాలను ప్రారంభించింది. భారత్‌లో తొలిసారిగా ఐపీఓకు వస్తున్న తొలి జీవిత బీమా సంస్థ ఇదేకానున్నది. ఈ ఐపీఓలో భాగంగా హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్‌లో తనకున్న61.65 శాతం వాటాలో 10 శాతం వాటాను హెచ్డీఎఫ్సీ విక్రయించనున్నది. ఐపీఓ వివరాలు వెల్లడి కానప్పటికీ, ఈ కంపెనీ ఐపీఓ కనీసం రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ త్వరలోనే ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీకి మర్పిస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐపీఓ వస్తుందని సమాచారం. -
ఐపీఓ కోసం వొడాఫోన్ కసరత్తు
న్యూఢిల్లీ: బ్రిటిష్ టెలికం సంస్థ వొడాఫోన్ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానుంది. తన భారత విభాగం ఐపీఓకు రావడం కోసం బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని వొడాఫోన్ ప్రతినిధి తెలిపారు. అయితే ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం, వొడాఫోన్ల మధ్య రూ.14,200 కోట్ల పన్ను వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ పన్ను వివాదం ఉన్నప్పటికీ, ఐపీఓ కోసం బ్యాంకులతో వొడాఫోన్ కొన్నాళ్లుగా సంప్రదింపులు జరుపుతోంది.