
ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయిన యాడ్‌ల్యాబ్స్ ఐపీవో
థీమ్ పార్క్‌ల నిర్వహణ సంస్థ యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చేపట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.11 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది.
ముంబై: థీమ్ పార్క్‌ల నిర్వహణ సంస్థ యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ చేపట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.11 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈలోని గణాంకాల ప్రకారం 1.76 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా ఇష్యూ ముగింపు రోజైన మంగళవారం నాటికి 1.95 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సుమారు రూ. 376 కోట్లు సమీకరించేందుకు మార్చి 10న ఈ ఐపీవో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువవడంతో ఆ తర్వాత ఇష్యూ ధర శ్రేణిని రూ. 221-230 నుంచి రూ. 180-215 (షేరు ఒక్కింటికి)కి తగ్గించడంతో పాటు ఆఫర్ గడువును కూడా సంస్థ పొడిగించింది. షేరు ఒక్కింటికి రూ. 221 చొప్పున 27.22 లక్షల షేర్లను ఐపీవో కన్నా ముందుగానే యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించడం ద్వారా యాడ్‌ల్యాబ్స్ రూ. 60 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.37 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 1.17 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి.