న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ సంస్థ టార్సన్స్ ప్రోడక్ట్స్ ఇనీ షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఆఖరు రోజు నాటికి 77.49 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం 1.08 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా 84.02 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల కేటగిరీ దాదాపు 185 రెట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 116 రెట్లు, రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (ఆర్‌ఐఐ)కేటగిరీ 11 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. షేరు ధర శ్రేణి రూ. 635–662గా ఉంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ రుణాలను తీర్చేందుకు, ఇతరత్రా పెట్టుబడి అవసరాలకు ఉపయోగించుకోనుంది. ప్రయోగ శాలల్లో, ఫార్మా సంస్థల్లో, డయాగ్నోస్టిక్ కంపెనీల్లో ఉపయోగించే ల్యాబ్ వేర్‌ను టార్సన్స్ ప్రోడక్ట్స్ తయారు చేసి, విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment