న్యూఢిల్లీ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 114 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 486 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 50 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యా యి. మొత్తం మీద ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఏడాదిలో ఇన్వెస్టర్ల నుంచి అత్యధిక స్పందన వచ్చిన ఇష్యూ ఇదే. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.36–37ను కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12న ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. అప్పర్ ప్రైస్‌బ్యాండ్(రూ.37) ధరకు దాదాపు రెట్టింపు ధరకు ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment