SFB
-
‘డిపాజిట్’ వార్!
బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పుడు డిపాజిట్ల పోరు మొదలైంది. రుణాలు ఇస్తున్నంత జోరుగా డిపాజిట్ల సమీకరణ జరగడం లేదంటూ ఆర్బీఐ పదేపదే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల మోత మోగుతోంది. అధిక వడ్డీ రేట్ల రేసులో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ముందుండటం గమనార్హం!డిపాజిట్ల సమీకరణలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) దూసుకెళ్తున్నాయి. దాదాపు అరడజను ఎస్ఎఫ్బీలు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై 8% శాతం పైగా వడ్డీరేటును ఆఫర్ చేస్తూ డిపాజిటర్లను ఆకర్షిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బడా బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఏకంగా 1 శాతం పైగానే అధికంగా వడ్డీరేటును ఆఫర్ చేస్తుండటం గమనార్హం. గత కొన్నేళ్లుగా డిపాజిట్ రేట్లు నేలచూపులు చూడటంతో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు ఇతరత్రా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఆకర్షించడంతో ఇన్వెస్టర్లు తమ పొదుపు నిధులను చాలా వరకు అటువైపు మళ్లిస్తున్నారు. దీంతో కొంతకాలంగా బ్యాంకుల్లో డిపాజిట్లు వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఆర్బీఐ తీవ్రంగా దృష్టి పెట్టడంతో బ్యాంకులు మళ్లీ రేట్ల పెంపు, ప్రత్యేక స్కీమ్‌ల ద్వారా డిపాజిట్ల సమీకరణ వేట మొదలు పెట్టాయి.ఇదీ చదవండి: ‘తొందరపాటు నిర్ణయాలు తీసుకోం’జులై నుంచి జోరు...ఈ ఏడాది జూన్‌లో డిపాజిట్లు, రుణ వృద్ధి మధ్య అంతరం ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకడంతో రేట్ల పెంపు మొదలైంది. బ్యాంకులన్నీ వరుస కట్టడంతో జులై నుంచి ఇది వేగం పుంజుకుంది. ఈ రేసులో ఎస్ఎఫ్బీలు బ్యాంకులతో పోటాపోటీగా వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఉత్కర్ష్, సూర్యోదయ ఎస్ఎఫ్బీలు 2–3 ఏళ్ల వ్యవధి ఫిక్సిడ్ డిపాజిట్లపై 8.5% వడ్డీని ఇస్తున్నాయి. ఈక్విటాస్ కూడా రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్డీలపై 8.5% వడ్డీరేటును అందిస్తోంది. యూనిటీ ఎస్ఎఫ్బీ అయితే 1,001 రోజుల ఎఫ్డీపై ఏకంగా 9% వడ్డీ ఇస్తుండటం విశేషం. ఈ విషయంలో వాణిజ్య బ్యాంకులు వెనుకబడుతున్నాయి. ఎస్బీఐ 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీమ్‌పై అత్యధికంగా 7.25% వడ్డీ ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గరిష్ట డిపాజిట్ రేటు 7.4%. అయితే, ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అదనంగా అర శాతం వడ్డీ ఇస్తున్నాయి. కాగా, బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కూడా 8% పైగా వడ్డీ ఆఫర్ చేస్తూ బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ 1–3 ఏళ్ల ఎఫ్డీలపై 8.25% వడ్డీ ఇస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్ 42 నెలల డిపాజిట్‌కు 8.65% వడ్డీ రేటు అందిస్తోంది. -
క్యాపిటల్ ఎస్ఎఫ్బీ కస్టమర్లకు మ్యాక్స్ లైఫ్ ప్లాన్లు
న్యూఢిల్లీ: మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన సేవింగ్స్ ప్లాన్లు, ప్రొటెక్షన్ ప్లాన్లు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించనుంది. దీనివల్ల ఇరు సంస్థలకూ వ్యాపార అవకాశాలు పెరగనున్నాయి. -
‘ఉజ్జీవన్’ ఐపీఓ... అదుర్స్
న్యూఢిల్లీ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 114 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 486 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 50 రెట్లు చొప్పున ఓవర్ సబ్స్క్రైబయ్యా యి. మొత్తం మీద ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఏడాదిలో ఇన్వెస్టర్ల నుంచి అత్యధిక స్పందన వచ్చిన ఇష్యూ ఇదే. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.36–37ను కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12న ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. అప్పర్ ప్రైస్‌బ్యాండ్(రూ.37) ధరకు దాదాపు రెట్టింపు ధరకు ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని అంచనా. -
‘ట్రక్’ గుర్తు చేటుపై ..తర్జన భర్జన!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయడమే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీలను గణనీయంగా తగ్గించిన ‘ట్రక్’ గుర్తు చేసిన నష్టంపై అధికార పార్టీలో తర్జన భర్జన నడుస్తోంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాలుగు చోట్ల విజయం సాధించగా, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎఫ్బీ) పార్టీకి ఈ ఎన్నికల్లో ట్రక్ గుర్తును కేటాయించారు. ఇది టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలి ఉండడంతో గ్రామీణులు, ముఖ్యంగా నిరక్షరాస్యులు ట్రక్ గుర్తును చూసి కారనుకున్నారన్న వాదన టీఆర్ఎస్ వర్గాలనుంచి వినిపిస్తోంది. ఎస్ఎఫ్బీ పార్టీనుంచి అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో ట్రక్ గుర్తును కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ప్రధానంగా వయో వృద్ధులు ఈ గుర్తు విషయంలో చాలా గందరగోళానికి గురయ్యారని, తమ పార్టీ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు ట్రక్ గుర్తుకు పడ్డాయని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఎస్ఎఫ్బీ పార్టీ నుంచి పోటీలో నిలబడిన వారు ఎవరూ నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రచారం చేయలేదని, విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ, సీపీఎం వంటి పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు ట్రక్ గుర్తున్న అభ్యర్థులకు పోలయ్యాయని చెబుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో అత్యధిక పర్యాయాలు సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. తొలి ఎన్నికల నుంచి 2014 ఎన్నికల దాకా కాంగ్రెస్ రెండు సార్లు, టీఆర్ఎస్ ఒకరి మాత్రమే గెలిచాయి. కానీ, ఈ ఎన్నికల్లో సీపీఎం పోటీలో ఉన్నా, ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 4543 ఓట్లు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే ఎస్ఎఫ్బీ అభ్యర్థి ట్రక్ గుర్తుపై ఏకంగా 10,383 ఓట్లు పోల్ కావడాన్ని వీరు ఉదహరిస్తున్నారు. జిల్లాలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 9818 ఓట్లు, మునుగోడులో 2279 ఓట్లు ఎస్ఎఫ్బీ అభ్యర్థులకు పోల్ కాగా, ట్రక్ గుర్తుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఉన్న మిర్యాలగూడలో 4,758, నల్లగొండ నియోజకవర్గంలో 2,932 ఓట్లు పోలయ్యాయి. ఈ అంశాలను విశ్లేషించుకున్న నేతలు కారు గుర్తును పోలిన ట్రక్ గుర్తు తమ అభ్యర్థుల మెజారిటీలు తగ్గించిందని, నకిరేకల్ నియోజకవర్గంలో ఏకంగా ఓటమికి కారణమైందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. రీ ఎలక్షన్‌కు డిమాండ్ నకిరేకల్ నియోజకవర్గంలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం తన ఓటమికి దారితీసిన ట్రక్ గుర్తు వ్యవహారంపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదులు, పార్టీ అధినాయకత్వంతో చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8,259 ఓట్ల మెజారిటీతో వేముల వీరేశంపై విజయం సాధించారు. అయితే, ట్రక్ రూపంలో తమ అభ్యర్ధికి 10,383 ఓట్లకు గండిపడిందన్నది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ట్రక్ గుర్తు లేని పక్షంలో తమ అభ్యర్థి కనీసం 1500 నుంచి 2వేల ఓట్ల మెజారిటీతో గెలిచేవారని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో రిజిస్టర్డ్ పార్టీ అయిన సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ తమ అభ్యర్థులకు కామన్ గుర్తుగా ‘ట్రక్’ను కోరడంలో ఒక వ్యూహం దాగి ఉందన్నది వీరి అభిప్రాయం. ఈ గుర్తు చేసే నష్టాన్ని అంచనా వేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులను పోటీలో లేకుండా కొందరు మేనేజ్ చేసుకున్నారని, అయినా, ఇండిపెండెంట్లకూ ఇదే గుర్తు కేటాయింపు జరగడంతో తమ మెజారిటీలు తగ్గాయని అంటున్నారు. ప్రత్యేకించి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వేముల వీరేశం తమ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ సరళిపై పూర్తి వివరాలు కావాలని జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌ను కోరారని తెలిసింది. అంతే కాకుండా గుర్తు చేసిన చేటు, గుర్తు కేటాయింపు తదితర అంశాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెబుతున్నారు. తమ నియోజకవర్గానికి రీ ఎలక్షన్ జరిపించాలని ఈసీని కూడా డిమాండ్ చేస్తూ కేసు వేయనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
ఈక్విటాస్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తుది లెసైన్స్
ముంబై: స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ)ను ప్రారంభించడానికి ఈక్విటాస్ హోల్డింగ్స్‌కు ఆర్బీఐ తుది లెసైన్స్‌ను మంజూరు చేసింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఈక్విటాస్ బ్యాంక్) పేరుతో త్వరలో కార్యకలాపాలు నిర్వహిస్తామని ఈక్విటాస్ హోల్డింగ్స్ ఎండీ పి. ఎన్. వాసుదేవన్ చెప్పారు. ఆర్బీఐ, ఇతర ఏజెన్సీల నుంచి మరికొన్ని ఆమోదాలు రావల్సి ఉందని, అవి వచ్చిన తర్వాత ఎస్ఎఫ్బీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ఏడాదిలో 400 బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈక్విటాస్ మైక్రో ఫైనాన్స్, ఈక్విటాస్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఈక్విటాస్ ఫైనాన్స్‌లో విలీనం కావడానికి గత నెలలోనే మద్రాస్ హైకోర్ట్ అనుమతిచ్చిందని తెలిపారు. ఈ కంపెనీల విలీనంతో ఈక్విటాస్ ఫైనాన్స్ కంపెనీ.... ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈక్విటాస్ హోల్డింగ్స్ షేర్ బీఎస్ఈలో 3.6 % లాభపడి రూ.184 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 8% లాభంతో ఏడాది గరిష్ట స్థాయి... రూ.191.5ను తాకింది. బీఎస్ఈలో 9.58 షేర్లు, ఎన్ఎస్ఈలో 49 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.