ujjivan Financial Services
-
తెలంగాణలో ఉజ్జీవన్ బ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజాగా తెలంగాణకు కార్యకలాపాలు విస్తరిస్తోంది. తొలుత అయిదు శాఖలను ప్రారంభించనుంది. వీటిలో నాలుగు వచ్చే వారంలోనూ, మరొకటి వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో ఇతిరా డేవిస్ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. వచ్చే ఏడాది వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు, అలాగే తమ టాప్ 10 మార్కెట్లలో తెలంగాణ కూడా ఒకటిగా నిలవగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు డేవిస్ తెలిపారు. ప్రస్తుతం 71 లక్షలకు పైగా కస్టమర్లకు సర్వీసులు అందిస్తున్నామని, కొత్త వాటితో కలిపి ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 598 శాఖలు ఉంటాయని వివరించారు. పసిడి, ట్రాక్టర్ లోన్స్‌పై దృష్టి.. బంగారం రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, ట్రాక్టర్ లోన్స్పైనా దృష్టి పెడుతున్నట్లు డేవిస్ చెప్పారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో సూక్ష్మ రుణాల విభాగం 71 శాతంగా ఉండగా మిగతాది అఫోర్డబుల్ హౌసింగ్ మొదలైన విభాగాల్లో ఉంటోందని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియోను 50 శాతానికి తగ్గించుకోవడం ద్వారా సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య సమతౌల్యం సాధించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి శాఖల సంఖ్యను 625కి పెంచుకోనున్నామని డేవిస్ చెప్పారు. తెలంగాణ శాఖల్లో తొలుత 30 మంది వరకు సిబ్బంది ఉంటారు. మరోవైపు, మాతృ సంస్థను విలీనం చేసుకునే రివర్స్ మెర్జర్ ప్రక్రియ జూన్–సెప్టెంబర్ మధ్యలో పూర్తి కావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. -
రికార్డ్ లాభాలను సాధించిన ఉజ్జీవన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202223) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో రూ. 294 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది ఒక క్వార్టర్‌కు బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 274 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 63 శాతం జంప్‌చేసి రూ. 1,140 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం సైతం 54 శాతం ఎగసి రూ. 993 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 8.1 శాతం నుంచి 9.8 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 11.8 శాతం నుంచి 5.06 శాతానికి, నికర ఎన్పీఏలు 3.29 శాతం నుంచి 0.04 శాతానికి దిగివచ్చాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో క్విప్ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. -
అలోక్‌కు ఆర్ఐఎల్ దన్ను- ఉజ్జీవన్ భళా
ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేశాక పునర్వ్యస్థీకరణ పూర్తిచేసుకున్న అలోక్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి లిస్టయ్యింది. తదుపరి మార్కెట్లతోపాటే భారీ హెచ్చుతగ్గులను చవిచూస్తోంది. ఇక మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం.. అలోక్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ రంగంలో సమీకృత కార్యకలాపాలు కలిగినప్పటికీ భారీ రుణాలు, నష్టాలతో దివాళా బాట పట్టిన అలోక్ ఇండస్ట్రీస్ షేరు ఇటీవల వెలుగులో నిలుస్తోంది. జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్ణన్ కంపెనీతో కలసి డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాదిలో అలోక్‌ను కొనుగోలు చేసింది. ఈ సంస్థలు సంయుక్తంగా వేసిన రూ. 5050 కోట్ల బిడ్‌ను 2019 మార్చిలో ఎన్సీఎల్టీ అనుమతించింది. ఈ నేపథ్యంలో పునర్వ్యస్థీకరణ పూర్తిచేసుకున్న అలోక్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ఫిబ్రవరి 27న రూ. 14 వద్ద తిరిగి లిస్టయ్యింది. తదుపరి మార్చి 31కల్లా ఈ షేరు రూ. 3.92కు పతనమైంది. తదుపరి మార్కెట్లతోపాటు జోరందుకుంది. వరుసగా 17 రోజులపాటు అప్పర్ సర్క్యూట్లను తాకుతూ వచ్చింది. తాజాగా ఎన్ఎసఈలో మరోసారి 5 శాతం ఎగసి రూ. 16.85 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి మార్చి 31 కనిష్టం నుంచి 330 శాతం ర్యాలీ చేసింది. ఈ మార్చికల్లా అలోక్ ఇండస్ట్రీస్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 37.7 శాతం వాటాను కలిగి ఉంది. సంపన్నవర్గాలు, రిటైలర్లు 45.67 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఉజ్జీవన్ ఫైనాన్స్ ఎన్బీఎఫ్సీ.. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 77 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇది 80 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 590 కోట్ల నుంచి రూ. 805 కోట్లకు ఎగసింది. కాగా.. కోవిడ్-19 నేపథ్యంలో అనుబంధ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రభావితంకానున్నట్లు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజాగా పేర్కొంది. దీంతో భవిష్యత్‌లో పనితీరుపట్ల ప్రస్తుతం అంచనాలను వెల్లడించలేమని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ షేరు 9.5 శాతం జంప్‌చేసి రూ. 171 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 176ను సైతం అధిగమించింది. కాగా ఫిబ్రవరి మొదటి వారంలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 415 నుంచి ఈ కౌంటర్ 50 శాతం పతనంకావడం గమనార్హం! -
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బంపర్ లిస్టింగ్
సాక్షి,ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బంపర్ లిస్టింగ్‌ను నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను మించి లిస్టింగ్‌లో దూసుకు పోయింది. స్టాక్‌మార్కెట్లలో గురువారం లిస్ట్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు ఏకంగా 60 శాతం ప్రీమియంతో రూ. 62 వద్ద లిస్ట్ అయింది. గత వారం తన 750 కోట్ల ఐపీవోలో 165 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన సంగతి తెలిసిందే. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.36-37 కాగా ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. దీంతో గ్రే మార్కెట్లో ఈ స్టాక్‌పై అంచనాలు అధికమయ్యాయి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇష్యూ ధర రూ.37లతో పోలిస్తే 50 శాతం ప్రీమియంతో షేర్లు లిస్టింగ్ జరగవచ్చని నిపుణలు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను మించి ఇష్యూ ధర కంటే 60 శాతం అధికం కావడం విశేషం. అలాగే పేరెంట్ కంపెనీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ.4,300 కోట్ల కన్నా ఎక్కువ. -
‘ఉజ్జీవన్’ ఐపీఓ... అదుర్స్
న్యూఢిల్లీ: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 114 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 486 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 50 రెట్లు చొప్పున ఓవర్ సబ్స్క్రైబయ్యా యి. మొత్తం మీద ఈ ఇష్యూ 166 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఏడాదిలో ఇన్వెస్టర్ల నుంచి అత్యధిక స్పందన వచ్చిన ఇష్యూ ఇదే. ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.36–37ను కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 12న ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. అప్పర్ ప్రైస్‌బ్యాండ్(రూ.37) ధరకు దాదాపు రెట్టింపు ధరకు ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని అంచనా. -
కొత్త బ్యాంకులు వచ్చేస్తున్నాయ్..!
మరింత మందికి సేవలు... ♦ తలా పది పేమెంట్, చిన్న బ్యాంకులకు లెసైన్సు ♦ వచ్చే రెండు మూడు నెలల్లో కొన్ని మొదలు ♦ భారీ సక్సెస్ చూసిన చిన్న బ్యాంకుల ఐపీఓలు ♦ మారనున్న బ్యాంకింగ్ ముఖచిత్రం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొండల్లా పేరుకుపోయిన ఎన్పీఏలతో నిత్యం వార్తల్లో ఉంటున్న భారతీయ బ్యాంకింగ్ రంగం... సమూలంగా మారబోతోంది. ఒకవైపు పేమెంట్ బ్యాంకులు, మరోవైపు చిన్న బ్యాంకులు రానుండగా... కొత్తగా యూనివర్సల్ బ్యాంకులకు కూడా లెసైన్సులిస్తామంటూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్బీఐ జారీ చేసింది. పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందిన ఎయిర్టెల్, పేటీఎం కార్యకలాపాలను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా... చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందిన ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈక్విటాస్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు కూడా వచ్చి దుమ్మురేపాయి. పరిస్థితి చూస్తుంటే త్వరలో ఊరికో బ్యాంకు స్థాయి నుంచి వీధికో బ్యాంకు వచ్చేలా కనిపిస్తోంది. పేమెంట్ బ్యాంకుల్లో దిగ్గజాలు... గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిజర్వ్ బ్యాంక్ 10 పేమెంట్ బ్యాంకులకు, 10 చిన్న బ్యాంకులకు సూత్రప్రాయ లెసైన్సులిచ్చింది. ఎయిర్టెల్, పేటీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి పేమెంట్ బ్యాంకు లెసైన్సులు పొందగా... ఉజ్జీవన్ ఫైనాన్షియల్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఈఎస్ఏఎఫ్ మైక్రోఫైనాన్స్ వంటివి చిన్న బ్యాంకుల లెసైన్సులు పొందాయి. చిన్న బ్యాంకు లెసైన్సు పొందిన వాటిలో 8 సంస్థలు ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ రంగంలో ఉన్నవే. వీటిలో అన్నింటికన్నా ముందు.. జలంధర్‌కు చెందిన క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఏప్రిల్‌లోనే 10 శాఖలతో కార్యకలాపాలు ప్రారంభించేసింది. ప్రస్తుతం రూ.3,000 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని .. చిన్న బ్యాంకు కార్యకలాపాలతో అయిదేళ్లలో రూ. 12,000 కోట్లకు, శాఖల సంఖ్యను 216కు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇక, చెన్నై సంస్థ ఈక్విటాస్ హోల్డింగ్స్ ఈ మధ్యే ఐపీవోకి వచ్చి రూ.2,170 కోట్లు సమీకరించింది. ఈ ఐపీవో ఏకంగా 17 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యిందంటే... వీటి భవిష్యత్‌పై మదుపరులకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ రూ.885 కోట్ల ఐపీవోకి రాగా ఇది ఏకంగా 41 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. బ్యాంకింగ్ సేవలు లేని ప్రాంతాల్లో కొత్తగా 100 శాఖలు ఏర్పాటు చేయాలని ఉజ్జీవన్ యోచిస్తోంది. ఇప్పటికే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్- మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో దీనికి 11.15% మార్కెట్ వాటా ఉంది. 24 రాష్ట్రాల్లో సుమారు 470 శాఖలు ఉన్నాయి. తొలి దశలో వీటిలో 40 శాతాన్ని బ్యాంకు శాఖలుగా మార్చాలని ఉజ్జీవన్ భావిస్తోంది. టెక్నాలజీపైనే పేమెంట్ బ్యాంకుల దృష్టి... పేమెంట్ బ్యాంకు లెసైన్సు పొందిన ఎయిర్టెల్... ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్యలో కార్యకలాపాలు ఆరంభించనుంది. ప్రస్తుతం 800 పట్టణాల్లో ఎయిర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ సంస్థ... మనీ ట్రాన్స్ఫర్, సెమీ క్లోజ్డ్ వాలెట్ సేవలు అందిస్తోంది. అటు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కూడా ఆగస్టులో కార్యకలాపాలు ఆరంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో ప్రారంభించి మిగతా ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి కావాల్సిన టెక్నాలజీ ఇన్ఫ్రా కోసం విప్రోతో చేతులు కలిపింది. ఆదిత్య బిర్లా నువో, పోస్టల్ విభాగం, ఫినో పేటెక్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్), ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, వొడాఫోన్ ఎం-పెసా, దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా వ్యవస్థాపకుడు), విజయ్ శేఖర్ శర్మ (పేటీఎం సీఈవో) తదితరులకు పేమెంట్ బ్యాంకు లెసైన్సులొచ్చాయి. ఇలాంటి కొత్త బ్యాంకులు రాక ఆహ్వానించ దగ్గదేనని, వీటివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పరిధి పెరిగి మరింత మందికి సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బ్యాంకుల్లో తేడాలివీ... ♦ చిన్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల లక్ష్యాలు, సర్వీసుల్లో తేడాలుంటాయి. చిన్న బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించడం, వాణిజ్య బ్యాంకుల నుంచి పెద్దగా రుణాలు పొందలేని వర్గాలకు రుణాలివ్వడం వంటివి చేస్తాయి. చిన్న రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, చిన్న తరహా వ్యాపార సంస్థలకు రుణ సదుపాయం కల్పిస్తుంటాయి. ♦ పేమెంట్ బ్యాంకుల సంగతి తీసుకుంటే... ఇవి పరిమితమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్సులు మొదలైన సర్వీసులు అందిస్తాయి. టర్మ్ డిపాజిట్లు స్వీకరించడం, రుణాలివ్వడం వంటివి చేయవు. ఇవి గరిష్టంగా ఒకో ఖాతాదారు నుంచి రూ.లక్ష దాకా మాత్రమే డిపాజిట్లు స్వీకరించగలవు. ఇవి ప్రభుత్వ బాండ్లు మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబడులు పొందుతాయి. ♦ వాణిజ్య బ్యాంకులైతే ఖాతాలు, టర్మ్ డిపాజిట్లు, పెద్ద మొత్తాల్లో రుణాలు, ఓవర్ డ్రాఫ్టులు, రెమిటెన్సులు మొదలైన పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. -
ఉజ్జీవన్ ఐపీఓ సక్సెస్
41 రెట్ల మేర బిడ్లు దాఖలు ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. రూ.885 కోట్ల ఈ ఐపీఓ 41 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రూ.207-210 ధరల శ్రేణిలో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 2.96 కోట్ల షేర్లను జారీ చేస్తుండగా... 120 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 34.3 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 4 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ సంస్థ చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందింది. ఈ ఐపీఓ అనంతరం కంపెనీలో విదేశీ సంస్థల వాటా ప్రస్తుతమున్న 77 శాతం నుంచి 45 శాతానికి తగ్గనుంది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ లీడ్ మేనేజర్లు. ఇటీవల కాలంలో ఐపీఓకు వచ్చిన రెండో సూక్ష్మ రుణ సంస్థ ఇది. గత నెలలో ఈక్విటాస్ హోల్డింగ్స్ ఐపీఓకు వచ్చింది. కాగా ఒక వారంలో మంచి స్పందన లభించిన రెండో ఐపీఓ ఇది. మొదటిది ైథైరోకేర్ ఐపీఓ. -
నేటి నుంచి ‘ఉజ్జీవన్’ ఐపీఓ
ధర శ్రేణి రూ.207-210 ముంబై: సూక్ష్మ రుణ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. సోమవారం (మే 2న ) ముగియనున్న ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.207-210గా కంపెనీ నిర్ణయించింది. చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం సూత్రప్రాయ ఆమోదాన్ని ఇప్పటికే ఈ కంపెనీ పొందింది. ఈ ఐపీఓ ద్వారా రూ.358 కోట్ల తాజా మూలధనాన్ని సమీకరిస్తామని ఉజ్జీవన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుధా సురేశ్ తెలిపారు.