ఉజ్జీవన్ ఐపీఓ సక్సెస్
41 రెట్ల మేర బిడ్లు దాఖలు
ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. రూ.885 కోట్ల ఈ ఐపీఓ 41 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రూ.207-210 ధరల శ్రేణిలో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 2.96 కోట్ల షేర్లను జారీ చేస్తుండగా... 120 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 34.3 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 4 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ సంస్థ చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందింది.
ఈ ఐపీఓ అనంతరం కంపెనీలో విదేశీ సంస్థల వాటా ప్రస్తుతమున్న 77 శాతం నుంచి 45 శాతానికి తగ్గనుంది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్ లీడ్ మేనేజర్లు. ఇటీవల కాలంలో ఐపీఓకు వచ్చిన రెండో సూక్ష్మ రుణ సంస్థ ఇది. గత నెలలో ఈక్విటాస్ హోల్డింగ్స్ ఐపీఓకు వచ్చింది. కాగా ఒక వారంలో మంచి స్పందన లభించిన రెండో ఐపీఓ ఇది. మొదటిది ైథైరోకేర్ ఐపీఓ.