ముగిసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ | L&T Infotech's Rs 1243-cr IPO oversubscribed 11.67 times | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ

Published Thu, Jul 14 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

ముగిసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ

ముగిసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ

12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ఇష్యూ

 ముంబై: లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారంతో ముగిసిన ఈ ఐపీఓకు ధర శ్రేణిని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ రూ.705-710గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,243 కోట్ల నిధులు సమకూరుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఐటీ అనుబంధ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎనర్జీ పరిశ్రమలకు ఐటీసొల్యూషన్లనందిస్తోంది.

ఈ కంపెనీ ఇటీవలనే రూ.710 ధరకు రూ.373కోట్ల విలువైన షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, అబర్న్... యాంకర్ ఇన్వెస్టర్లలో కొన్ని సంస్థలు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యవహరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement