oversubscribed
-
ఐపీవో కింగ్ అశోక్ సూతా : మరో జాక్‌పాట్
సాక్షి, బెంగళూరు : డిజిటల్ టెక్నాలజీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ బంపర్ ఐపీవో ద్వారా కంపెనీ కోఫౌండర్ అశోక్ సూతా తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశ సమాచార సాంకేతిక సేవల పరిశ్రమకు మార్గదర్శకుడిగా పేరొందిన సూతా రెండు అతిపెద్ద ఐపీవోలను విజయవంతం చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశంలోని అతిపెద్ద, విప్రో లిమిటెడ్‌తో సహా మూడు అవుట్సోర్సింగ్ కంపెనీలకు నాయకత్వం వహించిన అశోక్ సూతా తాజాగా మరో జాక్‌పాట్ కొట్టేశారు. ఈ వారంలో ఆయన స్టార్టప్ కంపెనీ హ్యాపీస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ 151 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ కావడం ఆయన వ్యాపార దక్షతకు అద్దం పట్టింది. 23.3 మిలియన్ల షేర్లను ఆఫర్ చేయగా 3.51 బిలియన్ షేర్లకు బిడ్లను సాధించింది. దీంతో తొలిసేల్ లోనే ఈ దశాబ్దంలో దేశంలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. తన వాటాలో కొంత భాగాన్ని అమ్మడం ద్వారా 140 కోట్ల రూపాయలను ఆయన సాధించారు. వచ్చే వారం షేర్ల ట్రేడింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అశోక్ సూతా విశ్వసనీయతే ఈ రికార్డు ఐపీవోలకు కారణమని ముంబైలోని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి అభిమన్యు వ్యాఖ్యానించారు. తాజా ఐపీవో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, సంస్థాగత, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. ఈ ఐపీవో ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ భారతీయ మార్కెట్లో ప్రీమియాన్ని ప్రతిబింబిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి దీపక్ జసాని అన్నారు. అశోక్ సూతా ప్రస్థానం అశోక్ సూతా (77) 1942 నవంబర్ 12న జన్మించారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టా పొందిన సూతా 1965లో శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం 1984 నుంచి 1999 వరకు విప్రో ఇన్ఫోటెక్ ప్రెసిడెంట్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ఐఐటి రూర్కీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సూతా విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీని ఆకర్షించారు. తన నూతన ఐటీ బిజినెస్ కోసం సూతాను ఎంపిక చేశారు. తరువాతి14 సంవత్సరాలలోఅంచలంచెలుగా ఎదిగి విప్రో వైస్ చైర్మన్ అయ్యారు సూతా. తద్వారా దేశంలో టాప్ 3 ఐటీ కంపెనీల్లో ఒకదానిగా నిలిపారు. అయితే విప్రోనుంచి బయటికి వచ్చిన ఆయన మరో 9 మంది విప్రో ఉద్యోగులతో కలిసి1991లో మరో ఐటీ కంపెనీ మైండ్ ట్రీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా 2007 మార్చిలో ప్రకటించిన ఐపీవో 100 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయ్యి బ్లాక్‌బస్టర్ ఐపీవో సాధించడంతోపాటు, విలువైన కంపెనీగా మైండ్ ట్రీని తీర్చిదిద్దారు. ఇక 2011లో బెంగూళరులో హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ పేరుతో మరో కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించారు. అంతేకాదు ఐపీవోలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. నిధుల సమీకరణలో ఆయన శైలి, ఐటీ రంగంలో అపారమైన అనుభవం హ్యాపియెస్ట్ ఐపీవోకు కలిసి వచ్చిన అదృష్టమని పరిశోధకులు అంటున్నారు. -
ముగిసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ
12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిన ఇష్యూ ముంబై: లార్సెన్ అండ్ టుబ్రో ఇన్ఫోటెక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 12 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారంతో ముగిసిన ఈ ఐపీఓకు ధర శ్రేణిని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ రూ.705-710గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,243 కోట్ల నిధులు సమకూరుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ ఐటీ అనుబంధ కంపెనీ అయిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎనర్జీ పరిశ్రమలకు ఐటీసొల్యూషన్లనందిస్తోంది. ఈ కంపెనీ ఇటీవలనే రూ.710 ధరకు రూ.373కోట్ల విలువైన షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, అబర్న్... యాంకర్ ఇన్వెస్టర్లలో కొన్ని సంస్థలు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వ్యవహరించాయి. -
పరాగ్ మిల్క్ ఐపీఓ పొడిగింపు
♦ తగ్గిన ధర శ్రేణి న్యూఢిల్లీ: డైరీ ఉత్పత్తుల కంపెనీ పరాగ్ మిల్క్ ఫుడ్స్ తన ఐపీఓను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. అంతేకాకుండా ధర శ్రేణిని కూడా సవరించింది. రూ.760 కోట్ల ఐపీఓ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ, శుక్రవారం ముగియాల్సిన ఈ ఐపీఓ గడువును వచ్చే బుధవారం వరకూ పొడిగించామని కంపెనీ తెలిపింది. ధర శ్రేణిని రూ.220-227 నుంచి రూ.215-227కు తగ్గిస్తున్నామని తెలిపింది. ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినా పొడిగింపు.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఐపీఓను పొడిగించాలని కోరడంతో మరో మూడు రోజుల పొడిగించామని కంపెనీ వివరించింది. బుధవారం ప్రారంభమైన ఈ ఐపీఓ 1.32 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన విభాగం 55 శాతం, సంస్థాగతం కాని ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం 2.66 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.72 రెట్ల చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. కొన్ని కేటగిరిల ఇన్వెస్టర్లకు కేటాయించిన విభాగం తక్కువగా సబ్‌స్క్రైబ్ కావడంతో ఐపీఓను కంపెనీ పొడిగించిందని సమాచారం. -
ఉజ్జీవన్ ఐపీఓ సక్సెస్
41 రెట్ల మేర బిడ్లు దాఖలు ముంబై: ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు అనూహ్య స్పందన లభించింది. రూ.885 కోట్ల ఈ ఐపీఓ 41 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. రూ.207-210 ధరల శ్రేణిలో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 2.96 కోట్ల షేర్లను జారీ చేస్తుండగా... 120 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 34.3 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 4 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ సంస్థ చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందింది. ఈ ఐపీఓ అనంతరం కంపెనీలో విదేశీ సంస్థల వాటా ప్రస్తుతమున్న 77 శాతం నుంచి 45 శాతానికి తగ్గనుంది. ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ లీడ్ మేనేజర్లు. ఇటీవల కాలంలో ఐపీఓకు వచ్చిన రెండో సూక్ష్మ రుణ సంస్థ ఇది. గత నెలలో ఈక్విటాస్ హోల్డింగ్స్ ఐపీఓకు వచ్చింది. కాగా ఒక వారంలో మంచి స్పందన లభించిన రెండో ఐపీఓ ఇది. మొదటిది ైథైరోకేర్ ఐపీఓ. -
హెచ్ సీజీ ఐపీఓ ఓవర్ సబ్ స్కైబ్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్(హెచ్‌సీజీ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.56 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఈ క్యాన్సర్ కేర్ నెట్వర్క్ కంపెనీ ఈ ఐపీఓకు రూ.205- 218ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలో ఎగువ ధరను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.650 కోట్లు సమీుకరిస్తుంది. ఈ ఐపీఓ ద్వారా 1.63 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనున్నది. 2.55 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.