సూక్ష్మ రుణ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నది.
ధర శ్రేణి రూ.207-210
ముంబై: సూక్ష్మ రుణ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. సోమవారం (మే 2న ) ముగియనున్న ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.207-210గా కంపెనీ నిర్ణయించింది. చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం సూత్రప్రాయ ఆమోదాన్ని ఇప్పటికే ఈ కంపెనీ పొందింది. ఈ ఐపీఓ ద్వారా రూ.358 కోట్ల తాజా మూలధనాన్ని సమీకరిస్తామని ఉజ్జీవన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుధా సురేశ్ తెలిపారు.