సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు అనుమతులను వేగవంతం చేసే దిశగా కొత్త విధానంపై పనిచేస్తున్నట్టు సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ముందుగా రూపొందించిన టెంప్లేట్‌లోని ఖాళీలను నింపడం ద్వారా కంపెనీలు ఐపీవో పత్రాలను సులభంగా సమరి్పంచొచ్చని చెప్పారు. అలాగే, కంపెనీలు సమరి్పంచిన ఐపీవో పత్రాలను వేగంగా తనిఖీ చేసేందుకు కృత్రిమ మేథ ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.
డిసెంబర్ నాటికి దీన్ని సిద్ధం చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐపీవో ప్రక్రియను వేగవంతం చేయడం తన ముందున్న కీలక లక్ష్యంగా పేర్కొన్నారు. ఎనిమిది ఐపీవో దరఖాస్తుల అనుమతులకు గరిష్ట గడువు అయిన మూడు నెలలు దాటినట్టు వివరించారు. న్యాయపరమైన జోక్యం, నిబంధనల అమలు లేమిని కారణాలుగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐపీవో విషయంలో సంక్లిష్ట ముసాయిదా పత్రాల దాఖలు ప్రకియ ఉన్నట్టు చెప్పారు. దీన్ని సులభతరం చేసేందుకు టెంప్లేట్‌ను తీసుకొస్తామన్నారు. ఈ విధానంలో కేవలం ఖాళీలు నింపడం ద్వారా ఐపీవో డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకోవచ్చని చెప్పారు. నిరి్ధష్ట అంశాల్లో వైరుధ్యాలను, సంక్లిష్టతలను వివరించేందుకు ప్రత్యేక కాలమ్ ఉంటుందన్నారు. కాకపోతే కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది ప్రకటించలేదు.
రైట్స్, ప్రిఫరెన్షియల్‌కూ కొత్త విధానం
లిస్టెడ్ కంపెనీలు సైతం వేగంగా నిధులు సమీకరించేందుకు కొత్త విధానంపై సెబీ కసరత్తు చేస్తోంది. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ కలయికతో ఇది ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 42 రోజుల సమయం తీసుకుంటుండగా, 23 రోజులకు తగ్గించనున్నట్టు సెబీ చైర్‌పర్సన్ తెలిపారు. సెబీ అనుమతులు, మర్చంట్ బ్యాంకర్ల అవసరాన్ని తొలగించనున్నట్టు, నిధుల సమీకరణకు సంబంధించి కేవలం రెండు పేజీల డాక్యుమెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దీనివల్ల మర్చంట్ బ్యాంకర్ల ఫీజుల బెడద తొలగిపోతుందన్నారు. ఈ ఆవిష్కరణను అమల్లోకి తీసుకురావడానికి ముందు సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తామన్నారు.
ఐపీవో పత్రాలు వెనక్కి..
మర్చంట్ బ్యాంకర్లకు వైపు నుంచి ప్రయోజనాల వైరుధ్యం, డైరెక్టర్లు మోసాల్లో నిందితులుగా ఉన్నప్పుడు, ఇష్యూకి సంబంధించి ఉద్దేశ్యాలు స్పష్టంగా లేనప్పుడు ఐపీవో పత్రాలను వెనక్కి తిప్పి పంపాలని సెబీ నిర్ణయించినట్టు మాధవి పురి బుచ్ తెలిపారు. నష్టాల్లోని కంపెనీలు లిస్ట్ అయ్యే విషయంలో వెల్లడించాల్సిన సమాచారాన్ని క్రమబదీ్ధకరించడంపైనా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు నెలలో పరిష్కారాలను తీసుకొస్తామన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (ఇని్వట్‌లు), రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లు (రిట్‌లు) పనితీరు పోల్చి చూసుకునేందుకు వీలుగా బెంచ్‌మార్క్ ఏజెన్సీని రూపొందిస్తున్నట్టు తెలిపారు.
గ్యారంటీ హామీలతో జాగ్రత్త
ఇన్వెస్టర్లకు హెచ్చరిక
కాగా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ తరఫున ఓ అ«దీకృత వ్యక్తి ఇస్తున్న హామీపూర్వక రిటర్నుల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. ‘‘మా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ఒకరికి సంబంధించి అ«దీకృత వ్యక్తి అమిత్ లిహారే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచి్చంది. ఈ తరహా హామీపూర్వక రాబడులపై కమీషన్లను సైతం తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంటున్నట్టు తెలిసింది’’అని సెబీ తెలిపింది. సంబంధిత ట్రేడింగ్ సభ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. భారీ రాబడులు ఇస్తామంటూ హామీలు గుప్పించే గుర్తింపు లేని సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment