Permits
-
వేగంగా అనుమతులు
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు అనుమతులను వేగవంతం చేసే దిశగా కొత్త విధానంపై పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ముందుగా రూపొందించిన టెంప్లేట్‌లోని ఖాళీలను నింపడం ద్వారా కంపెనీలు ఐపీవో పత్రాలను సులభంగా సమరి్పంచొచ్చని చెప్పారు. అలాగే, కంపెనీలు సమరి్పంచిన ఐపీవో పత్రాలను వేగంగా తనిఖీ చేసేందుకు కృత్రిమ మేథ ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ నాటికి దీన్ని సిద్ధం చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐపీవో ప్రక్రియను వేగవంతం చేయడం తన ముందున్న కీలక లక్ష్యంగా పేర్కొన్నారు. ఎనిమిది ఐపీవో దరఖాస్తుల అనుమతులకు గరిష్ట గడువు అయిన మూడు నెలలు దాటినట్టు వివరించారు. న్యాయపరమైన జోక్యం, నిబంధనల అమలు లేమిని కారణాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీవో విషయంలో సంక్లిష్ట ముసాయిదా పత్రాల దాఖలు ప్రకియ ఉన్నట్టు చెప్పారు. దీన్ని సులభతరం చేసేందుకు టెంప్లేట్‌ను తీసుకొస్తామన్నారు. ఈ విధానంలో కేవలం ఖాళీలు నింపడం ద్వారా ఐపీవో డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకోవచ్చని చెప్పారు. నిరి్ధష్ట అంశాల్లో వైరుధ్యాలను, సంక్లిష్టతలను వివరించేందుకు ప్రత్యేక కాలమ్ ఉంటుందన్నారు. కాకపోతే కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది ప్రకటించలేదు. రైట్స్, ప్రిఫరెన్షియల్కూ కొత్త విధానంలిస్టెడ్ కంపెనీలు సైతం వేగంగా నిధులు సమీకరించేందుకు కొత్త విధానంపై సెబీ కసరత్తు చేస్తోంది. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కలయికతో ఇది ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 42 రోజుల సమయం తీసుకుంటుండగా, 23 రోజులకు తగ్గించనున్నట్టు సెబీ చైర్పర్సన్ తెలిపారు. సెబీ అనుమతులు, మర్చంట్ బ్యాంకర్ల అవసరాన్ని తొలగించనున్నట్టు, నిధుల సమీకరణకు సంబంధించి కేవలం రెండు పేజీల డాక్యుమెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దీనివల్ల మర్చంట్ బ్యాంకర్ల ఫీజుల బెడద తొలగిపోతుందన్నారు. ఈ ఆవిష్కరణను అమల్లోకి తీసుకురావడానికి ముందు సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఐపీవో పత్రాలు వెనక్కి.. మర్చంట్ బ్యాంకర్లకు వైపు నుంచి ప్రయోజనాల వైరుధ్యం, డైరెక్టర్లు మోసాల్లో నిందితులుగా ఉన్నప్పుడు, ఇష్యూకి సంబంధించి ఉద్దేశ్యాలు స్పష్టంగా లేనప్పుడు ఐపీవో పత్రాలను వెనక్కి తిప్పి పంపాలని సెబీ నిర్ణయించినట్టు మాధవి పురి బుచ్ తెలిపారు. నష్టాల్లోని కంపెనీలు లిస్ట్ అయ్యే విషయంలో వెల్లడించాల్సిన సమాచారాన్ని క్రమబదీ్ధకరించడంపైనా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు నెలలో పరిష్కారాలను తీసుకొస్తామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇని్వట్‌లు), రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లు (రిట్లు) పనితీరు పోల్చి చూసుకునేందుకు వీలుగా బెంచ్‌మార్క్ ఏజెన్సీని రూపొందిస్తున్నట్టు తెలిపారు.గ్యారంటీ హామీలతో జాగ్రత్త ఇన్వెస్టర్లకు హెచ్చరిక కాగా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ తరఫున ఓ అ«దీకృత వ్యక్తి ఇస్తున్న హామీపూర్వక రిటర్నుల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. ‘‘మా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ఒకరికి సంబంధించి అ«దీకృత వ్యక్తి అమిత్ లిహారే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచి్చంది. ఈ తరహా హామీపూర్వక రాబడులపై కమీషన్లను సైతం తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంటున్నట్టు తెలిసింది’’అని సెబీ తెలిపింది. సంబంధిత ట్రేడింగ్ సభ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. భారీ రాబడులు ఇస్తామంటూ హామీలు గుప్పించే గుర్తింపు లేని సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం. -
ఎస్‌అండ్‌టీ మైనింగ్ విలీనం పూర్తి
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా అనుమతుల నేపథ్యంలో ఎస్‌అండ్‌టీ మైనింగ్ విలీనాన్ని పూర్తి చేసినట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజా గా వెల్లడించింది. డిసెంబర్1 నుంచి విలీనం అమలులోకి వచి్చనట్లు తెలియజేసింది. విలీన పథకంలో భాగంగా ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను మూసివేయకుండా కంపెనీలో కలిపేసుకున్న ట్లు వివరించింది. టాటా స్టీల్ ఇటీవల కొంతకాలంగా అనుబంధ సంస్థలను విలీనం చేసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లోఅనుబంధ సంస్థల విలీనం పూర్తికానున్నట్లు ఇంతక్రితం కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
డిజిటల్ ఇన్ఫ్రా సంస్థలకు పర్మిట్లు కేంద్రానికి ట్రాయ్ సిఫార్సు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్ఫ్రా సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా పర్మిట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ కొత్త కేటగిరీ లైసెన్సును డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ (డీసీఐపీ) లైసెన్సుగా వ్యవహరించవచ్చని ట్రాయ్ పేర్కొంది. డీసీఐపీలో కంపెనీలపై లైసెన్స్ రుసుము ఎలాంటి విధించబడదు. (హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే! ) అయితే పర్మిట్ల కోసం రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు, రూ. 15,000 ప్రాసెసింగ్ ఫీజు విధించ వచ్చని తెలిపింది. అయితే డీసీఐపీ కోసం లైసెన్సు ఫీజు విధించవద్దని సూచించింది. దీన్ని స్టాండెలోన్ లైసెన్సుగా కాకుండా ఏకీకృత లైసెన్సు కిందే జారీ చేయొచ్చని ట్రాయ్ తెలిపింది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
దళితబంధుకు దరఖాస్తు ఎలా?
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టించింది. ఈ పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించినప్పటికీ.. పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా, ఈ ఏడాది కూడా ప్రభుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గస్థాయిలో పథకం అమలు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ.. తదితరాలకు సంబంధించి అనుమతులిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ పథకానికి ఎస్సీ కుటుంబాలను గుర్తించి వారి అర్హతను నిర్ధారించాలని ఉత్తర్వుల్లో తెలిపినప్పటికీ అధికారుల్లో మాత్రం స్పష్టత లేదని తెలుస్తోంది. ఎంపికపై స్పష్టత కరువు..! ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. ప్రత్యేకంగా దళితబంధు పోర్టల్‌ను రూపొందించింది. దీంతోపాటు మొబైల్ యాప్‌ను కూడా త యారు చేయించిన ప్రభుత్వం.. పథకం అమలులో పారదర్శ కత కోసం లబ్దిదారుల వివరాలు, యూనిట్ల ఏర్పాటు, పథ కం పురోగతి తదితరాలన్నీ పోర్టల్, యాప్‌ల ద్వారానే నిర్వ హించనుంది. ఈ అంశాలన్నీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు ల్లో పేర్కొన్నప్పటికీ లబ్దిదారుల ఎంపికపైన మాత్రం ఉత్తర్వుల్లో వివరణ ఏమీ లేదని చెపుతున్నారు. నియోజకవర్గస్థాయిలో ప్రజాప్రతినిధి సహకారంతో ఎస్సీ కుటుంబాలను గు ర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉండడంతో ఆయన సహకారంతో అర్హులను ఎంపిక చేసే వీలుంటుంది. కానీ క్షేత్రస్థా యి నుంచి దరఖాస్తులు స్వీకరించాలా? లేక ఎమ్మెల్యే సూ చించిన పేర్లతో కూడిన జాబితాను ఆమోదించాలా? అనే అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. వసూళ్లపర్వం బహిరంగమే.. దళితబంధు పథకంలో పెద్ద ఎత్తున వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లబ్దిదారు నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తన వద్ద ఉందంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం హెచ్చరించారు. ఇలాంటివి సహించబోనని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ఈ పథకం అమలులో పక్షపాత వైఖరి ఉందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. అర్హుల ఎంపికలో ఎమ్మెల్యే జోక్యం ఉండకూదని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో కొత్తగా మార్గదర్శకాలు వస్తాయని ఎస్సీ కార్పొరేషన్ భావించింది. ఇందులో భాగంగానే గతేడాది ఈ పథకాన్ని అమలు చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ ఈ అంశంపై స్పష్టత లేకపోవడం.. పాత విధానాన్నే అమలు చేసేలా సూచనలు ఇవ్వడం పట్ల క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకే లబ్దిదారుల ఎంపిక బాధ్యతలు ఇవ్వడంవల్ల అక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతాయని పలువురు ఆక్షేపిస్తున్నారు. -
అనుమతి లేకుండా అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్/ఇబ్రహీంపట్నం: ఎలాంటి అనుమతులు లేని గురునానక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఆర్థికంగానే కాకుండా, విద్యా సంవత్సరం నష్టపోయామని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కారణమైన వర్సిటీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఓ చట్ట సవరణ తెచ్చింది. గత ఏడాది సెపె్టంబర్ 13న ఈ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారు. ఇప్పటివరకూ దీనిపై గవర్నర్ దగ్గర్నుంచి స్పష్టత రాలేదు. అయితే, గురునానక్‌తోపాటు మరో కాలేజీ కూడా బిల్లుపై స్పష్టత రాకుండానే విద్యార్థులను చేర్చుకుంది. వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. గురునానక్ కాలేజీలో 3వేల మంది విద్యార్థులు చేరారు. 2022–23 విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. దీనిపై ప్రభుత్వం సంబంధిత కాలేజీలకు నోటీసులివ్వగా, విద్యార్థుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ఈ చర్యతో తమకు జరిగిన నష్టం భర్తీ కాదని విద్యార్థులు అంటున్నారు. తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులు కళాశాలలోకి చొరబడి రాళ్లు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. -
ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు. మౌంట్ ఎవరెస్ట్‌ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ భారత్‌కు చెందిన టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుంది. శారీరకంగా ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫర్టెన్‌బాచ్ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్ ఎక్కి వచ్చారని చెప్పారు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్‌పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ పేర్కొన్నారు. ఆదాయానికి ఆశపడి..? నేపాల్‌కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంప్‌లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా సాధ్యమే ప్రపంచంలో ఎవరెస్ట్ మ్యాన్‌గా పేరు పొందిన నేపాల్‌కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్‌ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్‌గా నమోదైంది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్‌లో ఆటో కావాలా? రెండు లక్షలు అదనం తప్పదు! బతుకులు ‘తుక్కు’
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తమ గ్రామం నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన సాంబయ్య ఉపాధి కోసం ఆటో నడుపుకోవాలనుకున్నాడు. షోరూమ్‌లో కొత్త ఆటో ధర రూ.2.35 లక్షలే. కానీ ఆటో బయటికి వచ్చి రోడ్డుపై తిప్పుకునేందుకు రూ.4.20 లక్షలకుపైనే ఖర్చయింది. ఇదెలా అని ఆశ్చర్యపోవద్దు. హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి ఉంది. ఒక పాత ఆటో తుక్కుకు వెళ్తేగానీ.. కొత్త ఆటో రోడ్డెక్కడానికి వీల్లేదు. పెద్ద సంఖ్యలో పాత, పాడైపోయిన ఆటోల పర్మిట్లను చేజిక్కించుకున్న కొందరు.. ఆ పర్మిట్లను అడ్డుపెట్టుకుని కొత్త ఆటో కావాల్సిన వారి నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ముసుగులో ‘పర్మిట్ల’ దందాకు పాల్పడుతున్నారు. వారి ప్రమేయం లేకుండా ఒక్క కొత్త ఆటో కూడా రోడ్డెక్కని పరిస్థితి. అధికారులకు ఇదంతా తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య లేకుండా పరిమితితో.. రోడ్ల సామర్థ్యానికి మించి ఆటోలు బయటికి వస్తే ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం హైదరాబాద్‌లో ఆటోల సంఖ్యపై పరిమితి విధించింది. ఎవరంటే వారు ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే తిరుగుతున్న ఆటోలు తుక్కు (స్క్రాప్) కింద మారితే ఆ స్థానంలో కొత్త ఆటోలు రోడ్డెక్కడానికి అనుమతి ఉంటుంది. అయితే ఎవరైనా పాత ఆటో ఉన్నవారు. దానిని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కు కింద మార్చేస్తే.. వారికి కొత్త ఆటో కొనుక్కుని తిప్పుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. దీనినే కొందరు దందాగా మార్చుకున్నారు. ఏం చేస్తున్నారు? ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల వరకు ఆటోలు తిరుగుతున్నాయి. వాటిలో 30 శాతం మాత్రమే యజమానుల చేతుల్లో ఉన్నాయి. మిగతావన్నీ కొందరు వ్యక్తులు, ఫైనాన్షియర్ల చేతుల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తవారు ఆటో కొనాలంటే.. ముందుగా ఓ పాత, తుక్కు దశకు చేరిన ఆటోను వారి పేరిట మార్చుతున్నారు. తర్వాత దాన్ని రవాణాశాఖ ఆధ్వర్యంలో తుక్కుగా చేసి, ఈ పర్మిట్‌ను కొత్త ఆటోకు వచ్చేలా చేస్తున్నారు. ఇలా పాత ఆటో పర్మిట్‌ను ఇచ్చేందుకు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా పాత పర్మిట్, కొత్త ఆటో కలిసి నాలుగున్నర లక్షలదాకా చేరుతోంది. అంటే ఓ చిన్న కారు ధరతో సమానంగా మారుతోంది. కరోనా కష్టకాలంలో ‘పర్మిట్లు’ పట్టేసుకుని కరోనా మహమ్మారి, లాక్డౌన్లు, ఇతర పరిణామాలతో బడుగుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఆటోలు నడుపుకొనే వారి ఉపాధికి దెబ్బతగిలింది. ఆదాయం లేకపోవడం ఓవైపు.. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారినపడటమో, ఇతర అవసరాలతోనో డబ్బులు అవసరం పడటం మరోవైపు కలిసి.. చాలా మంది ఆటోలను అమ్ముకున్నారు. కొందరు ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని పాత, తుక్కు దశకు చేరుకున్న ఆటోలను తక్కువ ధరకు పెద్ద సంఖ్యలో కొనేసి పెట్టుకున్నారు. పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో మళ్లీ ఆటోలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడా పాత ఆటోల పర్మిట్లను అడ్డుపెట్టుకునిదందా కొనసాగిస్తున్నారు. డిమాండ్ పెరిగిన కొద్దీ ‘పర్మిట్ల’ రేట్లు పెంచేస్తున్నారు. ఫైనాన్స్ కట్టలేని వారి నుంచి.. హైదరాబాద్ నగరంలో ఆటోలకు ప్రైవేటుగా ఫైనాన్స్ చేసే వ్యక్తులు సుమారు 310 మందిదాకా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తిరుగుతున్న మొత్తం ఆటోల్లో 70 శాతం వరకు వీరు ఆర్థిక సాయం చేసినవే. ఈ అప్పులపై విపరీతంగా వడ్డీ ఉంటుంది. ఆటో సరిగా నడవక, తగిన ఆదాయం రాక, ఇల్లు గడవడానికి సంపాదన సరిపోక చాలా మంది రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం లేదు. అలాంటి ఆటోలను ఫైనాన్షియర్లు లాగేసుకుంటున్నారు. వాటిని అద్దెకు ఇచ్చినంత కాలం ఇచ్చి.. డొక్కుగా మారాక ‘పర్మిట్ల’ దందా కోసం వాడుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రవాణా శాఖ సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. వెంటనే చర్యలు చేపట్టాలి ఆటో పర్మిట్ల విక్రయం దందా తెలిసి కూడా అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియర్లు అక్రమ దందా చేస్తున్నారు. ఇటీవల ఇది మరింత తీవ్రమైనా చూసీచూడనట్టు ఉంటుండటం అనుమానాలకు తావిస్తోంది. బడుగుల జేబులను కొల్లగొడుతున్న ఈ దందాను అరికట్టాల్సి ఉంది – దయానంద్, తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి -
ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలో అక్రమార్జన
సాక్షి హైదరాబాద్: ఆబ్కారీశాఖలో నకిలీ ఈవెంట్ పర్మిట్ల దందా చర్చనీయాంశంగా మారింది. వేడుకల సందర్భంగా మద్యం వినియోగానికి నకిలీ అనుమతులు ఇచ్చిన ఉదంతంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, బాంక్విట్ హాళ్లు వంటి చోట్ల నిర్వహించే వేడుకల సందర్భంగా మద్యం వినియోగం కోసం పెద్ద సంఖ్యలో నకిలీ అనుమతులను ఇచ్చినట్లు వెల్లడి కావడంతో ఎక్సైజ్ శాఖ సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం వెనుక పైఅధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సీఐలతో పాటు మరో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అనుమతితోనే నకిలీ దందా కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఖాతాలో చేరాల్సిన సొమ్మును స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా కేవలం సస్పెన్షన్‌కే పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌తో పాటు నగర శివార్లలోని మరికొన్ని స్టేషన్ల పరిధిలోనూ ఇలాంటి నకిలీ పర్మిట్లు వందల సంఖ్యలో వెలువడ్డాయని, ఉన్నతస్థాయిలో విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖలో ఏళ్లుగా.. మరోవైపు తాజాగా నకిలీ అనుమతుల ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ 2016 అక్టోబర్ నుంచి ఇలాంటి అనుమతుల దందా కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వేడుకలు జరుగుతాయి. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తా రు. ఇలాంటి కార్యక్రమాలకు ఒకరోజు అనుమతికి రూ.8000 నుంచి రూ.9000 వరకు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు రూ.30 వేలకుపైగా ఎక్సైజ్‌శాఖకు చలానాల రూపంలో చెల్లించి ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పైఅధికారుల అండతోనే కిందిస్థాయి సిబ్బంది అనుమతుల సమూనాపత్రాల్లో తేదీలు, వేడుక స్థలాలను మార్పు చేసి ఇస్తున్నారు. ఇలా ఏటా వందల సంఖ్యలో నకిలీ అనుమతులు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ఆదాయం కొందరు అధికారులు, సిబ్బంది జేబుల్లోకొ వెళ్తోంది. మరోవైపు ఈ తరహా అక్రమాలకు పాల్పడే సిబ్బంది ఎలాంటి బదిలీలు లేకుండా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయి పని చేయడం గమనార్హం. ఏసీబీతో విచారణ జరిపించాలి.. ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో నకిలీ అనుమతులపై ఉద్యోగుల సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు పరిమితం కాకుండా ఏసీబీ విచారణ జరిపించాలని, ఏ స్థాయి అధికారులైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ వర్గాలు కోరుతున్నాయి. (చదవండి: పడవతో గస్తీ.. లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
స్థిరాస్తి ప్రాజెక్టులపై ‘రెరా’ కన్ను
సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అన్ని వర్గాల వారు దీనిని సమకూర్చుకోవాలనుకుంటారు. అయితే, కొన్న ఫ్లాట్లకు ప్రభుత్వ అనుమతులు లేకుంటే బ్యాంకు రుణాలు రావు.. అలాగే, ఓపెన్ ప్లాట్ అయితే నిర్మాణానికి స్థానిక సంస్థల అనుమతులు తప్పనిసరి. ఈ రెండు రకాల అనుమతులు ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ కొన్ని కొన్ని నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టొచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) బాధితులకు అండగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ ప్లాట్లు, బహుళ అంతస్తుల నిర్మాణలు చేపట్టే కంపెనీలు లేదా బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో రిజిస్టర్ చేయించాలని, లేదంటే వారికి న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరిస్తోంది. రెరాలో నమోదైనవి 2,900 ప్రాజెక్టులే.. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచిగాని, మున్సిపాలిటీలు, టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచిగాని ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. సదరు సంస్థలు బోర్డు తిప్పేస్తే ఇలాంటి వాటిలో స్థలాలు, ఫ్లాట్లు కొనేవారికి రక్షణ ఉండదు. ఇవిగాక మున్సిపాలిటీలు, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులు దాదాపు ఏడువేలకు పైగా ఉన్నట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ ‘రెరా’ అనుమతి తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో ‘రెరా’ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కేవలం 2,900 ప్రాజెక్టులు మాత్రమే ‘రెరా’లో నమోదయ్యాయి. ఈ ప్రాధికార సంస్థ అనుమతిలేకుంటే ఆ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పాటు నిర్మాణదారుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఇప్పటిదాకా తమ ప్రాజెక్టుల వివరాలు నమోదు చేయించకుంటే ‘రెరా’ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం 10 శాతం వరకు పెనాల్టీ విధిస్తామని ‘రెరా’ పాలకవర్గం ప్రాజెక్టుల యజమానులకు సమాచారం పంపిస్తోంది. అప్పటికీ స్పందించకుంటే అలాంటి ప్రాజెక్టుల వివరాలను బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి వాటి రుణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారులకు నష్టం జరగకుండా.. కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలుకు వెళ్తే.. అన్ని అనుమతలు ఉన్నాయని, స్థానిక సంస్థల నుంచి, టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతి ఉన్నట్లు చెబుతారు. వీటితో పాటు రెరాలో రిజిస్టర్ అయ్యిందో లేదో చూసుకోవాలి. 500 చ.మీ. విస్తీర్ణంలో దాటిన వెంచర్లు, డెవలపర్లు నిర్మించే ఫ్లాట్ల సంఖ్య 8 మించి ఉంటే తప్పనిసరిగా ‘రెరా’లో నమోదు చేయించడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి పనుల పురోగతిని ‘రెరా’లో నమోదు చేయాలి. అలా చేయని పక్షంలో ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో ఉంచే అధికారం ‘రెరా’కు ఉంది. కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా నిర్మాణం లేకున్నా.. మరేదైనా పెద్ద లోపాలు తలెత్తినా ఐదేళ్ల వరకు సదరు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన ఐదేళ్ల వరకు నిర్మాణంలో తలెత్తే పెద్ద సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సదరు బిల్డరుదే. ఆయా సమస్యలపై కొనుగోలుదారులు ‘రెరా’కు ఫిర్యాదు చేయవచ్చని పాలక మండలి చెబుతోంది. -
కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి అనుమతులివ్వండి
న్యూఢిల్లీ: భారత్‌తో పాటు పలు దేశాల్లో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగినందువల్ల కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి వ్యాపార అనుమతి మంజూరు చేయాలని తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా (సీఐఐ) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. భారత్‌లో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్లకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఇదివరకే సమర్పించామని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకాల పంపిణీ జరిగిందని, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని, వ్యాక్సిన్ సమర్థతకు ఇదే నిదర్శనమని సీరమ్ పేర్కొంది. -
ఆకివీడులో ప్రైవేటు ఆసుపత్రి సీజ్
ఆకివీడు: అనుమతులతో పాటు, వైద్యులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిలో సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ పి.బాలు, నర్సాపురం డిప్యూటీ వైద్యాధికారి ప్రసాద్‌లు తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీ చేపట్టినట్టు బాలు చెప్పారు. రమేష్ అనే వ్యక్తి తన పేరుతోనే ఆస్పత్రి నడుపుతున్నారని, దీనికి ప్రభుత్వ అనుమతుల్లేవన్నారు. తనిఖీ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంపై ప్రశ్నించగా.. కోవిడ్ కారణంగా రావడం లేదని నిర్వాహకులు చెప్పినట్టు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న మందుల షాపును కూడా సీజ్ చేసినట్టు డాక్టర్ బాలు వివరించారు. దీనిపై రమేష్ మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. -
సినిమా ఘూటింగ్లకు ప్రభుత్వం అనుమతి
-
వాహన పర్మిట్ల వ్యాలిడిటీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు విఘాతం కలగకుండా వాహన పర్మిట్ల వ్యాలిడిటీ గడువును జూన్ 30 వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, రిజిస్ర్టేషన్ పత్రాల చెల్లుబాటు వ్యవధిని ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకూ పొడిగించినట్టు కేంద్రం పేర్కొంది. ఈ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని జూన్ 30గా పరిగణించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ రవాణా కార్యాలయాలు మూతపడటంతో మోటార్ వాహనాల చట్టం, కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలకు అనుగుణంగా ఆయా డాక్యుమెంట్ల రెన్యువల్లో ఎదురువుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. దేశమంతటా నిత్యావసర సరుకులు, వస్తువులు నిరాటంకంగా సరఫరా అయ్యేందుకు ఈ మార్గదర్శకాలను విధిగా అమలుపరచాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. చదవండి : మందుబాబులకు గుడ్‌న్యూస్.. డోర్‌డెలివరీ -
ఈవెంట్ పర్మిట్లపై ఆబ్కారీ ఆంక్షలు
సాక్షి, అమరావతి: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లకు ఇచ్చే పర్మిట్లపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకుంటేనే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చే విషయం పరిశీలించాలని నిర్ణయించింది. మద్య నియంత్రణలో వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండడంతో ఈవెంట్ పర్మిట్ల విషయం లోనూ ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో అయితే ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి లిక్కర్ సరఫరా కోసం నిర్వాహ కులు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకునే వారు. ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అంశాల ప్రాతిపదికగా (సబ్జెక్ట్ టు కండిషన్) అనుమతులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కుదరదు. సాధారణంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించే ఈవెంట్లలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. గతంలో నూతన సంవత్సరం సందర్భంగా ఒక్క రోజే రూ.150 కోట్ల వరకు మద్యం అమ్మకాలు ఉండేవి. గత ప్రభుత్వం ఆదాయం పెంచుకు నేందుకు మద్యం అమ్మకాలను అర్ధరాత్రి వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసేది. ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేయడంతో ఈ సారి కొత్త ఏడాది వేడుకల ఈవెంట్ల పర్మిట్లకు దరఖాస్తులు భారీగా తగ్గాయి. గతంలో ఒక్క విజయవాడలో 30 నుంచి 40 ఈవెంట్ల పర్మిట్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చేది. ఈ సారి కేవలం ఐదు ఈవెంట్లకు మాత్రమే దరఖాస్తులు అందాయి. విశాఖలోనూ దరఖాస్తులు పెద్దగా రాలేదని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
గ్రానైట్.. అక్రమాలకు రైట్‌రైట్!
సాక్షి, అనంతపురం: జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అత్యంత విలువైన ఖనిజాన్ని రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దును దాటించేస్తున్నారు. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. దొరికితే దొంగ లేదంటే దొరే అన్న చందంగా అక్రమ రవాణా సాగుతోంది. క్వారీలపై గనులశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణ జోరుగా సాగుతోంది. గ్రానైట్ అక్రమ రవాణాతో ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లకు పైగా నష్టపోతోంది. పర్మిట్లు నిల్.. రవాణా ఫుల్.. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 340 క్వారీలకు గనులశాఖ అధికారులు అనుమతులను మంజూరు చేశారు. వీటిలో 150కిపైగా కిపైగా గ్రానైట్ క్వారీలు, 144 రోడ్డుమెటల్ క్వారీలున్నాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకొవాలనే అన్న సామెతను గ్రానైట్ అక్రమార్కులు తూ చ తప్పకుండా పాటిస్తున్నారు. ఎలాంటి పర్మిట్లు తీసుకోకుండానే అత్యంత విలువైన గ్రానైట్‌ను జల్లా సరిహద్దు దాటించేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కలర్ గ్రానైట్‌కు కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో గ్రానైట్ బ్లాక్‌లకు రాయల్టీ చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటకకు తరలిస్తున్నారు. క్వారీ నిర్వహకులు గ్రానైట్‌ను తరలించే సమయంలో భూగర్భ గనుల శాఖ అధికారులతో అనుమతులు పొందాలి. కలర్ గ్రానైట్‌కు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.2350, బ్లాక్ గ్రానైట్‌కు రూ.3000లతో రాయల్టీ చెల్లించాలి. అయితే క్వారీ నిర్వహకులు మాత్రం తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి అధిక మొత్తంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రోడ్డు మెటల్ క్వారీల్లో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. పెనుకొండ, రాయదుర్గం ప్రాంతాల్లోని రోడ్డు మెటల్ క్వారీల్లో తీసుకున్న పర్మిట్లకు క్వారీల్లో తవ్వుకున్న ఖనిజానికి ఎక్కడా పొంతన లేదు. తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి లక్షల కూబ్యిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తవ్వుకుంటున్నారు. మడకశిర కేంద్రంగా అక్రమ రవాణా గ్రానైట్ అక్రమ రవాణ మడకశిర కేంద్రంగా సాగుతోంది. మడకశిర నియోజకవర్గంలోని అత్యధిక గ్రానైట్ క్వారీలు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అధీనంలో ఉన్నాయి. ఇక్కడ గ్రానైట్ రవాణా మొత్తం ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.. గత 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా గ్రానైట్ రవాణా సాగించారు. ఇప్పుడు సైతం అదే పంథానే కొనసాగిస్తున్నారు. మొత్తం క్వారీలన్నీ ఆయన అధీనంలో ఉండడం.. క్వారీలకు 4,5 కిలో మీటర్ల దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండడం ఆ నేతకు బాగా కలిసొచ్చింది. అత్యంత విలువైన గ్రానైట్‌ను రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దును దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక మడకశిర ప్రాంతం నుంచే దాదాపు రూ.50 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం సాగుతోంది. మడకశిర జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణ సైతం కొరవడింది. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా రవాణా సాగిస్తున్నారు. గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంతోపాటు గనులశాఖ విజిలెన్సు కార్యాలయం జిల్లాలోనే ఉన్నా అక్రమ రవాణకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం వెహికల్ ట్రాకింగ్ సిస్టాన్ని అమలులోకి తీసుకువచ్చి గ్రానైట్ అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం. గ్రానైట్ రవాణా సమయంలో క్వారీ నిర్వహకులు రిజిస్టర్ వెహికల్ నంబర్ ఇస్తేనే పర్మిట్లు జారీ చేసేలా చర్యలు చేపడతాం. రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్ రవాణా సాగిస్తే వెహికల్‌ను సీజ్ చేయడంతోపాటు క్వారీల లీజును సైతం రద్దు చేస్తాం. – చంద్రమౌళి, గనులశాఖ డీడీ -
పర్యావరణ అనుమతులు లేవా?
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2007లో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేయగా దానిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వులను పునరుద్ధరించాలంటూ ఒడిశా ప్రభుత్వం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. అలాగే పర్యావరణ అనుమతులు లేకుండానే పోలవరం నిర్మిస్తున్నారని రేలా స్వచ్ఛంద సంస్థ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ఈ పిటిషన్లను ఇప్పటి వరకు జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. డిసెంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయడంతో గురువారం జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఒడిశా ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణ్యం వాదనలు వినిపించారు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు పొందిన ఏపీ ప్రభుత్వం.. ఆ డిజైన్‌ను మార్చి 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపారు. నిల్వ నీటి (బ్యాక్ వాటర్)తో ఒడిశాకు ముంపు ముప్పు ఎక్కువగా ఉందని విన్నవించారు. ఈ వాదనలతో ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ విభేదించారు. ముంపు ముప్పుపై బచావత్ ట్రిబ్యునల్ విచారించిన మీదటే అవార్డు జారీ చేసిందని నివేదించారు. కాగా పర్యావరణ అనుమతులు తిరిగి పొందాలని చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ పనుల నిలిపివేత ఆదేశాలను పదే పదే నిలిపివేస్తోందని రేలా స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది జయంత్ భూషణ్ ధర్మాసనానికి విన్నవించారు. అనుమతులు తిరిగి తీసుకునేంతవరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంలోకి ప్రైవేటు సంస్థలు రావడం సరికాదంటూ ఏకే గంగూలీతో పాటు కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలతో ధర్మాసనం విభేదించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎవరైనా వేయొచ్చని స్పష్టం చేస్తూ విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. -
16 ప్రాజెక్టుల్లో నిర్మాణంలో ఉన్నవి ఐదే
న్యూఢిల్లీ: దేశంలో 16 సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వగా దశాబ్దం తర్వాత ఐదు మాత్రం నిర్మాణంలో ఉన్నాయని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక తూర్పారబట్టింది. నిర్మాణం నత్తనడకన సాగుతుండగా వాటి అంచనా వ్యయం విపరీతంగా పెరిగిందని తెలిపింది. 2008 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్ పలు సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. వాటిల్లో ప్రస్తుతం పనులు నడుస్తున్నవి గోసిర్‌కుండ్, తీత్సా, సరయూ, ఇందిరాసాగర్ పోలవరం, షాపూర్–కాండి ప్రాజెక్టులు. కాగా, 2017 వరకు వీటి నిర్మాణానికి వెచ్చించిన మొత్తం రూ.13,299 కోట్లుగా కాగ్ తేల్చింది. ఈ ఐదు ప్రాజెక్టులు 8 శాతం నుంచి 99 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్నాయి. వీటి అంచనా వ్యయం మాత్రం 2,341 శాతం పెరిగిపోగా వీటి వల్ల అంత ప్రయోజనం దక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయంది. ఈ ప్రాజెక్టుల నివేదిక తయారీ, అనుమతులు, సర్వే, భూ సేకరణ నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ నిర్వహణ లోపాలున్నాయని తెలిపింది. -
యజమాని అంగీకరిస్తేనే భూ సేకరణ!
సాక్షి, హైదరాబాద్: యజమానుల అంగీకారంతోనే భూ సేకరణ జరపాలన్న కీలక షరతుతో ఫార్మా సిటీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల శాఖ పర్యావరణ అనుమతులు జారీ చేసింది. నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి తెరలేవనుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలోని 19,333.20 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ పారిశ్రామికవాడ నిర్మాణంతో 5.6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రభుత్వ అంచనా ప్రకారం.. ఫార్మా సిటీ ఔషధ ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.1.4 లక్షల కోట్ల టర్నోవర్ సాధించడంతోపాటు రూ.58 వేల కోట్ల విలువైన ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేయనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించనున్న ఫార్మాసిటీ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. రూ.16,784 కోట్ల అంచనా వ్యయంతో నిర్మి స్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా వేసింది. హైదరాబాద్ నుంచి 298 కాలుష్య కారక ఔషధ పరిశ్రమలను ఫార్మా సిటీకి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ నెల 7న ఢిల్లీలో సమావేశమై.. ఫార్మా సిటీ ప్రాజెక్టుకు 18 షరతులతో కూడిన పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసులు చేసింది. 18 షరతులివీ.. ♦ పర్యావరణ పరిరక్షణ నిబంధనల అమలు బాధ్యత టీఎస్‌ఐఐసీదే. ♦ పరిహారం చెల్లించి భూయజమానుల అంగీకారంతోనే మిగులు భూ సేకరణ జరపాలి. ♦ భూ నిర్వాసితులకు సరైన శిక్షణ అందించి వారి నైపుణ్యాన్ని పెంపొందించి, ఫార్మా సిటీలో వారికి టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఆవాసాలను మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాలి. సాధ్యం కాకుంటే ప్రస్తుతమున్న జనా వాసాలు, పరిశ్రమల మధ్య కనీసం ఒక కిలోమీటర్ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మాసిటీ నిర్మిత స్థలం, అడవుల మధ్య 100 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేయాలి. ♦ జల వనరులు కలుషితం కాకుండా 100 మీటర్ల బఫర్ జోన్‌తో రక్షణ కల్పించాలి. ♦ ఫార్మా సిటీ ప్రతిపాదిత ప్రాంతానికి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామాల్లో వార్షిక ఆరోగ్య సర్వే నిర్వహించాలి. గ్రామస్తులకు వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలి. ♦ బాయిలర్ల కోసం సహజ వాయువులనే వినియోగించాలి. మీథేన్ వాయువుల ఉద్గారాన్ని నిరంతరంగా సమీక్షిస్తుండాలి. ♦ భూ ఉపరితల జలాలు, భూగర్భ జలాల నాణ్యతలపై క్రమం తప్పకుండా సమీక్షలు జరిపి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, పీసీబీలకు త్రైమాసిక నివేదికలు సమర్పించాలి. ♦ ఫార్మా సిటీ అవసరాలకు భూగర్భ జలాలను వినియోగించరాదు. ♦ కేంద్ర/రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ఎప్పటికప్పుడు గాలి, నీటి నాణ్యతల సమాచారాన్ని తెలిపే ఆన్లైన్ సమీక్షల విధానాన్ని ఏర్పాటు చేయాలి. ♦ అటవీ శాఖతో సంప్రదింపులు జరిపి రిజర్వు ఫారెస్టు సంరక్షణ ప్రణాళిక అమలు చేయాలి. మూడేళ్లలో రూ.28.22 కోట్లు ఖర్చు చేసేలా చూడాలి. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)లో భాగంగా ప్రతిపాదించిన ఖర్చులకు ఇది అదనం. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం టీఎస్ఐఐసీ, అటవీ శాఖతోపాటు ఈ అంశంలో అవగాహన కలిగిన 2 జాతీయ గుర్తింపున్న స్వచ్ఛంద సంస్థలతో కమిటీ ఏర్పాటు చేయాలి. పర్యావరణం, కాలుష్యంపై సమీక్షల కోసం మరో కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ రెండు కమిటీలు ఏడాదికి కనీసం రెండుసార్లు సమావేశమై పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ రాష్ట్ర భూగర్భ జల శాఖ సహకారంతో ప్రాజెక్టు ప్రాంతంలో పీజోమీటర్లు ఏర్పాటు చేయాలి. భూగర్భ జలాల నాణ్యతలను త్రైమాసికంగా పరీక్షించి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ ఫార్మా సిటీకి 5 కి.మీల పరిధిలో ఉన్న పంట పొలాల స్థితిగతులు, దిగుబడులపై వార్షిక అధ్యయనం జరిపి పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ♦ సిటీ మూడో విడతలో ఆరెంజ్, గ్రీన్, వైట్ కేటగిరీల పరిశ్రమలనే ఏర్పాటు చేయాలి. ♦ ఫార్మా సిటీలోని ప్రతి పరిశ్రమ సొంత వ్యర్థాల శుద్ధి కర్మాగారం (ఈటీపీ) ఏర్పాటు చేసుకునే విధంగా సంబంధిత నియంత్రణ సంస్థ చర్యలు తీసుకోవాలి. ఫార్మా సిటీలోని కేంద్ర వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌పై ఒత్తిడి పెరగకుండా బల్క్ ఔషధాలు, రసాయన మిశ్రమాల ఉత్పత్తి పరిశ్రమలు ఈటీపీలు ఏర్పాటు చేయాలి. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరైన విరుగుడు మందులతోనే రసాయనాల రవాణా జరపాలి. రసాయ నాలు రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. పర్యావరణ పరిరక్షణ నివేదికలో పేర్కొన్నట్టు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి -
కొత్త ఆటోలకు గ్రీన్ సిగ్నల్
► పాత ప్రొసీడింగ్లపైనే జారీ ► 1407 ఆటోలకు అనుమతి ► జేటీసీ రఘునాథ్ వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరిన్ని కొత్త ఆటోలు రోడ్డెక్కనున్నాయి. గతంలో పలు జీవోల కింద విడుదలై గడువు ముగిసిన కారణంగా మిగిలిపోయిన 1,407 ఆటో రిక్షాలకు అనుమతినిస్తూ మంగళవారం రవాణాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. బుధవారం నుంచి కొత్త ఆటోల విక్రయాలకు అనుమతి ఇస్తున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వండి.. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పాటు కొత్తవాళ్లకు కూడా ఆటో పర్మిట్లు పొందేందుకు అవకాశం కల్పించాలని ఏఐటీయూసీ కార్యదర్శి బి.వెంకటేశం, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి ఏ.సత్తిరెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెండేళ్లలో పెరిగిన నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని అవకాశం కల్పించాలని కోరారు. -
'రోడ్లపైకి వస్తే నిప్పంటించడం ఖాయం'
ముంబయి: రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఆరోపించింది. 70శాతం ఆటో పర్మిట్లు రాష్ట్రేతరులకే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటోలన్నింటిని గుర్తించి తగులబెడతామంటూ బహిరంగ ప్రకటన చేసింది. తన పార్టీ కార్యకర్తలు అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే నిప్పుపెట్టడం ఖాయం అని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 'కొత్త పర్మిట్ తీసుకున్న మహారాష్ట్రేతర ఆటో కనిపిస్తే ఆపేస్తాం. అందులోని ప్రయాణీకులను దించివేసి ఆ ఆటోను కాల్చివేస్తాం.. రాష్ట్ర రవాణాశాఖను చూసుకుంటున్న శివసేన ఈ విషయంలో ఏం చేస్తోంది చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న అనుమతులు కాకుండా త్వరలోనే మరో 70 వేల మహారాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వబోతున్నారని వాటిని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
మాతృభాష రాకుంటే ఆటో పర్మిట్లు కూడా రావు!
మాతృభాషలో అనర్గళంగా మాట్లాడటం వచ్చా? రాకుంటే వెంటనే '30 రోజుల్లో మాతృభాష' పుస్తకాన్ని కొనుక్కొని నేర్చేసుకోండి. అది కూడా నవంబర్ 1 లోగా. ఎందుకంటే ఆ తర్వాతి నుంచి మాతృభాష రాకుంటే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడం కల్ల. అదృష్టవశాత్తు ఈ నిబంధన విధించింది తెలుగు రాష్ట్రాలు కాదు.. పక్కనున్న మహారాష్ట్రలో! నవంబర్ 1 నుంచి మరాఠీ మాట్లాడగలిగిన ఆటో డ్రైవర్లకు మాత్రమే పర్మిట్లు ఇస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రౌతే మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చినవారిపై మరాఠా అతివాదులు కొందరు దాడులు చేసిన నేపథ్యంలో తాజాగా విధించనున్న మరాఠీ భాషా నియమం ఎన్ని సమస్యలకు దారితీస్తుందో చూడాలి. -
ఇంటి అనుమతి.. ఇక ఈజీ!
మురికివాడల ప్రజలకు వెసులుబాటు ఇంటి నిర్మాణ అనుమతుల్లో రాయితీ చదరపు అడుగుకు రూ.10 నామమాత్రపు ఫీజు ఆర్కిటెక్ట్/ ఇంజినీర్ నుండే ఇంటి నిర్మాణ అనుమతులు బీపీఎస్‌పై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదనలు నగరంలో బీపీఎస్‌ను అమలు చేయడంతోపాటు ఇంటి నిర్మాణ అనుమతుల్ని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణానికి తప్పనిసరిగా అనుమతి తీసుకునేలా చూడాలని...ఆస్తి పన్ను రూపంలో ఆదాయం పెంచాలని యోచిస్తున్నారు. బీపీఎస్‌పై ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ ప్రతిపాదనల మేరకు మురికి వాడల్లో ఇళ్ల అనుమతికి చదరపు అడుగుకు రూ. 10 నామమాత్రపు ఫీజు తీసుకోవాలని భావిస్తున్నారు. అంటే వంద గజాల ఇంటి నిర్మాణానికి రూ.వెయ్యి మాత్రమే వసూలు చేస్తారు. ఇక అనుమతులు సైతం జీహెచ్ఎంసీ నుండి కాకుండా అధీకృత ఆర్కిటెక్ట్ లేదా ఇంజినీరు నుండే జారీ చేసేలా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. సిటీబ్యూరో: ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేనున్న బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) పథకంతోపాటు భవిష్యత్‌లో నిర్మాణ అనుమతుల్ని సులభతరం చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పేదలు ఎక్కువగా ఉండే స్లమ్స్లోనూ తప్పనిసరిగా అనుమతులు తీసుకునేందుకు వీలుగా వారికి డెవలప్మెంట్ ఫీజులవంటివి ఏవీ లేకుండా నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అదీ చదరపు అడుగుకు కేవలం రూ. 10 నామమాత్రపు ఫీజుగా వసూలు చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం పేదలకు ఉపకరించడమేకాకుండా.. అన్ని ఇళ్ల వివరాలూ రికార్డుల్లో నమోదు కాగలవని భావిస్తున్నారు. ప్రస్తుతం అనుమతులు పొందేందుకు ఉన్న ఇబ్బందులు.. టౌన్‌ప్లానింగ్ విభాగం అవినీతి తదితర కారణాల వల్ల స్లమ్స్‌లో నివసించే వారు చాలా వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సిన నిర్మాణ అనుమతులు ఫీజుల సంగతటుంచి, ఆస్తిపన్ను జాబితాలోనూ సదరు ఇళ్లు చేరడం లేవు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు జరిపినప్పుడు మాత్రం ఆస్తిపన్ను జాబితాలో నమోదు చేస్తున్నారు. సంబంధిత సిబ్బంది చేయి తడిపితే అదికూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఏటా రావాల్సిన ఆస్తిపన్ను రాకుండా పోతోంది. కొత్త నిబంధనల్లో స్లమ్స్‌కు నామమాత్రపు ఫీజును ఖరారు చేస్తే అందరూ అనుమతి తీసుకోవడంతో పాటు ఇతరత్రా ఎన్నో విధాలుగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. 2008లో బీపీఎస్‌ను అమల్లోకి తెచ్చినప్పుడు సైతం వాణిజ్యప్రాంతాలు, కాలనీల నుంచి క్రమబద్ధీకరణ కోసం ఎక్కువ దరఖాస్తులందగా, స్లమ్స్నుంచి అందలేదు. స్లమ్స్‌లో డీవియేషన్లు జరిగినా, తక్కువ విస్తీర్ణంలోవే కనుక ఎవరూ పట్టించుకోలేదు. తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ అంతస్తులు లేపడంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యకు కూడా పరిష్కారం కోసం సెట్‌బ్యాక్ నిబంధనల్ని మార్చాలని భావిస్తున్నారు. ఫ్రంట్ సెట్‌బ్యాక్‌ను ప్రస్తుతమున్న 1.5 మీటర్ల నుంచి 1 మీటరుకు తగ్గించాలనిచ 120 చ.గ.లలోపు ఇళ్లకు వీలైనంత మేరకు తక్కువ సెట్‌బ్యాక్‌ను వర్తింపచేయాలని భావిస్తున్నారు. నగరంలో భూముల విలువ దృష్ట్యా, సెట్‌బ్యాక్ నిబంధనల్ని పాటించడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఇది ఉపకరిస్తుంది. రోడ్డు వెడల్పు కూడా ప్రస్తుతమున్న 30 అడుగుల నుంచి 12 అడుగులకు కుదిస్తారు. ఈ మేరకు ఈ అంశంపై ఏర్పాటైన సబ్‌కమిటీ వీటిని ప్రతిపాదించింది. ఇంకా, స్లమ్స్‌లో చాలా ఇళ్లకు ఓనర్షిప్ టైటిల్ లేకపోవడం, అనుమతుల చార్జీలు భరించలేకపోవడం వల్లే అనుమతులు తీసుకోలేదని అంచనా వేసిన సబ్‌కమిటీ స్లమ్స్‌లోని వారికి పట్టాలివ్వడం ద్వారా ఓనర్షిప్ వర్తింపచేయాలని భావించింది. దాదాపు 1.50 లక్షల మందికి పట్టాలివ్వాలనే యోచనలో ఉంది. అనుమతుల ఫీజు తగ్గిస్తే అందరూ అనుమతులు తీసుకుంటారని అంచనా వేసింది. ఆర్కిటెక్ట్/ ఇంజినీర్లే అనుమతులిస్తారు స్లమ్స్‌లో ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారు అనుమతుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయాల దాకా వెళ్లకుండా జీహెచ్ఎంసీ గుర్తింపు పొందిన అథరైజ్డ్ ఆర్కిటెక్ట్/ఇంజినీర్లు సర్టిఫై చేస్తే చాలునని భావిస్తున్నారు. అంటే వారు సర్టిఫై చేస్తే నిర్మాణ అనుమతి పొందినట్లే. దీంతోపాటు చిన్న ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకునేవారికి తనఖా నిబంధనను ఎత్తివేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం 120 చదరపుగజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి ఒక అంతస్తు వరకు మాత్రమే తనఖా నిబంధన లేదు. దీనిని జీ ప్లస్ 2 వరకు అనుమతించాలని ప్రతిపాదించారు. అంతకు మించిన వాటికి వర్తింపచేసే తనఖాలను సైతం అందరికీ తెలిసేలా ఆన్లైన్లో ఉంచాలని భావిస్తున్నారు. తద్వారా అక్రమ నిర్మాణాలకు వీలుండదని అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ సీఎం పరిశీలించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
‘కర్నూలు’ ఇసుకకు చెక్!
రాష్ట్రంలోకి పర్మిట్లు లేకుండా తరలింపుపై చర్యలు లారీ యజమానుల డిమాండ్‌కు ప్రభుత్వ సానుకూల స్పందన తెలంగాణ ఇసుకకు డిమాండ్ పెరగటంతోపాటు ధర తగ్గే వీలు! చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: కర్నూలు ఇసుక పేరుతో తెలంగాణలో అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్మిట్లు, లోడ్ పరిమాణంతో సంబంధం లేకుండా యథేచ్చగా తరలిస్తున్న ఆ ఇసుక వల్ల తెలంగాణలోని ఇసుకకు డిమాండ్ తగ్గుతోందని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రోడ్లు, భవనాలు, రవాణా, కార్మిక, గనులు, పురపాలక శాఖల ఉన్నతాధికారులు, లారీ యజమానుల సంఘం నేతలు హాజరయ్యారు. సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్ లారీ యజమానుల సమస్యలను అధికారుల ముందు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా కర్నూలు ఇసుక పేరుతో జరుగుతున్న దందా, వినియోగదారులు నష్టపోతున్న తీరును వివరించారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. వినియోగదారులపై భారం తెలంగాణ ప్రాంతంలోని ఇసుకకు టన్ను ధర రూ.1200 పలుకుతుండగా, కర్నూలు పేరుతో అమ్ముతున్న ఇసుక ధర రూ.1,800 పలుకుతోంది. దీంతో చాలామంది వ్యాపారులు కర్నూలు ఇసుక పేరుతో స్థానిక ఇసుక ధర పెంచి వినియోగదారులపై భారం మోపుతున్నారు. కర్నూలు నుంచి ఇసుక తెలంగాణలోకి రాకుండా చూడటం వల్ల స్థానిక ఇసుకకు డిమాండ్ పెరగటంతో ఇక్కడి లారీ యజమానులకు ఉపయోగం కలుగుతుందని, ధర తగ్గి వినియోగదారులకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు అందుకు తీసుకోవాల్సిన చర్యలను త్వరలో ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. లారీ యజమానుల నుంచి ఇకపై ఎవరైనా తైబజారు రుసుము వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చూస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వారంరోజుల్లో కొత్తగా నాలుగు రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించారు. అలాగే ఇసుక ఫిల్టర్లు లేకుండా చూస్తామని, చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ద్వారా ఓవర్లోడింగ్ సమస్యను అధిగమిస్తామని అధికారులు పేర్కొన్నారు.