న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్‌ఫ్రా సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా పర్మిట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ కొత్త కేటగిరీ లైసెన్సును డిజిటల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ (డీసీఐపీ) లైసెన్సుగా వ్యవహరించవచ్చని ట్రాయ్ పేర్కొంది. డీసీఐపీలో కంపెనీలపై లైసెన్స్ రుసుము ఎలాంటి విధించబడదు. (హోండా కొత్త బైక్ ఎస్‌పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే! )
అయితే పర్మిట్ల కోసం రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు, రూ. 15,000 ప్రాసెసింగ్ ఫీజు విధించ వచ్చని తెలిపింది. అయితే డీసీఐపీ కోసం లైసెన్సు ఫీజు విధించవద్దని సూచించింది. దీన్ని స్టాండెలోన్ లైసెన్సుగా కాకుండా ఏకీకృత లైసెన్సు కిందే జారీ చేయొచ్చని ట్రాయ్ తెలిపింది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్)
Comments
Please login to add a commentAdd a comment