licence fees
-
డిజిటల్ ఇన్ఫ్రా సంస్థలకు పర్మిట్లు కేంద్రానికి ట్రాయ్ సిఫార్సు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్ఫ్రా సేవల సంస్థల కోసం ప్రత్యేకంగా పర్మిట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ కొత్త కేటగిరీ లైసెన్సును డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ (డీసీఐపీ) లైసెన్సుగా వ్యవహరించవచ్చని ట్రాయ్ పేర్కొంది. డీసీఐపీలో కంపెనీలపై లైసెన్స్ రుసుము ఎలాంటి విధించబడదు. (హోండా కొత్త బైక్ ఎస్పీ160: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే! ) అయితే పర్మిట్ల కోసం రూ. 2 లక్షలు ఎంట్రీ ఫీజు, రూ. 15,000 ప్రాసెసింగ్ ఫీజు విధించ వచ్చని తెలిపింది. అయితే డీసీఐపీ కోసం లైసెన్సు ఫీజు విధించవద్దని సూచించింది. దీన్ని స్టాండెలోన్ లైసెన్సుగా కాకుండా ఏకీకృత లైసెన్సు కిందే జారీ చేయొచ్చని ట్రాయ్ తెలిపింది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) -
డీటీహెచ్ సంస్థలకు ఇకపై 20 ఏళ్ల లైసెన్స్
న్యూఢిల్లీ: డీటీహెచ్ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) సేవలు దేశంలో మరింత బలపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు.. అదేవిధంగా డీటీహెచ్ బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆరు కోట్ల ఇళ్లకు డీటీహెచ్ ‘‘భారత్‌లో ఆరు కోట్లకు పైగా ఇళ్లకు డీటీహెచ్ సేవలు అందుతున్నాయి. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించాలని వాణిజ్య శాఖ లోగడ నిర్ణయించింది. అయితే, సమాచార, ప్రసార శాఖ నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం డీటీహెచ్ రంగానికి ఇంతకాలం లభించలేదు. నూతన నిబంధనలు వాణిజ్య శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇప్పటివరకు సమాచార, ప్రసార శాఖ నిబంధనల కింద 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉంది’’ అని మంత్రి మీడియాకు వివరించారు. డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లైసెన్స్ మంజూరు చేస్తామని, తర్వాత నుంచి ప్రతీ పదేళ్ల కాలానికి పునరుద్ధరించుకోవచ్చని వివరించారు. లైసెన్స్ ఫీజును ప్రస్తుతం ఏడాదికోసారి వసూలు చేస్తుండగా, ఇక మీదట త్రైమాసికానికి ఓసారి వసూలు చేస్తామన్నారు. ‘ఎఫ్‌డీఐ నిబంధనల సవరణతో ఈ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఫలితంగా నూతన పెట్టుబడులు రావడంతోపాటు, నూతన ఉపాధి అవకాశాలూ ఏర్పడతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. 8 శాతానికి తగ్గింపు నూతన నిబంధనల కింద లైసెన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు. దీంతో టెలికం శాఖ మాదిరే లైసెన్స్ ఫీజు అమలు కానుంది. ఇలా ఆదా అయిన నిధులను సేవల విస్తరణకు వెచ్చించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధిని సాధించొచ్చన్నది సమాచార, ప్రసార శాఖ అంచనా. ‘‘డీటీహెచ్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా డీటీహెచ్ వేదికలను, టీవీ చానళ్ల ట్రాన్స్పోర్ట్ స్ట్రీమ్‌లను పంచుకోవచ్చు. అదే విధంగా టీవీ చానళ్ల పంపిణీదారులు సైతం తమ సబ్‌స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎస్ఎమ్ఎస్), కండీషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) అప్లికేషన్ల కోసం ఉమ్మడి హార్డ్‌వేర్‌ను పంచుకోవడానికి అనుమతిస్తాము. సదుపాయాలు పంచుకోవడం వల్ల శాటిలైట్ వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు’’ అని సమాచార శాఖ ప్రకటన తెలియజేసింది. సంతోషం.. ఫీజులు కూడా తగ్గించాలి ‘‘మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు మా కృతజ్ఞతలు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న లైసెన్స్ పాలసీని పరిష్కరించారు. ఇది అనిశ్చితిని తొలగిస్తుంది’’ అని టాటా స్కై ఎండీ, సీఈవో హరీత్ నాగ్‌పాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని, అప్పుడు తాము మరింత పోటీపడగలమన్నారు. ‘‘కేబుల్ టీవీ మాదిరే ఒకే విధమైన ఫీజును నిర్ణయించడం ద్వారా మాకూ సమాన అవకాశం కల్పించాలి. కేబుల్ టీవీ కూడా సమాచార, ప్రసార శాఖ లైసెన్స్ పరిధిలోనే, ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ధరలు, మార్జిన్లను పాటిస్తోంది’’ అని నాగ్‌పాల్ చెప్పారు. ట్రాయ్ గణాంకాల ప్రకారం మార్చి చివరికి డీటీహెచ్ పరిశ్రమకు 7.24 కోట్ల మంది చెల్లింపుల చందాదారులు ఉన్నారు. -
రూ 10,000 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్..
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మందలింపు, ప్రభుత్వ డెడ్లైన్ల నేపథ్యంలో మొబైల్ దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రభుత్వానికి బకాయిపడిన రూ 10,000 కోట్లను టెలికాం శాఖకు చెల్లించినట్టు వెల్లడించింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తిచేస్తామని కంపెనీ వెల్లడించింది. భారతి ఎయిర్టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్‌ల తరపున మొత్తం రూ 10,000 కోట్లు చెల్లించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తాము స్వయం మదింపు కసరత్తు చేపట్టామని, అది ముగిసిన మీదట సుప్రీంకోర్టులో తదుపరి విచారణ గడువులోగా మిగిలిన బకాయిల చెల్లింపును చేపడతామని స్పష్టం చేసింది. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా టెలికాం కంపెనీలను కోరుతూ ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. టెలికాం శాఖ ఆదేశాలకు బదులిచ్చిన ఎయిర్టెల్ తాము ఫిబ్రవరి 20లోగా రూ 10,000 కోట్లు చెల్లిస్తామని, మార్చి 17లోగా మిగిలిన మొత్తం చెల్లిస్తామని పేర్కొంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీలు సహా భారతి ఎయిర్టెల్ ప్రభుత్వానికి రూ 35,586 కోట్లు బకాయిపడింది. చదవండి : టెల్కోలపై సుప్రీం కన్నెర్ర! -
పెరిగిన లెసైన్సు ఫీజు చెల్లించాల్సిందే!
డిస్టిలరీలు, బ్రూవరీలకు ఎక్సైజ్ శాఖ నోటీసులు సాక్షి, హైదరాబాద్: మద్యం, బీరు, ఈఎన్ఏ ఉత్పత్తులపై లెసైన్సు ఫీజును వందశాతం పెంచిన ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను వ్యత్యాసపు మొత్తాన్ని వసూలు చేసే చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రంలో 17 డిస్టిలరీలు, 6 బ్రూవరీలు, 14 ఈఎన్ఏ (స్పిరిట్) ఉత్పత్తి చేసే కంపెనీలున్నాయి. వీటి లెసైన్సు ఫీజును గత అక్టోబర్ నుంచి రెట్టింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ప్రూఫ్ లీటర్ ఐఎంఎఫ్ఎల్ మద్యంపై గతంలో ఒక రూపాయి లెసైన్సు ఫీజును వసూలు చేసేవారు. అలాగే బీరుకు సంబంధించి 200 లక్షల బల్క్ లీటర్ల ఉత్పత్తికి రూ. 50 లక్షలు ఫీజుగా ఆబ్కారీ శాఖ వసూలు చేసేది. ఈ లెక్కన డిస్టిలరీలు, బ్రూవరీలు, ఈఎన్ఏ కంపెనీల నుంచి లెసైన్సు ఫీజు రూపంలో ఏటా రూ. 35 కోట్లు వసూలయ్యేది. ఇప్పుడు గత అక్టోబర్ నుంచి లెసైన్సు ఫీజును రెట్టింపు చేసినందున 2015 అక్టోబర్ నుంచి వచ్చే మార్చి వరకు పెరిగిన ఫీజును చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీలన్నీ కలిపి సుమారు రూ. 25 కోట్ల వరకు ఈ వ్యత్యాస ఫీజు చెల్లించాల్సి ఉంది. దీన్ని వెంటనే చెల్లించాలంటూ ఆబ్కారీ శాఖ కమిషనర్ డిమాండ్ నోటీసులు జారీచేశారు. దీనికి కొంత గడువు ఇవ్వాలని ఐఎంఎఫ్ఎల్, బీరు, ఈఎన్ఏ ఉత్పత్తిదారులు సోమవారం ఆబ్కారీ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. వ్యత్యాస ఫీజుకు తోడు, 2016-17 లెసైన్సు ఫీజు రూపంలో మరో రూ. 70 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, అదంతా ఇప్పటికిప్పుడు కట్టడం సాధ్యం కాదని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్పత్తిదారులకు రావలసిన బిల్లులు రాలేదని, అవి వచ్చాక చెల్లిస్తామన్నారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, వ్యత్యాస ఫీజును చెల్లించాలని కమిషనర్ చెప్పారు. -
20% పెరిగిన లైసెన్సు ఫీజు
-
20% పెరిగిన లైసెన్సు ఫీజు
రెండేళ్ల కాలపరిమితితో కొత్త మద్యం విధానం ♦ 2,216 మద్యం దుకాణాలకు త్వరలో దరఖాస్తులు ♦ జనాభా ప్రాతిపదికన ఆరు శ్లాబుల్లో కేటాయింపు ♦ ఒకేసారి లేదా 6 వాయిదాల్లో చెల్లింపునకు అవకాశం ♦ టర్లో అత్యధికంగా 2.16 కోట్లు లెసైన్సు ఫీజు ♦ దరఖాస్తు ఫారం ధర రూ.50 వేలకు పెంపు ♦ పివిలేజి ఫీజు 8 శాతానికి తగ్గింపు ♦ 2015 అక్టోబర్ 1 నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు ఇదే విధానం ♦ ఈనెల 14న దుకాణాలకు నోటిఫికేషన్, 21 వరకు దరఖాస్తుల స్వీకరణ, 23న డ్రా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2015-16, 2016- 17 సంవత్సరాలకు ఉద్దేశించిన ఈ విధానం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2017 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు సంబంధించి లెసైన్సుల జారీ విధి విధానాలు, చేసిన మార్పులు, ఫీజుల నిర్ణయం తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం మూడు జీవోలు (163, 164, 165) విడుదలయ్యాయి. ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను విక్రయించనున్నారు. 21వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి... 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి దుకాణాలను కేటాయిస్తారు. ఒకేసారి 20 శాతం.. రెండేళ్ల కాలపరిమితితో మద్యం లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... లెసైన్సు ఫీజును ఒక్కసారిగా 20 శాతం పెంచేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆరు స్లాబుల్లో మద్యం దుకాణాలకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజుకు అదనంగా 20 శాతం పెంచుతూ ఈ కొత్త ఫీజులను నిర్ణయించారు. రెండేళ్లకు ఏటా 10 శాతం పెంచాలని తొలుత భావించినా... వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒకేసారి పెంచారు. ఈ లెక్కన 10 వేల జనాభా ఉన్న గ్రామం, పట్టణం, నగర పంచాయతీల్లో లెసైన్సు ఫీజు రెండేళ్లకు రూ.78 లక్షలు కాగా... 20 లక్షలపైన జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో లెసైన్సు ఫీజు రూ.2.16 కోట్లు. ఇక మద్యం అమ్మకాలు లెసైన్సు ఫీజు మొత్తం కన్నా ఏడు రెట్లు దాటితే ప్రస్తుతం అదనంగా 13.6 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా... కొత్త విధానంలో రెండేళ్లకుగాను 8 శాతంగా నిర్ణయించారు. అంటే రెండేళ్ల లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం అమ్మకాలు దాటితే... తర్వాతి అమ్మకాలపై 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫారం వెలను రూ.25వేల నుంచి రూ.50వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. మరిన్ని నిబంధనలు * టర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సరిహద్దు గీతకు 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణం లెసైన్సు ఫీజు కూడా ఆ కార్పొరేషన్ ధరకే కేటాయిస్తారు. ఉదాహరణకు జీహెచ్ఎంసీలో ఉప్పల్, కాప్రా వరకే కార్పొరేషన్ పరిధి. కానీ అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఘట్కేసర్లోని మద్యం దుకాణాలను కూడా జీహెచ్ఎంసీ ధరకే కేటాయిస్తారు. * మున్సిపాలిటీల సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని మద్యం దుకాణాలకు... నగర పంచాయతీల నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. * లెసైన్సు ఫీజులను 20 శాతం పెంచిన నేపథ్యంలో మద్యం దుకాణాలను ఎవ రూ తీసుకునేందుకు ముందుకు రాకపోతే రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్/ ఏజెన్సీ ద్వారా ఆ ప్రాంతాల్లో మద్యం వ్యాపారం జరుపుతారు. * పతి ఎ-4 షాపులో హాలోగ్రాఫిక్ ఎక్సైజ్ లేబుల్స్ (హెచ్‌ఈఏఎల్)ను డీకోడ్ చేసే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. * మద్యం సేవించడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి ప్రజలను చైతన్యం చేయాలి. * గుడుంబాను అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం చర్యలు చేపట్టాలి. * గతంలో జూలై నుంచి ప్రారంభమయ్యే ఎక్సైజ్ సంవత్సరాన్ని.. ఇక నుంచి అక్టోబర్‌కు మారుస్తూ నిర్ణయం. * విద్యాసంస్థలు, దేవాలయాలు, ఆసుపత్రులకు 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. * హైవేలకు 50 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలి. * మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసే పర్మిట్ రూంల లెసైన్సు ఫీజు రెండేళ్లకు రూ.4లక్షలు. ఈ మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించవచ్చు. * మద్యం దుకాణంలో బాటిళ్ల స్టోరేజ్ కోసం ప్రత్యేక ఎ-4(జీ) లెసైన్సుతో గోదాం ఏర్పాటు చేసుకోవచ్చు. -
ఖజానాకు కిక్కు..!
మద్యం ద్వారా భారీగా ఆదాయ సమీకరణకు సర్కారు పావులు * దుకాణాల లెసైన్సు ఫీజుల రూపంలోనే రూ. 2 వేల కోట్లు అంచనా * రూ. 12 వేల కోట్ల వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: మద్యం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పావులు కదుపుతోంది. అక్టోబర్ నుంచి అమలులోకి రానున్న నూతన మద్యం విధానం ద్వారా అంచనాలకు మించి ఆదాయం పొందేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. గుడుంబాకు విరుగుడుగా చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం మొదలుకుని.. మండలాలను గంపగుత్తగా వ్యాపారులకు కట్టబెట్టడం, కొత్త బార్ లెసైన్సుల మంజూరు, కుటీర పరిశ్రమల్లా బీర్ల ఫ్యాక్టరీలకు అనుమతులు, జీహెచ్ఎంసీలో షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో మద్యం విక్రయాలు, వైన్కేఫ్ల ఏర్పాటు వంటి ఆలోచనలన్నీ భారీ ఆదాయ సమీకరణలో భాగమేనని అధికార వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు రూ. 10,300 కోట్లు రాబడి రాగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆ లక్ష్యాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారు. కానీ, ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తులు చూస్తుంటే రూ. 15 వేల కోట్ల రికార్డు ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు చెపుతున్నారు. లెసైన్సుల ద్వారానే రూ. 2 వేల కోట్లు 2014-15 ఆబ్కారీ సంవత్సరం(జూలై1 నుంచి జూన్ 30)లో ఎక్సైజ్ శాఖకు లెసైన్సు ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 900 కోట్లు. మద్యం వ్యాపారులు నిర్ధేశిత లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మించి అమ్మకాలు జరిపితే సర్కారుకు చెల్లించే 13.6 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్ రూపంలో అదనంగా రూ. 400 కోట్లు సమకూరాయి. కానీ, ఈసారి లెసైన్సు ఫీజు రూపంలోనే రూ. 2 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తదనుగుణంగానే జీహెచ్ఎంసీ, మరో మూడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ఏర్పాటు చేసే మద్యం దుకాణాల లెసైన్సు ఫీజును నిర్ణయించినట్లు సమాచారం. మండలం లెసైన్సుదారుడు గ్రామాల్లో కూడా బి-లెసైన్సు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇక ధరఖాస్తు ఫారాలతో పాటు కొత్తగా బార్లకు అనుమతులు మంజూరు చేయడం, బీరు ప్లాంట్లు(మైక్రో బ్రేవరీలు), జీహెచ్ఎంసీలో మెట్రో సిటీ వాతావరణం కనిపించేలా వైన్కేఫ్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఆదాయం కోల్పోవడం వట్టిమాటే! గుడుంబాను నిర్మూలించేందుకు ప్రవేశపెడుతున్న చీప్‌లిక్కర్ ద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందన్న మంత్రుల మాటలకు సర్కార్ చేస్తున్న కసరత్తుకు పొంతన లేదు. చౌక మ ద్యం ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో రూ. 60కి విక్రయిస్తున్న 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ ధర సగానికి తగ్గుతుంది. అదే సమయంలో చీప్‌లిక్కర్‌పై 70 శాతం నుంచి 90 శాతం వరకు వసూలు చేస్తున్న వ్యాట్(విలువ ఆధారిత పన్ను) 49 శాతానికి తగ్గనుంది. దీనినే సుమారు వెయ్యి కోట్ల నష్టంగా ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. కానీ, గుడుంబాను సేవించే కస్టమర్లంతా చీప్‌లిక్కర్ వైపునకు మళ్లడం ద్వారా చౌక మద్యం అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో గుట్టుగా సాగే గుడుంబా విక్రయాలు, బెల్టుషాపులు ఇక అధికారిక దుకాణాలుగా మారనున్నాయి. తద్వారా అన్ని రకాల మద్యం గ్రామ పొలిమేరల్లోకి రావడంతో ‘చీప్’తో పాటు అన్ని రకాల మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతా యి. గుడుంబా అమ్మకాలే అనధికారికంగా రూ. 800 కోట్ల మేర ఉంటాయని సర్కార్ అంచనా వేసింది. ఈ మొత్తం ఇప్పుడు అధికారికంగా సర్కార్ ఖాతాలో చేరనుంది. వ్యాట్ తగ్గింపు ద్వారా కోల్పోయిన ఆదాయానికి రెండింతలు గ్రామాల్లో జరిగే వ్యాపారం ద్వారా సమకూరుతుందని అధికారులు లెక్కలు వేశారు. కోల్‌బెల్ట్, పరిశ్రమల ప్రాంతాలపై దృష్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో మద్యం వ్యాపారం అధికం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి పరీవాహక ప్రాంత సింగరేణి కోల్‌బెల్ట్‌లో ఇప్పటి వరకు ఉన్న మద్యం విధానాన్ని మార్చాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఒక్కటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడ లెసైన్సు ఫీజు, మద్యం అమ్మకాలు వేరుగా ఉంటాయి. మిగతా మందమర్రి, బెల్లంపెల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీలు కాగా శ్రీరాంపూర్, యైటింక్లైన్ కాలనీ, భూపాల్పల్లి వంటివి గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. అలాగే పరిశ్రమలు అధికంగా ఉన్న మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. -
ఇక ‘సహకార’ మద్యం
-
ఇక ‘సహకార’ మద్యం
రాష్ట్ర సర్కారు నిర్ణయం.. ♦ వాటికి లెసైన్సు ఫీజు ఉండదు.. ♦ మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధింపు! ♦ పదివేల చదరపు అడుగులున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతి.. జీవోలో స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే.. గ్రామాలు, మండల, పట్టణాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు మార్కెటింగ్ సహకార సంఘాల్లోనూ మద్యాన్ని విక్రయించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వం అధీనంలో నిర్వహించాలనుకున్న పదిశాతం మద్యం దుకాణాలను సహకార సంఘాల్లోను, ప్రభుత్వ కా ర్పొరేషన్లలోను ఏర్పాటు చేయడానికి కమిషనర్ అనుమతించేందుకు నూతన మద్యం విధానంలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సహకార సంఘాల్లో అనుమతించే మద్యం దుకాణాలకు లెసైన్సు ఫీజు ఉండదు. మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధిస్తారు. ♦ షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వం దీనిపై షరతులు విధించింది. పదివేల చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతమున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతించనున్నట్లు జీవో 218లో స్పష్టం చేశారు. ఇటువంటి షాపింగ్‌మాల్స్‌లో ఆ ప్రాంతం ఆధారంగా మద్యం దుకాణాలకున్న లెసైన్సు ఫీజును వసూలు చేస్తారు. ♦ ఒక్కో మద్యం దుకాణానికి లాటరీద్వారా మూడు దరఖాస్తులను తీస్తారు. దరఖాస్తుదారు లేకున్నప్పటికీ జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నట్టు జీవోలో స్పష్టం చేశారు. లాటరీలో తొలుత వచ్చిన దరఖాస్తుదారునికి మద్యం దుకాణం కేటాయిస్తారు. అదేసమయంలో మరో రెండు దరఖాస్తులను కూడా లాటరీద్వారా తీస్తారు. తొలుత వచ్చిన దరఖాస్తుదారు దుకాణం ఏర్పాటునకు ముందుకు రానిపక్షంలో రెండో దరఖాస్తుదారునికి అవకాశమిస్తారు. రెండో దరఖాస్తుదారూ రానిపక్షంలో మూడో దరఖాస్తుదారునికి దుకాణం కేటాయిస్తారు. ♦ లాటరీద్వారా తీసిన దరఖాస్తుదారుల కాలపరిమితి 90 రోజులుగా నిర్ధారించారు. అది దాటితే ఆ దరఖాస్తులకు విలువుండదు. ♦ షాపింగ్‌మాల్స్, కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వ కార్పొరేషన్లకు ఒకటికన్నా ఎక్కువ లెసైన్సులు మంజూరు అధికారం ఎక్సైజ్ కమిషనర్‌కు ఉంటుంది. గతంలో మద్యం దుకాణాల్లో విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేవి. ఇప్పుడు మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని గంట పెంచారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించారు. కొత్త విధానానికి మంచి స్పందన.. ఇదిలా ఉండగా నూతన మద్యం విధానానికి జిల్లాల్లో మంచి స్పందన ఉందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కొంతమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను రెండేళ్లకు బదులు ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఎందుకంటే గతంలో ఆదాయపుపన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారు ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసి మద్యం దుకాణాలకోసం తీసుకుంటున్నారని, అందుకే ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.