సహకార సంఘాల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే.. గ్రామాలు, మండల, పట్టణాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు మార్కెటింగ్ సహకార సంఘాల్లోనూ మద్యాన్ని విక్రయించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వం అధీనంలో నిర్వహించాలనుకున్న పదిశాతం మద్యం దుకాణాలను సహకార సంఘాల్లోను, ప్రభుత్వ కా ర్పొరేషన్లలోను ఏర్పాటు చేయడానికి కమిషనర్ అనుమతించేందుకు నూతన మద్యం విధానంలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సహకార సంఘాల్లో అనుమతించే మద్యం దుకాణాలకు లెసైన్సు ఫీజు ఉండదు. మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధిస్తారు.