Cooperative societies
-
సహకార సంఘాల్లో ఔషధాల విక్రయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయాధారిత సేవలు అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో ఇకపై ఔషధాలను కూడా విక్రయించాలని కేంద్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. చౌకగా లభించే జనరిక్ మందులను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాలు రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇప్పిస్తున్నాయి. ధాన్యం, ఇతర పంటల కొనుగోలుతోపాటు కొన్ని జిల్లాల్లో పె ట్రోల్ బంక్‌లు, సూపర్మార్కెట్లు, వే బ్రిడ్జిలు కూడా ఈ సంఘాలు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలో సొసైటీల్లో జనరిక్ మందులను విక్రయించాలని నిర్ణయించారు. జిల్లాకు నాలుగు సంఘాలు ఎంపిక.. రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాలున్నాయి. ఇందులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లకు అనుబంధంగా 798 పీఏసీఎస్‌లు ఉండగా, వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా మరో 108 సహకార సంఘాలున్నాయి. కాగా, ప్రయోగాత్మకంగా ఒక్కో జిల్లాకు నాలుగు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం సూచన మేరకు ఆర్థిక, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు పకడ్బందీగా నిర్వహించే నాలుగు సొసైటీల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల సహకార శాఖాధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం జిల్లా సహకార శాఖాధికారుల నుంచి ఎంపిక చేసిన సహకార సంఘాల (సొసైటీ) వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లానుంచి ఐదు సంఘాల పేర్లు పంపించారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, గుమ్మడిదల, ఝరాసంగం, ఏడాకులపల్లి, అందోల్ సహకార సంఘాలు ఇందులో ఉన్నాయి. ఫార్మసీ లైసెన్స్‌లు ఎలా? ఔషధాలు విక్రయించాలంటే ఫార్మసీ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే సొసైటీల్లో జన్ ఔషధి కేంద్రాలకు ఫార్మసీ లైసెన్సులు ఎలా? అనే అంశంపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని సహకారశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మసిస్టును నియమించుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. -
AP: దైన్యాన్ని తరిమి.. ధాన్యం భరోసా
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ధాన్యం కొనుగోళ్లతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు( పీఏసీఎస్) ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. రుణాలు సకాంలో చెల్లించక, బినామీల పేరుతో లక్షలు కొల్లగొట్టడం వంటి చర్యలతో బలహీనపడిన సంఘాలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. జిల్లాలో సహకార సంఘాలకు ఆర్థిక భారం వెంటాడుతోంది. చంద్రబాబు హయంతలో సహకార స్పూర్తిని దెబ్బతీస్తూ సంఘాలను నిర్వీర్యం చేశారు. టీడీపీ నాయకులు..వారి అనుచరులు ఎక్కడికక్కడ సంఘాల్లో లక్షలు నొక్కేసి ఖజానా గుల్ల చేసేశారు. వైఎస్ చలవతో.. సహకార సంఘాలకు మేలు చేయాలనే తలంపుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించారు. ఒక రకంగా సంఘాల నెత్తిన ఆయన పాలు పోశారని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. రైతులు తాము పండించిన పంటను సంఘాలకు విక్రయించేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నాడు వైఎస్ ఏ ఉద్ధేశంతో అయితే వీటికి అనుమతించారో ఆ లక్ష్యం నెరవేరుతూనే ఉంది. ఒకానొక దశలో సంఘాల్లో పనిచేసే సిబ్బందికి కనీసం జీతాలు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని దీనావస్థలో ఉండేవి. ఆ ఇబ్బందులు తొలగి సంఘం సభ్యులకు లాభాలు పంచే స్థాయికి సొసైటీలు చేరుకున్నాయి. వైఎస్ ముందుచూపుతో ఇది సాధ్యమైందనడం ఎలాంటి సందేహమూ లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మూస బాణీని మార్చుకున్నాయి. రైతులకు పంట రుణాలు, ఎరువులు విక్రయం, పెట్రోల్ బంక్‌ల నిర్వహణ, గోదాముల నిర్మాణం, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి చర్యలతో ధాన్యం కొనుగోళ్లు కూడా చేపడుతున్నాయి. రైతుల పండించే వరి, మొక్కజొన్న తదితర పంటలు కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి.ఈ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా వచ్చే కమీషన్‌తో సంఘాల్లో మౌలిక వసతులు కలి్పంచడంతో పాటు సభ్యులకు బోనస్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాయి. కమీషన్లతో ఆర్జన తూర్పు గోదావరి జిల్లాలో సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ద్వారా సహకార సంఘాలకు రూ.5 కోట్లు కమీషన్ రూపంలో ఆర్జిస్తున్నాయి. జిల్లాలో 401 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో సీజన్లో కనీసం 375 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోళ్లతో సమకూరిన ఆదాయాలతో జిల్లాలో సగానికి పైగా సంఘాలు ఆరి్థకంగా బలోపేతమవుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సైతం ధాన్యం కొనుగోళ్లుకు సంఘాలు సిద్ధపడుతున్నాయి.ఈ మేరకు సహకార అధికారులు సంఘాలను సమాయత్తం చేస్తున్నారు.ఈ సారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంఘాలు తోడ్పాటుతో ఆర్బీకేలలో కొనుగోలు చేయనున్నారు. గతం నుంచి పెండింగ్‌లో ఉన్న కమీషన్లను త్వరలో విడుదల కానున్నాయని సమాచారం. ఇందుకు కసరత్తు జరుగుతోందని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. మచ్చుకు కొన్ని... ►ముమ్మిడివరం మండలం ఠాణేలంక పీఏసీఎస్ గతేడాది 80 వేల క్వింటాళ్ల కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఒక క్వింటాలు ధాన్యం కొనుగోలుకు రూ.31.25 కమీషన్‌గా ఇస్తోంది. 80 వేల క్వింటాళ్ల కొనుగోలుపై ఈ సంఘానికి రూ.24 లక్షలు కమీషన్‌గా ఆదాయం సమకూరింది. ►పి.గన్నవరం మండలం నాగల్లంక పీఏసీఎస్ 74 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ.23 లక్షలు కమీషన్ రూపంలో లాభపడింది. ►జిల్లాలో 2019– 2020 ఖరీఫ్ సీజన్లో 244 కేంద్రాల ద్వారా రూ.2,300 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించాయి. ►ప్రతి సీజన్లోను సొసైటీలు రూ.2000 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేస్తూ వచ్చాయి. ►కొనుగోలుచేసే ధాన్యంపై క్వింటాల్‌కు ఏ–గ్రేడ్ ధాన్యానికి రూ.32, కామన్‌రకం «ధాన్యానికి రూ.31.25 వంతున కమీషనుగా సంఘాలకు ప్రభుత్వం జమ చేస్తుంది. – ►రెండు నెలల వ్యవధిలోనే ఆదాయం వస్తుండటంతో కొనుగోళ్లపై సంఘాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ►కమీషన్ త్వరితగతిన అందచేస్తే మరింత కొనుగోళ్లు ఊపందుకుంటాయని సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. సంఘాల తోడ్పాటుతో కొనుగోలు ఇలా.. ఈ సీజన్లో ప్రభుత్వం తొలిసారి వినూత్నంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. సహకార సంఘాల తోడ్పాటుతో ఆర్బీకేల వద్దనే కొనుగోలు చేయనుంది. జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశాల మేరకు సహకార సంఘాలను అప్రమత్తం చేసేందుకు శనివారం జిల్లా సహకార అధికారి దుర్గాప్రసాద్ పీఏసీఎస్ అధికారులతో డివిజన్ వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. రైతులు నేరుగా పంట పొలాలకు సమీపాన ఉన్న ఆర్బీకేల వద్దనే ధాన్యం అమ్ముకునే వెసలుబాటు కలి్పస్తోంది. జిల్లాలో 900పైనే ఆర్బీకేలను గుర్తించారు. ధాన్యం లభించే ప్రాంతాన్ని బట్టి ఆర్బీకేలను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి అవసరాన్ని బట్టి ఉద్యోగులను నియమించనున్నారు. ఏ గ్రూపు(ధాన్యం ఎక్కువగా కొనుగోలు)లో నలుగురు, బీ గ్రూపులో ముగ్గురు, సీ గ్రూపులో ఒకరు వంతున పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంఘాల్లోని సుమారు 600 మంది ఉద్యోగులను వినియోగించనున్నారు. వీరితో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 1800 మంది సిబ్బంది ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వామ్యం వహించనున్నారు. సంఘాలు బలపడుతున్నాయి ప్రభుత్వ లక్ష్యం మేరకు సంఘాల తోడ్పాటుతో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘం పరిధిలో రెండు, మూడు ఆర్బీకేలు ఉండటంతో తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కమీషన్‌తో సహకార సంఘాలు ఆర్థికంగా బలపడతాయి. కమీషన్‌తో సంఘాలను సహకారశాఖ అధికారులు మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. –ఇ లక్ష్మీరెడ్డి, జిల్లా మేనేజర్, పౌరసరఫరా కార్పొరేషన్ -
Vijaya Dairy: పా‘పాల’ పుట్ట!
విజయ డెయిరీ.. ఇది ఓ పా‘పాల’ పుట్ట.. అడుగడుగునా అక్రమాల చిట్టా. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ ఇప్పుడు అంతులేని విమర్శలు, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత యూనియన్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఈ సంస్థలో ఇప్పుడు అనేకానేక గోల్మాల్ వ్యవహారాలు గుప్పుమంటున్నాయి. భూముల కొనుగోలులో చేతివాటం మొదలు రూ.కోట్లలో నిధుల మాయం.. మితిమీరిన కమీషన్ల కక్కుర్తి.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని సంస్థ భాగస్వాములే కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. ఇక పొరుగు రాష్ట్రంలో అయితే ‘విజయ’ ముసుగులో ప్రైవేట్ దందాకు తెరతీశారు. మొత్తం మీద విజయ డెయిరీ పరిస్థితి ఇప్పుడు ‘మేడిపండు చూడ మేలిమై యుండు..’ అన్నట్లుగా ఉంది. సాక్షి, అమరావతి: కృష్ణా మిల్క్ యూనియన్‌కి చెందిన విజయ డెయిరీ అంటే ఒక బ్రాండ్. సుమారు 600 పాల ఉత్పత్తి సహకార సంఘాలు (సొసైటీలు) దీని కింద ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 40 వేల మంది రైతులున్నారు. ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను సంస్థ సేకరిస్తుంది. ఇందులో కృష్ణాజిల్లా నుంచే ఎక్కువ పాలు సేకరిస్తారు. దీని వార్షిక టర్నోవర్ రూ.900 కోట్లుగా ఉంది. ఇంత ప్రతిష్ట ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్. కానీ, ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీస్తూ కొత్త పాలకవర్గం ఇష్టారాజ్యంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యతకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సంస్థను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. యూనియన్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత చలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టాక ఆయన వ్యవహారశైలితో విజయ డెయిరీ బ్రాండ్ తన ప్రాభవాన్ని కోల్పోయిందని ఆందులో భాగస్వాములుగా ఉన్న పలు సొసైటీల చైర్మన్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడుగడుగునా అనేకచోట్ల విజయ పార్లర్లు పెట్టడం ద్వారా సంస్థ ప్రగతిపథంలో ఉందనే భ్రమ బయటకు కల్పిస్తున్నా అంతర్గతంగా మాత్రం పరిస్థితి చేయిదాటిపోయినట్లు స్పష్టమవుతోంది. కొత్త పాలకవర్గం వచ్చిన రెండేళ్లలోనే సంస్థ పరిస్థితి దిగజారిందని, అనేక గోల్మాల్ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే మూడు, నాలుగేళ్లలో సంస్థ దివాళా తీయడం ఖాయమని వారు చెబుతున్నారు. అక్రమాల చిట్టా ఇదే.. ► కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొత్త డెయిరీ యూనిట్ పెడుతున్నామనే పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. ఇక్కడ తన స్నేహితుడికి చెందిన పొలం ఎకరం రూ.50 లక్షలుంటే రూ.75 లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అలాగే, వీరవల్లి పరిసరాల్లోనే రైల్వే ట్రాక్‌కు ఆనుకుని రూ.25 లక్షలున్న ఎకరం భూమిని రూ.50 లక్షలిచ్చి రెట్టింపు రేటుకు కొన్నారు. ఇలా సుమారు 13 ఎకరాలు కొని రూ.4 కోట్లకు పైగా జేబులో వేసుకున్నారు. ఈ భూములను ఎందుకు కొన్నారో ఇప్పటివరకు సొసైటీలకు చెప్పలేదు. మొదట్లో పెల్లెట్స్ (గుళికలు) తయారీ ఫ్యాక్టరీ కోసం భూములు కొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఓ కంపెనీకి రూ.90 కోట్ల వర్క్ ఆర్డర్ ఇచ్చి రూ.10 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీనివల్ల సంస్థకు నష్టం తప్ప లాభంలేదని తేలడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. అడ్వాన్స్ మొత్తం ఏమైందో సమాధానం చెప్పే దిక్కులేదు. ► 2019లో కొత్త పాలకవర్గం వచ్చే నాటికి సంస్థలో రూ.90 కోట్ల రిజర్వు నిధులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఆ డబ్బును రెండేళ్లలోనే కరిగించేశారు. ఆ డబ్బును ఎందుకు, ఎక్కడ ఖర్చు పెట్టారో పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో కొందరు అడిగినా ఇప్పటివరకు జవాబులేదు. బోనస్‌లో ఎలా బరితెగించారంటే.. గతంలో రూ.700 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్నప్పుడు రైతులకు రూ.65 కోట్ల బోనస్ ఇచ్చారు. ఇప్పుడు టర్నోవర్ సుమారు రూ.900 కోట్లకు చేరినా రైతులకిచ్చే బోనస్ రూ.45 కోట్లకు పడిపోయింది. గతంలో రైతులకు లీటర్‌కు రూ.32 పైసల చొప్పున 3 విడతలుగా బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15 పైసలకి తగ్గించి ఒకసారే ఇస్తున్నారు. చైర్మన్ దుబారా, ధనదాహమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. విజయ పార్లర్లలో ఇతర బ్రాండ్లు ఇక విజయ పార్లర్లలో ఇతర సంస్థల ఉత్పత్తులను విజయ బ్రాండ్ పేరిట విక్రయించడానికి గేట్లు బార్లా తెరిచారు. దీంతో బ్రాండ్ పేరు మసకబారింది. కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐస్‌క్రీం, బ్రెడ్, కేక్, బిస్కెట్లు కొని వాటిని విజయ ఉత్పత్తులుగా అమ్ముతుండడంపై సంస్థలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎలాంటి టెండర్ లేకుండా ఒక ఐస్‌క్రీం కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టేశారు. అలాగే, విజయ పాలకు ఉన్నట్లే విజయ పశు దాణాకు మంచి డిమాండ్ ఉంది. దాన్ని కూడా స్వయంగా తయారుచేయకుండా కమీషన్ల కోసం ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేశారు. దీంతో అమ్మకాలు పడిపోయి నష్టాలు వస్తున్నాయి. ► ఇక చిత్తూరు జిల్లా రైతుల నుంచి సేకరించిన లీటర్ పాలకు రూ.3 బోనస్ ఇస్తామని చెప్పి రూ.1 మాత్రమే ఇచ్చారు. మిగతా రూ.2 మింగేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాగే వెండర్స్‌కి 7.5 శాతం బోనస్ ఇస్తామని చెప్పి డబ్బు డ్రా చేసి 3.5 శాతమే ఇచ్చారు. ఇప్పటికీ ఈ రైతులు, వెండర్లు తమ బోనస్ కోసం డెయిరీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ► అవసరం లేకపోయినా కమీషన్ల వేటలో భారీగా వెన్న, పాల పొడిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనిట్లో వీటి స్టాకు పెద్దఎత్తున నిల్వ ఉంది. ► తెలంగాణలోని కోదాడ, ఖమ్మంలో విజయ డెయిరీకి గతంలో 16 వేల లీటర్ల మార్కెట్ ఉండేది. అది ప్రస్తుతం వెయ్యి లీటర్లకు పడిపోవడం వెనుక చైర్మన్ మాయాజాలం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా కొందరితో కలిసి అక్కడే పాలు కొని సొంతంగా ప్యాక్ చేయించి అమ్ముతున్నట్లు సమాచారం. విజయ బ్రాండ్ పేరుతో సొంత లాభం కోసం ఇలా ప్రైవేటు దందాకు తెరతీశారని చెబుతున్నారు. ► తన పబ్లిసిటీ పిచ్చికి తమ చైర్మన్ రూ.50 లక్షలు వృధా చేసినట్లు వివిధ సొసైటీల చైర్మన్లు వాపోతున్నారు. యూనియన్ చైర్మనే స్వయంగా ఫ్లెక్సీలు వేయించి వాటిని అన్ని సొసైటీలకు లారీలో పంపి కట్టించారు. -
అరకొరగానే సహకారం: రూ.25లక్షలు అవసరం
సాక్షి, మోర్తాడ్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కొత్తగా చేరిన సభ్యులకు పంట రుణాలు అందడం లేదు. నిధులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు నిధులు కేటాయించాల్సి ఉంది. తెప్కాబ్ తక్కువ మొత్తంలోనే ఎన్‌డీసీసీబీకి నిధులు కేటాయించింది. ఫలితంగా సభ్యుల సంఖ్యకు అనుగుణంగా నిధులు లేక కొంత మందికే పంట రుణాలు దక్కుతున్నాయి. దీంతో మిగిలినవారు పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో కలిపి 142 సహకార సంఘాలు ఉన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు తెప్కాబ్ ద్వారా రూ. 28 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఈ నిధుల నుంచి సహకార సంఘాల సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రూ.15 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు పంట రుణాల కోసం కేటాయించారు. కానీ కొన్ని సహకార సంఘలకు పంట రుణాల కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నిధులు అవసరం ఉన్నాయి. నిధుల కేటాయింపు పరిమితంగానే ఉండడంతో కొంత మంది సభ్యులకు మాత్రమే పంట రుణాలను అందించారు. వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే రెన్యువల్ సమయంలో ఇబ్బంది తలెత్తుతుందని సహకార సంఘాల్లోనైతే ఎలాంటి సమస్య ఉండదని సభ్యులు భావిస్తున్నారు. దీంతో సహకార సంఘాల్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కొన్నింటిలో మిగులు, మరికొన్నింటిలో కొరత... సహకార సంఘాలకు పంట రుణాల కోసం కేటాయించిన నిధులకు సంబంధించి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకునే వారు లేకపోవడంతో నిధులు మిగిలిపోయాయి. సకాలంలో పంట రుణాల ఫైలింగ్ చేయకపోవడంతో ఆ నిధులు తెప్కాబ్కు వెనక్కి వెళ్లిపోయాయి. మరికొన్ని సహకార సంఘాలకు కేటాయించిన నిధులు సరిపోక పోవడంతో నిధుల కొరత ఏర్పడింది. కొన్ని సంఘాల నుంచి వెనక్కి వెళ్లిపోయిన నిధులను అవసరం ఉన్న సహకార సంఘాలకు కేటాయించాలని పలువురు చైర్మన్లు కోరుతున్నారు. కానీ అంతా ఆన్లైన్ విధానం అమలు కావడంతో నిధుల కేటాయింపు విషయంలో తాము ఏమీ చేయలేమని బ్యాంకు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. సహకార బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి పంట రుణాలకు డిమాండ్ ఉన్న సంఘాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. రూ.25లక్షలు అవసరం... తాళ్లరాంపూర్ సహకార సంఘం పరిధిలో కొత్త సభ్యులు ఎంతో మంది పంట రుణం కావాలని అడుగుతున్నారు. ఇప్పటి వరకు రూ. 25 లక్షల రుణాలిచ్చాం. మరో రూ.25 లక్షలు అవసరం. వంద శాతం రుణ వసూళ్లు ఉన్న సంఘాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. – పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్, పీఏసీఎస్ తాళ్లరాంపూర్ దరఖాస్తులు వస్తున్నాయి.. కొత్తగా సహకార సంఘాల్లో పంట రుణం తీసుకోవడానికి సభ్యులు దరఖాస్తులు అందిస్తున్నారు. సహకార సంఘాలకు డిమాండ్‌ను బట్టి పంట రుణాల కోసం నిధులు కేటాయించాలి. కొన్ని సంఘాల్లో మిగిలిపోయిన నిధులను అవసరం ఉన్న సంఘాలకు మళ్లించాలి. – బర్మ చిన్న నర్సయ్య, చైర్మన్, పీఏసీఎస్ ఏర్గట్ల -
టీడీపీ అక్రమాలు.. రూ.కోటిన్నర మాయం
గతమంతా ఘన చరిత్ర...అయితే అవినీతితో అన్నట్టుగా ఉంది టీడీపీ పాలన. అన్నీ పక్కాగా సాగాల్సిన సహకార సొసైటీల్లో కూడా కోట్ల రూపాయల స్వాహాకు పాల్పడ్డారు. తెలుగు తమ్ముళ్లు. తరువాత అధికారం తమదేనన్న ధీమాతో బినామీల పేరుతో...సెంటు భూమిలేని వ్యక్తుల పేరుతో నిధులను పక్కతోవ పట్టించారు. కళ్లుమూసుకొని పాలుతాగుతూ పిల్లి ఎవరూ చూడడం లేదన్న రీతిలో సొసైటీల్లో ఖజానా గుల్ల చేసేశారు. అనంతరం డీసీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంత ఉదయ భాస్కర్ ఈ అక్రమాలపై దృష్టి సారించడంతో వ్యవహారం బట్టబయలైంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కంచే చేను మేసింద’నే సామెతను తలపించే రీతిలో సహకార సంఘాలను అధికారులే కొల్లగొట్టేశారు. సంఘాలలో పనిచేస్తూ ప్రగతికి పాటుపడాల్సిన సంబంధితాధికారులు, ఉద్యోగులే సంఘాలను గుల్ల చేసిపోయారు. గత తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఏలుబడిలో తెలుగు తమ్ముళ్లు, అధికారులు కుమ్మక్కై గత ఐదేళ్లలో పలు అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఏ సంఘాన్ని కదిపినా అవినీతి, అవకతవకలే కదలాడుతున్నాయి. అప్పట్లో డీసీసీబీ పాలకవర్గం, సీఈఓ సహా అధికారుల సంఘాలు, బ్రాంచీల్లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను చూసీచూడనట్టు ప్రేక్షకపాత్ర పోషించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి డీసీసీబీ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక నాటి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వద్దిపర్రు సొసైటీ, ఆత్రేయపురం బ్రాంచి అధికారులు అడ్డంగా దోచేసిన రైతుల సొమ్ము అక్షరాలా రూ.1.37 కోట్లుగా లెక్క తేలింది. అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించడంతో ఈ కుంభకోణం బయటపడింది. 2019 మార్చి వరకూ జరిగిన లావాదేవీలపై ఆడిట్లో బయటపడింది కానీ లేకుంటే ఇది బయటపడేదే కాదు. ఈ కుంభకోణాన్ని వద్దిపర్రు పర్సన్ ఇన్చార్జి కొరుప్రోలు వెంకటేశ్వరరావు బయటపెట్టారు. వద్దిపర్రు సొసైటీలో... టీడీపీ ఏలుబడిలో సొసైటీలో 55 మంది బినామీ రైతుల పేర్లతో సుమారు రూ.54 లక్షలు దిగమింగేశారు. సొసైటీలో జరిపిన ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, నగదు నిల్వ రూ.23 లక్షలు కూడా మాయం చేసేశారు. వద్దిపర్రు, పేరవరం గ్రామాల్లో అసలు సెంటు భూమంటూ లేని, నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీల పేరుతో లక్షలు రుణాలు తీసేసుకున్నారు. ఈ సొసైటీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న సీఈఓ ఆచంట మునీశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన లావాదేవీలపై జరిపిన ఆడిట్లో ఈ కుంభకోణం వెలుగులోకి చూసింది. పేరవరం గ్రామానికి చెందిన కొండ్రు నాంచారావు సన్ఆఫ్ పల్లయ్య రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ. ప్రభుత్వం ఇచ్చిన పక్కా గృహంలో నివాసం ఉంటున్నాడు. అతని పేరున రూ.17.30 లక్షలు రుణం వద్దిపర్రు సొసైటీ రికార్డుల్లో ఉంది. సెంటు భూమి లేదు. అయినా నాంచారావు పేరున స్వల్పకాలిక రుణం రూ.3 లక్షలు, స్వల్పకాలిక ఇతర రుణం రూ.9.70 లక్షలు, దీర్ఘకాలిక రుణం రూ.4.60 లక్షలు, మొత్తంగా రూ.17.30 లక్షలు రుణం దోచేశారు. ఏవీ చూడకుండానే... ♦రుణం ఇవ్వాలంటే ముందు బ్రాంచి మేనేజర్, సూపర్వైజర్ కచ్చితంగా భూమిని పరిశీలించాలి. భూ తనఖా రిజిస్ట్రేషన్ నంబరు, అతని పేరున భూమి ఉందా లేదా, భౌతికంగా కూడా చూడాలి. అదే రూ.3 లక్షలు రుణం వరకూ బ్రాంచి స్థాయిలో పరిశీలన జరిపితే సరిపోతుంది. రూ.3 లక్షలు దాటి రుణం ఇవ్వాల్సి వస్తే డీసీసీబీ స్థాయిలో పరిశీలన జరపాలనేది నిబంధన. కానీ ఇవేమీ చూడకుండానే కళ్లుమూసుకుని సెంటు భూమి లేని నాంచారావు పేరున రూ.17.30 లక్షలు రుణం గుటకాయ స్వాహా చేశారు. ♦వద్దిపర్రు గ్రామంలో ఉప్పే కొండయ్య సన్ ఆఫ్ పెరుమాళ్లు. ఇతనికి 0.6 సెంట్లు భూమి ఉంది. దీనిని 0.67 సెంట్లుగా రికార్డు చూపించారు. అంటే 61 సెంట్లు పెంచి చూపించారు. స్వల్పకాలిక రుణ బాండ్లో 67 సెంట్లు చూపించారు. తీరా కొండయ్య పేరున సొసైటీలో తనఖా పెట్టిన బాండును అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఆ బాండు నంబర్ 949/2012తో కరుటూరి మాధవి పేరున రిజిస్టరై ఉందని తేలింది. ఇలా ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు పీఏసీఎస్ ద్వారా 55 మందికి రూ.54 లక్షలు పంట రుణాలు ఇచ్చినట్టు రికార్డు ఉంది. రుణాలు ఇవ్వాలంటే టైటిల్ డీడ్, బాండ్ పేపర్లు సొసైటీ తరువాత బ్రాంచిలో డిపాజిట్ చేయాలి. కానీ ఇక్కడ సొసైటీ సీఈఓ సహా కొందరు బ్రాంచి అధికారులు భూమి లేని వారికి భూమి ఉన్నట్టు, భూముల విస్తీర్ణం పెంచేసి, టైటిల్ డీడ్లు లేకుండానే ఉన్నట్టు, బాండ్ పేపర్లు నకిలీవి సృష్టించడం...ఇలా రికార్డుల మాయాజాలంతో లక్షలు దారిమళ్లించి రైతుల నోట మట్టికొట్టారు. ఓ రైతుకు రుణం ఇవ్వాలంటే... స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం టైటిల్ డీడ్, బాండ్ కచ్చితంగా ఉండాలి. వీటిని రైతుల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తీసుకుంటారు. సొసైటీ స్థాయిలో సీఈఓ పరిశీలన జరిపి డీసీసీబీ బ్రాంచికి అందజేయాల్సి ఉంటుంది. ఆ బ్రాంచి మేనేజర్ రికార్డు ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఆ రుణం కూడా నేరుగా రైతుకే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రైతుకు రుణం అందుకోవాలంటే ఇంతటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటే వద్దిపర్రు సొసైటీలో మాత్రం ఈ నిబంధనలన్నింటినీ గాలికొదిలేసినా డీసీసీబీ స్థాయిలో అప్పటి సీఈఓ సహా ఉన్నతాధికారులు, ఆత్రేయపురం బ్రాంచి మేనేజర్ ఎం.క్రాంతి కృష్ణ పర్యవేక్షణ ఏమి చేశారని ఆ ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ సీఈఓ ఆచంట మునీశ్వరరావు, సూపర్వైజర్ మహలక్ష్మిరాజు(పదవీ విరమణ) అక్కడి తెలుగు తముళ్లు తెరవెనుక ఈ కథ నడిపించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎరువుల లావాదేవీల్లోనూ... ఎరువుల లావాదేవీల సొమ్ము రూ.60 లక్షలు, మార్చి 2019 నాటికి ఉండాల్సిన నగదు నిల్వ రూ.23 లక్షలలో మాయాజాలమే జరిగింది. తమకు తెలియకుండా తమ పేరున రుణాలు కాజేసిన వ్యవహారం ఆనోట, ఈనోటా రైతులకు చేరడం, ఇంతలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వద్దిపర్రు పర్సన్ ఇన్ఛార్జిగా కొరుప్రోలు వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, కుంభకోణంపై ఆడిట్ నిర్వహించడం ద్వారా స్వాహా అయిన నిధులను బాధ్యుల నుంచి తిరిగి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కోటి రూపాయల వరకు రికవరీ చేసినట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. మిగిలిన మొత్తం కూడా వసూళ్లు చేస్తామన్నారు. సొమ్ము రాబట్టి బాధ్యులను విడిచిపెట్టేస్తే ఇలాంటి కుంభకోణాలు పునరావృతం అవుతాయని, బాధ్యులపై చర్యలకు డీసీసీబీ స్థాయిలో కొందరు అధికారులు అడ్డంపడుతున్నారని తెలిసింది. ఇటీవల గోకవరం బ్రాంచిలో బంగారం, దీర్ఘకాలిక రుణాలలో అవినీతిని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో బాధ్యుడైన మేనేజర్ ఎస్ఎ హుస్సేన్ నుంచి బంగారం, నగదు రికవరీ చేసి విధులకు దూరంగా ఉంచారు. వద్దిపర్రు సొసైటీ సీఈఓ మునేశ్వరరావుపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆత్రేయపురం బ్రాంచిలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు నొక్కేసింది వీరి పేర్లతోనే... పోతుల శ్రీరామ్-రూ.3 లక్షలు పోతుల ఏసుప్రభావతి-రూ.3 లక్షలు గుడే సునీత-రూ.3 లక్షలు బొజ్జా రాజేశ్వరి-రూ.3 లక్షలు బొజ్జా తులసీరావు-రూ.3లక్షలు మద్దిపోతి శ్రీనివాసరావు-రూ.13,700లు మద్దెల అర్జియ్య-రూ.2లక్షలు అత్తిలి రామాంజనేయులు-రూ.2 లక్షలు అత్తిలి గోవిందు-రూ.2 లక్షలు వరదా రాంబాబు-రూ.2.40లక్షలు మద్దిపోతు విజయలక్ష్మి-రూ.1.75 లక్షలు గన్నమేని అనసూయ-రూ.1.50 లక్షలు ఎస్ వెంకటేశ్వర్లు-రూ.లక్ష అవకతవకలు వాస్తవమే.. వద్దిపర్రు సొసైటీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. ఆ విషయాలు నా దృష్టికి కూడా వచ్చాయి. దానిపై ఆడిట్ కూడా నిర్వహించాం. బాధ్యులపై విచారణతోపాటు సొమ్ము రికవరీ చేస్తున్నాం. ఇటువంటి అవకతవకలు జరగకుండా బ్రాంచి, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారిని భవిష్యత్తులో బదిలీలు చేసేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రవీణ్‌కుమార్, డీసీసీబీ సీఈవో అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం సొసైటీలో అవకతకవలు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. ప్రతి పైసా సొసైటీకి తిరిగి వచ్చే వరకూ పోరాడతాం. సొసైటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. – కొరుప్రోలు వెంకటేశ్వరరావు, వద్దిపర్రు సొసైటీ చైర్మన్, ఆత్రేయపురం మండలం సహకార సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సహకార సంఘాలను భ్రష్టుపట్టించారు. తెలుగు తమ్ముళ్లు కొందరు సహకారంతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుతిన్నారు. అటువంటిదే మా నియోజకవర్గంలో పలివెలలో జరిగింది. పలివెలలోని సహకార సంఘ పరిధిలో రెండు భవనాల నిర్మాణానికి రూ.35 లక్షలు విడుదల చేశారు. కానీ అక్కడ నిర్మించింది ఒకే భవనం. నేను స్వయంగా అక్కడ జరిగిన అవినీతిని నాడు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు తీసుకోలేదు. పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిన మీదట మొక్కుబడిగా విచారణ చేసి రూ.6 లక్షలు అవినీతి జరిగినట్టు తేల్చారు. టీడీపీ అధికారం కోల్పోయిన సమయానికి కూడా అవినీతి సొమ్ము రికవరీ చేయలేకపోయింది. – చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే -
తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు
దొంగలు.. దొంగలూ ఊళ్లు పంచుకున్నట్టు తెలుగు తమ్ముళ్లు జగ్గంపేట సొసైటీలో సొమ్మును మెక్కేశారు. నకిలీ పాస్ పుస్తకాలతో జరిగిన ఈ కుంభకోణంలో రూ.ఆరు కోట్లకు పైగా అవినీతి జరిగిందని సమాచారం. నాటి పచ్చపాలనలో విచ్చలవిడిగా సాగిన ఈ అవినీతిపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సెక్షన్ 51 ప్రకారం విచారణ జరుగుతోంది. సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగు తమ్ముళ్లు ఒక సహకార సంఘంపై పడి నిలువు దోపిడీ చేశారు. నేతల దోపిడీ రూ.ఆరు కోట్లపై మాటేనని ప్రాథమిక సమాచారం. నిజాలు నిగ్గు తేలితే దోపిడీ రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కింది నుంచి పై స్థాయి వరకూ అందరికీ తెలిసే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ రుణాల కుంభకోణం జరిగిందని చెప్పేందుకు పలు ఆధారాలు కనిపిస్తున్నాయి. తమ్ముళ్లు వందకుపైనే నకిలీ పాస్ పుస్తకాలు కూడా తయారు చేశారు. తెలుగుదేశం పార్టీ కీలక నేతల కనుసన్నలో ఇదంతా జరిగింది. సొసైటీలో రికార్డులనే మాయం చేసేశారు. గత సర్కార్‌లో అడ్డగోలుగా పచ్చ నేతలు మెక్కేసిన రైతుల సొమ్ము ముక్కుపిండి వసూలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. క్షేత్ర స్థాయిలో సహకార సంఘం దగ్గర నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వరకూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ఇలా అడుగడుగునా అవినీతి జ్యోతిలా వెలిగిపోయింది. ఈ రుణాల కుంభకోణం వ్యవహారం సహకార సంఘం సీఈఓ అడ్డగళ్ల సాయిరాం ఉసురు తీసింది. రెండుసార్లు నోటీసులు అందుకున్న సీఈఓ సాయిరాం విచారణకు హాజరుకాకుండానే మృతిచెందారు. అప్పట్లో ఆయన మృతిపై పలు అనుమానాలు రేకెత్తాయి. చదవండి: తిరుమల శ్రీవారి దర్శనం షురూ కొనసాగుతున్న విచారణ మెట్ట ప్రాంతంలో లంపకలోవ సొసైటీలో బినామీ రుణాల బాగోతం మరిచిపోకుండానే జగ్గంపేట సొసైటీలో రుణాల కుంభకోణంపై విచారణ జరుగుతోంది. జగ్గంపేట విశాల వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్‌పర్సన్‌గా 2013 జనవరి నుంచి టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి మణి ఉన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సొసైటీల్లో అవినీతి ప్రక్షాళన కోసం పాత కమిటీలను రద్దు చేసి ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలోనే సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా బుర్రి విష్ణుచక్రం (చక్రబాబు) నియమితులయ్యారు. ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సొసైటీ రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించారు. లావాదేవీల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలున్న నేపథ్యంలో గతేడాది ఆగస్టులో జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేయడంతో సహకార చట్టం సెక్షన్ 51 ప్రకారం విచారణకు ఆదేశించిన సంగతి పాఠకులకు విదితమే. విచారణాధికారి శివకామేశ్వరరావు గత డిసెంబర్ 9 నుంచి విచారణ నిర్వహిస్తున్నారు. అంతా బినామీ భాగోతమే... సహజంగా ఒక మధ్యతరగతి రైతు అన్ని ధ్రువీకరణ పత్రాలతో రుణం కోసం సహకార సంఘానికి వెళితే సవాలక్ష సాకులతో నెలల తరబడి తిప్పుకుంటారు. అటువంటిది 110 మంది బినామీలు రైతుల ముసుగేసుకుని నకిలీ పాసు పుస్తకాలతో రూ.కోట్లు కొట్టేశారు. కోనసీమలోని రాజోలు ప్రాంతంలో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ పాసు పుస్తకాలు తయారుచేయడంలో చేయి తిరిగిన ముఠా ద్వారానే జగ్గంపేట సహకార సంఘంలో దాఖలు చేసిన నకిలీ పాసు పుస్తకాలు తయారు చేశారని విశ్వసనీయ సమాచారం. పాసు పుస్తకాలు, వాటి సర్వే నంబర్లు, ఆ సర్వే నంబర్లు వాస్తవమా కాదా అనేది కనీసం పరిశీలన లేకుండా సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజి్రస్టేషన్ కూడా చేశారు. వాటిని సొసైటీలో పెట్టినప్పుడు కనీసం సొసైటీ పరిశీలన జరపాలి. చదవండి: నవవధువు అనుమానాస్పద మృతి అక్కడంతా తెలుగు తమ్ముళ్లే ఉండటంతో పక్కా పథకం ప్రకారమే క్రెడిట్ లిమిట్ కోసం డీసీసీబీ బ్రాంచికి, అక్కడి నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు పంపించేశారు. ఆ సమయంలో జగ్గంపేట డీసీసీబీ బ్రాంచిలో కూడా టీడీపీ ప్యానలే ఉండటంతో కనీసం పరిశీలన జరపకుండా బినామీ పాసు పుస్తకాలపై రుణాలు ముంజూరు చేసి దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకున్నట్టు జగ్గంపేట విశాల పరపతి సంఘంలో రూ.కోట్లు కొల్లగొట్టేశారు. అప్పటి పాలకవర్గం కనుసన్నల్లో సుమారు 110 మంది తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగులేసి నకిలీ పాసు పుస్తకాలతో రూ.3 కోట్లు వరకు ముట్టజెప్పారని ప్రాథమిక సమాచారం. బినామీ రైతులంతా జగ్గంపేట, ప్రత్తిపాడు, కిర్లంపూడి, ఏలేశ్వరం తదితర మండలాలకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా మెట్ట ప్రాంతంలో పచ్చ నేతల కొమ్ముకాసిన ద్వితీయ శ్రేణి నేతలే. రుణాలు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకూ వడ్డీలు లెక్క కట్టి చూస్తే రుణాల కుంభకోణం విలువ రెట్టింపు అయ్యే అవకాశాలే ఉన్నాయి. ప్రైవేటు ఆడిట్‌తో అక్రమాలు కప్పిపుచ్చిన వైనం సంఘాల్లో ఏటా ప్రభుత్వ ఆడిట్లు నిర్వహిస్తుండాలి. ఈ సంఘంలో 2014–15 నుంచి 2018–19 వరకూ జరిగిన కార్యకలాపాలపై ప్రైవేటు ఆడిట్ నిర్వహించి అక్రమాలను కప్పిపుచ్చారనే ఆరోపణలున్నాయి. సొసైటీ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులన్నింటినీ మాయం చేసేశారు.110 బినామీ రుణాల్లో 17 మంది నుంచి రుణాలు తిరిగి వసూలు చేయగలిగారు. ఈ సొసైటీలో కుంభకోణం రుణాలకే పరిమితం కాలేదు. భవన నిర్మాణాలు, నగదు లావాదేవీలు, ఎరువుల కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ప్రస్తుత సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణానికి సొసైటీ నుంచి అధికారికంగా రూ.40 లక్షలకు అనుమతి తీసుకుని అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో వెనుకా ముందూ చూడకుండా చేతి రసీదు పేరుతో రూ.90 లక్షలు ఖర్చు చూపించారని డీసీసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఆ మేరకు రూ.50 లక్షలు దారి మళ్లాయంటున్నారు. ఎరువుల కొనుగోలులో సుమారు రూ.16 లక్షలు, నగదు లావాదేవీల్లో సుమారు రూ.40 లక్షలు..ఇలా అవినీతి భాగోతం రూ.కోటిపైనే ఉంటుందని లేస్తున్నారు. డీసీసీబీ అధికారులకు 20శాతం కమీషన్ ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు ప్రధాన భూమిక పోషించారు. జగ్గంపేట సహకార సంఘం నుంచి రుణాల కోసం ప్రతిపాదనలు వచ్చినప్పటికీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేయాల్సి ఉంది. కానీ డీసీసీబీలో అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడ్డారు. ప్రతి రుణంపైన డీసీసీబీలో అప్పటి అధికారులు 20 శాతం కమీషన్ తీసుకొని అనుమతి ఇచ్చారని సమాచారం. చదవండి: భలే భలే.. నేనూ పోలీసునే.. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే విచారణ జిల్లా సహకార అధికారుల ఆదేశాల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నెల నుంచి విచారణ చేస్తున్నాం. సంఘ«ంలో రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కొంతకాలం, సీఈఓ మృతి చెందడంతో మరి కొంతకాలం విచారణలో జాప్యం జరిగింది. లాక్డౌన్ కారణంగా రెండు నెలల నుంచి విచారణ ముందుకు సాగలేదు. బినామీ పేర్లతో రుణాలు పొందడం, ఎరువుల అమ్మకాలు, నగదు లావాదేవీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. విచారణ అనంతరం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం. – జె.శివకామేశ్వరరావు, సబ్ డివిజినల్ సహకార అధికారి, విచారణాధికారి, సహకార శాఖ నిజాలు నిగ్గు తేలుస్తాం నేను త్రిసభ్య కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక గత పాలకవర్గంలో చోటుచేసుకున్న అవకతవకలు నా దృష్టికి వచ్చాయి. బినామీ పేర్లు, నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు దారి మళ్లించారని సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే వాటిని నివృత్తి చేసి సొసైటీకి అప్పగించాలని నేను జిల్లా సహకార అధికారికి విజ్ఞప్తి చేశాను. ఆ ఫిర్యాదు తరువాతే విచారణాధికారిని నియమించారు. ఇప్పుడు 51 విచారణ జరుగుతోంది. నిజాలు నిగ్గు తేలుస్తాం. – బుర్రి విష్ణుచక్రం (చక్రబాబు), త్రిసభ్య కమిటీ చైర్మన్, జగ్గంపేట సొసైటీ. -
దేవినేని ఉమా బంధువు అవినీతి.. ఏసీబీ సోదాలు
సాక్షి, నందిగామ: మాజీ మంత్రి దేవినేని ఉమా బంధువు గద్దె వీరభద్రరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కంచికచర్ల మండలం పెరకలపాడు సహకార సంఘం భవనంలో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పొట్లూరి అరుణ అనే మహిళ ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. తన పేరు మీద గద్దె వీరభద్రరావు లోన్ తీసుకున్నారని సదరు మహిళ ఆరోపిస్తున్నారు. సహకార పరపతి సంఘంలో తాను లోను తీసుకోకపోయినప్పటికీ తీసుకున్నట్లుగా తన పేరును ఉపయోగించి బినామీ రుణాలు పొందారని అరుణ ఫిర్యాదు చేశారు. పూర్వపు పాలకవర్గం, ప్రస్తుత కార్యదర్శులు తన పేరును ఉపయోగించే బినామీ రుణాలు పొందారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరకలపాడు సహకారం సంఘంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. -
దేవినేని ఉమా సోదరుడు గద్దె వీరభద్రరావుపై అవినీతి
-
ప్రశాంతంగా ముగిసిన సహకారం ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 747 ప్యాక్స్లకు (వాటిల్లోని 6,248 డైరెక్టర్ పదవులు) జరిగిన ఎన్నికల్లో 79.36 శాతం ఓటింగ్ జరిగినట్లు వెల్లడించింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 89.82 శాతం ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 87.99 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అథారిటీ వెల్లడించింది. అత్యంత తక్కువగా నారాయణపేట జిల్లాలో కేవలం 55.78 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.48 లక్షల మంది ఓటర్లకుగాను, 9.11 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 906 ప్యాక్స్లకుగాను 904 పరిధిలోని 11,653 డైరెక్టర్ స్థానాలకు (ప్రాయోజిత నియోజకవర్గాలు) సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తరువాత 157 ప్యాక్స్‌లు... వాటిల్లోని 2,017 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే మిగిలిన ప్యాక్స్‌ల్లోని మరికొన్ని స్థానాలు.. అంటే 3,388 డైరెక్టర్ స్థానాలు కూడా ఏకగీవ్రమయ్యాయి. మొత్తంగా 5,405 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మిగిలిన 6,248 డైరెక్టర్ స్థానాలకు ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మొత్తం 14,530 మంది పోటీపడ్డారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఫలితాలు ప్రకటించారు. డైరెక్టర్లు ఎవరో తేలిపోయింది. నేడు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక... డైరెక్టర్లుగా ఎన్నికైన 11,653 మంది 904 ప్యాక్స్లకు చైర్మన్, వైస్ చైర్మన్లను ఆదివారం ఎన్నుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఈ ప్రక్రియ ముగియనుంది. చైర్మన్, వైస్ చైర్మన్లను చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. అనంతరం జిల్లా కలెక్టర్లు వారి పేర్లను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీకి పంపిస్తారు. ఆపై వారి పేర్లను అధికారికంగా వెల్లడిస్తారు. ప్యాక్స్ చైర్మన్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ చేస్తారు. పాత జిల్లాల ప్రాతిపదికనే డీసీసీబీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నెల 24 నాటికి డీసీసీబీ అధ్యక్షుల ఎన్నిక పూర్తవుతుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతుంది. డీసీసీబీ అధ్యక్షులు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. టెస్కాబ్ చైర్మన్ ఎన్నికను ఈ నెల 29 నాటికల్లా పూర్తిచేస్తారు. దీంతో మొత్తం సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో అత్యంత తక్కువ సమయంలో ఈ ఎన్నికలను సహకారశాఖ సమర్థంగా నిర్వహించిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్యాక్స్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వాట్సాప్‌ను అత్యధికంగా వినియోగించుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక గ్రూపును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆదేశాలను వాట్సాప్ ద్వారానే జారీ చేసింది. దీంతో సమయం ఎంతో కలసి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. -
ముగిసిన సహకార సంఘాల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 747 ప్యాక్స్లకు (వాటిల్లోని 6,248 డైరెక్టర్ పదవులు) జరిగిన ఎన్నికల్లో 79.36 శాతం ఓటింగ్ జరిగినట్లు వెల్లడించింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 89.82 శాతం ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 87.99 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అథారిటీ వెల్లడించింది. అత్యంత తక్కువగా నారాయణపేట జిల్లాలో కేవలం 55.78 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.48 లక్షల మంది ఓటర్లకుగాను, 9.11 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సహకార ఎన్నికల పోలింగ్
-
ముగిసిన ‘సహకార’ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగింది. ఏకగ్రీవం కాగా(157 ప్యాక్స్‌లు... 5,403 డైరెక్టర్ స్థానాలు) మిగిలిన 747 ప్యాక్స్‌లు, 6,248 వార్డులకు (ప్రాయోజిత నియోజక వర్గాలు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 14,530 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రంలోపు ఫలితాలు ప్రకటిస్తారు. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఆ లాటరీలో ఎంపికైన అభ్యర్థికి మిగిలిన వారికన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినట్లు పరిగణించి ఆ అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ►నారాయణఖేడ్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గంలో సంగారెడ్డి అనే వ్యక్తి పేరిట ఉన్న ఓటును మరొకరు వేశారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన సంగారెడ్డి ఎలా ఓటు వేస్తారని ఎన్నికల సిబ్బందితో టీఆర్ఎస్ నేతల వాగ్వాదానికి దిగారు. దొంగ ఓట్లు వెయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ►నారాయణఖేడ్ లో ఎన్నికల అధికారులతో 14 వ వార్డు కౌన్సిలర్ నూర్జహాన్ బేగం వాగ్వాదం తన ఓటును వేరే వ్యక్తులు ఎలా వేస్తారని ప్రశ్నించిన కౌన్సిలర్ ►నల్లగొండ జిల్లా చిట్యాలలో జరుగుతున్న ‘సహకార’ ఎన్నికల్లో ఓ పెళ్లి కొడుకు ఓటు హక్కు వినియోగించుకున్నా. ఉదయం 11.30గంటలకి వివాహ ముహూర్తం ఉండడంతో ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లిపోయాడు. ► ఆదిలాబాద్ జిల్లా బోథ్ సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతల ఆందోళన దిగారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణ అదుపు చేశారు. ►నిజామాబాద్ జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కోటగిరి, మొస్ర చందూర్ మండలాల్లో ఉన్న 5సహకార సంఘాల్లోని 54 డైరెరక్టర్ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ►కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సహకార సంఘాలు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 14 సహకార సంఘాలకు ఓటింగ్ ప్రారంభమైంది. 220 డైరెక్టర్ పదవుల్లో 104 ఏకగ్రీవం కాగా, 116 లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 125 సహకార సంఘాలు ఉండగా12 ఏకగ్రీవం అయ్యాయి. 743 డైరక్టర్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 113 సహకార సంఘాలకు పోలింగ్ ప్రారంభమైంది. -
ఏకగ్రీవాల జోరు: మంత్రి కృతజ్ఞతలు
సాక్షి, నిజామాబాద్: సహకార సంఘాల ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్కొండ నియోజక వర్గంలో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని 20 సహకార సంఘాలకు గాను 19 సంఘాలు ఏకగ్రీవంగా నిలిచాయి. సహకార ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా ఈ సారి ఏకగ్రీవాల జోరు కొనసాగింది. బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక సొసైటీలు ఏకగ్రీవం కావడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దమొత్తంలో ఏకగ్రీవాలు చేసింనందుకు వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏకగ్రీవాలను అందించిన జిల్లా రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా జిల్లాలోని 89 సహకార సంఘాలకుగాను 26 సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. -
దిగ్గజ నాయకులను అందించిన సహకార ఎన్నికలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర, దేశస్థాయి రాజకీయాలకు సింగిల్ విండో ఎన్నిక ఎంతో తోడ్పడింది. అందివచ్చిన ‘సహకారం’తో ఎందరో నాయకులను అసెంబ్లీ, పార్లమెంట్‌కు పంపింది. రైతుకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజామెప్పుతో రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగి తమ సత్తాను పలువురు నాయకులు చాటుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా తొలుత సింగిల్ విండో చైర్మన్‌గా పని చేసిన వారే. సహకార ఎన్నికల నేపథ్యంలో సంఘాల వేదికగా రాజకీయంగా ఎదిగిన నేతలపై కథనం. సహకార ‘భీష్ముడు’... ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన వుచ్చిడి మోహన్‌రెడ్డి సహకార బీష్ముడిగా పేరుంది. 1969 నుంచి 1981 వరకు అల్మాస్పూర్ సర్పంచ్‌గా పని చేశారు. 1981లో సహకారరంగం ఏడీబీగా ఉండేది. అప్పట్లో ఏడీబీలో డైరెక్టర్‌గా ఉన్నారు. 1984 నుంచి ఇప్పటివరకు 36 ఏళ్లుగా అల్మాస్పూర్ సహకార సంఘం చైర్మన్‌గా ఉంటున్నారు. 1983లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికై 20 నెలలపాటు మోహన్‌రెడ్డి పని చేశారు. ఎన్టీ రామారావు అప్పట్లో ప్రభుత్వం రద్దు చేయడంతో మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. 2005లో కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్‌గా 2013 నుంచి కేడీసీసీ బ్యాంక్ వైస్‌చైర్మన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో మోహన్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటి సహకార ఎన్నికల్లోనూ అల్మాస్పూర్ సహకార సంఘం నుంచి మళ్లీ డైరెక్టర్‌గా మోహన్‌రెడ్డి ఏకగ్రీవం కావడం విశేషం. సహకార రంగంలో మోహన్‌రెడ్డి భీషు్మడిగా అభివర్ణిస్తారు. గంభీరావుపేట నుంచి అంతర్జాతీయ స్థాయికి... గంభీరావుపేట మండలం గజసింగవరంకు చెందిన కొండూరి రవీందర్రావు 2005లో సహకార సంఘం చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది కరీంనగర్ సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్‌గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఉన్నారు. రెండోసారి 2013లో గంభీరావుపేట సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీబీ చైర్మన్‌గా పని చేస్తూ 2015లో తెలంగాణ సహకార బ్యాంక్ చైర్మన్(టెస్కాబ్)గా ఎన్నికయ్యారు. 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా సహకార రంగంలోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌పాలసీ అమలు చేసే కమిటీకి కొండూరి రవీందర్రావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గంభీరావుపేటలో మొదలైన రవీందర్రావు ప్రస్థానం సహకార రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. 2020లో గంభీరావుపేట సింగిల్‌విండో పరిధిలో 6వ డైరెక్టర్ స్థానానికి తాజాగా కొండూరి రవీందర్రావు నామినేషన్ వేశారు. ఒక్కటే నామినేషన్ రావడంతో ఏకగ్రీవంకానున్నారు. ‘సింగిల్’ నుంచి కరీంనగర్ ఎంపీగా.. కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ çసహకార పరపతి సంఘం డైరెక్టర్‌గా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన పొన్నం ప్రభాకర్ అనంతరం కరీంనగర్ లోక్సభసభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ సింగిల్‌విండో నుంచే ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం మొదలై అంచలంచెలుగా రాష్ట్ర, దేశస్థాయి నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. 2005లో కరీంనగర్ సింగిల్‌విండోకు జరిగిన ఎన్నికల్లో డైరెక్టర్, చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దివంగత సీఎం డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి శిషు్యడిగా 2005లోనే డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికై ఉమ్మడి ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రభాకర్ 2009లో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరించి దేశవ్యాప్తంగా గుర్తింపుపొందారు. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాత్రను పోషించి ప్రజల మన్ననలు పొందారు. రాజకీయంగా తొలి అవకాశం మాత్రం సహకార సంఘం కల్పించడంపట్ల పొన్నం ఆనందం వ్యక్తం చేస్తారు. డైరెక్టర్ టు మార్క్‌ఫెడ్ చైర్మన్..లోక బాపురెడ్డి ప్రస్థానం కథలాపూర్(వేములవాడ): రైతు కుటుంబం నుంచి వచ్చి సహకార సంఘం డైరెక్టర్‌గా గెలుపొంది అంచలంచెలుగా మార్క్‌ఫెడ్ చైర్మన్ స్థాయికి ఎదిగిన ‘లోక’ ప్రస్థానం ఇదీ. కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన లోక బాపురెడ్డి 2013 సంవత్సరంలో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్‌గా పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్ల మద్దతు కూడగట్టుకొని భూషణరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సహకార సంఘం చైర్మన్‌గా రైతుకు సేవలందిస్తున్న తరుణంలో 2017 సంవత్సరం మార్చిలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ పదవిని సీఎం కేసీఆర్ అప్పగించారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈ నెలలో జరుగుతున్న సహకార సంఘాల ఎన్నికల్లో భూషణరావుపేట సహకార సంఘంలో ఒకటో టీసీలో నామినేషన్ వేసి డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెజార్టీ డైరెక్టర్లను గెలిపించుకొని మరోసారి సహకార సంఘం చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు కుటుంబంలో పుట్టి రాష్ట్రంలోని రైతులకు సేవలందించడం ఆనందంగా ఉందని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి చెబుతారు. సింగిల్ విండో నుంచి ఎమ్మెల్యేగా... వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రేగులపాటి పాపారావు 1996లో రుద్రవరం సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికై అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్‌గా పనిచేశారు. అంతకు ముందు 1980లో వేములవాడ పాత తాలూకా సమితి చైర్మన్‌గా పనిచేశారు. 1987లో వేములవాడ తొలి మండల అధ్యక్షుడిగా పాపారావు ఉన్నారు. 1999లో సిరిసిల్ల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు రుద్రవరం సర్పంచ్‌గా పని చేస్తూ రాష్ట్రస్థాయిలో ఉత్తమ సర్పంచ్‌గా పాపారావు ఎన్నికయ్యారు. సింగిల్ విండో చైర్మన్‌గా పని చేసి చట్టసభకు ఎన్నికకావడం విశేషం. ఎమ్మెల్యే నుంచి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా... గంభీరావుపేటకు చెందిన కటుకం మృత్యుంజయం 1981లో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా పని చేశారు. అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యేగా 1983లో ఎన్నికయ్యారు. 1992 నుంచి 1995 వరకు గంభీరావుపేట సింగిల్ విండో చైర్మన్‌గా పని చేసి ఉమ్మడి కరీంనగర్ సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మృత్యుంజయం ముందు చట్టసభలకు వెళ్లి తర్వాత సొంత ఊరి నుంచి సహకార బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికై, ప్యాక్స్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో రాజకీయంగా గుర్తింపు పొందారు. -
నేడే సహకార నోటిఫికేషన్
సాక్షి, నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని ఆయా సంఘాల ఎన్నికల అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. జిల్లాలో మొత్తం 43 పీఏసీఎస్‌లు ఉండగా కట్టంగూరు మినహా 42 సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. కట్టంగూర్ సహకార సంఘం పాలకవర్గ పదవీకాలం పూర్తి కానందున ఆ సంఘానికి ఎన్నికలు నిర్వహించడంలేదు. మొత్తం 42 సంఘాల్లో సుమారు లక్షా 15 వేలకు పైగా సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 13 డైరెక్టర్ స్థానాలు ఉంటాయి. వీటిలో 2 డైరెక్టర్ స్థానాలు ఎస్సీ, 1 ఎస్టీ, 2 బీసీ, 8 స్థానాలు జనరల్ (అందులో 7 మేల్, 1 ఫిమేల్) రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. కాగా జిల్లాలోని 42 సహకార సంఘాల్లోని మొత్తం 546 డైరెక్టర్ స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఈనెల 6, 7, 8 తేదీల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల ఉంటుంది. పోటీ చేసేందుకు అర్హతలు.. ఆయా సంఘాల పరిధిలోని గ్రామాల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. 21సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. 31 డిసెంబర్ 2018 నాటికి సభ్యుడై ఉండాలి. 31 డిసెంబర్ 2019 నాటికి సంఘంలో అప్పు ఓడీ అయ్యి ఉండకూడదు.సంఘంలో రూ.330 సభ్యత్వ రుసుం చెల్లించి ఉండాలి. అన్ని ఏర్పాట్లు పూర్తి రాష్ట్ర ఎన్నికల సంఘం, కలెక్టర్ ఆదేశాల ప్రకా రం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేశాం. 42 మంది ఎన్నికల అధికారులను నియమించాం. ఎన్నికలకు సుమారు రెండు వేల మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నాం. – రావిరాల శ్రీనివాసమూర్తి, జిల్లా అదనపు ఎన్నికల అధికారి -
నిజమైన సం.. క్రాంతి!
సం..క్రాంతి.. పండుగ కాంతి.. మట్టి పిసికే రైతు ఒంటరిగా ఉంటే విఫణిలో బేలగా నిలబడాల్సి వస్తుంది.. వ్యాపారుల నిలువు దోపిడీకి గురవ్వాల్సి వస్తుంది.. విత్తనాలు, ఎరువులు వ్యాపా రులు చెప్పిన (చిల్లర) ధరకు కొనాల్సి వస్తుంది.. దళారులు చెప్పిన (టోకు) ధరకే పంటను తెగనమ్మాల్సి వస్తుంది...! అటువంటి రైతులే, చేయీ చేయీ కలిపితే మహత్తర శక్తిగా మారొచ్చని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతన్నలు రుజువు చేశారు. ఐకమత్యంతో కదులుతూ చరిత్రను తిరగరాస్తున్నారు. పెద్ద పండుగ వేళ లక్ష్మీపూర్ రైతన్నల ఆచరణ నుంచి మనమూ స్ఫూర్తి పొందుదాం.. ఒక్కతాటిపైకి వచ్చిన అన్నదాతలకు నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుదాం.. లక్ష్మీపూర్ రైతులు రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమష్టి శక్తిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ చిన్న గ్రామం లక్ష్మీపూర్. తొలుత సహకార సంఘంగా ఏర్పడిన రైతులు అనతి కాలంలోనే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. లక్ష్మీపూర్ సొసైటీ 2016 డిసెంబర్లో రిజిస్టరైంది. సొసైటీ కన్నా మెరుగైన ప్రయోజనాల కోసం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ)ని రైతులు నాబార్డ్ తోడ్పాటుతో సెప్టెంబర్ 2018లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీకి కేంద్ర వాణిజ్య శాఖ గుర్తింపు కూడా ఇటీవలే లభించింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను, రాయితీలను, రుణాలను అందుకోవడానికి.. తమ ఉత్పత్తులను దేశ విదేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి లక్ష్మీపూర్ రైతులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అవకాశం ఏర్పడింది. సంఘ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఒకే చోట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే సంఘం రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సైతం నేరుగా సంఘానికి వస్తాయి. దీనివల్ల రైతులకు రవాణా భారం, ఖర్చులు తగ్గాయి. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు.. ఆ గ్రామంలో 90 శాతం రైతు కుటుంబాలే. దాదాపు 8 వేల జనాభా. వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టపడి చేస్తూ, ప్రతి పంటలోను తోటి గ్రామాల రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తుంటారు. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు, టమాటోలు తదితర కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. వేరుశెనగ, కంది పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రతి భూమిలో కనీసం రెండు, మూడు పంటలు పండిస్తారు. ఎన్నికలప్పుడు ఎవరి పార్టీ వారిదే. ఎన్నికలయ్యాక మాత్రం అందరూ ఒక్కటిగా మెలుగుతున్నారు. ఒకప్పుడు అందరు రైతుల మాదిరిగానే ఆ రైతులు పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఎ.డి. అశోక్‌కుమార్ తోడై, రైతుల ఐకమత్యంతో ఏమేమి సాధించవచ్చో నూరిపోశారు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే లక్ష్షీ్మపూర్ రైతుల పరస్పర సహకార సంఘం. సభ్యత్వ రుసుము రూ. 3,500 తొలుత ఐదుగురు సభ్యులు సహకార సంఘానికి బీజం వేశారు. వారి ఆలోచనలు నచ్చిన గ్రామంలోని రైతులందరు సంఘంలో సభ్యులైనారు. కేవలం నెలలోపే, ఎవరి ప్రమేయం లేకుండా 312 మంది రైతులు సభ్యులుగా చేరడం రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా చెపుతుంటారు. రెండెకరాల రైతుకు అప్పట్లో సభ్యత్వ రుసుము రూ. 2,300 ఉండేది, ప్రస్తుతం రూ. 3,500కు పెరిగింది. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, మూడు నెలలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సంఘం చైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను ప్రతి రెండేళ్ల కొకసారి ఎన్నుకుంటారు. వీరు సంఘం నిర్మాణం, పటిష్టత, వ్యాపారాలపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమవుతుంటారు. చైర్మన్ సహా ప్రతి సభ్యుడూ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులందరి ముందు ప్రమాణం చేస్తారు. ప్రభుత్వ నిబంధనలతో పాటు సంఘానికి ప్రత్యేక నిబంధనలు రాసుకుని ముందుకు వెళ్తుండటంతో సొసైటీ విజయపథాన నడుస్తోంది. సర్వసభ్య సమావేశానికి రాకపోతే రూ. 500 జరిమానా, సంఘ డైరెక్టర్లు సమావేశానికి వెళ్లకపోతే రూ. 100 జరిమానా విధిస్తుంటారు. దీంతో, ప్రతి సమావేశానికి సభ్యులందరూ వచ్చి తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో సంఘానికి ఆదాయం తెస్తూనే, సంఘ సభ్యుడైన రైతులకు లాభం ఉండేలా తొలుత ‘లక్ష్షీ్మపూర్ రైస్’ను తెర మీదకు తెచ్చి, సఫలీకృతులయ్యారు. ఆ కోవలోనే గ్రామ రైతులు పండించిన విత్తనాన్ని తోటి రైతులకు అందించాలనే ఆకాంక్షతో ‘లక్ష్మీపూర్ సీడ్’ను అమ్ముతున్నారు. ఇదే వరుసలో తాజాగా ‘లక్ష్మీపూర్ నువ్వుల’ను సైతం మార్కెట్లోకి తీసుకువచ్చారు. క్వింటాలుకు రూ. వెయ్యి అదనపు రాబడి గ్రామంలో ఎక్కువగా బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం వరి రకాలను సాగు చేస్తుంటారు. ఈ గ్రామస్తులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో, ఎకరాకు 28–30 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. రైతులు ఎవరికివారే వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, గ్రామంలోని మిల్లులో మర ఆడిస్తారు. అప్పుడు సంఘ ప్రతినిధి బృందం పరిశీలించి, బాగున్నాయనుకుంటేనే సంఘం తీసుకుని, గోదాములో నిల్వ చేస్తుంది. మార్కెట్ రేటు కంటే తక్కువకే నేరుగా వినియోగదారులకు అమ్ముతుంటారు. బియ్యం అమ్మగా వచ్చిన డబ్బులో కొంత సంఘానికి జమ చేసి, మిగతా డబ్బులను వెంటనే రైతులకు చెల్లిస్తుంటారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరూ సన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చుతుండటంతో, ధాన్యాన్ని అమ్మిన దాని కంటే, బియ్యం అమ్మగా రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 నుంచి వెయ్యి వరకు లాభపడుతున్నారు. లక్ష్మిపూర్ సీడ్‌కు ఆదరణ గ్రామ రైతులు ప్రతి సీజన్లో లక్షల రూపాయలు పెట్టి రక రకాల కంపెనీల వరి విత్తనాన్ని తీసుకువచ్చి పంటే వేసేవారు. కానీ, విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల పంట దిగుబడులు వచ్చేవి కాదు. దీంతో, రైతులందరం కలిసి మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవడం కాదు, తోటి రైతులకు కూడా అందించాలని లక్ష్షీ్మపూర్ సీడ్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. పొలాస పరిశోధనా స్థానం నుంచి వరిలో కొత్త దొడ్డు రకం జెజిఎల్–24423ని దాదాపు 1000 ఎకరాల్లో సాగు చేసి, ఆ విత్తనాన్ని తోటి రైతులకు అమ్ముతున్నారు. వీటితో పాటు ఐఆర్–64, బతుకమ్మ, ఎంటియు–1010 రకాలను కూడా విక్రయిస్తున్నారు. విత్తన రైతులకు మార్కెట్ ధర కంటే రూ. 200 వరకు ఎక్కువ ధర వస్తున్నది. లక్ష్మీపూర్ రైతులు పసుపు పంట తర్వాత నువ్వులు వేస్తుంటారు. గ్రామంలో దాదాపు వెయ్యి క్వింటాళ్ల వరకు నువ్వులు పండుతాయి. నువ్వులు నాణ్యంగా ఉన్నప్పటికీ, దళారులు రంగ ప్రవేశం చేసి కిలో రూ 70–100 వరకు కొనుగోలు చేసేవారు. దీంతో, రైతులకు సరైన ఆదాయం రాక నష్టపోతుండేవారు. సీడ్స్, రైస్‌తో లక్ష్మీపూర్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చినందున, నువ్వులను సైతం విక్రయిస్తున్నారు. ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. లక్ష్మీపూర్ రైతులు ఐకమత్యంతో చేస్తున్న ప్రతి పనికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తోడ్పాటునిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవ వల్ల గ్రామంలో రూ. 4 కోట్లతో విత్తన శుద్ధి ప్లాంట్ ఏర్పాటైంది. సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చైర్మన్ తిరుపతి రెడ్డి రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 2017లో రూ. 11 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు, 2018లో రూ. 14 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు అమ్మారు. సంఘం ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు రూ. 4 కోట్ల టర్నోవర్‌తో శభాష్ అనిపించుకుంటున్నారు. రైతులు పండించే కూరగాయల అమ్మకానికి లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఘటితం కావడం వల్ల రైతులు అధికాదాయం పొందుతున్నారు. సరసమైన ధరకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు దొరుకుతుండటంతో వినియోగదారులూ సంతోషపడుతున్నారు. (వివరాలకు.. సంఘ ప్రతినిధులు మోహన్ రెడ్డి(95020 26069), రాంరెడ్డి(99484 52429) పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలి పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలన్నదే మా సంఘం ప్రధాన ఉద్దేశం. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటూనే సంఘాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. యువ రైతులను, ఖాళీగా ఉండే వెనుకటి పెద్ద మనుషులను సంఘ సలహాదారులు నియమించుకుంటున్నాం. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఒక చోట అందిస్తూనే, ముఖ్యంగా రైతులు పండించిన ప్రతి పంటను ఎలా మార్కెటింగ్ చేయాలన్న దానిపైనే చర్చిస్తున్నాం. అదే మాదిరిగా వినియోగదారులకు సైతం తక్కువ ధరలో ఉత్పత్తులు అందేందుకు ప్రయత్నిస్తున్నాం. – పన్నాల తిరుపతి రెడ్డి, చైర్మన్(93915 28529), లక్ష్మీపూర్ రైతుల సహకార సంఘం, జగిత్యాల జిల్లా సంకల్ప బలమే సక్సెస్‌కు కారణం లక్ష్మీపూర్ సొసైటీ రైతు లోకానికి మార్గదర్శిగా మారింది. ఇక్కడి రైతులు రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తుండటంతో, చాలా గ్రామాల రైతులు సైతం లక్ష్మీపూర్ రైస్ మాదిరిగా ఆయా గ్రామాల పేర్లతో రైస్ విక్రయించడం జరుగుతుంది. ఇక్కడి రైతుల్లో సంకల్పం, పట్టుదల, విజయం సాధిస్తామన్న నమ్మకం మెండుగా ఉంది. అందువల్లే ప్రతి పనిలోనూ సక్సెస్ కాగలుగుతున్నారు. – అశోక్‌కుమార్ (85004 28578), జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారు, జగిత్యాల ∙‘లక్ష్మీపూర్ నువ్వుల’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్ శరత్ నువ్వులు విక్రయిస్తున్న సంఘ సభ్యులు – పన్నాల కమలాకర్, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
సహకార సమరం
సాక్షి, మెదక్: జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. సహకార సంఘాల సభ్యుల ఫొటో ఓటరు ముసాయిదా జాబితా సిద్ధం అవుతోంది. ఈ నెల 28న తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. జనవరి 15న సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా సహకార శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బ్యాలెట్ బాక్సుల సేకరణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని 20 మండలాల్లో 36 సహకార సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో రుణాలు తీసుకుని సభ్యులుగా చేరిన రైతులు 78 వేల మంది ఉన్నారు. వీరిలో ఓటు హక్కు కలిగిన సభ్యులు 52,600 మంది ఉన్నారు. ఎన్నికల నాటికి రుణం తీసుకున్న రైతులు ఏడాది పూర్తయితేనే వారికి ఓటు హక్కు లభిస్తుంది. ఈ ఏడాది పూర్తి కాని సభ్యుల సంఖ్య జిల్లాలో 20 వేలు. దీంతో వీరికి ఓటరు జాబితాలో చోటు దక్కడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి 20 వేల మందికి ఓటు హక్కు లభిస్తుంది. సహకార సంఘాల ముసాయిదా ఓటరు జాబితాలను పంచాయతీల్లో ప్రద్శిస్తున్నారు. అభ్యంతరాలు ఉంటే వాటిని ఈ నెల 23లోగా ప్రాథమిక సహకార సంఘాల్లో తెలపాల్సి ఉంటుంది. సవరించిన తుది ఫొటో ఓటరు జాబితాను ఈ నెల 28న ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర సహకార రిజిష్ట్రార్ శాఖ ఆదేశాల మేరకు పొరుగు జిల్లాలోని సహకార సంఘాల పరిధిలోకి వచ్చే మెదక్ జిల్లాలోని గ్రామాల విలీన ప్రక్రియను ప్రారంభించారు. మెదక్ జిల్లా రేగోడ్ మండంలోని ఐదు గ్రామాలు, అల్లాదుర్గం మండలంలోని పది గ్రామాలు సంగారెడ్డి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో విలీనం చేయనున్నారు. చేగుంట మండలంలోని నాలుగు గ్రామాలు సిద్దిపేట జిల్లాలో విలీనం కానున్నాయి. సిద్దిపేట జిల్లాలోని నర్సంపల్లి గ్రామం తూప్రాన్ సహకార సంఘంలో విలీనం కానుంది. 36 సంఘాలకు ఎన్నికలు జిల్లాలో మొత్తం 36 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం ఉన్నాయి. వీటి పదవీ కాలం ఈ ఏడాది జనవరితో ముగిసింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 36 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా సహకార ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైంది. 36 సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం 481 పోలింగ్ బూతులను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎన్నికల కోసం 529 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో సహకార సంఘం పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉంటారు. 13 మంది డైరెక్టర్లను బ్యాలెట్ పద్ధతిలో సంఘం పరిధిలోని ఓటర్లు ఎన్నుకుంటారు. డైరెక్టర్ల ఎన్నిక ముగిసిన అనంతరం అందులోనే ఒకరిని సంఘం చైర్మన్‌గా, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు అంతా కలిసి జిల్లా సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. సహకార సంఘాల ఓటరు జాబితాలు సిద్ధం అవుతుండటంతోపాటు జనవరిలో నోటిఫికేషన్ రానుంది. దీంతో గ్రామాల్లో సహకార సంఘాల ఎన్నికల వేడి మొదలైంది. పీఏసీఎస్ డైరెక్టర్లుగా, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంపై ఆశావహులు అప్పుడే దృష్టి సారించారు. సహకార సంఘంలోని ఓటరు జాబితా ఆధారంగా ఓటర్లను కలిసి ఇప్పటి నుంచే వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సైతం సహకార ఎన్నికలపై దృష్టి సారించాయి. పీఏసీఎస్ చైర్మన్‌తోపాటు జిల్లా సహకార సంఘం చైర్మన్ పదవి తమ పార్టీకి చెందిన వారికి దక్కేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. -
జోరుగా ప్యాక్స్ ఎన్నికల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వీటిని నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసిన వ్యవసాయశాఖ, ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి శుక్రవారం లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 906 సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణ నిమిత్తం 11,778 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆ లేఖలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 12,946 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని కోరారు. ఎన్నికల వ్యయాన్నిప్యాక్స్లే భరించాలి ఎన్నికల నిర్వహణ ఖర్చును ప్యాక్స్‌లే సమకూర్చుకోవాలని వ్యవసాయశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అందుకోసం రూ. లక్షను జిల్లా సహకార సొసైటీ ఎన్నికల ఖాతాలో జమ చేయాలని పార్థసారథి ఆదేశించారు. ఒకవేళ ప్యాక్స్లకు ఆస్థాయిలో ఆర్థికంగా భరించే స్థోమత లేకపోతే డీసీసీబీలు సమకూర్చాలని కోరారు. డీసీసీబీలకు కూడా స్థోమత లేకపోతే టెస్కాబ్ అడ్వాన్స్ ఇవ్వాలన్నారు. ఏఏ ప్యాక్స్లకు ఎన్నికల ఖర్చు భరించే స్థోమత లేదో అటువంటి వాటిని గుర్తించాలని కోరారు. -
ఉల్లి రైతుకు ఊరటనిచ్చే యంత్రం
ఉల్లి పాయలను పీకిన తర్వాత కాడను కొంత మేరకు కోసి పొలంలో 3–7 రోజులు ఎండబెడతారు. ఎండిన తర్వాత ఉల్లిపాయలపై గుప్పెడు ఎత్తున ఉండే పిలకను కత్తితో కోసి, గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పనిని సాధారణంగా మహిళా కూలీలతో చేయిస్తుంటారు. ఇది చాలా శ్రమతో, ఖర్చుతో కూడిన పని. ఈ సమస్య పరిష్కారానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ ఎ. కరోలిన్ రతినకుమారి ఒక యంత్రాన్ని రూపొందించారు. ఆనియన్ డి–టాప్పింగ్ మెషీన్లో ఎండిన ఉల్లిపాయలు వేస్తే.. ఉల్లిపాయల నుంచి పిలకలను కత్తిరించి, వీటిని వేర్వేరుగా బయటకు పంపుతుంది. 3 కె.డబ్లు్య., 3 ఫేజ్ విద్యుత్ మోటార్‌తో నడుస్తుంది. గంటకు టన్ను ఉల్లిపాయలపై పిలకలు కత్తిరిస్తుంది. దీని ధర రూ. 4 లక్షలు. ఉల్లిని ఎక్కువగా సాగు చేసే ప్రాంతాల్లో రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కొనుగోలు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. వివరాలకు.. డాక్టర్ ఎ. కరోలిన్ రతినకుమారి, ముఖ్య శాస్త్రవేత్త, ఐఐహెచ్ఆర్, బెంగళూరు. మొబైల్ – 94835 19724 carolin@iihr.res.in -
‘సహకార’ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే!
సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు అర్థమవుతోంది. వచ్చే నెల 3 నాటికి ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (డీసీఎంఎస్), రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)ల పాలకవర్గ పదవీకాలం ముగియనుంది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం వాటికి ఎన్నికలు నిర్వహించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నా ఎన్నికల నిర్వహణకు కనీసం 2 నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వాటి పదవీ కాలం ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని, నూతన పాలకవర్గం కొలువుదీరే పరిస్థితి లేదని సహకార శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రైతులకు పెట్టుబడి సాయం తర్వాత.. రాష్టంలో 906 ప్యాక్స్, 10 డీసీసీబీలు, 9 డీసీఎంఎస్‌లు, టెస్కాబ్‌లు ఉన్నాయి. ఈ సహకార సంఘాల ఎన్నికల్లో రైతులే ఓటర్లు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరం కాదనేది సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వ్యతిరేకత కనిపిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనేది భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత గ్రామాల్లో పరిస్థితిని మెరుగుపరిచి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పెట్టుబడి కింద ఎకరాలకు రూ.8 వేల ఇవ్వనుంది. ఈ పథకం కింద 1.42 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. దీన్ని అమలు చేశాక సంఘం ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని సర్కారు భావనగా కన్పిస్తోంది. పాలకవర్గ అధ్యక్షులే పర్సన్ ఇన్‌చార్జీలా సహకార సంఘాల పదవీకాలం ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించకపోతే వాటికి పర్సన్ ఇన్చార్జీలను నియమించాల్సి ఉంది. అందుకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా పర్సన్ ఇన్‌చార్జీలుగా అధికారులను నియమిస్తుంటారు. అధికారులను నియమిస్తే వ్యవస్థ మొత్తం ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది. కానీ రాజకీయ అవసరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పాలకవర్గ అధ్యక్షులను పర్సన్ ఇన్‌చార్జీలుగా కూడా నియమించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని సహకార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఇప్పుడు పాలవకర్గ అధ్యక్షులుగా ఉన్నవారు కొనసాగొచ్చు. 6 నెలల వరకే వారు కొనసాగుతారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. కాగా, 200 ఫిషరీస్ సొసైటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
సహకార సంఘాలకు ఆర్బీఐ ఝలక్
సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు స్వీకరించొద్దని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: సభ్యులు కాని వారి నుండి డిపాజిట్లను స్వీకరించొద్దని సహకార సంఘాలకు రిజర్వు బ్యాంకు హెచ్చరికలు జారీచేసింది. సహకార సంఘాల్లో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుంచి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని రిజర్వు బ్యాంకు రీజనల్ డైరెక్టర్ ఆర్.సుబ్రమణియన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సహకార సంస్థలకు బ్యాంకింగ్ వ్యాపారం చేయడానికి రిజర్వుబ్యాంకు బి.ఆర్. యాక్ట్‌ను అనుసరించి ఎటువంటి లైసెన్స్‌ను జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. అటువంటి అధికారం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు. ఇటువంటి సహకార సంఘాల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఎటువంటి బీమా కవరేజ్ లేదని ఆయన స్పష్టంచేశారు. ప్రజలు ఈ విషయాలను గమనించి సహకార సంఘాల్లో డిపాజిట్ల విషయంలో జాగ్రత్త వహించాలని సుబ్రమణియన్ తెలిపారు. రూ. వెయ్యి కోట్ల డిపాజిట్లు: అనేక సహకార సంఘాలు పొదుపు చేసుకొని తమ సభ్యులకు అప్పులుగా ఇస్తుంటాయి. కొన్ని పెద్ద సంఘాలు సభ్యుల నుంచే కాకుండా సభ్యులు కాని ఇతరుల నుంచి కూడా డిపాజిట్లు సేకరిస్తున్నాయి. అలా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించే అర్హత వాటికి లేదు. ఆర్బీఐ నుంచి వాటికి ఎటువంటి అనుమతి లేదు. రాష్ట్రంలో అలా అక్రమంగా కొన్ని సహకార సంఘాలు రూ. వెయ్యి కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు ప్రాథమిక అంచనా. సహకార శాఖ ఇటీవల తనిఖీలు నిర్వహించినప్పుడు 25 సొసైటీలు రూ. 200 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. కొన్ని పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సొసైటీలే అందులో కీలకంగా ఉన్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సహకారశాఖ ఉన్నతాధికారి శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక ‘సహకార’ మద్యం
-
ఇక ‘సహకార’ మద్యం
రాష్ట్ర సర్కారు నిర్ణయం.. ♦ వాటికి లెసైన్సు ఫీజు ఉండదు.. ♦ మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధింపు! ♦ పదివేల చదరపు అడుగులున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతి.. జీవోలో స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల్లోనూ మద్యం విక్రయాలకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే.. గ్రామాలు, మండల, పట్టణాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు మార్కెటింగ్ సహకార సంఘాల్లోనూ మద్యాన్ని విక్రయించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వం అధీనంలో నిర్వహించాలనుకున్న పదిశాతం మద్యం దుకాణాలను సహకార సంఘాల్లోను, ప్రభుత్వ కా ర్పొరేషన్లలోను ఏర్పాటు చేయడానికి కమిషనర్ అనుమతించేందుకు నూతన మద్యం విధానంలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ కార్పొరేషన్లు, సహకార సంఘాల్లో అనుమతించే మద్యం దుకాణాలకు లెసైన్సు ఫీజు ఉండదు. మద్యం విక్రయాల్లో ఇంత శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన విధిస్తారు. ♦ షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతించిన ప్రభుత్వం దీనిపై షరతులు విధించింది. పదివేల చదరపు అడుగుల నిర్మాణ ప్రాంతమున్న షాపింగ్‌మాల్స్‌లోనే మద్యం విక్రయాలకు అనుమతించనున్నట్లు జీవో 218లో స్పష్టం చేశారు. ఇటువంటి షాపింగ్‌మాల్స్‌లో ఆ ప్రాంతం ఆధారంగా మద్యం దుకాణాలకున్న లెసైన్సు ఫీజును వసూలు చేస్తారు. ♦ ఒక్కో మద్యం దుకాణానికి లాటరీద్వారా మూడు దరఖాస్తులను తీస్తారు. దరఖాస్తుదారు లేకున్నప్పటికీ జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నట్టు జీవోలో స్పష్టం చేశారు. లాటరీలో తొలుత వచ్చిన దరఖాస్తుదారునికి మద్యం దుకాణం కేటాయిస్తారు. అదేసమయంలో మరో రెండు దరఖాస్తులను కూడా లాటరీద్వారా తీస్తారు. తొలుత వచ్చిన దరఖాస్తుదారు దుకాణం ఏర్పాటునకు ముందుకు రానిపక్షంలో రెండో దరఖాస్తుదారునికి అవకాశమిస్తారు. రెండో దరఖాస్తుదారూ రానిపక్షంలో మూడో దరఖాస్తుదారునికి దుకాణం కేటాయిస్తారు. ♦ లాటరీద్వారా తీసిన దరఖాస్తుదారుల కాలపరిమితి 90 రోజులుగా నిర్ధారించారు. అది దాటితే ఆ దరఖాస్తులకు విలువుండదు. ♦ షాపింగ్‌మాల్స్, కోఆపరేటివ్ సొసైటీలు, ప్రభుత్వ కార్పొరేషన్లకు ఒకటికన్నా ఎక్కువ లెసైన్సులు మంజూరు అధికారం ఎక్సైజ్ కమిషనర్‌కు ఉంటుంది. గతంలో మద్యం దుకాణాల్లో విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేవి. ఇప్పుడు మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని గంట పెంచారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించారు. కొత్త విధానానికి మంచి స్పందన.. ఇదిలా ఉండగా నూతన మద్యం విధానానికి జిల్లాల్లో మంచి స్పందన ఉందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కొంతమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను రెండేళ్లకు బదులు ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఎందుకంటే గతంలో ఆదాయపుపన్ను రిటర్న్స్ దాఖలు చేయనివారు ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసి మద్యం దుకాణాలకోసం తీసుకుంటున్నారని, అందుకే ఏడాదికే పరిమితం చేయాలని కోరుతున్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రిక‘వర్రీ’
ఏలూరు (టూ టౌన్) : జిల్లాలోని సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల్లో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలోను, సంబంధిత మొత్తాలను వసూలు చేయడంలోను బ్యాంకుల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే సందర్భంలో బినామీ పేర్లతో తీసుకున్న రుణాలను ఎవరి నుంచి రికవరీ చేయూలో అర్థంకాక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 256 సహకార సంఘాల్లో ఈ తరహా కేసులకు సంబంధించి రూ.15 కోట్లు వసూలుకాకపోవడంతో ఆయూ సహకార సంఘాలు దివాళా దిశగా పయనిస్తున్నాయి. తాజాగా టి.నరసాపురం మండలం కె.జగ్గవరం సహకార సంఘ సిబ్బంది రైతుల పేరిట లక్షలాది రూపాయల్ని కాజేసిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కొద్ది నెలలుగా పలు సహకార సంఘాల్లో జరిగిన అక్రమాలపై అధికారులు 51, 52 విచారణలు జరిపించి నివేదికలు తెప్పించుకున్నారు. వీటి ఆధారంగా కొంతమంది సహకార సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సిబ్బందికి సహకార శాఖ నోటీసులు ఇచ్చింది. వాణిజ్య బ్యాంకుల్లోనూ బినామీ రుణాలు నిన్నమొన్నటి వరకూ బినామీ రుణాల జబ్బు సహకార సంఘాలకే పరిమితం కాగా, తాజాగా వాణిజ్య బ్యాంకులకూ సోకింది. ఒకే రైతు ఒకే మండలంలో రెండుచోట్ల రుణాలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఒకచోట ఆయిల్‌పామ్ పంట పేరుతో రుణం తీసుకోగా, మరోచోట చెరకు పంటకు రుణం తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఆంధ్రాబ్యాంకులో సైతం నకిలీ రుణాలు, బినామీ రుణాలు తీసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఆంధ్రాబ్యాంకులో నకిలీ పట్టాలు పెట్టి లక్షలాది రూపాయలు రుణాలు తీసుకున్న ఘటనలో ఒక వీఆర్వోతోపాటు 15 మంది రైతులపై పోలీస్ కేసులు నమోదు చేశారు. భీమడోలు, దూబచర్ల, తిరుమలంపాలెం, ద్వారకాతిరుమల బ్యాంకుల్లోనూ నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో సుమారు రూ.5 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఒక బ్యాంకులో ఓ వ్యక్తి బ్యాంక్ మేనేజర్‌ను మచ్చిక చేసుకుని తన పేర, తండ్రి పేర నకిలీ పాస్ పుస్తకాలలో సుమారు రూ.50 లక్షల మేర రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా ఒకే వ్యక్తి తమ బ్యాంకు పరిధికాని బ్యాంకుకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చే సినప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. వడ్డించేవాడు మన వాడైతే అన్న చందంగా కొంతమంది బ్యాంకు మేనేజర్ల సాయంతో కొందరు బినామీలు ఎడాపెడా రుణాలు తీసుకుని ఆనక బ్యాంకులకు మొహం చాటేస్తున్నారు. సామాన్యుడు రుణం కోసం వెళితే.. సవాలక్ష ఆంక్షలు పెట్టే బ్యాంకు అధికారులు బినామీలకు మాత్రం వెండిపళ్లెంలో వడ్డించిన చందంగా రుణాలు ఇస్తుండటం విశేషం. -
ఇదేమి మెలిక?
మోర్తాడ్: ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణం పై 30 శాతం రుణం హెచ్చింపు చేసి కొత్త రుణం ఇవ్వాలని ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను ఆదేశించింది. దీంతో రైతు కు ఉన్న రుణంపై 30 శాతం ఎక్కువ రుణం ఇవ్వాల్సి ఉంది. అంటే మాఫీ అయిన 25 శాతం సొమ్ముతోపాటు అదనం గా మంజూరు అయ్యే రుణం రైతుకు అందాలి. అయితే సింగిల్ విండోల అధికారులు గతంలో లేని నిబంధనలను ఇప్పుడు ఉన్నట్లు చూపుతూ రైతులకు మొండి చెయ్యి చూపుతున్నారు. రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పంట రుణాలకు టైటిల్ డీడ్‌ను కాని, పట్టాదారు పాసు పుస్తకాన్ని తనఖా ఉంచుకోకూడదు. అయిన్పటికీ టైటిల్ డీడ్లను తనఖా ఉంచాలని స ంఘాల ఉద్యోగులు పట్టుబడుతున్నారు. గతంలో ఏం జరిగింది? గతంలో సహకార సంఘాలలో రైతులు రుణాలు తీసుకున్నప్పుడు టైటిల్ డీడ్లను తనఖా ఉంచుకోలేదు. తక్కువ మొత్తంలోనే రుణం లభిస్తుండటంతో పహాణి అందించి, మరొక రైతు జామీనుతో రుణం పొందారు. రైతుకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా సహకార సంఘాలు రూ. 60 వేలకు మించి రుణం ఇవ్వలేదు. వాణిజ్య బ్యాంకులలో ఎకరానికి రూ. 50 వేల చొప్పున పంట రుణం ఇచ్చారు. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులు సహకార సంఘాల్లో పహాణిలను ఇచ్చి పంట రుణం తీసుకున్నారు. వాణిజ్య బ్యాంకులలో టైటిల్ డీడ్ తనఖా ఉంచి ఎక్కువ పంట రుణం తీసుకున్నారు. సహకార సంఘాలలో ఎంత రుణం ఉన్నా తమ భూమిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సింపుల్ మార్టిగేజ్ చేసి ఇచ్చారు. పంట రుణాలకు సంబంధించి సహకార సంఘాలు, బ్యాంకులు సిం పుల్ మార్టిగేజ్ చేసుకోవాలని టైటిల్ డీడ్ తనఖా పెట్టుకోరాదని రిజర్వు బ్యాంకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. బ్యాం కర్లు మాత్రం రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను కాదని టైటిల్ డీడ్ తనఖాకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల మంది రైతులకు రూ.320 కోట్ల రుణం మాఫీ లభించింది. సర్కారు తొలి విడతగా 25 శాతం నిధు లను విడుదల చేయడంతో సహకార సంఘాలకు రూ. 80 కోట్ల మాఫీ సొమ్ము జమ అయ్యింది. అక్కడ రైతులు ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చే సుకున్నారు. దీంతో రైతులకు మాఫీ సొమ్ము చేరాల్సి ఉంది. ఎక్కువ మంది రైతులు టైటిల్ డీడ్లను తనఖా ఉంచడం లేదనే కారణంతో మాఫీ సొమ్ము రైతుల చేతికి అందకుండా రుణంలోనే మినహాయిస్తున్నారు. గతంలో లేని నిబంధనలను ఇప్పుడు సాకుగా చూపుతూ కొత్త రుణాలను ఇవ్వక పోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నా సహకార సంఘాలలో తక్కువ పంట రుణం లభించడంతోనే తాము మళ్లీ వాణిజ్య బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులలో ఎంత రుణం ఉన్నా ఒక రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. లక్ష పంట రుణం మాత్రమే మాఫీ చేస్తుంది. సహకార సంఘాలు రుణాలను రెన్యూవల్ చేయకపోవడంతో చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా వ్యవసాయం ఉన్న రైతుకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న, సన్నకా రు రైతులకు మాత్రం కొత్త నిబంధనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సహకార సంఘాలలో సభ్యు లైన రైతులకు కొత్త రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.