ఏకగ్రీవాల జోరు: మంత్రి కృతజ్ఞతలు | Prashanth Reddy Thanks To Balkonda Farmers For Making Societies Unanimous | Sakshi
Sakshi News home page

బాల్కొండ నియోజకవర్గంలో ఏకగ్రీవాల రికార్డు

Published Tue, Feb 11 2020 9:21 AM | Last Updated on Tue, Feb 11 2020 9:30 AM

Prashanth Reddy Thanks To Balkonda Farmers For Making Societies Unanimous - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: సహకార సంఘాల ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్కొండ నియోజక వర్గంలో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని 20 సహకార సంఘాలకు గాను 19 సంఘాలు ఏకగ్రీవంగా నిలిచాయి. సహకార ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా ఈ సారి ఏకగ్రీవాల జోరు కొనసాగింది.

బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక సొసైటీలు ఏకగ్రీవం కావడంపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దమొత్తంలో ఏకగ్రీవాలు చేసింనందుకు వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏకగ్రీవాలను అందించిన జిల్లా రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా జిల్లాలోని 89 సహకార సంఘాలకుగాను 26 సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement