![TRS MLA Jeevan Reddy About Governor Tamilisai Soundararajan - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/21/JEEVAN-REDDY.jpg.webp?itok=-2qpXgMV)
నిజామాబాద్ సిటీ: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా కాకుండా బీజేపీ అనుబంధ విభాగం మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్లుగా ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీకి చెందినవారు దాడి చేస్తే సాటి మహిళగా స్పందించని గవర్నర్.. నేడు బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై నివేదికలు కోరడంతో ఆమె పనితీరు బయటపడిందని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ని రాజకీయ భవన్‌గా మార్చి తమిళిసై గవర్నర్ పదవికి మచ్చ తెస్తున్నారన్నారు. కవిత గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే 62 లక్షల టీఆర్‌ఎస్ సైన్యం ఎంపీని నిజామాబాద్ నుంచి కోరుట్ల వరకు ఉరికించి కొడతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment