మోతెలో మాట్లాడుతున్న వేముల ప్రశాంత్‌రెడ్డి
సాక్షి, భీమ్‌గల్: మండలంలోని జాగిర్యాల్ గ్రామానికి తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో నిధులు కేటాయించానని, మళ్లీ గెలిపిస్తే గ్రామస్తులు కోరిన విధంగా సాగునీరు అందించి తీరుతానని టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రశాంత్‌రెడ్డికి గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు.
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, పింఛన్లు తదితర అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ తనను ఆశీర్వదించాలన్నారు. డాక్టర్ మధుశేఖర్, ఎంపీపీ గోదావరి, జెడ్పీటీసీ లక్ష్మి, ఎంపీటీసీ గడాల లింగు, పసుల రాజమల్లు తదితరులున్నారు.
సాక్షి, వేల్పూర్: కేసీఆర్‌కు రైతులు, పేదలు రెండు కళ్లలాంటి వారని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మోతెలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాలు యాభై ఏళ్లలో రైతులకు, పేదలకు చేయని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారని చెప్పారు. విద్యుత్ సమస్య తీర్చినట్లుగానే, కాళేళ్వరం ప్రాజెక్టుతో శాశ్వతంగా సాగునీటి కొరత తీర్చబోతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఊపిరిపోసిన మోతె గ్రామాభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు మంజూరు చేసి పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పనులకు, టీఆర్‌ఎఎస్ చేసిన అభివృద్ధికి తేడాను ప్రజలు గమనించాలన్నారు.
మరోసారి ఆశీర్వదించి, గెలిపిస్తే మూడు రెట్ల అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రచారానికి వచ్చిన ప్రశాంత్‌రెడ్డికి గ్రామస్తులు బోనాలు, డప్పువాయిద్యాలు, వలగోడుగులతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు రజిత, జెడ్పీటీసీ వెల్మల విమల, వజ్రలత, మోహన్‌యాదవ్, దొల్ల రాజేశ్వర్‌రెడ్డి, పాలెపు బాల్‌రాజ్, సామ మహిపాల్, పోటూరి నర్సారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment