మోర్తాడ్: ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణం పై 30 శాతం రుణం హెచ్చింపు చేసి కొత్త రుణం ఇవ్వాలని ప్రభుత్వం సహకార సంఘాలు, బ్యాంకులను ఆదేశించింది. దీంతో రైతు కు ఉన్న రుణంపై 30 శాతం ఎక్కువ రుణం ఇవ్వాల్సి ఉంది. అంటే మాఫీ అయిన 25 శాతం సొమ్ముతోపాటు అదనం గా మంజూరు అయ్యే రుణం రైతుకు అందాలి.
అయితే సింగిల్ విండోల అధికారులు గతంలో లేని నిబంధనలను ఇప్పుడు ఉన్నట్లు చూపుతూ రైతులకు మొండి చెయ్యి చూపుతున్నారు. రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పంట రుణాలకు టైటిల్ డీడ్‌ను కాని, పట్టాదారు పాసు పుస్తకాన్ని తనఖా ఉంచుకోకూడదు. అయిన్పటికీ టైటిల్ డీడ్‌లను తనఖా ఉంచాలని స ంఘాల ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
గతంలో ఏం జరిగింది?
గతంలో సహకార సంఘాలలో రైతులు రుణాలు తీసుకున్నప్పుడు టైటిల్ డీడ్‌లను తనఖా ఉంచుకోలేదు. తక్కువ మొత్తంలోనే రుణం లభిస్తుండటంతో పహాణి అందించి, మరొక రైతు జామీనుతో రుణం పొందారు. రైతుకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా సహకార సంఘాలు రూ. 60 వేలకు మించి రుణం ఇవ్వలేదు.
వాణిజ్య బ్యాంకులలో ఎకరానికి రూ. 50 వేల చొప్పున పంట రుణం ఇచ్చారు. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులు సహకార సంఘాల్లో పహాణిలను ఇచ్చి పంట రుణం తీసుకున్నారు. వాణిజ్య బ్యాంకులలో టైటిల్ డీడ్ తనఖా ఉంచి ఎక్కువ పంట రుణం తీసుకున్నారు. సహకార సంఘాలలో ఎంత రుణం ఉన్నా తమ భూమిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సింపుల్ మార్టిగేజ్ చేసి ఇచ్చారు.
పంట రుణాలకు సంబంధించి సహకార సంఘాలు, బ్యాంకులు సిం పుల్ మార్టిగేజ్ చేసుకోవాలని టైటిల్ డీడ్ తనఖా పెట్టుకోరాదని రిజర్వు బ్యాంకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. బ్యాం కర్లు మాత్రం రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను కాదని టైటిల్ డీడ్ తనఖాకు మొగ్గుచూపుతున్నారు.
ఇప్పుడేం చేస్తున్నారు
జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల మంది రైతులకు రూ.320 కోట్ల రుణం మాఫీ లభించింది. సర్కారు తొలి విడతగా 25 శాతం నిధు లను విడుదల చేయడంతో సహకార సంఘాలకు రూ. 80 కోట్ల మాఫీ సొమ్ము జమ అయ్యింది. అక్కడ రైతులు ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించి రుణాలను రెన్యూవల్ చే సుకున్నారు.
దీంతో రైతులకు మాఫీ సొమ్ము చేరాల్సి ఉంది. ఎక్కువ మంది రైతులు టైటిల్ డీడ్‌లను తనఖా ఉంచడం లేదనే కారణంతో మాఫీ సొమ్ము రైతుల చేతికి అందకుండా రుణంలోనే మినహాయిస్తున్నారు. గతంలో లేని నిబంధనలను ఇప్పుడు సాకుగా చూపుతూ కొత్త రుణాలను ఇవ్వక పోవడంతో రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నా సహకార సంఘాలలో తక్కువ పంట రుణం లభించడంతోనే తాము మళ్లీ వాణిజ్య బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులలో ఎంత రుణం ఉన్నా ఒక రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. లక్ష పంట రుణం మాత్రమే మాఫీ చేస్తుంది. సహకార సంఘాలు రుణాలను రెన్యూవల్ చేయకపోవడంతో చిన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎక్కువగా వ్యవసాయం ఉన్న రైతుకు ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న, సన్నకా రు రైతులకు మాత్రం కొత్త నిబంధనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సహకార సంఘాలలో సభ్యు లైన రైతులకు కొత్త రుణాలు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదేమి మెలిక?
Published Sat, Nov 8 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement