న్యూఢిల్లీ: పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్ ఢిల్లీ ఛలో బుధవారం(మార్చ్ 6) ఉదయం మళ్లీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఢిల్లీలో కలుసుకోవడానికి రైతు సంఘాలు ప్లాన్ చేశాయి. అయితే తమ డిమాండ్లపై మార్చ్ 14న ఢిల్లీలో మహా పంచాయత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతుసంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు.
అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్‌ను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే టిక్రీ,సింగు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు.
VIDEO | Farmers' protest: Security remains tightened at Delhi's Ghazipur border.
— Press Trust of India (@PTI_News) March 6, 2024
Earlier this week, the farmers had called to march towards Delhi from March 6 to press the government to fulfill their demands.#FarmersProtest pic.twitter.com/qkperoHULm
ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్‌ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్‌ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి.
Comments
Please login to add a commentAdd a comment