MSP
-
Cabinet approves: వరికి మరో 117
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను 5.35 శాతం పెంచింది. అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ ధాన్యానికి మద్దతు ధర పెంచడం గమనార్హం. త్వరలో జరగనున్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెంచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎంఎస్పీని సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300కు, ‘ఎ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,320కు పెంచినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు చెప్పారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు అమలు చేసినట్లు పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి వ్యయాన్ని సీఏసీపీ శాస్త్రీయంగా మదింపు చేసిందన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు → మహారాష్ట్రలోని వధవాన్‌లో రూ.76,200 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టు అభివృద్ధి. ఈ ఓడరేవును ప్రపంచంలోని టాప్–10 ఓడరేవుల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ పోర్టులో 9 కంటైనర్ టెర్మినళ్లు ఉంటాయి. ఒక్కో టైర్మినల్ పొడవు వెయ్యి మీటర్లు. → రూ.2,869.65 కోట్లతో వారణాసిలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. ఆప్రాన్, రన్‌వేను మరింత విస్తరిస్తారు. → సముద్ర తీరంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు రూ.7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్). 500 మెగావాట్ల చొప్పున గుజరాత్లో ఒకటి, తమిళనాడులో ఒకటి పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు. → 2024–25 నుంచి 2028–29 దాకా రూ.2,254.43 కోట్లతో జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం(ఎన్ఎఫ్ఐఈఎస్) అమలు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి. నూతన క్యాంపస్‌లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) ఏర్పాటు. -
Rahul Gandhi: వీరి బాధలు ఎవరికీ పట్టట్లేవు
జైపూర్: తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు ఎంత మొత్తుకున్నా బాధలను మోదీ సర్కార్ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అనూప్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ తమ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ఉపాధి కల్పించాలని నిరుద్యోగ యువత విన్నపాలు చేస్తోంది. నిత్యా వసరాల ధరల నుంచి ఉపశ మనం కల్పించాలని మహి ళలు వేడుకుంటున్నా వీళ్ల గోడు ఎవరికీ పట్టదు’’ అని రాహుల్ అన్నారు. ‘‘ వెనుకబడిన వర్గా లు, దళితులు, గిరిజనులు, జనరల్ కేటగిరీలో ఉన్న పేదల అభ్యున్నతి కోసమే ఈ ఎన్నికలు. నిరుద్యోగమే దేశంలో అతిపెద్ద సమస్య. ద్రవ్యోల్బణం రెండో సమస్య. దేశంలో 90 శాతం మంది ఇవే చెబుతారు. కానీ ఒకవేళ కేంద్రంలో బీజేపీ చెప్పుచేతల్లో ఉన్న జాతీయమీడియాను ఫాలో అయితే మాత్రం మనకు అంబానీ కుమారుల పెళ్లివేడుకే దేశంలో అతిపెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తుంది. మోదీ ఓసారి సాగరగర్భంలోకి వెళ్తారు, మరోసారి గస్తీవిమానంలో చక్కర్లు కొడతారు, మరోసారి డప్పు వాయిస్తూ కనిపిస్తారు, ఇంకోసారి సభలో మొబైల్ ఫ్లాష్లైట్లు వెలిగించాలని పిలుపునిస్తూ కనిపిస్తారు. జాతీయ మీడియాలో 24 గంటలూ మోదీ ముఖమే దర్శనమిస్తుంది’’ అని ఎద్దేవాచేశారు. -
‘ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పిస్తాం’: రాహుల్ గాంధీ
ఢిల్లీ:లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల విషయంలో వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే యువత కోసం ‘యువ న్యాయ్’ పేరుతో హామీలు, ‘నారీ న్యాయ్’ పేరుతో మహిళలకు ఎన్నికల హామీలను ప్రకటించింది కాంగ్రెస్. తాజాగా బుధవారం రైతుల కోసం ‘కిసాన్ న్యాయ్’ పేరుతో ఐదు హామీలను ప్రకటించింది. ఇవే ఆ ఐదు హామీలు... స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పిస్తాం. రైతుల రుణాలను మాఫీ చేయడానికి, రుణమాఫీ మొత్తాన్ని నిర్ణయించడానికి శాశ్వత ‘వ్యవసాయ రుణ మాఫీ కమిషన్’ ఏర్పాటు చేస్తాం. బీమా పథకాన్ని మార్చడం ద్వారా పంట నష్టం జరిగితే 30 రోజులలోపు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం. రైతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త దిగుమతి, ఎగుమతి విధానాన్ని రూపొందిస్తాం. వ్యవసాయ వస్తువులను జీఎస్టీని తొలగించడం ద్వారా రైతులను జీఎస్టీ రహితంగా తీర్చిదిద్దుతాం. ‘దేశంలోని అన్నదాతలకు నా సెల్యూట్!. మీ సమస్యలను కూకటివేళ్లతో నిర్మూలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలను ఇస్తోంది. చెమటతో దేశంలోని నేలను పచ్చదనంతో నింపే రైతుల జీవితాలను ఆనందంగా మార్చడమే కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఈ ఐదు చారిత్రాత్మాక హామీల దిశగా అడుగులు వేస్తున్నాం’ అని రాహుల్ గాంధీ ఐదు హామీలను ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ప్రకటించారు. చదవండి: పేద మహిళలకు ఏటా రూ. లక్ష देश के सभी अन्नदाताओं को मेरा प्रणाम! कांग्रेस आपके लिए 5 ऐसी गारंटियां लेकर आई है जो आपकी सभी समस्याओं को जड़ से खत्म कर देंगी। 1. MSP को स्वामीनाथन आयोग के फार्मूले के तहत कानूनी दर्ज़ा देने की गारंटी। 2. किसानों के ऋण माफ़ करने और ऋण माफ़ी की राशि निर्धारित करने के लिए एक… pic.twitter.com/sfIUcdeW6t — Rahul Gandhi (@RahulGandhi) March 14, 2024 పంటలకు కనీస మద్దుతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించటంతో పాటు ఇతర డిమాండ్ల సాధనకు దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు ‘చలో ఢిల్లీ’ పేరుతోల నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రైతులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు డిమాండ్లకు పెద్దపీట వేస్తూ ఐదు హామీలను ప్రకటించటం గమనార్హం. చదవండి: రాహుల్ ‘యువ న్యాయ్’ -
Delhi Chalo: ఢిల్లీలో ‘మహా పంచాయత్’కు రైతుల పిలుపు
న్యూఢిల్లీ: పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్ ఢిల్లీ ఛలో బుధవారం(మార్చ్ 6) ఉదయం మళ్లీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఢిల్లీలో కలుసుకోవడానికి రైతు సంఘాలు ప్లాన్ చేశాయి. అయితే తమ డిమాండ్లపై మార్చ్ 14న ఢిల్లీలో మహా పంచాయత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతుసంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్‌ను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే టిక్రీ,సింగు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. VIDEO | Farmers' protest: Security remains tightened at Delhi's Ghazipur border. Earlier this week, the farmers had called to march towards Delhi from March 6 to press the government to fulfill their demands.#FarmersProtest pic.twitter.com/qkperoHULm — Press Trust of India (@PTI_News) March 6, 2024 ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్‌ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్‌ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి. ఇదీ చదవండి.. రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం -
కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి మళ్లీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వందలాది ట్రాక్టర్లు, జేసీబీలతో రాజధాని నగరంలోకి చొచ్చుకు వచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే రైతు నాయకులు కేంద్రానికి బుధవారం ఉదయం 11 గంటల దాకా సమయమిచ్చారు. ఈ లోపు ఏదో ఒకటి తేల్చకపోతే ఢిల్లీ ఛలో యథావిధిగా జరుగుతుందని తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. టిక్రీ, సింగు సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు. ఈ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించడమే కాక కాంక్రీట్ బారికేడ్లను అడ్డుగా ఉంచారు. రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తే నగరంలో ట్రాఫిక్ గ్రిడ్‌లాక్‌కు దారి తీస్తుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే ఘాజీపూర్ సరిహద్దును కూడా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. నోయిడా, గురుగ్రామ్‌లలోనూ ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్‌లో మార్చ్ చేసేందుకు రైతులు ఇప్పటికే డిసైడయ్యారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కీలకమైన పంజాబ్, హర్యానాల సరిహద్దు అయిన శంభు బోర్డర్లో భారీగా పోలీసులు మోహరించారు. హర్యానాలోని 7 జిల్లాలో బల్క్ ఎస్ఎమ్ఎస్లతో పాటు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది. ర్యాలీ చేసే రైతుల వద్ద ఉన్న జేసీబీ వంటి యంత్రాలను సీజ్ చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వం ఇప్పటికే కోరింది. కాగా, ఈ నెల 13న రైతులు మొదటిసారి ఢిల్లీ ఛలోకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కేంద్రం వారితో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫెయిల్ అవడంతో రైతు సంఘాలు మళ్లీ బుధవారం నుంచి ఛలో ఢిల్లీ ర్యాలీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు. బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలు.. ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పిలపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. #WATCH | Farmer leader Sarwan Singh Pandher says, "...We have told the govt that you can kill us but please don't oppress the farmers. We request the Prime Minister to come forward and put an end to this protest by announcing a law on the MSP guarantee for the farmers...The… pic.twitter.com/pwBEiPH9RX — ANI (@ANI) February 21, 2024 ఇదీ చదవండి.. మరాఠాల రిజర్వేషన్‌కు ఓకే -
కేంద్రం ఆఫర్.. ఇక రైతు సంఘాలదే నిర్ణయం
ఢిల్లీ, సాక్షి: పలు డిమాండ్ల సాధనకై ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్రం నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు(8, 12, 15 తేదీల్లో) రైతు సంఘాలతో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి 8:15 గం. నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తాయని మా బృందం ప్రతిపాదించింది. ఒప్పందం కుదిరాక ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి.. On meeting farmer leaders in connection with the ongoing protest, Union Minister Piyush Goyal says, "With new ideas and thoughts, we had a positive discussion with farmer leaders. We have together proposed a very innovative, out-of-the-box idea...The govt promoted cooperative… pic.twitter.com/KRRQR566gv — Gagandeep Singh (@Gagan4344) February 18, 2024 .. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండబోదు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తాం. మా ప్రతిపాదనలతో పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయి. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయి’’ అని మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ‘‘కేంద్రాన్ని.. పప్పు ధాన్యాలపై కనీస మద్ధతు ధర హామీ అడిగామ’’ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ మీడియాకు తెలిపారు. ఇక.. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. సోమ, మంగళవారాల్లో తమ రైతు సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన విధానాలు మానుకొని, లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా రైతుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ డిమాండ్ చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రం చర్చలు చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధతకు ఒక ఆర్డినెన్స్, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేంద్రం పరిష్కారం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. డిమాండ్లు నెరవేర్చే వరకు రైతులు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. 21న నల్ల జెండాలతో ఘెరావ్ గతంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ నెల 21న బీజేపీతో సహా అధికార ఎన్డీయే పక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపాలని రైతులకు సూచించింది. మరోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు 24 గంటల ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు రైతుల ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈనెల 19 వరకు పొడిగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లో పటియాలా, సంగ్రూర్, ఫతేగఢ్ సాహిబ్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవల రద్దును 24 వరకు పొడిగించారు. -
పంటలకు మద్దతు ధర అరకొరేనా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ పంటలకు మద్దతు ధరలు ఆశాజనకంగా లేవని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ పంటల సాగు ఖ ర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయా లని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని అంటున్నాయి. కేంద్రం విదిల్చే లెక్క ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతు లు పండించే పంటలకు కేంద్రం బుధవారం ప్రకటించిన కొత్త మద్దతు ధరలు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటున్నాయి. సీఏసీపీకి ఇచ్చిన నివేదికల ప్రకారం..: రాష్ట్రంలో రైతులు పంటల సాగుకు పెడుతున్న పెట్టుబడి ఖర్చులపై రాష్ట్ర వ్యవ సాయశాఖ భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)కి నివేదించింది. సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ. 3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొ న్నకు రూ. 2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతే డాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వా మినాధన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాల ని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరా రు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయి తే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. అయితే కేంద్రం పత్తికి మద్ద తు ధర కేవలం రూ. 7,020 మాత్రమే ఖరారు చేసింది. స్వామినాధన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. కానీ క్షేత్రసాయి లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
‘అల్లం’ రైతుల్లో ఆనందం.. ఐదు రెట్లు పెరిగిన ధర..
సాక్షి, సంగారెడ్డి: గత ఏడాదితో పోలిస్తే అల్లం ధర ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో రైతులు ఏటా అల్లం పంటను సంప్రదాయక పంటగా సాగుచేస్తూ వస్తున్నారు. ఐదేళ్లుగా క్వింటాలు అల్లం ధర రూ.2 వేల నుంచి రూ.2,500 మాత్రమే పలుకుతూ వచి్చంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో రూ.8 వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో పంటను సాగు చేస్తున్న రైతులు ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లుగా మార్కెట్లో అల్లం పంటకు సరైన ధర లేక పోవడంతో దేశవ్యాప్తంగా సాగువిస్తీర్ణం భారీగా పడిపోయింది. అంతే కాకుండా గత ఏడాది అధికంగా వర్షాలు పడటంతో సాగులో ఉన్న పంట సగానికి పైగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో పంటను కాపాడుకున్న రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. అనేక మంది రైతులు గత ఏడాది క్రితమే ధర లేని కారణంగా అల్లం సాగుకు స్వస్తి చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,500 ఎకరాల్లో పంట సాగులో ఉన్నట్టు అంచనా. ఇందులో జహీరాబాద్ ప్రాంతంలోనే 90 శాతం సాగవుతోందని రైతులు చెపుతున్నారు. ఈ ఏడాది మళ్లీ పంట సాగుపై ఆసక్తి ప్రస్తుతం అల్లం పంటకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఈ ఏడాది అల్లం పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మే నెల నుంచి జూన్ చివరి వరకు రైతులు అల్లం పంటను సాగు చేస్తారు. ఎకరం పంట సాగుకు సుమారు 1.50 లక్షల మేర పెట్టుబడి వ్యయం అవుతుంది. మార్కెట్లో ధర ఉంటేనే గిట్టుబాటవుతుంది. లేకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాగా, అల్లం పంట సాగుకు కేరళ రాష్ట్రం ప్రతీతి. ఈ ఏడాది అక్కడ కూడా భారీగానే పంట సాగుకు రైతులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ ఏడాది 3 వేల ఎకరాలకు పైగా పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు చెపుతున్నారు. పంట ఉన్న రైతులకు లబ్ధి అల్లం పంట ఉన్న రైతులకు మంచి ధర వస్తోంది. దీంతో లబ్ధి పొందుతున్నారు. గతంలో ధర లేక రైతులు నష్టపోయిన సందర్భాలున్నాయి. పంట సాగు తక్కువగా ఉన్నందున రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తోంది. క్వింటాల్ ధర రూ.8 వేలు పలుకుతోంది. ఈ ఏడాది పంట సాగు పెరిగే అవకాశం ఉంది. –అనూష, ఉద్యానవన అధికారి, జహీరాబాద్ బాగా గిట్టుబాటు అయింది ఎకరం పొలంలో గత ఏడాది అల్లం పంట సాగు చేసుకున్నా. ఇటీవల పంటను తీసి విక్రయించా. 60 క్వింటాళ్ల మేర పంట దిగుబడి వచి్చంది. పంట సాగు కోసం సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టాను. క్వింటాలు అల్లం రూ.9 వేల ధరకు అమ్మాను. మంచి ధర రావడంతో బాగా గిట్టుబాటు అయింది. – నర్సింహారెడ్డి, రైతు–చిరాగ్పల్లి ఇంకా ధర పెరుగుతుందనే ఆశతో ఉన్న అల్లం పంట తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. దీంతో మరింత ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేప థ్యంలో పంటను ఇంకా భూమిలోనే నిల్వ పెట్టాను. ప్రస్తుతం 4ఎక రాల్లో పంట ఉంది. ఈ ఏడాది మరో 6 ఎకరాల్లో సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. క్వింటాలు ధర రూ.10 వేలకు పైగా పలికే అవకాశం ఉంది. –వెంకట్‌రెడ్డి, రైతు, హోతి (కె) చదవండి: ‘బాక్స్ సాగు’ భలేభలే..! -
ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు
సాక్షి, అమరావతి: గతంలో విత్తుకునే సమయంలో ఉండే ధర పంటలు కోతకోసే నాటికి ఉండేది కాదు. దీంతో కాస్త మంచిరేటు వచ్చేవరకు మార్కెట్ గోదాముల్లో నిల్వచేసుకుని, ‘రైతుబంధు’ పథకం కింద రుణాలు తీసుకుని సాగుకోసం పెట్టిన అప్పులను తీర్చుకునేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పండే ప్రధాన వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంలో ఎన్నడూలేని రీతిలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు మించి మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. కల్లాల నుంచి నేరుగా కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ఫలితంగా తాము పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు గోదాముల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. రుణాలు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా ఈనాడు కట్టుకథలను అచ్చేస్తూ నిత్యం అభాసుపాలవుతోంది. ఏటా బడ్జెట్ కేటాయింపులు.. కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులకు మంచి ధర లభించేంత వరకు వారికి అండగా నిలిచేందుకు ఉద్దేశించిందే రైతుబంధు పథకం. మార్కెట్ గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు అందించే రుణంపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత 181వ రోజు నుంచి 270 రోజుల వరకు 12శాతం చొప్పున వడ్డీ వసూలుచేస్తారు. ఈ పథకానికి 2019–20లో రూ.70 కోట్లు, 2020–21లో రూ.70 కోట్లు, 2021–22లో రూ.80 కోట్లు కేటాయించగా, గడిచిన 2022–23లో ఏకంగా రూ.90 కోట్లు కేటాయించింది. 2019–20లో ఈ పథకం కింద తమ పంట ఉత్పత్తులను నిల్వచేసుకోవడం ద్వారా 1,826 మంది రూ.17.23 కోట్ల రుణాలు పొందగా, 2020–21లో 517 మంది రూ.71లక్షలరుణాలు పొందారు. ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు సీఎం యాప్ ద్వారా గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఎమ్మెస్పీకి మించి ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుంటూ ధరలు పెరిగేలా చేస్తోంది. సాధారణ, గ్రేడ్–ఏ రకం ధా న్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఫలితంగా ఇతర పంట ఉత్పత్తులకు కూడా మంచి రేటు పలుకుతోంది. కోతల దశలోనే ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతుండడంతో మంచి ధర కోసం పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వచేసుకోవడం, రైతుబంధు పథకం కింద రుణాలు పొందాలన్న ఆసక్తి రైతుల్లో కనిపించడంలేదు. కళ్లెదుట వాస్తవాలిలా ఉంటే.. రైతుబంధు పథకాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసినట్లు, పంట నిల్వచేసుకునే రైతులకు రుణాలివ్వడానికి ప్రభుత్వం ముఖం చాటేసినట్లుగా ఈనాడు విషప్రచారం చేస్తుండడంపట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధుకు ఏటా కేటాయింపులు మార్కెట్లో మించి ధరలు లభిస్తుండడంవల్లే గోదాముల్లో దాచుకునేందుకు రైతులు ముందుకు రావడంలేదు.అలాగే రైతులెవ్వరూ రైతుబంధు పథకం కింద రుణం పొందేందుకు ముందుకు రావడం లేదు. దీనిని రద్దు చేయడంగానీ, ఏటా నిధుల కేటాయింపులు ఆపడంగానీ చేయలేదు. రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రాహుల్ పాండే, కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ -
మద్దతు ధరపై నాలుగు సబ్ గ్రూపులు
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ నాలుగు సబ్ గ్రూపులను ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన కమిటీ తొలి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీరో బడ్జెట్ ఆధారిత సాగు, దేశావసరాలకు అనుగుణంగా పంట విధానాల మార్పు, మద్దతు ధరను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చడం వంటి పలు అంశాలపై చర్చ జరిగినట్టు కమిటీ సభ్యుడు బినోద్ ఆనంద్ మీడియాకు తెలిపారు. ‘‘హిమాలయ రాష్ట్రాల్లో పంటల తీరుతెన్నులపై ఒక సబ్ గ్రూపు, సూక్ష్మ సాగును రెండోది, జీరో బేస్డ్ సాగును మూడోది, దేశవ్యాప్తంగా పంటల తీరుతెన్నులు, పంటల వైవిధ్యాన్ని నాలుగో సబ్ గ్రూపు అధ్యయనం చేసి నివేదికలు అందజేస్తాయి’’ అని వివరించారు. ముందుగా ప్రకటించినట్టుగానే సంయుక్త కిసాన్ మోర్చా ఈ భేటీకి దూరంగా ఉంది. ఇదీ చదవండి: రైతుల ‘మహాపంచాయత్’ -
ఎంఎస్పీ కమిటీ తొలి భేటీకి 40 రైతు సంఘాలు దూరం
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ ఆగస్టు 22న తొలిసారి సమావేశం కానుంది. అయితే, ఈ తొలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మంగళవారం ప్రకటించింది. కమిటీని తామిప్పటికే తిరస్కరించామని గుర్తు చేసింది. త్వరలో భావిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఎస్కేఎం నేత హనుమాన్ మొల్లా తెలిపారు. మరోవైపు ఎస్కేఎం నేతలను కనీస మద్దతు ధర కమిటీ భేటీకి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 26 మందితో ఎంఎస్పీ కమిటీని జూలై 18న కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్ షాక్.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా! -
‘ఎంఎస్పీ’ కమిటీపై రగడ.. కేంద్రం ఏమందంటే?
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కమిటీని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల కూటములైన భారతీయ కిసాయన్ యూనియన్ (బీకేయూ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించాయి. రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్థించిన కుహానా రైతు నేతలకు, కార్పొరేట్ శక్తుల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధి లేమిని బయట పెట్టుకుందంటూ ధ్వజమెత్తాయి. ఆ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకే కమిటీ వేశారని ఆరోపించాయి. ఇదో బోగస్ కమిటీ అని ఎస్కేఎం సభ్యుడు దర్శన్ పాల్ ఆరోపించారు. మద్దతు ధరకే పరిమితం కావాల్సిన కమిటీ పరిధిని సహజ సాగుకు ప్రోత్సాహం, పంట వైవిధ్యం వంటి పలు అంశాలకు విస్తరించడం వెనక ఉద్దేశం ఇదేనని రైతు నేతలు అంటున్నారు. పలు అంశాలను చేర్చడం ద్వారా మద్దతు ధర అంశం ప్రాధాన్యతను తగ్గించారని హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్‌సింగ్ దుయ్యబట్టారు. రైతులు, నేతల అభ్యంతరాలన్నింటినీ ప్యానల్లో చర్చిస్తామని కమిటీ సభ్యుడైన హరియాణాకు చెందిన రైతు నేత గునీ ప్రకాశ్ చెప్పారు. మరోవైపు, చట్టపరమైన హామీ కల్పించేందుకు కమిటీ వేస్తామని సంయుక్త కిసాన్ మోర్చాకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్‌సభకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఎంఎస్పీని మరింత పారదర్శకంగా ప్రభావశీలంగా మార్చడం, సహజ సాగును ప్రోత్సహించడం తదితరాల కోసం కమిటీ వేస్తామని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకే రైతు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలతో కమిటీ వేశామన్నారు. ఇదీ చదవండి: PM Kisan: అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..! -
‘వరి’ కొనేలా ఆదేశించాలని హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి రైతుల నుంచి వరిని కొనుగోలు చేసేలా ఆదేశించాలంటూ నగరానికి చెందిన న్యాయవిద్యార్థి బొమ్మగాని శ్రీకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శ్రీకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. లక్షలాది టన్నుల వరిని రైతులు పండించినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని, వరి కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు పడి కొందరు రైతు లు చనిపోయారని తెలిపారు. వేలాది టన్నుల వరిని రోడ్లపై పోస్తున్నారని, అప్పులు భరించలేక మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరిని కొంటామని ముందు హామీ ఇచ్చినా రాజకీయ కారణాలతో ప్రభుత్వం తన హామీని వెనక్కు తీసుకుందని వివరించారు. ఎంఎస్పీ చెల్లించి రైతుల నుంచి వరిని కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల విభాగం ముఖ్య కార్యదర్శులతోపాటు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
మా సిఫార్సులు రైతు అనుకూలం!
న్యూఢిల్లీ: రైతు చట్టాలపై అధ్యయనానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక వందశాతం రైతులకు అనుకూలమని కమిటీలో కీలక సభ్యుడొకరు వెల్లడించారు. సుప్రీంకోర్టు త్వరలో ఈ విషయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా విచారించాలని కోరారు. కమిటీ నివేదిక బహిర్గతం చేయడం వల్ల తలెత్తే అవకాశమున్న చట్టపరమైన సమస్యలను సుప్రీం, కేంద్రం పరిగణించి కొంత సమయం తీసుకోవచ్చని, అయితే పూర్తిగా నివేదికను బుట్టదాఖలా చేయడం కుదరదని, అలా చేయకూడదని కమిటీ సభ్యుడు అనీల్ జే ఘనావత్ అభిప్రాయపడ్డారు. అందరూ ఆందోళనచెందుతున్నట్లు కొత్త చట్టాలతో ఎంఎస్పీ(కనీస మద్దతు ధర) రద్దు కాదని, కొత్త చట్టంలో అసలు ఎంఎస్పీ అంశమే లేదని చెప్పారు. నివేదికను ప్రజల్లో ఉంచాలని సెపె్టంబర్1న ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగని ప్రభుత్వం తెచి్చన మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న వాదనకు కమిటీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. అయితే చట్టాల్లో పలు లోపాలున్నట్లు తమ కమిటీ పరిశీలనలో తేలిందని వివరించారు. వీటిని పరిష్కరించాల్సిఉందని సూచించారు. అందువల్ల సుప్రీంకోర్టు వెంటనే నివేదికను బహిర్గతం చేయాలని కోరినట్లు తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాల అధ్యయనానికి 2021 జనవరిలో ఒక కమిటీని రూపొందించింది. ఇందులో షెట్కారీ సంఘటన నాయకుడైన ఘనావత్ ఒక సభ్యుడు. ఈయనతో పాటు సీఏసీపీ మాజీ చైర్మన్ అశోక్ గులాటి, ఐఎఫ్‌పీఆర్‌ఐకి చెందిన ప్రమోద్ కుమార్ కమిటీలో ఉన్నారు. -
‘ఎమ్ఎస్పీ తొలగిస్తే రాజీకీయాల నుంచి తప్పుకుంటా’
చండీఘడ్: పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్ఎస్పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాక్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్ ఆదివారం మాట్లాడారు. ‘రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుంది. దానిని ఎవరైనా తొలగించాలని చూస్తే మనోహర్‌లాల్ ఖట్టర్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. ఎమ్ఎస్పీ ఎప్పటికీ రద్దు కాదు. ఎమ్ఎస్పీ గతంలో ఉంది. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. కాగా ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు ఆదివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. చదవండి: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: అమిత్ షా చదవండి: ఈ నెల 25న రైతులతో ప్రధాని మోదీ భేటీ శనివారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసిన మరునాడు ఖట్టర్ ఈ ప్రకటన చేశారు. ‘చర్చల వల్లనే ఈ సమస్య (అన్నదాతల ఆందోళనలు ) పరిష్కారం అవుతుంది. త్వరలోనే ఈ సమస్య సమిసిపోతుందని భావిస్తున్నా. నూతన చట్టాలపై రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’ అని కేంద్రమంత్రితో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య మరో రౌండ్ చర్చలు జరపవచ్చని ఖట్టర్ పేర్కొన్నారు, కొత్త మూడు వ్యవసాయ చట్టాలపై తమ భయాలను మరింత వివరంగా చెప్పాలని నిరసన తెలుపుతున్న వ్యవసాయ సంఘాలను తోమర్ కోరారు. నిర్దిష్ట సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది అవసరమని, వారి ఆందోళనలో స్పష్టత లేదన్నారు. అదే విధంగా చర్చలకు ఓ తేదీని పేర్కొనాలని మంత్రి రైతులను కోరారు. చదవండి: ‘అలా జరగకపోతే రాజీనామా చేస్తా’ మరోవైపు ఒకట్రెండు రోజుల్లో రైతుల నిరసన బృందాలతో తోమర్ చర్చలు జరిపే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. "ఎప్పుడు జరుగుతుందో సరిగా తెలియదు కాని త్వరలోనే నిరసనకారుల డిమాండ్లను చర్చించడానికి తోమర్ రైతుల ప్రతినిధులను కలుసుకునే అవకాశం ఉంది" అని షా ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని విలేకరుల సమావేశంలో అన్నారు. -
‘అలా జరగకపోతే రాజీనామా చేస్తా’
చండీఘడ్: మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)ను కల్పించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హెచ్చరించారు. శుక్రవారం చండీఘడ్‌లో జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పటికే ఎమ్ఎస్పీని కల్పించమని కేంద్రానికి లేఖ రాశారు. నేను డిప్యూటీ సీఎంగా ఉన్నంత కాలం రైతులకు ఎంఎస్పీ ఉండేలా కృషి చేస్తాను. ఒకవేళ అలా జరగకుంటే రాజీనామా చేస్తాను’’అని చెప్పారు. ఎంఎస్పీ, ఇతర డిమాండ్లపై రైతులకు లిఖితపూర్వక హామీలు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చినందున అన్నదాతలు తమ ఆందోళనను విరమించుకుంటారని దుష్యంత్ చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపే రైతులు కేంద్రం రాతపూర్వక హామీ ఇస్తున్నప్పుడు, అది “వారి పోరాటానికి విజయం” అని చౌతాలా అన్నారు. చదవండి: (నడ్డాపై దాడి: బెంగాల్ డీజీపీ, సీఎస్‌లకు సమన్లు) అయితే, ఎంఎస్పి, మండి వ్యవస్థపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిరసనను కొనసాగించారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు, కొంతమంది హర్యానా రైతుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న దుష్యంత్ చౌతాలా, కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) వ్యవస్థకు ముప్పు ఉంటే తాను రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. ఏదేమైనా, రైతు సంఘాలు, ముఖ్యంగా పంజాబ్ మరియు హర్యానాలో, కొత్త చట్టాలు ఎంఎస్పీ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: (రైతన్నలూ.. చర్చలకు రండి) -
రైతుల ఆర్థిక స్థితి మారుతుంది: మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు ఈ బిల్లులు వ్యతిరేకం కాదని, తమకు నచ్చిన ధరకు రైతులు ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చని తెలిపారు. అదే విధంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు ఆదివారం రాజ్యసభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులు రాష్ట్రపతి సంతకంతో త్వరలోనే చట్టరూపం దాల్చనున్నాయి. (చదవండి: సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడుతూ.. ‘‘నిన్న రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాయి. రైతులకు నా శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ రూపురేఖలను మార్చే ఇలాంటి బిల్లుల అవసరం ఎంతగానో ఉంది. రైతులు, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసమే మా ప్రభుత్వం వీటిని తీసుకువచ్చింది. ఈ బిల్లులు రైతులు సాధికారికత సాధించేలా తోడ్పడతాయి. రైతులు తమకు నచ్చిన చోట, నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాయి. (చదవండి: రైతుల పాలిట రక్షణ కవచాలు) వీటి ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. మరో ముఖ్యవిషయాన్ని నేను స్పష్టం చేయదలచుకున్నాను. మండీలు(వ్యవసాయ మార్కెట్లు)కు ఇవి ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. నిజానికి మా ప్రభుత్వమే దేశ వ్యాప్తంగా మండీల ఆధునికీకరణ చేపట్టి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటోంది. కనీస మద్దతు ధర విధానం కూడా కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు. కాగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్-2020, ఫార్మర్స్(ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్, ఫార్మ్ సర్వీసెస్ బిల్-2020పై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
రైతన్నలకు మరో 3 వరాలు!
సాక్షి, అమరావతి : అన్నదాతలకు మరో మూడు వరాలను ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పండించే పలు పంటలకు గిట్టుబాటు ధరలు, శాశ్వత కొనుగోలు కేంద్రాలతోపాటు కేంద్రం కొనుగోలు చేయగా మిగిలిన పంటను రైతుల నుంచి కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు మార్కెటింగ్‌శాఖ ఈమేరకు చర్యలను తీసుకుంటోంది. వీటికి సంబంధించి నూతన ఏడాదిలో ప్రకటన చేసే అవకాశం ఉంది. మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్లకు ‘మద్దతు’ కేంద్రం మద్దతు ధర ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్ల (కొర్రలు, అండుకొర్రలు, సామలు)కు మద్దతు ధర ఇచ్చి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పంటల సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా వరి, గోధుమలు, అపరాలు, పత్తి, కంది పంటలకు మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే రాష్ట్రంలో పండించే పలు పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధిక దిగుబడి వచ్చిన సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్ మిల్లెట్లకు మద్దతు ధర ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌శాఖల అధికారులతో చర్చలు జరిపిన మార్కెటింగ్, సహకారశాఖల ప్రత్యేక కార్యదర్శి మధుసూధనరెడ్డి దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు. శాశ్వత కొనుగోలు కేంద్రాలు ఇకపై సీజన్లవారీగా కాకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు శాశ్వత కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరిమిత కాలంలో ఏర్పాటవుతున్న కొనుగోలు కేంద్రాల వల్ల రైతులు పూర్తిగా పంటను అమ్ముకోలేకపోతుండటంతో శాశ్వత కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్ సబ్ యార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో పంటల ధరలు తగ్గినప్పుడు రైతులు తమ పంటలను ఎప్పుడైనా శాశ్వత కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయించే అవకాశం లభిస్తుంది. మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో పౌరసరఫరాలశాఖ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీలుగా పంటలను కొనుగోలు చేయనున్నాయి. మిగతాది రాష్ట్రమే కొంటుంది ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటల దిగుబడిలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొనగా మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిపై జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
రైతు నెత్తిన బకాయిల భారం
సాక్షి, పాలకొండ (శ్రీకాకుళం): కూలీల కొరత, పెరగిన పెట్టుబడులు, ప్రకృతి సహకరించక పోవడం, దిగుబడులు లేకపోవడం..అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక లభించకపోవడం తదితర కారణాలతో రైతులు వ్యవసాయం చేయడం అంటేనే భయపడున్నారు. ఈ ఏడాది రైతులకు కష్టాలు మరింత రెంటిపు స్థాయిలో వెంటాడాయి. దీంతో పెట్టుబడులు కూడా తిరిగి రాక వలసలు పోతున్నారు. కాస్త పండిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సేకరించకపోవడంతో రైతులు దీన స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి నీటి తీరువా వసూలు కోసం రైతులపై వత్తిని నెలకొంది. ఎన్నికల్లో లబ్ధి కోసం గత ఐదేళ్లుగా నీటితీరువాపై నామమాత్రంగా స్పందించిన ప్రభుత్వం ఎన్నికల అనంతరం నీటితీరువా వసూలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రైతుల నుంచి పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకూ ఈ ఏడాది నీటితీరువా 447.12కోట్లు వరకూ ఉంది. ఈ మొత్తం రైతుల నుంచి వసూళ్లు చేసేందుకు అధికారులు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. నీటి తీరువా బకాయిలు ఉన్న రైతులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ నిలిపివేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పని ఉన్నా ముందుగా నీటితీరువా కట్టాలని నిబంధనలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు అందించకుండా నీటితీరువా? నిబంధనల ప్రకారం సంవత్సరంలో కాలువల ద్వారా 150 రోజులు రైతులకు నీరు అందిస్తేనే నీటి తీరువా వసూలు చేయాలి. 150 రోజుల నీరు అందిస్తే కేటగిరీ ఏ కింద ఎకరానికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంది. 100 రోజులు పైబడి నీరు అందిస్తే కేటగిరి 2 కింద ఎకరానికి రూ.100 చొప్పున చెల్లించాలి. కాని పాలకొండ డివిజన్లో ఇంతవరకూ మేజర్, మైనర్ ఇరిగేషన్ల ద్వారా 90 రోజుల కూడా నీరు అందించలేదని రైతులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం నీరు అందించకుండా నీటితీరువా మాత్రం బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జీవో ఏం చెబుతుంది? రైతుల నుంచి భూమి శిస్తు వసూలు విధానంపై 1996లో జీవో విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి భూమి శిస్తును రద్దు చేసి 11/88 జీవోను తీసుకువచ్చారు. ఈ జీవో ప్రకారం రైతులు వాడుకున్న నీటిని ఆధారంగా తీరువా వసూలు చేయాలని నిబంధన తీసుకువచ్చారు. దీని ప్రకారం 150 రోజులు నీరు అందించకపోతే తీరువా వసూలు చేయడానికి అవకాశం లేదు. ఈ నిబంధన ప్రకారం అయితే నీటితీరువా చెల్లించాల్సిన అవసరం లేదని రైతు సంఘాలు వాధిస్తున్నాయి. నియోజకవర్గంలో మండలాల వారిగా నీటి తీరువా బకాయిలు మండలం బకాయిలు పాలకొండ 148.86 కోట్లు వీరఘట్టం 289.06 కోట్లు సీతంపేట 001.16 లక్షలు భామిని 008.04 లక్షలు మొత్తం 447.12 కోట్లు రైతులపై వత్తిడి తగదు నీటి తీరువా కోసం రైతులపై వత్తిడి తగదు. నీరు అందించక పోయినా తీరువా చెల్లిస్తున్నాం. అయినా అధికారులు పాత బకాయిలు కూడా చెల్లిం చాలని వత్తిడి తెస్తున్నారు. రైతులకు అçప్పులే మిగిలాయి. అధికారులు ఆచోలించాలి. – లోలుగు విశ్వేశ్వరరావు, రైతు సంఘం నాయకుడు, అంపిలి 90 రోజులు కూడ నీరు అందించడంలేదు అధికారులు తోటపల్లి కాలువల ద్వారా ప్రతి ఏటా కనీసం 90 రోజులు కూడా నీరు అందించడంలేదు. జనవరి నుంచి నవంబర్ నెల ఆఖరకు నీరు అందించిన రోజులు లెక్కించాల్సి ఉంది. అధికారులు మాత్రం రెండు సంవత్సరాలు అందించిన రోజులను లెక్కిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. – కండాపు ప్రసాదరావు, రైతు, రుద్రిపేట ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నీటి తీరువా వసూలు చేయడం వాస్తవం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్ఓలకు ఆదేశాలు జారి చేశాం. పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలు చేయడంపై లక్ష్యాలు విధించాం. అదేశాల ప్రకారమనే అధికారులు పనిచేస్తున్నారు. – ఎల్ రఘుబాబు, ఆర్డీవో, పాలకొండ -
సేద్యానికి ‘చంద్ర’గ్రహణం
పరిహారంపై సన్నగిల్లుతున్న ఆశలు గత ఏడాది డిసెంబర్లో కేంద్ర కరువు బృందం పర్యటించి జిల్లా కరువు తీవ్రతను గుర్తించింది. జిల్లాలో 6.77 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 6.95 లక్షల మంది రైతులకు రూ.937.40 కోట్లు పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. మొత్తమ్మీద గత ఏడాది పంట పెట్టుబడులు, దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే జిల్లా రైతులకు రూ.3,600 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం రూ.937 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ఇంకా ఆమోదం తెలపకపోవడంతో పరిహారంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రబీదీ అదే దుస్థితి ఖరీఫ్ 2018 కల్లోలం కాగా కనీసం ఆదుకుంటుందనుకున్న రబీ కూడా దారుణంగా దెబ్బతీసింది. 77 వేల హెక్టార్లలో చేపట్టిన పప్పుశనగ సాగులో ఎక్కడా ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడులు రాలేదు. రూ.600 కోట్లకు పైగా రైతులు భారీగా నష్టపోయారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 155.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 50 మి.మీ నమోదైంది. 67 శాతం లోటు వర్షపాతంతో రబీ ప్రధానపంట పప్పుశనగతో పాటు మరికొన్ని పంటలు దాదాపు 2 లక్షల ఎకరాల్లో దారుణంగా దెబ్బతిన్నాయి. గత రబీలో జిల్లా రైతులకు రూ.700 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రబీలో కూడా 32 మండలాలను కరువు జాబితాలోకి ప్రకటించి చంద్రబాబు సర్కారు చేతులుదులుపుకుంది. రూ.100 కోట్లు పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదించినా... పరిహారం ఇచ్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం ఉలుకుపలుకూ లేదు. రుణమాఫీ పరిస్థితి ఇలా... 2014 నాటికి జిల్లాలో రైతు రుణాలు రూ.6,817కోట్లు కమిటీలు, కొర్రీల కింద పక్కన పెట్టిన రుణాలు రూ.4,073కోట్లు చివరకు పంట,బంగారు రుణాల మాఫీకి అర్హత రూ.2,744కోట్లు ఒకేసారి మాఫీ అయిన మొత్తం రూ.650కోట్లు మొదటి విడతగా మాఫీ అయిన మొత్తం రూ.418కోట్లు రెండో విడతగా మాఫీ అయిన మొత్తం రూ.461కోట్లు మూడో విడత మాఫీ రూ.502కోట్లు ఇప్పటిదాకా జమ అయిన మాఫీ సొమ్ము రూ.1,906కోట్లు రెండు,మూడు విడతల్లో పెండింగ్ రూ.33కోట్లు గిట్టుబాటూ ఎండమావే జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్పీ కన్నా మార్కెట్లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్ లాంటి ప్రభుత్వరంగ నోడల్ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్పీ కన్నా మార్కెట్లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్ లాంటి ప్రభుత్వరంగ నోడల్ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. పై చిత్రంలోని రైతు పేరు ప్రభాకర్‌రెడ్డి. పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు రెండు ఎకరాలలో బెండ పంట సాగు చేశాడు. బోరు బావిలో అరకొర వస్తున్న నీటితో పంటను కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్న ఫలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పని చేయకుండా పోయింది. ఈ విషయాన్ని తోటి రైతులతో కలసి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారి నుంచి స్పందన లేదు. ఈక్రమంలో నీరందక పంట ఎండిపోతోంది. చేతి కొచ్చిన పంటను ఎండిపోకుండా ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 చెల్లించి నీటిని తోలుతున్నాడు. తన కష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట ఎండిపోతే తీవ్రంగా నష్టపోతానని, ఇలా ఎన్ని రోజులు ట్యాంకర్‌తో నీళ్లు తోలుకోవాలో దిక్కు తెలియడం లేదని ఆందోళన చెందుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఈ రైతు ఒక్కడిదే కాదు పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసిన రైతులందరిదీ. – ధర్మవరం రూరల్ ఈ ఫొటోలోని రైతు పేరు నాగేంద్రప్ప, వలస గ్రామం, అమరాపురం మండలం. ఈయన పేరిట 4–50 ఎకరాల పొలం ఉంది. పంటలు సాగు చేయడానికి స్థానిక సిండికేట్ బ్యాంకులో 2013లో రూ. 1.2 లక్షల రుణం తీసుకున్నాడు. ఏటా సకాలంలో రుణం రెన్యూవల్ చేయించుకుని వడ్డీ రాయితీ పొందేవాడు. అయితే 2014 ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని, రైతులు రుణాలు కట్టొద్దని చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకులు చెప్పడంతో ఈ రైతు కూడా రుణానికి సంబంధించి వడ్డీ కూడా చెల్లించలేదు. తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోయింది. బ్యాంకులో అప్పు మాత్రమే అలాగే ఉంది. – అమరాపురం పొలంలోనే వదిలేశా.. రూ.లక్ష పెట్టుబడి పెట్టి గత ఖరీప్‌లో వర్షాధారం కింద 8 ఎకరాల్లో వేరుశనగ సాగుచేశా. కానీ పంట సాగుచేసిన తర్వాత రెండు నెలలైనా వాన జాడ లేకపోవడంతో పంటంతా నిట్టనిలువునా ఎండిపోయింది. ఒక్క వర్షం పడినా పెట్టుబడులు వచ్చి, పశువుల మేత అయినా దక్కుతుందనుకున్నా. కాని చివరి వరకు వర్షం రాకపోవడంతో పంటను పొలంలోనే వదిలేశా. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటుందనుకుంటే అసలు పట్టించుకోవడం లేదు. – తలారి నరసింహులు, వేరుశనగ రైతు, కనగానపల్లి బీమా పరిహారం నిల్ ఫసల్ బీమా కింద 11 వేల మంది పప్పుశనగ రైతులు 2017 రబీలో రూ.2 కోట్లు ప్రీమియం చెల్లించారు. వర్షాభావంతో పంట చేతికి అందకుండా పోయింది. ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందలేదు. 2018 ఖరీఫ్‌లో 5.40 లక్షల మంది వేరుశనగ రైతులు రూ.82 కోట్లు ప్రీమియం కట్టారు. ఈ పరిహారం ఇంకా ప్రకటించలేదు. అదే ఏడాది రబీలో కూడా 1.05 లక్షల మంది పప్పుశనగ రైతులు రూ.5 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినా పరిహారం అతీగతి లేకుండా పోయింది. అంతకు మునుపు కూడా 2014, 2015, 2016లో వేరుశనగ ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. జిల్లా రైతులు ఏటా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు వరకు బీమా ప్రీమియం చెల్లించనా... పరిహారం మాత్రం కంటితుడుపుగా విడుదల చేశారు. ప్రభుత్వంతో పాటు బీమా కంపెనీలు కూడా దగా చేయడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రైతు విలవిల అధికారిక లెక్కల ప్రకారం గత 25 ఏళ్ల జిల్లా వ్యవసాయ చరిత్ర తిరగేస్తే.. కేవలం నాలుగు సంవత్సరాల్లో మాత్రమే వేరుశనగ పంట అంతో ఇంతో చేతికొచ్చింది. మిగిలిన 20 సంవత్సరాలు పెట్టుబడులు కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. సగటున ఎకరాకు 10 బస్తాలు లేదా హెక్టారుకు వెయ్యి కిలోల వరకు దిగుబడులు వస్తే పంట బాగా వచ్చినట్లు లెక్క. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1995 నుంచి 2018 వరకు వేరుశనగ పంట దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే అందులో 1995, 1998, 2000, 2006లో మాత్రమే పంట పండింది. ఆ తర్వాత 1996, 2004, 2017లో పెట్టుబడులు దక్కించుకున్నారు. ఇక మిగిలిన 18 ఏళ్లు సర్వం కోల్పోయారు. శతాబ్దాల చరిత్ర పునరావృతం జిల్లా గత 140 సంవత్సరాల వర్షపాతం చరిత్ర తీసుకుంటే ఈ ఏడాదే అతి తక్కువ వర్షం కురిసింది. జిల్లా సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా గత జూన్ నుంచి ఇప్పటివరకు కేవలం 274 మి.మీ వర్షం కురిసింది. అంటే సా«ధారణం కన్నా 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు రెండూ ఈ సారి మొహం చాటేయడంతో వర్షం జాడ కరువైపోయింది. ఈ శతాబ్ధిలో నమోదైనంతగా లోటు వర్షపాతం గతంలో ఎన్నడూ లేదు. ఈ‘సారీ’ దారుణం గత ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. కీలకమైన ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 261 మి.మీ వర్షం కురిసింది. అంటే కురవాల్సిన దాని కన్నా 37 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో 7 లక్షల హెక్టార్లలో సాగు చేసిన ప్రధాన, ప్రత్యామ్నాయ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే 2018 ఆగస్టులో తొలి విడతలో 44 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత రెండో విడతగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మిగిలిన 19 మండలాలను కూడా కరువు జాబితాలోకి చేర్చింది. పడకేసిన ప్రత్యామ్నాయం చంద్రబాబు హయాంలో వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయమైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటల మనుగడ కూడా పడకేసింది. సబ్సిడీ, రాయితీలు, పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో రైతులను సీఎం చంద్రబాబు దగా చేస్తూ వచ్చారు. కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయనియ్యకుండా అంతో ఇంతో తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమ అయ్యేలా చేశారు. ఈ ఐదేళ్లలో ఉద్యానశాఖ ద్వారా రూ.50 కోట్లు వెనక్కి మళ్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యానహబ్ అంటూ ఊరించినా దాని ఊసే లేకుండా చేశారు. పండిన పండ్ల ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక చాలా సార్లు టమాట పంట రోడ్డున పడేస్తున్న దుస్థితి నెలకొంది. చీనీ, దానిమ్మ, అరటి, మామిడి, కర్భూజా, కళింగర, దోస, బొప్పాయి, మిరప లాంటి పంట ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధరలు లభించక నష్టాలపాలవుతున్నారు. పశుశాఖకు కేటాయించిన బడ్జెట్ ఐదేళ్లలో రూ.60 కోట్లు కాగా, ఇందులో పాడి రైతులకు ఉపయోగపడే ఒక్క పథకమూ అమలు చేయలేదు. చంద్రబాబు ప్రైవేట్ డైయిరీను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ డెయిరీ నిర్వీర్యమైపోయింది. పదేళ్ల కిందటనే రోజుకు 60 నుంచి 70 వేల లీటర్లు పాలు సేకరిస్తున్న ప్రభుత్వ డెయిరీలో ఇపుడు రోజుకు 6 వేల లీటర్లు కూడా రావడం లేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 1.81 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటల మనుగడకు విఘాతం ఏర్పడింది. అలాగే ఏటా రూ.800 కోట్లు టర్నోవర్ కలిగిన పట్టుపరిశ్రమను నమ్ముకున్న రైతులూ రూ.200 కోట్లకు పైగా నష్టాలు మూటగట్టుకున్నారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు తిరిగి ఎన్నికలు వచ్చినా పూర్తిగా మాఫీ చేయలేదు. గత మూడు విడతల రుణమాఫీ మొత్తం గత అప్పు¯నకు చెల్లించాల్సిన వడ్డీకే సరిపోయింది. ఇక 4, 5 విడతల రుణమాఫీ మొత్తం బ్యాంకు ఖాతాకు ఇప్పటికీ జమ కాలేదు. తిరిగి ఎన్నికలు వచ్చాయి. అయినా ఇప్పటికీ మాఫీ చేసింది లేదు. హామీ నెరవేర్చలేని చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. – బాలునాయక్, తిప్పేపల్లి, ఓడీచెరువు నయాపైసా మాఫీ కాలేదు నాకు మా గ్రామ సమీపంలో 4 ఎకరాల పొలం ఉంది. సిండికేట్ బ్యాంకులో రూ.1.5 లక్షల అప్పు ఉంది. సీఎం చంద్రబాబునాయడు 2014 ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తానని గొప్పగా ప్రకటించారు. అయినా నాకు ఇంత వరకూ నయాపైసా కూడా మాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం ప్రచారం చేయడమే తప్ప రైతులను ఆదుకోవడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదు. – శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి, లేపాక్షి మం -
ఆర్థిక వ్యవస్థను బాగుచేస్తాం
న్యూఢిల్లీ: నోట్లరద్దు, అస్తవ్యస్తంగా జీఎస్టీని అమలు చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు బీజేపీ ప్రభుత్వం కలిగించిన నష్టాన్ని తాము న్యాయ్ (కనీస ఆదాయ భద్రత పథకం) ద్వారా పూడుస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. 17వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న తరుణంలో పీటీఐకి రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాము ప్రకటించిన న్యాయ్ పథకానికి రెండు లక్ష్యాలు ఉన్నాయనీ, వాటిలో ఒకటి నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందివ్వడం కాగా, రెండోది ప్రధాని మోదీ ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను బాగుచేయడమని రాహుల్ చెప్పారు. కనీస ఆదాయ భద్రత పథకానికి తాము న్యాయ్ (న్యూన్‌తమ్ ఆయ్ యోజన) అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందనీ, గత ఐదేళ్లలో మోదీ ప్రజలకు అన్యాయం చేయగా, మేం న్యాయం చేస్తామని చెప్పడానికే ఆ పేరు పెట్టామని తెలిపారు. ప్రజాకర్షక పథకం కాదిది న్యాయ్ పథకం ప్రజలను కాంగ్రెస్ వైపునకు ఆకర్షించేందుకు తీసుకొచ్చింది కాదనీ, పేదరికంపై చివరి అస్త్రమని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ అమలు విధానం నిర్ణయాల్లా ఇది అస్తవ్యస్తంగా ఉండదనీ, ఒక పద్ధతి ప్రకారం ప్రయోగాత్మకంగా అమలు చేసి, అప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించిన అనంతరం దేశం మొత్తం అమలు చేస్తామని తెలిపారు. మూడేళ్లదాకా అనుమతులు అక్కర్లేదు కొత్తగా ప్రారంభమైన వ్యాపార సంస్థలు తొలి మూడేళ్ల కాలంలో ఏ రకమైన అనుమతినీ ప్రభుత్వం నుంచి పొందాల్సిన అవసరం లేకుండా చేస్తామని రాహుల్ హామీనిచ్చారు. స్టార్టప్ కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులపై విధిస్తున్న ఏంజెల్ ట్యాక్స్‌ను కూడా రద్దు చేస్తామన్నారు. వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థలు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాయనేదాని ఆధారంగా వారికి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఉంటాయని రాహుల్ తెలిపారు. వచ్చే వారంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. -
అన్నదాతకు ‘పీఎం ఆశ’
న్యూఢిల్లీ: 2019 ఎన్నికలకు ముందు రైతులకు లబ్ధి చేకూర్చే మరో పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. 2022 వరకు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేసే కార్యక్రమంలో భాగంగా.. రైతులకు మద్దతు ధర భరోసా కల్పించే రూ.15,053 కోట్ల విలువైన సేకరణ విధానాన్ని కేంద్రం ప్రకటించింది. దీంతోపాటుగా ధాన్యాల కొనుగోలు విషయంలో రైతులకు లాభం జరిగేలా సేకరణ జరగాలని, ఇందుకోసం అవసరమైతే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ (ఆదాయం) సంరక్షణ్ అభియాన్’ (పీఎం ఆశ)కు ఆమోదం లభించింది. ‘2018 బడ్జెట్లో ప్రకటించినట్లుగా రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర పొందేలా చూడటమే ఈ ‘పీఎం ఆశ’ విధానం లక్ష్యం. ఇదో చారిత్రక నిర్ణయం’ అని కేబినెట్ భేటీ వివరాలను వెల్లడిస్తూ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. ‘పీఎం ఆశ’ విధానంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు.. ఎమ్మెస్పీ (కనీస మద్దతు ధర) కన్నా తగ్గినపుడు ధాన్యాన్ని సేకరించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వాలు మూడు పథకాల్లో (ప్రస్తుత మద్దతు ధర – పీఎస్ఎస్, కొత్తగా రూపొందించిన ధరల కొరత చెల్లింపుల పథకం – పీడీపీఎస్, ధాన్య సేకరణ ప్రైవేటు వ్యాపారుల పథకం పైలట్ – పీపీఎస్ఎస్) ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. సేకరణ క్రెడిట్ లైన్ పెంపు పీఎం ఆశ పథకాన్ని అమలుచేసేందుకు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు రూ.15,053 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. సేకరణ సంస్థలకు ఇచ్చే క్రెడిట్ లైన్‌కు ప్రభుత్వ హామీని రూ. 16,550 కోట్లు పెంచింది. దీంతో ఈ క్రెడిట్ లైన్ మొత్తం రూ.45,550కి చేరింది. ఈ కొత్త విధానం ప్రకారం.. రాష్ట్రాలకు ప్రస్తుత మద్దతుధర పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం కేంద్ర ఏజెన్సీలు.. వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు తగ్గినపుడు కూడా ఎమ్మెస్పీని రైతులకు చెల్లించే అవకాశం ఉం టుంది. దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ అమలుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు ► దేశవ్యాప్తంగా 13,675 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ.12,134.5 కోట్ల విడుదలకు పచ్చజెండా ఊపింది. 2021–22 కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ► దేశవ్యాప్తంగా మరో 4 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఎన్ఐడీ చట్టం– 2014కు సవరణలను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుం ది. అమరావతి (ఏపీ), భోపాల్ (మధ్య ప్రదేశ్), జోర్హాట్ (అస్సాం), కురుక్షేత్ర (హరియాణా)ల్లో ఏర్పాటుచేయనున్న ఎన్‌ఐడీలకు జాతీ య ప్రాముఖ్య సంస్థల హోదా కల్పిస్తారు. ఇథనాల్ ధర 25% పెంపు దేశవ్యాప్తంగా పెట్రో మంట రాజుకున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరను 25% పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించే యత్నాల్లో భాగంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లీటర్ ఇథనాల్ ధర రూ.47.13 ఉండగా.. దీన్ని రూ.59.13కి పెంచనున్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా చక్కెర రైతులకు లబ్ధి జరగనుంది. ఇథనాల్ ధరను పెంచడం ద్వారా చక్కెర మిల్లులకు లాభం పెరిగి.. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు వీలవుతుంది. చక్కెర మిల్లుల ద్వారా రైతులకు రూ.13వేల కోట్ల బకాయిలున్నాయి. ఇందులో 40% యూపీలోనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో 4–5% ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలు పుతుండగా.. వచ్చే నాలుగైదేళ్లలో దీన్ని 10%కు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. -
‘మద్దతు ధర’ అసలు మతలబు!
ప్రపంచ మార్కెట్‌కు భారతదేశ ఎగుమతులు ఎక్కకుండా నిరోధిస్తూ భారత దిగుమతులపై సుంకాలు విపరీతంగా పెంచడానికి అమెరికా నిర్ణయించింది. మన వ్యవసాయ రంగాన్ని సరళీకరించడం పేరుతో ప్రపంచ బ్యాంక్, అమెరికా ప్రోత్సాహంతో విదేశీ సరుకు దిగుమతుల కోసమే భారత మార్కెట్లలోని కొన్ని విభాగాల్ని ధారాదత్తం చేసుకున్నాం. విదేశీ దిగుమతులపైన మనం విధించాల్సిన సుంకాలను తొలగించుకుంటున్నాం. బ్రిటిష్‌వారి పరిపాలనలో మాదిరిగా సంప్రదాయ పరిశ్రమల్ని నాశనం చేస్తున్న కారణంగా కోట్లాదిమంది దేశ ప్రజలు ఉపాధి కోల్పోయే దుస్థితిలో పడుతున్నారని గుర్తించాలి. ‘‘రైతాంగం పండించే వరి, పత్తి వగైరా పంటలకు ప్రభుత్వం క్వింటాల్‌కు కనీస ధరను రూ.200 పెంచాలని నిర్ణయించింది. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం. పంటలు పండించడానికి రైతు భరించే ఖర్చు కన్నా అదనంగా 50 శాతం ధరను రైతుకు ముట్టజెప్పబోతున్నట్టు లెక్క. అంటే, పంటకయ్యే విత్తనాల కొనుగోలుపైన, సేద్యపు నీటి వాడకంపైన రైతు కుటుంబం ప్రత్యేకించి కూలి చెల్లించాల్సిన పని లేదు. కాబట్టి, ఈ కనీస ధరను 50 శాతం పెంచాం.’’ – ప్రధాని మోదీ ప్రకటన (4–7–18) ‘‘రైతాంగం వ్యవసాయ ఖర్చులు, పంట ధరలను బేరీజు వేసుకునే అన్ని రకాల వ్యయాన్ని సమగ్రంగా అంచనా వేశాకే జాతీయ స్థాయి సాధికార కమిషన్ రైతులు పండించే పంటలకు హెచ్చు మద్దతు ధరను నిర్ణయించింది. ఎందుకంటే, దేశ రైతాంగ ప్రజల ఆర్థిక సమస్యలను గుర్తించబట్టే కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. నేడు ప్రభుత్వం పెంచిన పంట కనీస ధర మొత్తంమీద చూస్తే (రూ. 200) పైకి ఎక్కువగానే కనిపిస్తుంది కానీ, పెరిగిన సాగు ఖర్చుల దృష్ట్యా వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక కమిషన్ (2006) సిఫారసు చేసిన ప్రతిపాదనల కన్నా తక్కువ అని గమనించాలి.’’ – దేశంలో వ్యవసాయ సంక్షోభం నివారణకు ఏర్ప డిన జాతీయ స్థాయి సాధికార కమిషన్ అధ్యక్షుడు ఎం.ఎస్. స్వామినాథన్ (4–7–18) గత నాలుగున్నరేళ్ల బీజేపీ ఏలుబడిలో రైతుల బాధలు ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తొచ్చాయి. కొన్ని పంటలకు కనీస మద్దతు ధరను గుర్తించడాన్ని ఆయన చారిత్రక నిర్ణయంగా ప్రకటించుకున్నారు. బీజేపీ సర్కారు పెంచిన తాజా కనీస ధర లోతు పాతులు పరిశీలిస్తే ఆ నిర్ణయంలోని డొల్లతనం బట్ట బయలవుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రభుత్వం కనీస ధర పెంచుతూ చేసిన ప్రకటన వెలువడిన మూడు రోజులకే 36 దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) తాజా నివేదిక వెలు వడింది. ఈ నివేదిక భారత దేశంలో వ్యవసాయ సంబంధిత విధానాలను సమీక్షిస్తూ, ‘‘ఇండియాలో రైతులు ప్రధాన వ్యవసాయ సబ్సిడీల వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాని, నరేంద్ర మోదీ అధికా రంలోకి వచ్చాక 2014 నుంచి 2016 దాకా అనుసరిం చిన విధానాల నిర్ణయాల మూలంగా రైతులకు అందిన ఆదాయాలు ఏటా సగటున ఆరు శాతం చొప్పున తరిగిపోతూ వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు దక్కాల్సిన శ్రమ ఫలితంలో ఆ పంటను అనుభవించే వినియోగదా రుల నుంచి 25 శాతం తక్కువ ఆదాయం లభి స్తోంది!’’ అని పేర్కొంది. అందుకనే వరి పంట కనీస ధరను క్వింటాల్‌కు రూ.1550 నుంచి రూ.2000కు అంటే అదనంగా రూ.450 పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలు పండించడానికి అవసరమైన ఎరువుల (యూరియా, ఫాస్ఫేట్ వగైరా) ధరలు, ఇంకా సాగుకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, యంత్రాల ధరలూ బాగా పెరిగిపోయాయి. వీటిని సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలపై నియంత్రణ లేదు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి సకాలంలో సంతలకు తరలించే సరైన ప్రొక్యూర్మెంట్ విధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ధాన్యం సేకరణకు అవసరమైన గిడ్డంగుల సౌకర్యం కొరవడింది. ఇంకా, ఈ విషయంలో కీలకమైన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను 1991లో ప్రపంచ బ్యాంకు అమల్లోకి తెచ్చిన సంస్కరణలు బలహీనపరిచాయి. ఫలితంగా ప్రైవేటు గుత్త వ్యాపార సంస్థల ప్రవేశంతో రైతుల కష్టాల పెరిగాయి. రైతులను, వ్యవసాయ రంగాన్ని ముట్టడించిన ఇన్ని అనర్థాలకు మౌలిక పరిష్కారాలు వెతకడం లేదు. ఈ పనిచేయకుండా మోదీ ప్రకటిం చిన ‘కనీస మద్దతు ధర’ ఎన్నికల కోసం నడిపే తంతుగా లేదా మోసంగా మిగిలిపోతుందే తప్ప ‘చారిత్రక నిర్ణయం’గా నిలదొక్కుకోలేదు. మాట తప్పిన మోదీ సర్కారు! ధాన్యాలకు కనీస ధరను మొత్తం ఖర్చులకు అద నంగా 50 శాతం ధర చేర్చి ఇస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. కానీ, నాలుగేళ్ల నుంచీ ‘మాట తప్పిన మోదీ’ గానే ప్రధాని మిగిలిపోయారు. మాటలు నేర్వకపోతే పూటలు గడవవన్న సామెతకు విలువ లేకుండా పోవాలంటే మాట ప్రకారం 2014 నుంచే కనీస మద్దతు ధరను అమలు చేయాల్సింది. అదే చేసి ఉంటే ఈ సరికే రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం దేశ రైతాంగానికి కలిగేదని నిపుణుల అంచనా! ఈ చారిత్రక మోసం లేదా వైఫల్యం వల్ల నష్టపోయినవారు రైతులు, వ్యవసాయ కార్మికులేనని గమనించాలి. పెంచుతామన్న ప్రకటిత కనీస ధర హామీ అమల్లోకి రానందున 2014–17 మధ్య కాలంలో ప్రతి ఏడాదికి రైతాంగానికి దక్కిన కనీస మద్దతు ధర పెరుగుదల కేవలం 3.6 శాతం మాత్రమేగానీ, దక్కాల్సిన సగటు ధర 13 శాతమని పరపతి అంచనా (క్రెడిట్ రేటింగ్) సంస్థ ప్రకటిం చింది. 2009–13 మధ్య నాలుగేళ్లలో కనీస మద్దతు ధర 19.3 శాతం పెరిగింది. ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ధరలు పెరుగుతూ రైతుల రుణభారాన్ని కూడా పెంచేశాయి. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పాలకులు రైతులు, వ్యవసాయ కార్మికులను సాగు నుంచి క్రమంగా సాగ నంపడానికి వారు పట్టణాలు, నగరాలకు వలస పోయే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఈ దుస్థితికి పరిణామాలు దారితీయక ముందే పాలకులు రైతులకు చెల్లించే మద్దతు ధరకు తోడుగా ఆహార భద్రతా చట్టాన్ని, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కూడా స్వామినాథన్ పట్టుబడుతున్నారు. అమెరికా మార్కెట్లోకి వచ్చే సరకులపై సుంకాలు పెంచాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తాజాగా చైనా, భారత్‌లను ముమ్మ రించే మరో బెడద. 20 ప్రధాన పంటలను ప్రభుత్వం గానీ, సహకార రంగ సంస్థలుగాని కాపాడేలా ధాన్యం సేకరణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ తన 70వ నివేదికలో ప్రతిపాదించింది. 9 కోట్ల 20 లక్షల రైతు కుటుంబాల రుణభారం రూ.4 లక్షల 23 వేల కోట్లు. ఇందులో రుణదాతలు, వర్తకులు, ఉద్యోగులు, భూస్వాములు, దుకాణదారులు వడ్డీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ. 1 లక్షా 23 వేల కోట్లు. ఈ పెట్టుబడిదారీ మార్కెట్ ‘దందా’ వ్యవస్థలో వరికి, గోధుమ పంట లకు వర్తక వ్యాపారులు తమ లావాదేవీల్లో రైతులకు చెల్లింపజూచే వెల తక్కువగా ఉంటుంది. ఈ కారణం గానే ప్రభుత్వం అనుసరించే ప్రొక్యూర్మెంట్ (ధాన్య సేకరణ) ధరను కనీస మద్దతు ధరగా పేర్కొంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత నుంచి క్రమంగా అమెరికా సలహాలపైన, ప్రపంచబ్యాంకు సంస్కరణల ప్రభావం వల్ల తప్పుకుంటూ వచ్చిందో అప్పటి నుంచే రైతుల పరిస్థితి అనాథల స్థితికి వచ్చింది. కాగా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ పరిధిలోకి రానివి దేశంలో విస్తారంగా, భారీ స్థాయిలో పండించే బంగాళా దుంపలు (ఆలుగడ్డలు), ఉల్లి, వేరుశెనగ పంటలు. ఇందుకు కారణం– ఈ పంటలను ధాన్యా దుల మాదిరిగా నిల్వ ఉంచడం సాధ్యం కాదు. కానీ నిలవ ఉండగలిగే కంది, పెసర పంటలతో పోల్చితే తేడా స్పష్టం అని నిపుణుల అంచనా.పెరుగుతున్న పండ్లు, కూరగాయల సాగు! అలా బేరసారాలతో రైతులు బలహీనులు కావడం వల్ల, ప్రభుత్వం బాధ్యత నుంచి పక్కకు తప్పుకో వటం వల్ల కూడా గత పదేళ్లకు పైగా ధాన్యాదులు పండే భూముల్ని పండ్లు, కాయగూరల పంటలకు భారీగా మళ్లించడమూ జరిగిందని వ్యవసాయ పరి శోధకులు అభిప్రాయపడుతున్నారు. రైతు ‘వ్యధాభ రిత కథా చిత్రం’ అంతటితో ముగియలేదు. తీరా దొంగ బేరాలు చేయలేక పంట పొలాల్ని పండ్లు, కాయగూరలకు మళ్లించినా వాటికీ సరైన ధరలు లేక మార్కెట్లకు ఎక్కడం లేదని బీజేపీ పాలకులు చెబు తున్నారు. ఈ సాకుతో నింపాదిగా చాప కింద నీరులా విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులను భారత ‘రైతుల అవసరాలను, ఆహారశుద్ధి పరిశ్రమను ఆదుకునే’ పేరిట ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశం లోకి దించేశారు. కునారిల్లుతున్న వ్యవసాయ రంగం బలోపేతం కావడానికి అవసరమైన పెట్టుబడులను రైతాంగానికి దన్నుగా సమకూర్చకుండా ఆహార భద్ర తకు స్వయంగా పాలకులు కీడు చేస్తున్నారు. విచిత్రమేమంటే, 1990ల చివరి నుంచీ వ్యవ సాయ, వాణిజ్య వ్యాపారీకరణ ముఖ్యంగా పత్తి లాంటి వాణిజ్య పంటల వైపు అవసరానికి మించిన విస్తరణకు రైతుల్ని, వ్యవ సాయాన్ని ప్రోత్సహించిన ప్రాంతాలున్నాయి. ఈ విలోమ (తారుమారు) పద్ధ తుల్లో భారత వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్ని ప్రోత్సహించిన అమెరికా తీరా నేడు చేస్తున్న విద్రో హం ఏమిటి? ప్రపంచ మార్కెట్‌కు ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థకూ భారతదేశ ఎగుమతులు ఎక్కకుండా నిరోధిస్తూ అమెరికాలో భారత దిగుమ తులపై సుంకాలు విపరీతంగా పెంచడానికి నిర్ణయిం చింది. మన వ్యవసాయరంగాన్ని సరళీకరించడం లేదా ‘ఉదారవాద సంస్కరణ’లను ప్రవేశపెట్టించే పేరుతో ప్రపంచ బ్యాంక్, అమెరికా ప్రోత్సాహంతో విదేశీ సరుకు దిగుమతుల కోసమే భారత మార్కెట్ల లోని కొన్ని విభాగాల్ని ధారాదత్తం చేసుకున్నాం. ఉదాహరణకు మనం వంటనూనెల్ని (ఖాద్య తైలాలు) దిగుమతి చేసుకునే ఖర్మ పట్టింది. విదేశీ దిగుమతుల పైన మనం విధించాల్సిన సుంకాలను తొలగించుకుంటున్నాం. బ్రిటిష్‌వారి పరిపాలనలో మాదిరిగా సంప్రదాయ పరిశ్రమల్ని నాశనం చేస్తున్న కారణంగా కోట్లాదిమంది దేశ ప్రజలు ఉపాధి కోల్పోయే దుస్థితిలో పడుతున్నారని గుర్తించాలి. ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@ahoo.co.in -
‘ఆపరేషన్ బదులు మోదీ బ్యాండేజ్ వేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రం మద్దతు ధరల పెంపుపై స్పందించారు. ఎన్డీయే ప్రభుత్వం చర్యలు మార్కెటింగ్ వ్యూహాల్ని తలపిస్తున్నాయని చురకలంటించారు. సరుకుల్ని మార్కెట్లో అమ్ముకోవడానికి తయారీదారులు వేసే ఎత్తుగడల మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 120 కోట్ల జనాభా కల్గిన దేశంలో రైతులకు మేలు చేస్తున్నామని చెప్పుకుంటున్న ఎన్డీయే ప్రభుత్వం మద్దతు ధర పేరుతో కేవలం 15 వేల కోట్ల రూపాయల భారాన్ని భుజాన వేసుకుందని అన్నారు. 34 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేసిన కర్ణాటక ప్రభుత్వం కేంద్రం కంటే ఎంతో మేలని ట్విటర్లో శుక్రవారం పేర్కొన్నారు. కానీ, బీజేపీ నాయకులకు కర్ణాటక ప్రభుత్వం చర్య.. ‘స్వల్ప మొత్తంలో రుణాల మాఫీ’గా కనబడుతోందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ అవసరమైన గాయానికి చిన్న బ్యాండేజ్ వేసినట్టుగా మోదీ ప్రభుత్వం మద్దతు ధర పెంపు ఉందని విమర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం 34 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అసెంబ్లీ టు అసెంబ్లీ నిరసన పరుగు
సాక్షి, హైదరాబాద్: అన్నదాతకు మద్దతుగా ఓ రైతుబిడ్డ వినూత్న నిరసనకు సమాయత్తమవుతున్నాడు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ పరుగుకు శ్రీకారం చుట్టాడు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని అసెంబ్లీ నుంచి పరుగు మొదలు పెట్టనున్నాడు. ఇది ఈ నెల 19న అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వద్ద ముగియనుంది. గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతో పరుగు చేపట్టనున్నట్లు వెంకట ఫణీంద్రకుమార్ అనే యువకుడు ‘సాక్షి’కి తెలిపారు. కృష్ణా జిల్లా అప్పికట్లకు చెందిన ఫణీంద్ర గుడివాడలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్ఆర్బీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి నాగరాజు కౌలురైతు. గిట్టుబాటు ధర దక్కక ఏటా తన తండ్రి దిగాలు చెందేవాడని, 26 ఏళ్లుగా అదే పరిస్థితి అని పేర్కొన్నాడు. పంటలు బాగున్నప్పుడు ధరలు పతనమవుతున్నాయని, పంటలు బాగాలేనప్పుడు ధరలు పెరిగిపోతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కాలం బాగుందని అప్పు చేసి పత్తి, మినుములు, మిర్చి వంటి వాణిజ్య పంటలను రైతులు సాగుచేస్తున్నారు, తీరా పంటలు చేతికి అందే సమ యంలో దిమ్మతిరిగేలా ధరలు పడిపోతున్నాయి. దీంతో అన్నదాతలకు దిక్కుతోచడం లేదు’అని పేర్కొన్నాడు. తన పరుగుతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కనువిప్పు కలిగి అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాడు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశాడు. -
మార్క్‌ఫెడ్ ద్వారానే మక్కల కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో పండిన మక్కలకు కనీస మద్దతు ధర చెల్లించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ ఫెడ్ ద్వారానే కొనుగోలు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎండీ జగన్మోహన్ శనివారం సీఎంకు తెలిపారు. మక్కల కొనుగోలుకు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ మార్క్‌ఫెడ్‌కు కావాల్సిన గ్యారంటీ ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, మార్క్‌ఫెడ్‌ను సమన్వయం చేసుకుని మక్కల కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్ రావును కోరారు. ‘‘రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. క్వింటాలుకు రూ.1,425 చెల్లించి ప్రభుత్వం తరçఫునే కొనుగోలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. రైతులు తొందరపడి మక్కలను తక్కువ ధరకు అమ్ముకోవద్దు. రూపాయి కూడా నష్టపోకుండా చూడాలి’’అని సీఎం అన్నారు. -
కర్షకుడికి మేలు జరిగితే కన్నెర్ర
అదే రైతులకు లాభసాటి ధరలను అమలు చేయడం గురించి మాట్లా డితే మరుక్షణం ఆర్థికవేత్తల కనుబొమలు ముడిపడతాయి. కనీస మద్దతు ధర నుంచి కేవలం కొద్దిమంది రైతులే లబ్ధి పొందుతారు. అయితే కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేస్తే ఏటా రూ. 45,000 కోట్లు అదనపు వ్యయం అవుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏడో వేతన సంఘం కోసం 4.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ఎవరూ అడగడం లేదు. దాదాపు పదేళ్ల నుంచి రైతుల నిజ ఆదాయం (కొనుగోలు శక్తిని ద్రవ్యో ల్బణం ప్రభావితం చేసినప్పుడు నిర్ణయించేది) స్తంభించిపోయింది. ఇది అధికారిక సమాచారమే. ఔను! మీరు సరిగానే విన్నారు, రైతు నిజ ఆదాయం స్తంభించింది. ఒక సేద్యగాడి నిజ ఆదాయంలో ఐదేళ్ల నుంచి, అంటే 2015– 16 ఆర్థిక సంవత్సరం వరకు ఏటా 0.44 శాతం పెరుగుదల మాత్రమే కని పించింది. మరోమాటలో చెప్పాలంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం ఎదుగూబొదుగూ లేకుండా స్తబ్దంగా ఉంది. రైతులకు మిగిలేది చేదు ఫలమే ఈ పరిణామానికి తోడు 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా పరిణమించింది. అంతే కాకుండా తమ పంటను తెగనమ్ముకోవలసిన పరిస్థితులు, ఒత్తిడి తలెత్త డంతో ధరలు దారుణంగా పడిపోయాయి. దీనితో చాలామంది రైతులు తాము పండించిన పంటను రోడ్ల మీద పడేసి పోవడం దేశమంతటా కని పించింది. ఇలాంటి దెబ్బ టొమేటో, బంగాళదుంప, ఉల్లి పంటలకు గట్టిగా తగిలింది. ఈ ప్రభావం నుంచి ఇంకా వ్యవసాయ రంగం బయటపడలేదు. ఇందుకు మహారాష్ట్ర రైతులే మంచి ఉదాహరణ. ఇటీవల ఆగ్రోవాన్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం వ్యవసాయోత్పత్తు లను ప్రతిసారీ తక్కువ ధరకే అమ్ముకోవడం వల్ల ఆ రాష్ట్ర రైతులు ఒక్క తృణధాన్యాలలోనే రూ. 2,579 కోట్లు నష్టపోయారు. ఈ ఒక్క సీజన్లోనే చమురు గింజలను తెగనమ్ము కోవడం వల్ల రూ. 769 కోట్లు నష్టం వాటి ల్లింది. మిగిలిన ప్రాంతాలలో కూడా ఇదే పునరావృతమవుతూ ఉంటుంది. స్వరాజ్ అభియాన్ కూడా ఇలాంటి నష్టాలు ఏ రీతిలో ఉన్నాయో వెల్ల డిం చింది. బార్లీ పండించే రైతులు ఆ విధంగా రూ. 325 కోట్లు నష్ట పోతున్నారు. సేకరణ ధర క్వింటాల్‌కు రూ. 4,410 ఉండగా పద్ధతి ప్రకారం చెల్లించవలసిన ధర కంటే 15 శాతం తక్కువే ఉంటున్నది. ఉదాహరణకు శనగపప్పు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో దీని ధర నాటకీ యంగా పడి పోయింది. గత సంవత్సరం దక్కిన ధరతో పోల్చుకుంటే శనగపప్పు మార్కెట్ ధర 30 నుంచి 38 శాతం పతనమైంది. ఆవాల మొత్తం దిగుబడిని మార్కెట్లకు తరలించడం పట్ల రైతులు నిరసన ప్రకటించారు. ఈనామ్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా లేదు. ఈనామ్ మార్కెట్ల విషయంలో జరిగిన పటాటోపాన్ని పక్కన పెడితే, ప్రతిపాదిత 585 ఈనామ్ మార్కెట్లు ఏవీ కూడా వ్యవసాయోత్పత్తులను కనీస మద్దతు ధరకు కొను గోలు చేసే స్థితిలో లేవు. ఈనామ్ మార్కెట్లలో పద్ధతి ప్రకారం చెల్లిం చవలసిన ధరలను చెల్లించాలనే ప్రతిపాదించారు. ఈ ధరలను రోజువారీ వాణిజ్యంలో సగటు ద్వారా నిర్ణయిస్తారు. అయితే ఆ ధరలు కూడా న్యాయ బద్ధంగా లేవని తేలింది. ఇదంతా రైతులకు చేదు ఫలమే. రైతులలో పెల్లుబుకుతున్న ఆగ్రహం భయానకమైన ఈ వ్యావసాయిక సంక్షోభమే రైతులను ఆగ్రహంతో రోడ్డు ఎక్కేటట్టు చేస్తున్నది. గడచిన సంవత్సర కాలంగా రైతుల ఆగ్రహావేశాలు రోడ్ల మీద కనిపిస్తున్నాయి. 2014–2016 – కేవలం ఈ రెండు సంవత్సరాల కాలాన్ని పరిశీలిస్తే రైతుల నిరసన కార్యక్రమాలు అనూహ్యంగా పెరిగి పోయిన సంగతి అర్థమవుతుంది. దేశం మొత్తం మీద ఆ రెండేళ్లలోనే రైతు నిరసన కార్యక్రమాలు 680 శాతం పెరిగాయి. 2016 సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నమోదు చేసిన నిరసనల సంఖ్య 4,837. అంటే ఇంచు మించు రోజుకు 14 నిరసనలు. అప్పటి నుంచి రైతుల నిరసన ప్రదర్శనలు కొన్ని రెట్లు పెరిగిపోయాయి. నా అభిప్రాయం ఒక్కటే. ఎన్నికల ఫలితాల మీద రైతాంగ సంక్షోభం తన ప్రభావాన్ని చూపించగలిగితే తప్ప రాజకీయ నాయకత్వానికి ఆర్థిక, సామాజిక పతనంలోని తీవ్రత గురించి తలకెక్కదు. ఆర్థిక వృద్ధిని సాధించడానికి వ్యవసాయాన్ని త్యాగం చేయాలని చాలామంది ఆర్థికవేత్తల ప్రబల ఆలోచన. కాబట్టి సంస్కరణలకు అనుకూలమైన వాతా వరణం నెలకొనడం కోసం వ్యవసాయాన్ని మరింత లేమి వైపు నెట్టుతు న్నారు. రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ ఒక మాట పదే పదే చెబుతూ ఉంటారు. అదేమిటంటే, చౌకగా కూలీల అవసరం ఉన్న పట్టణాలకు వ్యవ సాయ రంగం నుంచి గణనీయమైన సంఖ్యలో జనాభా తరలిపోవాలి. అదే నిజమైన సంస్కరణ అంటారాయన. 1996లో ప్రపంచ బ్యాంక్ ఆదేశించినది కూడా ఇదే. రాబోయే (అప్పటికి) ఇరవై ఏళ్లలో, అంటే 2015 నాటికి గ్రామీణ ప్రాంతాల నుంచి నలభై కోట్ల మంది తరలిపోవాలని ప్రపంచ బ్యాంక్ ఆకాం క్షించింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ఆర్థిక విధానాన్ని అనుసరిం చాయి. కుడి లేదా ఎడమ లేదా మధ్యేమార్గం అనుసరించే ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు. విధానం మాత్రం అదే. ప్రభుత్వ రంగ సంస్థలలో మదుపు కోసం వ్యవసాయ రంగాన్ని పస్తులు ఉంచడమే. అలాగే సేద్యాన్ని లాభసాటి వ్యవహారం కాదంటూ, అందుకు పరిష్కారం వ్యవసాయ రంగం నుంచి జనా భాను బయటకు నెట్టడమేనని భావించారు. తనను తాను పునరావిష్కరించుకోవాలి ఇలాంటి నిరాశాపూరిత వాతావరణంలో వ్యవసాయం తనను తాను పునరా విష్కరించుకోవలసిన అవసరం ఉంది. వ్యవసాయాభివృద్ధికి మామూలు మోతాదులో ఇచ్చే ప్రోత్సాహం చాలదు. వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవా లని నిజంగా భావిస్తే అసలు ఆర్థికరంగంలో మౌలిక మార్పు తేవడం ద్వారానే సాధ్యమన్న సంగతిని గుర్తించాలి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచు కుంటూనే, గడచిన కొన్నేళ్లుగా పట్టణాలలో ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్న సంగతిని కూడా గమనించాలి. కాబట్టి మిగిలివున్న ఏకైక ప్రత్యా మ్నాయం వ్యవసాయ రంగం తనని తాను పునరావిష్కరించుకోవడమే. దీని గురించి కొంచెం వివరిస్తాను. 2004–14 నుంచి చూస్తే స్థూల జాతీయోత్పత్తి రేటు ఎక్కువగానే ఉన్నా, అది సంవత్సరానికి 1.25 కోట్ల ఉద్యోగాలను సృష్టించ గలిగినది కాదు. కేవలం కొలది ఉద్యోగాలను మాత్రమే సృష్టించడం జరిగింది. మరొకమాటలో చెప్పాలంటే 17.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడం జరుగుతుందని అంచనా వేశారు. కానీ సృష్టించినవి మాత్రం 1.6 కోట్ల ఉద్యో గాలే. కాబట్టి వ్యవసాయం నుంచి జనాభాను తరలించాలన్న ఆలోచన ఆర్థిక శాస్త్ర పరమైన స్పృహతో చేసినది కాలేదు. ఉద్యోగావకాశాల మార్కెట్ ఒట్టి పోయింది. అందుచేత వ్యవసాయాన్ని ఆర్థికంగా సానుకూలమైనది, పర్యావ రణపరంగా నిలకడైనదని మన ఇంగితజ్ఞానం గ్రహించాలి. 52 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అంటే దాదాపు 60 కోట్ల జనాభా. కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో లాభదాయకమైన ఆదాయ మార్గాలు చూపించాలి. పట్టణాలలో, నగరాలలో ఉన్న కార్మికులను వ్యవసాయ రంగాన్ని పునర్నిర్మించేందుకు గ్రామాలకు తరలేటట్టు చేసే విధంగా ఆర్థిక నిపుణుల ఆలోచనా ధోరణి మారినప్పుడే అది సాధ్యమవుతుంది. రైతుకు మేలు చేస్తే కన్నెర్ర దేశంలో పేదలకు ఉన్న ఏకైక ఆర్థిక భద్రత భూమి. పేదల దగ్గర ఉండే కొద్దిపాటి భూమిని లాక్కోవాలని అనుకోవడం సరైన ఆర్థికశాస్త్ర చింతన కాలేదు. కానీ భూమిని లాక్కోవడమే ఇప్పుడు ప్రపంచమంతటా ఒక ధోర ణిగా మారిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో రైతులు భూమిలేని నిరుపేద శ్రామికులుగా మారిపోయారు. వీరికి కొద్దిపాటి భూమి ఇస్తే కనుక, ఆ చర్య ఆర్థిక పతనానికి దారి తీస్తుంది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని తర్కం ఒకటి ఉంది. వ్యాపార వర్గాలకు మాత్రం చదరపు మీటరు ఒక రూపాయి నామమాత్రపు ధరకు ధారాదత్తం చేయడమేమిటో అర్థం కాదు. అలా వ్యాపార వర్గాలకు కట్టబెడుతున్న భూఖండాలను లక్షలాదిగా ఉన్న భూమిలేని నిరుపేదలకు చదరపు మీటరు రూపాయికి ఇస్తే గ్రామీణ ఆర్థిక దృశ్యం గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది. ఇదే వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించడంలో తొలి అడుగు అవుతుంది. దీనికి కనీసంగా జీవించడానికి అవకాశం కల్పించే నెలవారీ వ్యవసాయ ఆదాయ విధానం కూడా తోడుగా ఉండాలి. అసమ ఆర్థిక విధానం ఇది ప్రాథమ్యాలకు సంబంధించిన ప్రశ్న. ఏడో వేతన సంఘం సిఫారసుల వల్ల 45 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 50 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరగలదని అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఏటా ప్రభుత్వానికి రూ. 1.02 లక్షల కోట్లు భారం పడుతుందని ఆర్థికమంత్రి తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కళాశాలలు దేశ వ్యాప్తంగా ఆ సిఫా రసులను అమలు చేస్తే అదనపు భారం రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని క్రెడిట్ సుయిస్సే బ్యాంక్ చెబుతుంది. ఇదంతా దేశంలో ఒకటి నుంచి రెండు శాతం ఉన్న ఉద్యోగవర్గాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. చిత్రం ఏమి టంటే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందని ఏ ఆర్థికవేత్త ఎప్పుడూ ప్రశ్నించడు. లేదా పెరుగుతున్న ఆర్థికలోటు గురించి కూడా ఎవరూ నిలదీ యరు. కానీ పారిశ్రామికరంగం మాత్రం దీనిని ప్రోత్సాహక మోతాదుగా పేర్కొంటుంది. ఎందుకంటే జనం చేతిలో అదనపు ధనం ఉంటే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. అదే రైతులకు లాభసాటి ధరలను అమలు చేయడం గురించి మాట్లా డితే మరుక్షణం ఆర్థికవేత్తల కనుబొమలు ముడిపడతాయి. కనీస మద్దతు ధర నుంచి కేవలం కొద్దిమంది రైతులే లబ్ధి పొందుతారు. అయితే కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేస్తే ఏటా రూ. 45,000 కోట్లు అదనపు వ్యయం అవుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏడో వేతన సంఘం కోసం 4.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం ఎవరూ అడగడం లేదు. మన ఆర్థిక విధానం ఇలా అన్యాయంగా, అసమ దృష్టితో రూపొం దింది. నిజానికి గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్‌ను పెంచితే ఆర్థిక వ్యవస్థకు అది వేగవంతమైన మోతాదు అందించినట్టవుతుంది. ఇది మంచి రాజ కీయమే కాదు, మంచి ఆర్థికశాస్త్రం కూడా. దేవిందర్‌శర్మ, వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మిర్చి దందా మొదలైంది...
సాక్షి, హైదరాబాద్ : మిర్చి దందా మొదలైంది. వ్యాపారులు, దళారులు అక్రమాలకు తెరలేపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మిర్చికి డిమాండున్నా రైతుకు ధర ఇవ్వడంలో వ్యాపారులు మొండిచేయి చూపిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అయి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. 15–20 రోజుల క్రితం వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా మిర్చి ధర రూ.11,275 వరకు ఉండగా, ఈ నెల పదో తేదీ నాటికి రూ.9 వేలకు పడిపోయింది. ఏకంగా రూ.2 వేలకుపైగా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలలపాటు మార్కెట్‌కు మిర్చి తరలిరానుంది. కీలకమైన ఈ సమయంలో ధర పతనం అవుతుండటంతో రైతులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. మున్ముందు ధర ఆశాజనకంగా ఉంటుందా?.. లేదా?.. అన్న భయం వారిని వెన్నాడుతోంది. గతేడాది జనవరి 10న మిర్చి ధర రూ. 11,500, 11న రూ. 11,200 పలికింది. ఫిబ్రవరి ఒకటో తేదీన రూ. 10,400, మూడో తేదీన రూ. 9,900, ఆరో తేదీన రూ. 9,100 పలికింది. చివరకు ఏప్రిల్ 27వ తేదీ నాటికి క్వింటా మిర్చి ధర ఏకంగా రూ. 2 వేలకు పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు ఖమ్మంలో కడుపు మండిన రైతున్న వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేశాసి బీభత్సం సృష్టించాడు. ఈ దాడితో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాడిలో పాల్గొన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడం కూడా రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఈ నేపథ్యంలో అదే పరిస్థితి ఈసారి కూడా పునరావృతమవుతుందా అన్న భయం అందరిలో నెలకొంది. 87,220 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి... ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో మిర్చి అధికంగా సాగు చేశారు. దీంతో ఈసారి 87,220 మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి కావొచ్చని మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ధర మున్ముందు కొనసాగే పరిస్థితి ఉంటుందా?.. లేదా?.. అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు పెద్దలను కూడా కలవరపరుస్తోంది. మిర్చికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లేదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసే అవకాశముంది. గతేడాది ధర పతనం కావడం, కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను బట్టే మిర్చికి ధర ఉంటుంది. ఆ ప్రకారమే తాము కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది అంతర్జాతీయంగా ధర మందగించిందని, ఉత్తరాది వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపించడం లేదని కూడా చెబుతున్నారు. ధర విషయంలో తామేమీ చేయలేమని తేల్చి చెబుతున్నారు. అంటే ఈసారి కూడా వ్యాపారులు దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చేప్పుడే వ్యాపారులు దందా మొదలుపెడతారు. డిమాండ్ పెరిగిన సమయంలో ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. అయితే ఈ సమయంలో రైతులు తమ మిర్చి పంటను సరైన ధర వచ్చే వరకు నిలువ చేసుకునే అవకాశం లేక తెగనమ్ముకుంటారు. అటువంటి సమయంలో రైతులకు కోల్డ్‌స్టోరేజీలు అందుబాటులో ఉండాలి. కానీ అవి కేవలం వ్యాపారుల చేతుల్లోనే ఉండటంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. నాణ్యత లేదని చెబుతూ కొందరి రైతుల నుంచి కొనుగోలు చేయని దుస్థితి కూడా ఉంది. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
దళారులకే ‘మద్దతు’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 52వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేయగా, 15,277 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కంది దిగుబడులు మార్కెట్లకు పోటెత్తుతుండగా.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.3,600 నుంచి రూ.4,500 వరకు చెల్లిస్తున్నారు. కంది రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించి.. ఇప్పటి వరకు 7,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తెల్లాపూర్, సదాశివపేట, జహీరాబాద్, ఇప్పపల్లి, న్యాలకల్, ఝరాసంగం, నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, వట్పల్లి, రాయికోడ్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కందుల కొనుగోలు జరుగుతోంది. రెవెన్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా నంబరు జిరాక్స్ కాపీతో వచ్చే రైతుల నుంచి మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో కందులు తీసుకుంటారు. కనీసం 12శాతం లోపు తేమ ఉన్న శాంపిళ్లను తెచ్చే రైతులకు మాత్ర మే తేదీల వారీగా టోకెన్లు జారీ చేస్తున్నా రు. టోకెన్లపై ఉన్న తేదీల్లో వచ్చే రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు కందులు సేకరించాల్సి ఉంటుంది. అక్రమాలకు సరి‘హద్దు’ లేవీ? నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, నాగల్గిద్ద, జహీరాబాద్, న్యాల్కల్ తదితర మండలాలకు సరిహద్దులో ఉన్న కర్ణాటక నుంచి కందులు అక్రమ మార్గాల్లో జిల్లాలోకి తరలివస్తున్నాయి. గతంలో జిల్లాకు చెందిన సరిహద్దు ప్రాంత రైతులు బీదర్ ప్రాంతంలో శనగలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం కర్ణాటకలో కంది కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, బీదర్ ప్రాంతంలో కంది ధర క్వింటాలుకు రూ.3,500కు మించి పలకడం లేదు. దీంతో దళారులు కొందరు కర్ణాటకలో పండించిన కందులను సరిహద్దు గ్రామాల్లోకి చేరవేస్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా సాగు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారు. మరోవైపు దళారులకు మార్క్‌ఫెడ్ యంత్రాంగం సహకరిస్తూ టోకెన్లు జారీ చేస్తోంది. కళ్లముందే పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న కందులు కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ తీరుతో స్థానిక రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో అంచనా వేసిన కంది దిగుబడిలో సగం మేర కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ లెక్కలు చెప్తోంది. రైతులు మాత్రం ఇంకా దిగుబడులు వస్తున్న దశలోనే.. దళారుల నుంచి కొనుగోలు చేస్తే .. కోటా ముగిసిందనే నెపంతో కేంద్రా లు మూసివేసే అవకాశం ఉందని ఆందో ళన చెందుతున్నారు. చెక్‌పోస్టులు కనిపించవెందుకని? కర్ణాటక నుంచి అక్రమంగా తరలివస్తున్న కందులను ఇటీవల కంగ్టి రెవెన్యూ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఇటీవల నారాయణఖేడ్ నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. ఇప్పటి వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు కాక పోగా, రోడ్డు మార్గంపై నిఘా ఉంటుందనే ఉద్దేశంతో దళారులు రూటు మార్చారు. కారాముంగి, గౌడ్గావ్ జనవాడ, తోర్నాల్, ఎన్జీ హుక్రానా తదితర చోట్ల మంజీరా నదిలో పుట్టి మార్గంలో కందులు వస్తున్నాయి. కంగ్టిలో దళారులదే రాజ్యం కంగ్టిలో జనవరి 21న కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలివస్తున్నాయి. దళారీలకు సహకరించేలా మార్క్‌ఫెడ్ కృత్రిమంగా బార్దాన్ (గోనె సంచులు) కొరత సృష్టిస్తోంది. టోకెన్ల కోసం రైతులు పడిగాపులు పడుతున్నా.. దళారీలకు మాత్రం గంటల వ్యవధిలోనే టోకెన్ల జారీ, తూకం వేయడం జరుగుతోంది. రెవెన్యూ అధికారులు సాగు విస్తీర్ణంపై ఎలాంటి విచారణ జరపకుండానే టోకెన్లపై సంతకాలు చేస్తూ దళారీలకు సహకరిస్తున్నారు. గత ఏడాది దాదాపు 80 రోజులు కొనసాగిన కొనుగోలు కేంద్రంలో 37 వేల క్వింటాళ్లు సేకరించగా.. ప్రస్తుతం కేంద్రం ప్రారంభమైన పది రోజుల్లోనే 11 వేల క్వింటాళ్లు తూకం వేశారు. 50 బస్తాల కందులు పట్టివేత నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లోని కందుల కొనుగోలు కేంద్రానికి వ్యాపారులు తెచ్చిన 50 బస్తాల కందులను మార్క్‌ఫెడ్ అధికారులు సోమవారం పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్ డీఎం ఇంద్రసేన విలేకరులతో మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌లోని కొనుగోలు కేంద్రానికి గుర్తుతెలియని వ్యాపారులు రెండు రోజుల క్రితం 50 బస్తాల కందులు తెచ్చారని, తమకు అందిన సమాచారం మేరకు బస్తాలను సీజ్‌చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం రైతులు సాగుచేసిన పంటను మాత్రమే అధికారులు ధ్రువీకరణ ప్రకారం కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం విఠల్‌రెడ్డి, రాజారెడ్డి అనే వ్యక్తులు 85బస్తాల కందులను అమ్మారని, ఇవి కూడా రైతులవి కాదని తమకు ఫిర్యాదు అందిందన్నారు. కొనుగోలు చేసిన కందులకు సంబంధించి డబ్బులు వారి ఖాతాల్లో పడకుండా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కాకుండా వ్యాపారులు తీసుకువస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తీసుకున్న టోకెన్ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎకరాకు 4క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చిందని వ్యవసాయ అధికారులు నివేదించారన్నారు. ఈ లెక్కన 4క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసుకు వస్తే వీఆర్వో ధ్రువీకరణ కాకుండా వ్యవసాయ అధికారి ధ్రువీకరణ అవసరమని స్పష్టం చేశారు. దళారులకే ప్రాధాన్యం.. కందుల కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తెచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారులు ముందుగా వ్యాపారులు, దళారులు తెచ్చిన కందులు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. – రవి, రైతు, పైడిపల్లి పట్టించుకోవడం లేదు.. రెండు క్వింటాళ్ల కందులు మనూరు కొనుగోలు కేంద్రానికి తెచ్చి రెండు రోజులు అవుతోంది. అధికారులు టోకెన్ ఇచ్చినా కందులు కొనడంలేదు. బీదర్ నుంచి దళారులు, వ్యాపారుల కందులను మాత్రం కొంటున్నారు. రైతులను పట్టించుకోవడంలేదు. – సాలె నారాయణ, రైతు, మనూరు ధ్రువీకరణ పత్రాలు తెస్తేనే.. రైతులు తెచ్చే శాంపిళ్లలో 12 శాతం లోపు తేమ ఉంటేనే టోకెన్లు జారీ చేస్తున్నాం. రెవె న్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నకలు కాపీలు ఉంటేనే కొనుగోలు చేస్తున్నాం. కం దుల కొనుగోలులో అవకతవకల కు తావు లేకుండా పారదర్శకంగా కొనుగో లు చేస్తున్నాం. త్వరలో శనగ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి వచ్చింది. – ఇంద్రసేన్, డీఎం, మార్క్‌ఫెడ్ తనిఖీలు ముమ్మరం చేశాం పొరుగు రాష్ట్రం నుంచి కందులు అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు రెవెన్యూ, వ్యవసాయ మార్కెటింగ్ విభాగాలకు ఆదేశాలు జారీ చేశాం. కర్ణాటక సరిహద్దుల్లో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం. కంగ్టిలో అక్రమంగా తరలిస్తున్న కందులను సీజ్ చేసి, కేసు నమోదు చేశాం. అక్రమాలకు పాల్పడే ప్రభుత్వ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం. – డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జేసీ అధికారుల అండతోనే.. రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమంగా వస్తున్న కందుల కొనుగోలును మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ, మార్క్‌ఫెడ్ సిబ్బంది కుమ్మక్కై స్థానిక రైతులకు అన్యాయం చేస్తున్నారు. మేము టోకెన్ల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా.. దళారీల సరుకు మాత్రం ఉదయం, సాయంత్రం విరామం లేకుండా తూకం వేస్తున్నారు. హమాలీల దోపిడీ కూడా భారీగానే ఉంది. రైతులు తెచ్చిన ధాన్యంలో తూకం పేరిట కింద పడేస్తూ.. రోజూ క్వింటాళ్ల కొద్దీ పోగు చేసి అమ్ముకుంటున్నారు. – సంగారెడ్డి, రైతు, మనూరు -
కంది కొనుగోళ్లలో దళారులకు చెక్
మోర్తాడ్(బాల్కొండ) : కంది కొనుగోళ్లలో దళారుల దగాకు చెక్ పెట్టింది తాళ్లరాంపూర్ సహకార సంఘం. వ్యాపారుల బారిన పడకుండా రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటికే నాలుగు వేల సంచులను కొనుగోలు చేసింది. కందికి రూ.5,450 చొప్పున మద్దతు ధర చెల్లిస్తూ రైతులకు భరోసా కల్పిస్తోంది. వాస్తవానికి బయట మార్కెట్లో దళారులు క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,200 వరకు మాత్రమే ధర చెల్లిస్తూ రైతులను మోసగిస్తున్నారు. అయితే, తాళ్ల రాంపూర్‌లో కంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు మద్దతు ధర లభిస్తోంది. మోర్తాడ్, ఏర్గట్ల, మెండోర మండలాలకు సంబంధించిన తాళ్ల రాంపూర్ కొనుగోలు కేంద్రంలోనే పంట ఉత్పత్తులు విక్రయించి మద్దతు ధర పొందుతున్నారు. పది రోజుల కింద ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, ఇప్పటివరకు నాలుగు వేల సంచుల కందులను కొనుగోలు చేశారు. కందులు విక్రయించిన రైతులకు వారం రోజుల్లోనే సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు తాము పండించిన కందులను మంచి ధర పొందేందుకు అవకాశం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాన్ని మరిన్ని రోజులు కొనసాగిస్తామని, రైతులు నాణ్యమైన కందులను తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సొసైటీ చైర్మన్ సోమ చిన్న గంగారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. -
‘పచ్చ బంగారం’ ధర పలికేనా..!
బాల్కొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు సిరులు కురిపించి న పసుపుపంట ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. రాజన్న హయాంలో క్వింటాలు ధర రూ.17వేలు పలుకగా, నేడు గరిష్టంగా రూ.8 వేలు పలుకుతోంది. మరోవైపు జిల్లాలో పసుపుబోర్డు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటైతే మద్దతు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంటకు ఆశించిన ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 33వేల ఎకరాల్లో రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు తవ్వకాలు జోరందుకున్నా యి. రైతులు పసుపును మార్కెట్‌కు తరలిస్తు న్నారు. కాగా క్వింటాలుకు గరిష్టంగా రూ.8 వేలు, కనిష్టంగా రూ.6 వేల ధర పలుకుతోంది. దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పసుపు పంట సాగుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర పెట్టుబడి పెట్టి సాగు చేసే పంట కావడంతో రైతులకు మార్కెట్ ధర గిట్టుబాటు కావడం లేదు. కనీసం క్వింటాలుకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటేనే పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. రాజన్న హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007, 2008లో క్వింటాలు పసుపు ధర గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.12 వేలు పలికింది. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు పంటను కొనుగోలు చేయడంతో రైతులకు మంచి ధర లభించింది. ధరలు నిలకడగా ఉండటంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. రాజన్న వ్యవసాయాన్ని పండగ చేశారు. పసుపుపంట సాగు చేస్తున్నప్పటి నుంచి అంత ధర దక్కలేదని రైతులు అంటున్నారు. అలాంటి ధరను ఎప్పుడు చూస్తామా.. అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పసుపు పంట సీజన్ వచ్చిన ప్రతిసారి రాజశేఖర్‌రెడ్డి పాలనలో వచ్చిన ధరను గుర్తు చేసుకుంటున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో.. వైఎస్ మరణం తరువాత పాలకుల నిర్లక్ష్యం పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా పసుపు పంటకు క్వింటాలుకు రూ.4 వేల మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుందని కేంద్రానికి లేఖ రాశా రు. దీంతో పసుపు రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులను గురించి పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా మద్దతు ధర కోసం, పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తున్నా.. ఇప్పటికీ మోక్షం కలుగలేదు. పసుçపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పడంతో రైతుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా మోక్షం లభిస్తుందని రైతులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ వారికి నిరాశే మిగులుతోంది. పాలకులు స్పందించి పసుపు పంటకు కనీన మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పచ్చ బంగారమాయేనా..!
వాణిజ్య పంటగా పేరొందిన పసుపు పంటపైనే జిల్లా రైతులు ఆశలు పెంచుకున్నారు. రెండు, మూడేళ్లుగా అంతంతమాత్రంగానే ఉన్న పసుపు ఉత్పత్తుల ధరలు.. ఈ ఏడాది ఎలా ఉంటాయోనని ఎదురుచూస్తున్నారు. ఈసారి వాతావరణ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు సోకినా పంటను కాపాడుకున్నారు. ప్రస్తుతం పసుపు పంట ఆకులు కోసి.. కొమ్ములను తవ్వే పనిలో అన్నదాత బిజీగా ఉన్నాడు. ఇక మార్కెట్‌కు తరలించడమే తరువాయి.. తీరా దిగుబడి మార్కెట్‌కు తరలించే సమయానికి ధర ఎంత ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో క్వింటాల్‌కు రూ.10వేలు ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లాలో ప్రధానంగా జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మల్లాపూర్, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి మండలాల్లో అత్యధికంగా, గొల్లపల్లి, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం మండలాల్లో ఓ మోస్తారుగా పసుపు సాగుచేస్తుంటారు. దాదాపు 42 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అంచనా. పసుపుకు అనుకూలమైన ఎర్రనేలలు ఉండడం, యాజమాన్య పద్ధతులు అవలంబిస్తుండడంతో లాభసాటిగా మారింది. నాలుగేళ్ల క్రితం పసుపు ధరలు బంగారంతో పోటీపడటంతో అన్నదాత ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పసుపు పంటకు ధర ఉన్నా.. లేకున్నా ఇంటి పంటగా భావించి ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగుచేస్తున్నారు. ఇక్కడి రైతులు గుంటూర్, అర్మూర్ రకాలతోపాటు సుగుణ, సుదర్శన్ వంటి రకాలను వేస్తున్నారు. వీటిలో కుర్కుమిన్ శాతం తక్కువగా ఉండటంతో కొందరు కేరళ, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన రకాలనూ సాగుచేస్తున్నారు. ఇటీవల బెడ్ పద్ధతిని అవలంబిస్తూ కొంతమంది ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఈసారి అంతంతే.. ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపుకు తెగుళ్లు సోకాయి. ఆకురోగం, దుంపకుళ్లు రోగంతో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి ప్రాంతాల్లో కొంతనష్టం జరిగింది. జగిత్యాల, గొల్లపల్లి, రాయికల్ మండలాల్లో పెద్దగా తెగుళ్లు రాకున్నా ఆశించినస్థాయిలో దిగుబడులు రావడంలేదని రైతులు చెపుతున్నారు. కనీసం ఎకరాకు 5క్వింటాళ్ల మేర తగ్గే అవకాశముంది. మార్కెట్లో గతేడాది క్వింటాల్‌కు రూ.5–7 వేల మధ్యలో ధర పలకగా.. దిగుబడులు వచ్చినా రేటు రాక నష్టపోయారు. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.6–8 వేలు ఉన్నట్లు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే పంట మార్కెట్‌కు వచ్చే వరకు ధర ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుకు పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో కనీసం క్వింటాల్‌కు రూ.10వేలు ఉంటేనే గిట్టుబాటవుతుందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా.. పసుపును ఆహార పదార్థాల్లోనే కాకుండా మందులు, చర్మ సౌందర్యానికి వాడే పరిమళ ద్రవ్యాల తయారీ, రంగుల పరిశ్రమలో వాడుతుండడంతో అంతర్జాతీయంగా డిమాండ్ఉంది. ఏటా రేట్లు హెచ్చు తగ్గులకు లోనవుతుండటంతో మార్కెట్లో ఏ రేటు వస్తుందో తెలియని పరిస్థితి. రైతులు పోటీ పడి దిగుబడులు తీస్తున్నా మార్కెటింగ్ సమయంలో పెట్టుబడికి తగ్గ ధర రాక డీలా పడుతున్నారు. కొన్నేళ్లుగా పసుపు బోర్డు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. చివరకు లోకల్ మార్కెట్లో ఏదో ఓ రేటుకు అమ్ముకుని నష్టాలను చవిచూస్తున్నారు. పసుపు రైతులకు పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో 9 నెలలు కష్టపడితే ఎకరాకు కనీసం రూ.25 వేలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర ఇవ్వాలి.. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశముంది. కష్టపడి దిగుబడులు తీస్తున్నాంగానీ మార్కెట్‌కు పోయి వ్యాపారుల కాళ్లావేళ్లా పడాల్సి వస్తంది. క్వింటాల్‌కు కనీసం రూ.10వేలు ఉంటేనే రైతులకు గిట్టుబాటవుతుంది. –దొడ్లె జీవన్‌రెడ్డి, జగిత్యాల రైతు ధర చెప్పలేం.. పసుపు పంటమార్కెట్‌కు తీసుకెళ్లే వరకు ఏ రేటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. తాత, తండ్రుల నుంచి వస్తున్న పంట కావడంతో లాభం వచ్చినా, నష్టం వచ్చినా సాగు చేస్తున్నాం. –తీపిరెడ్డి రాజవ్వ, పసుపు రైతు -
ఎంఎన్‌పీ సమస్యలకు ట్రాయ్ చెక్
న్యూఢిల్లీ: నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలు తిరస్కరణకు గురవుతున్న ఉదంతాలను నియంత్రించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంఎన్‌పీ క్లియరింగ్ హౌస్ (ఎంసీహెచ్) ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ ఎంసీహెచ్‌లో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రతిపాదించింది. ప్రస్తుత విధానం ప్రకారం నెట్వర్క్ మారదల్చుకున్న వారి గత బిల్లింగ్ బకాయిల వివరాలు, అందుకున్న నోటీసులు, విశిష్ట పోర్టింగ్ కోడ్ (యూపీసీ) ఆఖరు తేదీ మొదలైనవి కొత్త ఆపరేటరు (ఆర్వో)కి అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయా అంశాలను ధ్రువీకరించు కోలేక పలు నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలను ఆపరేటర్లు తిరస్కరించాల్సి వస్తోంది. తిరస్కరణకు గురైన కేసుల్లో దాదాపు 40 శాతం అభ్యర్ధనలు యూపీసీ సరిపోలకపోవడం, యూపీసీ గడువు ముగిసిపోవడం వంటి అంశాల కోవకి చెందినవే ఉంటున్నాయి. ఇది గుర్తించిన ట్రాయ్.. ప్రస్తుత పోర్టబిలిటీ ప్రక్రియలో ఎంసీహెచ్‌ని కూడా చేర్చాలని భావించింది. దీనిపై ఆగస్టు 31 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కి తెలియచేయొచ్చు. -
ధాన్యం బంపర్.. ధరల టెన్షన్
- యాసంగిలో మూడున్నర రెట్లు పెరిగిన దిగుబడి - గత యాసంగిలో 7,21,000 టన్నులు - ప్రస్తుతం 26,41,000 టన్నులు - ప్రభుత్వ తాజా నివేదికలో వెల్లడి - గిట్టుబాటు ధరపైనే ఆందోళన - రైతును వెంటాడుతున్న గత ఖరీఫ్ భయం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో యాసంగి పంట పండింది. వరి ధాన్యం రాశులు వెల్లువెత్తుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడంతో యాసంగి మురిసిపోతోంది. 2015–16 యాసంగిలో ధాన్యం 7.21 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ యాసంగిలో ఏకంగా 26.41 లక్షల టన్నులకు పెరిగింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా మూడున్నర రెట్లు ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. యాసంగి సాధారణ పంటల సాగు విస్తీర్ణం 29.86 లక్షల ఎకరాలు కాగా.. ఈ యాసంగిలో ఏకంగా 38.01 లక్షల (127%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 21.39 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. గోదావరి జిల్లాలను తలదన్నేలా ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. వరితో పాటు పప్పుధాన్యాల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. గత యాసంగిలో పప్పుధాన్యాల దిగుబడి 60 వేల టన్నులు కాగా, ఈ యాసంగిలో 1.48 లక్షల టన్నులకు పెరిగింది. గత యాసంగిలో వేరుశనగ 1.45 లక్షల టన్నులు దిగుబడి రాగా, ఈ యాసంగిలో 2.44 లక్షల టన్నుల్లో దిగుబడులు రానున్నాయి. దాంతోపాటు మొక్కజొన్న గత యాసంగిలో 4.25 లక్షల టన్నులు పండగా, ఈ యాసంగిలో 7.80 లక్షల టన్నులు పండింది. గత యాసంగిలో శనగ 48 వేల టన్నుల దిగుబడులు రాగా, ఈ యాసంగిలో 1.24 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఇలా అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గిట్టుబాటు ధరపైనే ఆందోళన.. గిట్టుబాటు ధర రైతును ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కుదేలయ్యాడు. ఇదే దుస్థితి రబీ పంటలకూ వస్తుందన్న ఆందోళన రైతును వేధిస్తోంది. ఖరీఫ్‌లో 2.44 లక్షల టన్నుల కంది ఉత్పత్తి జరిగిందని ప్రభుత్వం తెలిపింది. గతేడాది కందికి మార్కెట్లో క్వింటాలుకు రూ.10 వేల వరకు ధర పలకగా, ఈ ఏడాది రూ.4 వేలకు పడిపోయింది. ప్రభుత్వం రూ.5,050కి గిట్టుబాటు ధరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా చాలా మంది రైతులు వ్యాపారుల దోపిడీకి గురయ్యారు. గతేడాది ఖరీఫ్‌లో 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3.17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. ఉత్పత్తి గణనీయంగా ఉన్నా ధర మాత్రం పడిపోయింది. 2015–16 ఖరీఫ్‌లో పండిన మిర్చి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.12 వేల వరకు పలకగా, ఈ ఏడాది ఏకంగా రూ.4,500 వరకు పడిపోయింది. మిర్చిని రూ.7 వేల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. ఆలస్యంగా కేంద్రం అనుమతిస్తే వ్యాపారులకే గిట్టుబాటు ధర లభిస్తుందన్న విమర్శలున్నాయి. రబీ ధాన్యం కొనుగోలుపై కేంద్రీకరించాలి.. రబీలో వరికి గిట్టుబాటు ధర దక్కేలా పూర్తి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వరికి కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం 3,076 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, అవి పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. వరి ఏ గ్రేడ్ రకం ధర క్వింటాలుకు రూ.1,510, సాధారణ రకం ధర రూ.1,470 మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మిర్చితో నష్టపోయాం: ఇందుర్తి రంగారెడ్డి, పోచారం, ఖమ్మం జిల్లా మిర్చికి సరైన ధర రాక పెద్ద ఎత్తున నష్టపోయాను. కాలం కలిసొచ్చిందన్న సంతోషం లేకుండా పోయింది. వ్యాపారుల దగా వల్ల మిర్చికి గిట్టుబాటు ధర రాకుండా పోవడంతో అప్పులే మిగిలాయి. కనీసం రబీలో పండించిన వరికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. గిట్టుబాటు ధర కల్పించాలి: యాదయ్య, రైతు, మిడ్జిల్ (మహబూబ్‌నగర్) ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడయ్యింది. దిగుబడులేమో ఆశించినంతగా లేవు. కాలం లేక పంటలన్నీ ఎండిపోతున్నయి. నాలుగు గంటల సేపు బోరు నడిస్తే అర ఎకరం పొలం కూడా పార్తలేదు. పశువులకు కొంత గడ్డి పండుతదని వరి పంట ఏసినం. నాలుగు గింజలు పండుతున్నయి. కాస్త రేటు కల్పించి మమ్ముల్ని ఆదుకోవాలి. ప్రభుత్వమే ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి, రైతు, మున్ననూర్, మహబూబ్‌నగర్ ఈ ఏడాది పంటలకు సరైన గిట్టు బాటు ధరలు దక్కట్లేదు. మొక్కజొన్న, పత్తి, కంది, మిర్చికి సరైన ధరలు లభించక పోవడంతో తీవ్రంగా నష్టపోయినం. పెట్టుబడులు ఎల్లని దుస్థితి నెలకొంది. పెట్టిన పెట్టుబడి కూడా ఎల్తలేదు. ప్రభుత్వం వరి విషయంలోనైనా మంచి ధరలు లభించేలా చర్యలు తీసుకుని ఆదుకోవాలి. ప్రతి గింజా కొనుగోలు చేస్తాం: మంత్రి హరీశ్‌రావు రబీలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గణనీయంగా మార్కెట్లోకి వరి ధాన్యం వస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జాయింట్ కలెక్టర్లను పర్యవేక్షణ చేయమన్నాం. ఎఫ్‌సీఐని, మిల్లర్లను కూడా సిద్ధంగా ఉండాలని చెప్పాం. గన్నీ బ్యాగులను సేకరించి పెట్టుకున్నాం. పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ధాన్యం కొంటున్నారు. దానివల్ల పోటీ పెరిగి రైతులకు ఉపయోగపడుతుంది. ప్రతి గింజా కొనేందుకు ఏర్పాట్లు చేశాం. -
దక్కేది అంతంత.. కొంటారా అంతా
ఏలూరు (మెట్రో) : ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,550, సాధారణ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,470గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. అదికూడా నిర్దేశించిన స్థాయిలో తేమ శాతం ఉంటేనే చెల్లిస్తారు. లేదంటే మద్దతు ధరలోనూ కోత తప్పని పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మాసూలు చేసిన ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు. తీరిగ్గా మేల్కొన్న అధికారులు జిల్లా వ్యాప్తంగా 260 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈనెల 7వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ నెల రెండో వారం నాటికి గాని ఆ కేంద్రాలు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులకు చెల్లించే మద్దతు ధర అంతంత మాత్రంగానే ఉన్నా.. రైతులందరి నుంచి ధాన్యం కొనే పరిస్థితి ఐకేపీ కేంద్రాల్లో లేకపోవడంతో ధాన్యాన్ని దళారులు తన్నుపోతున్నారు. తేమ శాతాన్ని బట్టి ధర చెల్లింపు ధాన్యంలో 17శాతానికి మించి తేమ ఉండకూడదు. అంతకుమించి తేమ ఉంటే రైతులకు చెల్లించే ధర తగ్గిస్తారు. 17 శాతం తేమ ఉండే గ్రేడ్ ఏ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,550, 75 కేజీల బస్తాకు రూ.1,132.50 చెల్లిస్తారు. సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470, 75 కేజీల బస్తాకు రూ.1,102.50 చెల్లిస్తారు. తేమ శాతం పెరిగితే.. ఆ శాతానికి అనుగుణంగా ధర తగ్గిపోతుంది. వెబ్‌ల్యాండ్.. ఈ క్రాప్ ఆధారంగా కొనుగోళ్లు ప్రస్తుత ఖరీఫ్ సీజ¯ŒS నుంచి ధాన్యం కొనుగోళ్లలో నూతన విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఈ క్రాప్, వెబ్‌ల్యాండ్ విధానం ఆధారంగా కొనుగోళ్లు జరుపుతారు. జిల్లా వ్యాప్తంగా 260 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో 160 కేంద్రాలు ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) ఆధ్వర్యంలోను, 100 కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి రావచ్చని అంచనా వేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ధాన్యం కొనుగోళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. రైతుకు న్యాయం జరిగేలా, దళారులను అడ్డుకునేలా అన్నిశాఖల అధికారుల ఈసారి ధాన్యం కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించి కిందిస్థాయి నుంచి తనిఖీలు జరిపిస్తాం. రైతు నుంచి ధాన్యం మిల్లరుకు చేరిన తరువాత ట్రక్‌షీట్‌ను కూడా పరిశీలించి అసలైన రైతు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ మద్దతు ధర బాధ్యత రాష్ట్రానిదే భారత రాజ్యాంగాన్ని బట్టి చూస్తే వ్యవసాయం రాష్ట్ర జాబితాలోనే ఉంది. మద్దతు ధరలు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ కేంద్రం ఇచ్చే బోనస్‌తోనే సరిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడిపేస్తోంది. పెట్టుబడికి అదనంగా మద్దతు ధర ప్రకటించి రైతులను రాష్ట్ర ప్రభుత్వమే విధిగా ఆదుకోవాలి. – నాగబోయిన రంగారావు, అధ్యక్షుడు, రాష్ట్ర కౌలు రైతుల సంఘం -
ఓసీలపై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి
కాసిపేట : కేసీఆర్ దళితులను మోసం చేసినట్లుగా ప్రజలను మోసం చేయొద్దని, వెంటనే ఓపెన్‌కాస్టు(ఓసీ)లపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ఓసీ నిర్వాసిత గ్రామంగా మారనున్న దుబ్బగూడెంను సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ఓసీలను అడ్డుకుంటామని ఎన్నికల సమయంలో ప్రచారం చేయడంతోనే ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని గుర్తు చేశారు. ప్రజల భయాందోళనను తొలగించాలని అన్నారు. ఓసీకి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పని చేస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే పేర్కొనడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పది రోజుల్లో ఓపెన్‌కాస్టులపై వైఖరి ప్రకటించుకుంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని, ఒక రోజు దీక్షలో పాల్గొంటామని తెలిపారు. ఓపెన్‌కాస్టు కేవలం 19గ్రామాల సమస్య కాదని, తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలోని నాలుగు జిల్లాల సమస్యగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి ఉందని, ఇందులో భాగంగా దుబ్బగూడెంలో ఒక రోజు దీక్షలో పాల్గొని ఉద్యమం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అద్యక్షుడు కల్వల శరత్, అధికార ప్రతినిధి మంత్రి మల్లేష్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ రజీహైదర్, టీఆర్ఎస్ నాయకుడు లంక లక్ష్మణ్, యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ, మాజీ సర్పంచ్ కొండబత్తుల రాంచందర్, ప్రజాస్పందన వేదిక కన్వీనర్ సిలోజు మురళి, ఎమ్మార్పీఎస్ యూత్ అధ్యక్షుడు ఆదర్ల మహేందర్, గ్రామస్తులు బోగె పోశం, బోగ రామకృష్ణ, ఊట్ల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ కోసం దేశ వ్యాప్త ఉద్యమం బెల్లంపల్లి : ఎస్సీ వర్గీకరణ కోసం దేశ వ్యాప్త ఉ ద్యమాన్ని చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించా రు. శనివారం పట్టణంలోని సింగరేణి కళావేదికలో నిర్వహించిన తూర్పు జిల్లా కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాల నుంచి ఏ, బీ, సీ, డీ వర్గీకరణ ఉద్యమం సాగుతోందన్నారు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో రెండుసార్లు వర్గీకరణను సాధించుకున్నా సాంకేతికంగా నిలిచిపోయిందని తెలిపారు. అత్యున్న త న్యాయవ్యవస్థలో మాల కులస్తులు ఉండి అ డ్డుకోవడం వల్ల వర్గీకరణ నిలిచిపోయిందని చె ప్పారు. మలి దశ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయి నుంచి నిర్మించి దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని అ న్నారు. జిల్లాల వారీగా రెండు రాష్ట్రాల్లో సదస్సు లు నవంబర్ నెలాఖరు వరకు నిర్వహిస్తామని చెప్పారు. మహజన సోషలిస్టు పార్టీ కో ఆర్డినేటర్ ఎండి రజీహైదర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వల శరత్, జిల్లా అధికార ప్రతినిధి మంత్రి మల్లేశ్, జిల్లా నాయకులు మల్లారపు చిన్నరాజం, మంతెన కొమురయ్య, ఆయిళ్ల రామకృష్ణ, ఓరం రవీందర్, ఎం.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ చేయకపోతే యుద్ధమే
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సిద్దిపేట టౌన్: ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాత్రి జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. మూడు నెలల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి, శిక్షణ శిబిరాలను నిర్వహిస్తామన్నారు. శిక్షణ పొందిన వారు ప్రతిపక్ష పాత్రకై పోరుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు వర్గీకరణపై నిర్లక్ష్యం వహించి ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించిందన్నారు. నెల రోజుల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మభ్యపెట్టాలో ఆలోచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను ఎండగట్టే ధైర్యం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు లేదన్నారు. అందుకే ఎమ్మార్పీఎస్ ప్రజల డిమాండ్‌ను ఎజెండాగా మార్చుకుని పోరాటానికి సిద్ధమవుతుందన్నారు. దళితులకు ఐదు ఎకరాలు ఇవ్వాల్సిందే..! తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఐదు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఇవ్వాలన్నారు. ఉన్నత చదువులు చదివే ఉన్నత వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తానంటున్న ప్రభుత్వం, ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న బడుగు పిల్లలకు ఎందుకు ఉచిత నాణ్యమైన విద్యను అందించడం లేదని ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగులకు ఫించన్లను అక్టోబర్ నుంచి పెంచుతూ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి 13 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాలన్నారు. 15న రాస్తారోకో, 18న ప్రభుత్వ కార్యాలయాల దిగ్భందం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం తాను రథయాత్ర చేస్తానన్నారు. ఆగస్టు 12న అసెంబ్లీ ముట్టడి ఉంటుందన్నారు. సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అందె రాంబాబు, దళిత , ప్రజా, కుల సంఘాల రాష్ట్ర, జిల్లా సారథులు నర్సింలు, దుర్గప్రసాద్, గడ్డం మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
'సిఎం కావాలనుకుంటున్న కెసిఆర్'
మెదక్: తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇప్పుడు మాట మారుస్తున్నారని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ఇప్పుడు తానే సీఎం కావాలని కెసిఆర్ అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను దళితులు, బిసిలు, ముస్లీంలు విశ్వసించరని చెప్పారు. కేసీఆర్ దళితద్రోహి అని అన్నారు.