ఢిల్లీ:లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల విషయంలో వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే యువత కోసం ‘యువ న్యాయ్’ పేరుతో హామీలు, ‘నారీ న్యాయ్’ పేరుతో మహిళలకు ఎన్నికల హామీలను ప్రకటించింది కాంగ్రెస్. తాజాగా బుధవారం రైతుల కోసం ‘కిసాన్ న్యాయ్’ పేరుతో ఐదు హామీలను ప్రకటించింది.
ఇవే ఆ ఐదు హామీలు...
- స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పిస్తాం.
- రైతుల రుణాలను మాఫీ చేయడానికి, రుణమాఫీ మొత్తాన్ని నిర్ణయించడానికి శాశ్వత ‘వ్యవసాయ రుణ మాఫీ కమిషన్’ ఏర్పాటు చేస్తాం.
- బీమా పథకాన్ని మార్చడం ద్వారా పంట నష్టం జరిగితే 30 రోజులలోపు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తాం.
- రైతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త దిగుమతి, ఎగుమతి విధానాన్ని రూపొందిస్తాం.
- వ్యవసాయ వస్తువులను జీఎస్టీని తొలగించడం ద్వారా రైతులను జీఎస్టీ రహితంగా తీర్చిదిద్దుతాం.
‘దేశంలోని అన్నదాతలకు నా సెల్యూట్!. మీ సమస్యలను కూకటివేళ్లతో నిర్మూలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలను ఇస్తోంది. చెమటతో దేశంలోని నేలను పచ్చదనంతో నింపే రైతుల జీవితాలను ఆనందంగా మార్చడమే కాంగ్రెస్ లక్ష్యం. అందుకే ఈ ఐదు చారిత్రాత్మాక హామీల దిశగా అడుగులు వేస్తున్నాం’ అని రాహుల్ గాంధీ ఐదు హామీలను ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా ప్రకటించారు.
చదవండి: పేద మహిళలకు ఏటా రూ. లక్ష
देश के सभी अन्नदाताओं को मेरा प्रणाम!
— Rahul Gandhi (@RahulGandhi) March 14, 2024
कांग्रेस आपके लिए 5 ऐसी गारंटियां लेकर आई है जो आपकी सभी समस्याओं को जड़ से खत्म कर देंगी।
1. MSP को स्वामीनाथन आयोग के फार्मूले के तहत कानूनी दर्ज़ा देने की गारंटी।
2. किसानों के ऋण माफ़ करने और ऋण माफ़ी की राशि निर्धारित करने के लिए एक… pic.twitter.com/sfIUcdeW6t
పంటలకు కనీస మద్దుతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించటంతో పాటు ఇతర డిమాండ్ల సాధనకు దాదాపు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్నదాతలు ‘చలో ఢిల్లీ’ పేరుతోల నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికీ రైతులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు డిమాండ్లకు పెద్దపీట వేస్తూ ఐదు హామీలను ప్రకటించటం గమనార్హం.
చదవండి: రాహుల్ ‘యువ న్యాయ్’
Comments
Please login to add a commentAdd a comment