నీ సోదరిగా గర్విస్తున్నా..నువ్వెంత ధీశాలివో మాకు తెలుసు! | Lok Sabha elections 2024 Priyanka Gandhi Vadra lauds her brother Rahul Gandhi | Sakshi
Sakshi News home page

నీ సోదరిగా గర్విస్తున్నా..నువ్వెంత ధీశాలివో మాకు తెలుసు!

Published Wed, Jun 5 2024 12:16 PM | Last Updated on Wed, Jun 5 2024 3:35 PM

Lok Sabha elections 2024 Priyanka Gandhi Vadra lauds her brother Rahul Gandhi

2024 లోక్‌సభ  ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మిత్ర పక్షాలతో ఇండియా కూటమిగా ఏర్పడి  ‘అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌’  అంటూ నినదించిన బీజేపీకి భారీ షాకిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 328 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు  ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఎక్స్‌వేదికపై స్పందించారు. తన సోదరుడు రాహుల్‌ గాంధీపై ప్రశంసలు కురిపించారు.

 ‘వారు (బీజేపీ నేతలు) ఎంతఅవమానించినా, అవహేళన చేసినా, దూషించినా చాలా దృఢంగా నిలబడ్డావు.  అవహేళనలు, కష్టాలను చూసి ఎన్నడూ వెనక్కి  తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అనుమానించినా  విశ్వాసాన్ని కోల్పోలేదు.  ఎంతగా నీపై అవాస్తవాలు, అబద్ధాలతో విపరీతమైన ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరు ఆగలేదు. కోపం ద్వేసం, నీ దరి చేరనీయలేదు. సంయమనం కోల్పోలేదు.   ప్రతిరోజూ  నీపై ద్వేషాన్ని  కుమ్మరించినా నీ గుండెల్లోని  ప్రేమ, దయతోనే, నిజం కోసం పోరాడావు. ఇది వాళ్లందరికీ  ఇపుడు  అర్థం అవుతుంది. కానీ నువ్వెంత ధీశాలివో ఎల్లపుడూ మాలో కొందరికి తెలుసు.  నేను సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’   అంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. ఈసందర్భంగా ఒక కార్టూన్‌ను కూడా షేర్‌ చేశారు.

 

కాగా  బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఇప్పటికీ సగం సీట్లతో సరిపెట్టుకోవచ్చు, కానీ రాహుల్‌, ప్రియాంకా ద్వయం మాత్రం స్టార్‌ క్యాంపెయినర్లుగా నిలిచి బీజేపీ ఆశలకు భారీగా గండి కొట్టారు.  భారత్‌ జోడో యాత్రతో  రాహుల్‌ తమ శ్రేణుల్లో కొత్త ఉ‍త్సాహాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని యావద్దేశానికి చాటి చెప్పారు  రాహుల్‌గాంధీ. అంతేకాదు తల్లి, చెల్లి పట్ల బాధ్యతగా, ప్రేమగా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. అలాగే ప్రియాంకా 2024 ఎన్నికలలో ప్రసంగాల్లో బాగా రాణించారు. తన తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగాలాతో ఓటర్లను ఆకర్షించారు.  కాంగ్రెస్‌విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ కంచుకోటలైన,  అమేథీ ,రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ప్రచారాన్ని లీడ్‌ చేశారు. అంతేకాదు  గాంధీ కుటుంబ విధేయుడు కిషోరి లాల్ శర్మ విజయం కోసం శ్రమించారు. తద్వారా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించి 2019లో రాహుల్ గాంధీ ఓటమికి స్వీట్‌ రివెంజ్‌ తీర్చుకున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement