
ఓసీలపై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి
కాసిపేట : కేసీఆర్ దళితులను మోసం చేసినట్లుగా ప్రజలను మోసం చేయొద్దని, వెంటనే ఓపెన్‌కాస్టు(ఓసీ)లపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్‌పీ) అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని ఓసీ నిర్వాసిత గ్రామంగా మారనున్న దుబ్బగూడెంను సందర్శించారు. ప్రజలతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ఓసీలను అడ్డుకుంటామని ఎన్నికల సమయంలో ప్రచారం చేయడంతోనే ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని గుర్తు చేశారు.
ప్రజల భయాందోళనను తొలగించాలని అన్నారు. ఓసీకి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి పని చేస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే పేర్కొనడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పది రోజుల్లో ఓపెన్‌కాస్టులపై వైఖరి ప్రకటించుకుంటే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని, ఒక రోజు దీక్షలో పాల్గొంటామని తెలిపారు. ఓపెన్‌కాస్టు కేవలం 19గ్రామాల సమస్య కాదని, తెలంగాణలోని సింగరేణి ప్రాంతంలోని నాలుగు జిల్లాల సమస్యగా పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి ఉందని, ఇందులో భాగంగా దుబ్బగూడెంలో ఒక రోజు దీక్షలో పాల్గొని ఉద్యమం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అద్యక్షుడు కల్వల శరత్, అధికార ప్రతినిధి మంత్రి మల్లేష్, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ రజీహైదర్, టీఆర్‌ఎస్ నాయకుడు లంక లక్ష్మణ్, యూత్‌కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణ, మాజీ సర్పంచ్ కొండబత్తుల రాంచందర్, ప్రజాస్పందన వేదిక కన్వీనర్ సిలోజు మురళి, ఎమ్మార్పీఎస్ యూత్ అధ్యక్షుడు ఆదర్ల మహేందర్, గ్రామస్తులు బోగె పోశం, బోగ రామకృష్ణ, ఊట్ల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వర్గీకరణ కోసం దేశ వ్యాప్త ఉద్యమం
బెల్లంపల్లి : ఎస్సీ వర్గీకరణ కోసం దేశ వ్యాప్త ఉ ద్యమాన్ని చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించా రు. శనివారం పట్టణంలోని సింగరేణి కళావేదికలో నిర్వహించిన తూర్పు జిల్లా కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాల నుంచి ఏ, బీ, సీ, డీ వర్గీకరణ ఉద్యమం సాగుతోందన్నారు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో రెండుసార్లు వర్గీకరణను సాధించుకున్నా సాంకేతికంగా నిలిచిపోయిందని తెలిపారు. అత్యున్న త న్యాయవ్యవస్థలో మాల కులస్తులు ఉండి అ డ్డుకోవడం వల్ల వర్గీకరణ నిలిచిపోయిందని చె ప్పారు.
మలి దశ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయి నుంచి నిర్మించి దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని అ న్నారు. జిల్లాల వారీగా రెండు రాష్ట్రాల్లో సదస్సు లు నవంబర్ నెలాఖరు వరకు నిర్వహిస్తామని చెప్పారు. మహజన సోషలిస్టు పార్టీ కో ఆర్డినేటర్ ఎండి రజీహైదర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వల శరత్, జిల్లా అధికార ప్రతినిధి మంత్రి మల్లేశ్, జిల్లా నాయకులు మల్లారపు చిన్నరాజం, మంతెన కొమురయ్య, ఆయిళ్ల రామకృష్ణ, ఓరం రవీందర్, ఎం.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.