‘పచ్చ బంగారం’ ధర పలికేనా..! | will turmeric get minimum support price | Sakshi
Sakshi News home page

‘పచ్చ బంగారం’ ధర పలికేనా..!

Published Sat, Jan 20 2018 6:20 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

will turmeric get minimum support price - Sakshi

మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన పసుపు

బాల్కొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు సిరులు కురిపించి న పసుపుపంట ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. రాజన్న హయాంలో క్వింటాలు ధర రూ.17వేలు పలుకగా, నేడు గరిష్టంగా రూ.8 వేలు పలుకుతోంది. మరోవైపు జిల్లాలో పసుపుబోర్డు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటైతే మద్దతు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంటకు ఆశించిన ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 33వేల ఎకరాల్లో రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు తవ్వకాలు జోరందుకున్నా యి. రైతులు పసుపును మార్కెట్‌కు తరలిస్తు న్నారు. కాగా క్వింటాలుకు గరిష్టంగా రూ.8 వేలు, కనిష్టంగా రూ.6 వేల ధర పలుకుతోంది. దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పసుపు పంట సాగుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర పెట్టుబడి పెట్టి సాగు చేసే పంట కావడంతో రైతులకు మార్కెట్‌ ధర గిట్టుబాటు కావడం లేదు. కనీసం క్వింటాలుకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటేనే పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు.  

రాజన్న హయాంలో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007, 2008లో క్వింటాలు పసుపు ధర గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.12 వేలు పలికింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా పసుపు పంటను కొనుగోలు చేయడంతో రైతులకు మంచి ధర లభించింది. ధరలు నిలకడగా ఉండటంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. రాజన్న వ్యవసాయాన్ని పండగ చేశారు. పసుపుపంట సాగు చేస్తున్నప్పటి నుంచి అంత ధర దక్కలేదని రైతులు అంటున్నారు. అలాంటి ధరను ఎప్పుడు చూస్తామా.. అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పసుపు పంట సీజన్‌ వచ్చిన ప్రతిసారి రాజశేఖర్‌రెడ్డి పాలనలో వచ్చిన ధరను గుర్తు చేసుకుంటున్నారు.  

పాలకుల నిర్లక్ష్యంతో..
వైఎస్‌ మరణం తరువాత పాలకుల నిర్లక్ష్యం పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా పసుపు పంటకు క్వింటాలుకు రూ.4 వేల మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుందని కేంద్రానికి లేఖ రాశా రు. దీంతో పసుపు రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులను గురించి పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్ద కాలంగా మద్దతు ధర కోసం, పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తున్నా.. ఇప్పటికీ మోక్షం కలుగలేదు. పసుçపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పడంతో రైతుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా మోక్షం లభిస్తుందని రైతులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ వారికి నిరాశే మిగులుతోంది. పాలకులు స్పందించి పసుపు పంటకు కనీన మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement