‘ఎమ్‌ఎస్‌పీ తొలగిస్తే రాజీకీయాల నుంచి తప్పుకుంటా’ | Manohar Lal Khattar: Will Leave Politics If Someone Tries To Abolish MSP | Sakshi
Sakshi News home page

‘ఎమ్‌ఎస్‌పీ రద్దు చేస్తే రాజీకీయాల నుంచి తప్పుకుంటా’

Published Mon, Dec 21 2020 1:49 PM | Last Updated on Mon, Dec 21 2020 1:56 PM

Manohar Lal Khattar: Will Leave Politics If Someone Tries To Abolish MSP - Sakshi

చండీఘడ్‌: పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్‌ఎస్‌పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాక్‌ ఖట్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్‌ ఆదివారం మాట్లాడారు. ‘రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుంది. దానిని ఎవరైనా తొలగించాలని చూస్తే మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. ఎమ్‌ఎస్‌పీ ఎప్పటికీ రద్దు కాదు. ఎమ్‌ఎస్‌పీ గతంలో ఉంది. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. కాగా ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు ఆదివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి.
చదవండి: బీజేపీకి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి: అమిత్‌ షా
చదవండి: ఈ నెల 25న రైతులతో ప్రధాని మోదీ భేటీ

శనివారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిసిన మరునాడు ఖట్టర్‌ ఈ ప్రకటన చేశారు.  ‘చర్చల వల్లనే ఈ సమస్య (అన్నదాతల ఆందోళనలు ) పరిష్కారం అవుతుంది. త్వరలోనే ఈ సమస్య సమిసిపోతుందని భావిస్తున్నా. నూతన చట్టాలపై రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’ అని కేంద్రమంత్రితో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య మరో రౌండ్ చర్చలు జరపవచ్చని ఖట్టర్‌ పేర్కొన్నారు, కొత్త మూడు వ్యవసాయ చట్టాలపై తమ భయాలను మరింత వివరంగా చెప్పాలని నిరసన తెలుపుతున్న వ్యవసాయ సంఘాలను తోమర్‌ కోరారు. నిర్దిష్ట సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది అవసరమని, వారి ఆందోళనలో స్పష్టత లేదన్నారు. అదే విధంగా చర్చలకు ఓ తేదీని పేర్కొనాలని మంత్రి రైతులను కోరారు. చదవండి: ‘అలా జరగకపోతే రాజీనామా చేస్తా’

మరోవైపు ఒకట్రెండు రోజుల్లో రైతుల నిరసన బృందాలతో తోమర్‌ చర్చలు జరిపే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. "ఎప్పుడు జరుగుతుందో సరిగా తెలియదు కాని త్వరలోనే నిరసనకారుల డిమాండ్లను చర్చించడానికి తోమర్‌ రైతుల ప్రతినిధులను కలుసుకునే అవకాశం ఉంది" అని షా ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని విలేకరుల సమావేశంలో అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement