Manohar Lal Khattar
-
‘అమృత్’ స్కామ్.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం(నవంబర్ 11) ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి చెందిన శోద కంపెనీకి రూ.1100 కోట్ల రూపాయల టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టారని ఫిర్యాదులో తెలిపారు. రూ.2 కోట్ల లాభం కూడా లేని కంపెనీకి ఇంత పెద్ద టెండర్ ఇవ్వడం వెనుక ఏదో గోల్మాల్ జరిగిందన్నారున. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. టెండర్లు రద్దు చేయాలన్నారు.కాగా, గతంలో అమృత్ స్కామ్‌పై కేటీఆర్ మీడియా సమావేశాలు పెట్టి సీఎం రేవంత్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో బీజేపీ నేతలు కూడా రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్లు -
Haryana Assembly Elections 2024: బీజేపీలో చేరాలంటూ సెల్జాకు ఖట్టర్ ఆఫర్
చండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జాను బీజేపీలో చేరాల్సిందిగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానించారు. ప్రముఖ దళిత నేత కూడా అయిన సెల్జా వచ్చే నెలలో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రతరమైందని మంత్రి ఖట్టర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఘరువాండాలో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. -
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
బీజేపీ పాలిత ర్యానాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. పానిపట్‌లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్‌తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం.కాగా ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్) బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకుంటే కాంగ్రెస్‌కు బయటి మద్దతు ఇస్తానని ప్రకటించారు. -
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
చంఢిగఢ్: లోక్‌సభ ఎన్నికల వేళ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధావారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవటంతో బీజేపీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం పడదు. మాతో కూడా పలువురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. పలువురు నేతలు సైతం మాకు మద్దతుగా నిలుస్తున్నారు.వారిని రక్షించుకోవాలి.అయితే తర్వరలోనే తమతో ఎంతమంది టచ్‌లోకి వచ్చారన్న విషయంలో స్పస్టత వస్తుంది’ అని మనోహర్ లాల్ కట్టర్ అన్నారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించారు.ఈ లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ నేత అయిన ఖట్టర్.. కర్నాల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని మొత్తం పది స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.హర్యానాలో మొతం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాలీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే నిన్న ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీ కి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. -
హర్యానా సీఎం రాజీనామా
-
హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నుకుంది ఆ రాష్ట్ర బీజేఎల్పీ. మంగళవారం అక్కడి రాజకీయాల్లో ఒకదాని వెంట ఒకటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా.. ఆయన ప్రధాన అనుచరుడైన నాయబ్ ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు.. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. ఇదీ చదవండి: జేజేపీ అవుట్ చేసేందుకే బీజేపీ వ్యూహం! 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. -
సెక్యూరిటీ లేకుండా పబ్లిక్ లోకి వచ్చిన సీఎం..
-
బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్
చంఢీగర్: ఎలాంటి భద్రత లేకుండా బైక్ రైడ్ చేశారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై సీఎం ముందు వెళుతుండగా.. భద్రతా సిబ్బంది, అధికారులు ఆయనను అనుసరించారు. కర్నాల్ ఎయిర్‌పోర్టు వరకు బైక్ ప్రయాణం చేశారు. హరియాణాలో 'కార్ ఫ్రీ డే' సందర్భంగా సీఎం బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ను తగ్గించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. వారంలో ఓ రోజు కార్లను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించే సంకల్పంతో బైక్ రైడ్ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కర్నాల్‌లో ఈ ర్యాలీ చేపట్టారు. "कार फ्री डे" हो या "नशामुक्त हरियाणा" बनाने का संकल्प हो बिना जनसहयोग के पूरा नहीं हो सकता! “कार फ्री डे” पर करनाल एयरपोर्ट तक की यात्रा बाइक द्वारा करके, आज के दिन कार ट्रैफिक कम करने का एक छोटा सा प्रयास मेरा भी रहा। मुझे आशा है कि प्रदेश के जागरूक लोग इस सन्देश को आगे… pic.twitter.com/a5DQeDn1ky — Manohar Lal (@mlkhattar) September 26, 2023 ఇదీ చదవండి: బీజేపీ నేతపై లుక్అవుట్ నోటీసులు -
చంద్రయాన్-4లో నిన్ను పంపిస్తా.. మహిళతో హర్యానా సీఎం వెటకారం!
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఓ పేద మహిళ అడిగిన ప్రశ్నకు కోపంగా సమాధానం చెబుతూ వెటకారంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. తమ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరిన ఓ పేద మహిళను సీఎం ఖట్టర్ దారుణంగా అవమానించారు. ఈ సందర్భంగా ఆగ్రహానికిలోనైన ఖట్టర్.. ‘చంద్రయాన్-4తో నిన్ను కూడా పంపుతా.. కూర్చో’ అంటూ సదరు మహిళను ఉద్దేశించి వెటకారంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం ఖట్టర్ తీరుపై ప్రతిపక్షాలు నేతలు మండిపడుతున్నారు. ఖట్టర్ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పందిస్తూ.. ‘ఉపాధి చూపమని సదరు మహిళ సీఎంను కోరటం నేరమా? సీఎం ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజా సేవచేయడానికి ఎన్నుకోబడ్డ నాయకులు.. ప్రజలపైనే పరిహాసమాడుతున్నారు. ఇదే విధమైన డిమాండ్ ప్రధాని మోదీకి మిత్రులైన బడా కోటీశ్వరులు, కార్పొరేట్ల నుంచి వస్తే.. అప్పుడు మొత్తం హర్యానా ప్రభుత్వ యంత్రాంగమే వారి సేవలో నిమగ్నమయ్యేది’ అని ఆప్ ఎద్దేవా చేసింది. ఇక, కాంగ్రెస్ స్పందిస్తూ.. పేద మహిళ తన కష్టం చెప్పుకుంటే సీఎం ఖట్టర్‌కు నవ్వులాటగా ఉంది. మహిళల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. Apathy at display: A woman posed a request to Haryana CM Manohar Lal Khattar to establish a factory so that employment can be generated. He replies “Next time when Chandrayaan-4 is launched, we will send you to the moon.” #Haryana #ManoharLalKhattar @BJP4Haryana pic.twitter.com/44fLWJd9vA — NewsTAP (@newstapTweets) September 7, 2023 ఇది కూడా చదవండి: ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. లైవ్ అప్డేట్స్ -
నిన్ను చంద్రయాన్ ఎక్కిస్తా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చండీగఢ్: ఇటీవల నూహ్ అల్లర్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన హర్యానా రాష్ట్రం తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన మరోసారి వార్తల్లో నిలిచింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌కు ఓ మహిళ తన గోడు వినిపించగా సీఎం వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల సీఎం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. ఇంకేముంది ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఊరుకుంటాయా. సీఎం మాట్లాడిన వీడియోతో సహా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది. "अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।" धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं। महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt — AAP (@AamAadmiParty) September 7, 2023 BJP के मुख्यमंत्री की सोच देखिए... हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके। इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे। और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db — Congress (@INCIndia) September 7, 2023 ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్ -
హర్యానా ఘర్షణలు.. నుహ్ జిల్లాలో బుల్డోజర్ చర్యకు దిగిన ప్రభుత్వం
చండీగఢ్: మత ఘర్షణలతో హర్యానా రాష్ట్రం అట్టుడుకుతోంది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లతో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ చర్చ చేపట్టింది. హింసాకాండకు గురైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరు ఏరియాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివసిస్తున్న వసలదారుల గుడిసెలను అధికారులు కూల్చివేశారు. కాగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింసలో బయటి వ్యక్తులు(చొరబాటుదారులు) పాల్గొన్నారని పోలీసులతోపాటు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సైతం ఆరోపించారు. ఈ క్రమంలో అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలుగా భావించి బుల్డోజర్ యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఖట్టరే ఈ కూల్చివేతలకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ శరణార్థులు.. ఇటీవల హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి మార్గంలో వార్డు నంబర్ వన్‌లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించి, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. చదవండి: హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు -
పెళ్లి కాని వారికి గుడ్‌న్యూస్.. ప్రతీ నెలా 2,750 పెన్షన్
చండీఘడ్: హర్యానా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెళ్లి కాని యువతీ యువకుల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీమ్‌ను ప్లాన్ చేసింది. హర్యానాలో వివాహం చేసుకోని వారికి ప్రతీ నెలా రూ.2,750లను పెన్షన్‌గా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాల ప్రకారం.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హర్యానాలో పెళ్లి కాని ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రతి నెలా రూ.2,750 ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, ఈ స్కీమ్ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే వర్తించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అవివాహిత పెన్షన్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 లక్షలకు తక్కువగా ఉండాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. మరోవైపు.. హర్యానాలో వితంతవులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువులకు కూడా పెన్షన్‌ను అందించనున్నట్టు సీఎం ఖట్టర్ ప్రకటించారు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వితంతువులకు ప్రతినెలా రూ.2750 ఇవ్వనున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలనే నిబంధనను విధించారు. मैं घोषणा करता हूं कि हरियाणा के 45 से 60 वर्ष तक की आयु वाले अविवाहित पुरुष व महिलाओं को अब से ₹2,750 मासिक पेंशन दी जाएगी। ₹1.80 लाख से कम वार्षिक आय वाले व्यक्तियों को इस पेंशन का लाभ मिलेगा। इसके अलावा 40-60 वर्ष आयु तक के विधुर पुरुष, जिनकी वार्षिक आय ₹3 लाख से कम है… pic.twitter.com/Jwn5fO5sWp — Manohar Lal (@mlkhattar) July 6, 2023 ఇది కూడా చదవండి: మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు.. ఎంపీ ఎన్నిక రద్దు.. -
Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కన్నుమూత
చండీగఢ్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కటారియా(72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో (న్యుమోనియా) బాధపడుతున్న రతన్‌లాల్.. చండీగఢ్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని అంబాలా నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 నుంచి 2021 వరకు రతన్‌లాల్ కేంద్రమంత్రిగా పనిచేశారు. కేంద్ర జల్‌శక్తి, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కటారియా మృతిపట్ల హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, స్పీకర్ జియాన్ చంద్ గుప్తా సంతాపం తెలిపారు. గురువారం సాయంత్రం అధికార లాంఛనాలతో రతన్‌లాల్ కటారియా అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అంబాలా లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జాపై 57 శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అంతకు ముందు 1999, 2014లో అంబాలా నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కుమారి సెల్జా చేతిలో ఓటమిని చవిచూశారు. చదవండి: హైదరాబాద్‌కు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. 1200 మందికి ఉపాధి -
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. ఆరుగురు యువకులు మృతి
చండీగఢ్: హర్యానాలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మహేంద్రగఢ్, సోనిపత్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన వేరు వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మహేంద్రగఢ్‌లో ఏడు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కాలువలోకి దిగిన 9 మంది యువకులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఐదుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనిపత్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సరయూ నదిలోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయారు. ఈ విషాద ఘటనలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లి వీరంతా ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే సహాయక చర్యల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసించారు. महेंद्रगढ़ और सोनीपत जिले में गणपति विसर्जन के दौरान नहर में डूबने से कई लोगों की असामयिक मृत्यु का समाचार हृदयविदारक है। इस कठिन समय में हम सभी मृतकों के परिजनों के साथ खड़े हैं। NDRF की टीम ने कई लोगों को डूबने से बचा लिया है, मैं उनके शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ। — Manohar Lal (@mlkhattar) September 9, 2022 చదవండి: అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే.. -
సీబీఐ చేతికి సోనాలి ఫోగట్ మృతి కేసు?
గోవా: హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు. మృతికి కొద్ది గంటల ముందు జరిగిన సంఘటనలకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే సోనాలి మృతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తామని తెలిపారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఫోగట్ కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఈ మేరకు వెల్లడించారు సీఎం. ‘హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నాతో మాట్లాడారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయను కలిసి సీబీఐ దర్యాప్తు జరపాలని కోరిన క్రమంలో.. అదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ రోజు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక.. అవసరమైతే కేసును సీబీఐకి అప్పగిస్తాం.’ అని తెలిపారు ప్రమోద్ సావంత్. సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్‌ను శనివారం కలిశారు. నటి మృతి కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం.. సీబీఐ దర్యాప్తు కోసం గోవా ప్రభుత్వానికి లేఖ రాస్తామని హరియాణా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోకరి అరెస్ట్.. సోనాలి ఫోగట్ మృతి కేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. నిందితులు సోనాలి వెళ్లిన క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ దత్తప్రసాద్ గోయంకర్, ఎడ్విన్ నన్స్‌గా తెలిపారు. తాజాగా ఆదివారం మరో డ్రగ్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: సోనాలి ఫోగట్‌ను ఎవరు చంపారో తేల్చాలి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా కావొద్దు -
విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు. చదవండి: (శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం) -
మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు!
చండీఘడ్: రాష్ట్రంలోని మైనింగ్ జోన్లో శనివారం కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 15 నుంచి 20 మంది ఘటనలో చిక్కుకున్నారు. తోషమ్ బ్లాక్‌లోని దాడం మైనింగ్ జోన్లో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న మైనింగ్ ఏరియాలో వాహనాల్లో వేరే ప్రాంతాలకు వెళ్తున్న కార్మికులపై కొండచరియలు విరిగిపడటంతో, వాహనాల్లో కార్మికులందరూ చిక్కుకున్నట్లు సమాచారం. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్లు, క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించడానికి జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ట్విటర్ వేదికగా తెలిపారు. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ హుటాహుటిన చేరుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి తరలించామని, ఇద్దరు మృతి చెందారని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మీడియాకు తెలిపారు. కాగా దాడం మైనింగ్ ప్రాంతం, ఖనాక్ పహారీలో మైనింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. ఐతే కాలుష్యం కారణంగా నేషనల్ గ్నీన్ ట్రిబ్యునల్ విధించిన రెండు నెలలు నిషేధాన్ని గురువారం ఎత్తివేయగా శుక్రవారం నుంచి మైనింగ్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. నిషేధం తర్వాత కేవలం ఒక్క రోజులోనే ఇంత పెద్ద ప్రమాదం జరడగంతో తాజా సంఘటన చర్చనీయాంశమైంది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ -
సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
చంఢీఘడ్: 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత రెజ్లర్ వీరేందర్ సింగ్ యాదవ్ అలియాస్ గుంగా పహిల్వాన్.. హర్యానా(అతని సొంత రాష్ట్రం) రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టాడు. బధిర క్రీడాకారులను పారా అథ్లెటుగా గుర్తించాలంటూ, పారా అథ్లెట్లతో సమానంగా తమకు కూడా హక్కులు కల్పించాలంటూ తాను సాధించిన పద్మ శ్రీ, అర్జున అవార్డులతో సీఎం ఇంటి ముందు గల ఫుట్‌పాత్‌పై కూర్చొని నిరసన తెలిపాడు. माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी आपके आवास दिल्ली हरियाणा भवन के फुटपाथ पर बैठा हूँ और यहाँ से जब तक नहीं हटूँगा जब तक आप हम मूक-बधिर खिलाड़ियों को पैरा खिलाड़ियों के समान अधिकार नहीं देंगे, जब केंद्र हमें समान अधिकार देती है तो आप क्यों नहीं? @ANI pic.twitter.com/4cJv9WcyRG — Virender Singh (@GoongaPahalwan) November 10, 2021 ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. బధిర క్రీడాకారుల సమస్యలపై హరియాణా సీఎం స్పందించాలని కోరాడు. మంగళవారం(నవంబర్ 9) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న వీరేందర్.. గంటల వ్యవధిలోనే బధిర అథ్లెట్ల హక్కుల కోసం నిరవధిక నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కాగా, హరియాణాలోని సస్రోలిలో జన్మించిన వీరేందర్‌కు వినబడదు, మాట్లాడలేడు. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
సైకిల్‌పై సీఎం సందడి: కొత్త స్కీం
చండీగఢ్: వరల్డ్ కార్ ఫ్రీ డే సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్‌పై సందడి చేశారు. కాలుష్య నివారణపై అవగాహన కల్పించేలా తన మంత్రి వర్గ సహచరులు, ఇతర ఎమ్మెల్యేలతో సైకిల్‌యాత్ర చేపట్టారు. తన అధికారిక నివాసం నుండి సెక్రటేరియట్ వరకు సైకిల్‌పై వచ్చి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ మంత్రి జేపీ దలాల్, రవాణా శాఖ మంత్రి మూల్‌చంద్ శర్మ సైకిల్‌పై పౌర సచివాలయానికి చేరుకోవడం విశేషం. (World Car Free Day: ఎంచక్కా సైకిల్‌పై షికారు చేద్దాం!) ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 75 సంవత్సరాల పైబడిన పాత చెట్ల నిర్వహణ నిమిత్తం, ప్రాణ వాయు దేవత పెన్షన్ యోజన పేరిట ఏడాదికి రూ.2,500 పెన్షన్ అందజేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను ఈ పథకంలో చేర్చడం ద్వారా పరిరక్షణకు చర్యలు చేపడతా మన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఇస్తున్న హరియాణా ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని తీసుకురానుంది. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, ఖట్టర్ చండీగఢ్ నుండి కర్నాల్ వరకు రైలులో ప్రయాణించారు. అలాగే సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. #WATCH | Haryana Chief Minister Manohar Lal Khattar* rides a bicycle along with his cabinet colleagues and MLAs from his residence to the secretariat in Chandigarh to observe #Worldcarfreeday pic.twitter.com/ME0dt31MJl — ANI (@ANI) September 22, 2021 -
ఏసీ హాల్లో ఎందుకు? గ్రౌండ్లో కూడా పెళ్లి చేసుకోండి: నితిన్ గడ్కరీ
సాక్షి, చండీగఢ్: కేంద్ర మంత్రులు పలు సమస్యలపై ప్రశ్నిస్తే వింతగా సమాధానమిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. టోల్ గేట్ల ధరల పెంపుపై ప్రశ్నించగా వింతగా సమాధానమిచ్చారు. ‘డబ్బులు చెల్లిస్తే మంచి రోడ్లు వస్తాయి’ అని పేర్కొన్నారు. దానికో ఉదాహరణ కూడా వివరించి సోషల్ మీడియాలో నెటిజన్లకు చిక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యలేంటో తెలుసుకోండి. చదవండి: 2023లోనూ టీఆర్ఎస్దే విజయం హరియాణాలోని సోహ్నాలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (డీఎంఈ) పనులను గురువారం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసీ హాల్లో వివాహం చేసుకుంటే డబ్బులు చెల్లించాలి. అదే మైదానంలో అయితే ఏం ఖర్చు ఉండదు. అక్కడ కూడా చేసుకోవచ్చు’ అని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ హైవేలపై టోల్ చార్జీలతో ప్రయాణ వ్యయం పెరుగుతుండడంపై ఆయన ఇచ్చిన ఉదాహరణ. అంతటితో ఆగకుండా మరికొంత ఉదాహరిస్తూ.. ‘ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే వినియోగిస్తే 12 గంటల్లో ప్రయాణించొచ్చు. ఎక్స్‌ప్రెస్ వేతో ప్రమాణ సమయం తగ్గుతుంది. ఇంధన ధర తగ్గుతుంది. అదే ఓ ట్రక్కు ముంబై నుంచి ఢిల్లీ చేరడానికి 48 గంటలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్ వేతో ఎక్కువ ట్రిప్పులు తిరగొచ్చు. దాని ద్వారా వ్యాపారం మరింత చేసుకోవచ్చు’ అని తెలిపారు. మెరుగైన రోడ్లు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించక తప్పదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. చదవండి: బీజేపీ సరికొత్త ప్రయోగం.. వారికి నో ఛాన్స్ దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ వేను ఢిల్లీ- ముంబై మధ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న 1,380 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్ వే పనులు 2023లో పూర్తి చేయాలనే లక్ష్యం. ఆ పనులు ముమ్మరం చేయడంలో భాగంగా నితిన్ గడ్కరీ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి పరిశీలించారు. భవిష్యత్‌లో రోడ్లపై విమానాలు దిగే మాదిరి అత్యంత నాణ్యతతో ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
పారాలింపిక్స్ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన షూటర్లకు హర్యానా ప్రభుత్వం శనివారం భారీ నజరానా ప్రకటించింది. 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాధించగా, సింఘ్ రాజ్ అధనా రజత పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న మనీష్ నర్వాల్‌కు రూ .6 కోట్లు, రజత పతకం సాధించిన సింఘ్ రాజ్ అధనాకు రూ.4 కోట్లు రివార్డు ను ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. పతకాలు గెలిచిన ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వనున్నట్లు హర్యానా సర్కార్ ప్రకటించింది. కాగా అంతకముందు పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్ ఆంటిల్‌కు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రూ .6 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు. డిస్కస్ త్రో ఎఫ్ -56 లో రజత పతకం సాధించినందుకు యోగేష్ కథునియాకు కూడా రూ. 4 కోట్ల రివార్డును ఆయన ప్రకటించారు. ఈ ఇద్దరు అథ్లెట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: Tokyo Paralympics 2021: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం.. -
హాకీ క్రీడాకారిణులకు 50 లక్షల నజరానా
Indian Women Hockey Team Wins Hearts: కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శనను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్ ఆడిన జట్టులో భాగమైన తమ రాష్ట్ర హాకీ క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. మొత్తం తొమ్మిది మందికి ఈ నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోరాట పటిమ కనబరిచారంటూ హాకీ జట్టుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా భారత మహిళా హాకీ ఒలింపిక్ చరిత్రలో రాణి సేన తొలిసారి సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్లో ఓడిన అమ్మాయిలు.. శుక్రవారం కాంస్యం కోసం జరిగిన పోరులో బ్రిటన్‌తో హోరాహోరీగా పోరాడారు. కానీ, చివరి క్వార్టర్లో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించడంతో 4-3 తేడాతో ఓటమి పాలయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Haryana Government will award Rs 50 lakhs each to the nine members of the Olympics women's hockey team who are from Haryana. I congratulate the Indian team for their praiseworthy performance at the Tokyo Olympics. — Manohar Lal (@mlkhattar) August 6, 2021 -
బీజేపీకి ఊరట: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
చండీగఢ్: హర్యానాలో బీజేపీకి ఊరట లభించింది. రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీజేపీ-జేజేపీ కూటమికి 55 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు కేవలం 32 ఓట్లు మాత్రమే లభించాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్ సర్కార్ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా అరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌పైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా ఆరోపించారు. చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్ -
బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..
చండీఘడ్: హర్యానా రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమి చిక్కుల్లో పడింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిడంతో రేపు అసెంబ్లీలో ఓటింగ్ జరుగనుంది. మొత్తం 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలుండగా, మిత్రపక్షం జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 మంది శాసనసభ్యులున్నారు. బీజేపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవాలి అంటే 45 మంది సభ్యుల మద్దతు అవసముంటుంది. సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రానికి చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలను చేపడుతన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలైన చోటు చేసుకోవచ్చని నిఘా వర్గాల సమాచారంతో కాషాయ కూటమి అలర్ట్ అయ్యింది. కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అధికార కూటమికి 50 మంది శాసనసభ్యులు, కాంగ్రెస్‌కు 30, ఇతర పార్టీలకు 8 మంది శాసనసభ్యులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరుకావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్ జారీ చేశారు. ఇటు బీజేపీ, జేజేపీ లు కూడా విప్ జారీ చేసాయి. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని మిత్రపక్షం జేజేపీ ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
‘ఎమ్ఎస్పీ తొలగిస్తే రాజీకీయాల నుంచి తప్పుకుంటా’
చండీఘడ్: పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్ఎస్పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాక్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడంపై రగడ కొనసాగుతున్న తరుణంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్ ఆదివారం మాట్లాడారు. ‘రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుంది. దానిని ఎవరైనా తొలగించాలని చూస్తే మనోహర్‌లాల్ ఖట్టర్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. ఎమ్ఎస్పీ ఎప్పటికీ రద్దు కాదు. ఎమ్ఎస్పీ గతంలో ఉంది. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. కాగా ద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు ఆదివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. చదవండి: బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: అమిత్ షా చదవండి: ఈ నెల 25న రైతులతో ప్రధాని మోదీ భేటీ శనివారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసిన మరునాడు ఖట్టర్ ఈ ప్రకటన చేశారు. ‘చర్చల వల్లనే ఈ సమస్య (అన్నదాతల ఆందోళనలు ) పరిష్కారం అవుతుంది. త్వరలోనే ఈ సమస్య సమిసిపోతుందని భావిస్తున్నా. నూతన చట్టాలపై రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’ అని కేంద్రమంత్రితో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య మరో రౌండ్ చర్చలు జరపవచ్చని ఖట్టర్ పేర్కొన్నారు, కొత్త మూడు వ్యవసాయ చట్టాలపై తమ భయాలను మరింత వివరంగా చెప్పాలని నిరసన తెలుపుతున్న వ్యవసాయ సంఘాలను తోమర్ కోరారు. నిర్దిష్ట సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది అవసరమని, వారి ఆందోళనలో స్పష్టత లేదన్నారు. అదే విధంగా చర్చలకు ఓ తేదీని పేర్కొనాలని మంత్రి రైతులను కోరారు. చదవండి: ‘అలా జరగకపోతే రాజీనామా చేస్తా’ మరోవైపు ఒకట్రెండు రోజుల్లో రైతుల నిరసన బృందాలతో తోమర్ చర్చలు జరిపే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. "ఎప్పుడు జరుగుతుందో సరిగా తెలియదు కాని త్వరలోనే నిరసనకారుల డిమాండ్లను చర్చించడానికి తోమర్ రైతుల ప్రతినిధులను కలుసుకునే అవకాశం ఉంది" అని షా ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని విలేకరుల సమావేశంలో అన్నారు.