![another rape incident in Haryana's Fatehabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/18/RAPE-MURDER.jpg.webp?itok=xqTj4pis)
ఫతేహాబాద్ : ‘కురుక్షేత్ర నిర్భయ’ ఘటనపై ఆందోళనలు చల్లారకముందే హరియాణాలో మరో ఘోరం జరిగింది. ఫతేహాబాద్ జిల్లా భుథాన్ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు యువకులు దాడిచేసి, పారిపోయారు. ఈ ఘటనపై ఫతేహాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఎస్‌హెచ్‌వో బీమ్లాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.
సీఎం స్పందన : రాష్ట్రంలో వరుసగా జరుగుతోన్న హత్యలు, అత్యాచారా ఘటనలపై ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారంటూ ముగ్గురు ఐజీ స్థాయి అధికారులపై బదిలీవేటు వేశారు. వేధింపులపై ఫిర్యాదుచేయాలనుకునే మహిళలు 1090 లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఎం ఖట్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment