Fatehabad
-
ఇండియాలో ఐస్‌క్రీం అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ!
జమ్మూకశ్మీర్‌లోని పెహల్గావ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో మన దేశంలో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వారిని తమ దేశానికి పంపించేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దాయాది దేశంలో న్యాయం దొరక్కపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మనదేశానికి వలస వచ్చి బతుకుబండిని లాగిస్తున్న పాకిస్తాన్ మాజీ ఎంపీ ఒకరు వెలుగులోకి వచ్చారు.పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎంపీ దబయా రామ్.. బండిపై ఐస్‌క్రీములు అమ్ముతూ హరియాణాలో జీవిస్తున్నారు. ఫతేహాబాద్ జిల్లాలోని రతియా తహసీల్ పరిధిలోని రతన్‌గఢ్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఇటీవల ఆయనను విచారించినట్టు న్యూస్ 18 వెల్లడించింది. విచారణ ముగిసిన తర్వాత రత్తన్గఢ్ గ్రామానికి తిరిగి వెళ్లేందుకు ఆయనను పోలీసులు అనుమతించారని తెలిపింది. దబయా రామ్ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు భారత పౌరసత్వం (Indian citizenship) పొందారు. మిగిలిన 28 మంది ఇప్పటికీ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్నారు.రక్షణ కోసం ఇండియాకు వలస దేశ విభజనకు రెండేళ్ల ముందు పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో దబయ రామ్ (Dabaya Ram) జన్మించాడు. 1947 తర్వాత కూడా ఆయన అక్కడే నివసించాడు. మతం మారాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా దబయ రామ్, ఆయన కుటుంబం తలొగ్గలేదు. 1988లో లోహియా, బఖర్ జిల్లాల నుంచి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన పదవీకాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తమ బంధువుల్లో ఓ మహిళను మతోన్మాదులు కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిచేసుకున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన దబయ రామ్‌కు చుక్కెదురైంది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు (Pakistan Supreme Court) ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. అక్కడవుంటే తమకు రక్షణ లేదని భావించిన దబయ రామ్ కుటుంబంతో సహా 2000 సంవత్సరంలో పాకిస్తాన్‌ను విడిచిపెట్టాడు.ఆరుగురికి భారత పౌరసత్వంబంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి ఒక నెల వీసాపై హరియాణాలోని రోహ్తక్కు వచ్చారు. తర్వాత రతన్‌గఢ్ గ్రామంలో (Rattangarh village) స్థిరపడ్డారు. తన పెద్ద కుటుంబాన్ని పోషించడానికి దబయ రామ్ ఐస్‌క్రీమ్ వాలాగా మారారు. సైకిల్ రిక్షాపై కుల్ఫీలు, ఐస్‌క్రీమ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఏడుగురు పిల్లలు వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. మొత్తం 34 మంది కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురికి భారత పౌరసత్వం దక్కింది. మిగిలిన 28 మంది దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. దబయ రామ్ మొదట్లో ఒక నెల వీసాపై తన కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చాడు. 2018 వరకు ఏటా వీసా గడువును పొడిగించుకుంటూ నెట్టుకొచ్చాడు. మొదట్లో సంవత్సరం పాటు వీసా గడువు పొడిగింపు దక్కింది. తర్వాత ఐదేళ్ల పాటు అనుమతులు లభించాయి.చదవండి: పాకిస్తాన్‌పై భారత్ ఆర్థిక యుద్ధంవారికి మినహాయింపుపెహల్గావ్ దాడి తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు 537 మంది పాకిస్తాన్ పౌరులు ఇండియా నుంచి తిరిగివెళ్లారు. అలాగే పాకిస్తాన్ నుంచి 240 మంది భారతదేశంలోకి ప్రవేశించారు. వారిలో 50 మంది NORI (నో అబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా) వీసాదారులు ఉన్నారు. పాకిస్తానీయులు ఏప్రిల్ 29లోపు దేశం విడిచి వెళ్లాలని భారత్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కొంత మందికి మాత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) మినహాయింపు ఇచ్చింది. దీర్ఘకాలిక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న పాకిస్తానీ హిందువులను బహిష్కరణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీర్ఘకాలిక వీసాకు అర్హత ఉండి, దరఖాస్తు చేసుకోని హిందూ వలసదారులకు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనే షరతు విధించింది. -
దొంగల తెలివి మామూలుగా లేదు.. 3 రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేశారు..
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో దొంగిలించిన బైక్ రూపు రేఖలు మార్చి మూడు రోజుల్లోనే రాష్ట్రాలు దాటించేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి బైక్ యజమాని తెలిపిన వివరాల మేరకు.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉదయ్‌శంకర్ పాత్రో మే 27న తన బండిని పోగొట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎంతగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడకు మూడు రోజుల తర్వాత ఆగ్రాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతియాబాద్ పోలీసుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ వాహన తనిఖీల్లో పోలీసులకు ఓ బండి దొరికిందని, ఇంజిన్ వివరాలను పరిశీలిస్తే పలాసకు చెందిన బైక్ అని నిర్ధారణ జరిగిందని వారు చెప్పారు. అయితే ఆ వాహనం ఫొటోలు చూసి ఉదయశంకర్ పోల్చుకోలేకపోయారు. తన బండి అలా ఉండదని చెప్పేశారు. కానీ అక్కడి పోలీసులు మాత్రం ఇంజిన్ వివరాలు మీ పేరు మీదే ఉన్నాయని స్పష్టం చేశారు. ట్యాంక్ కవర్ చింపేసి, అద్దాలు తీసేసి రూపురేఖలు మార్చేశారని వివరించారు. దీంతో ఆయన వెంటనే ఫతియాబాద్ వెళ్లి వాహనాన్ని పరిశీలించి అక్కడి పోలీసులకు సీ–బుక్ చూపించడంతో వివరాలన్నీ సరిపోయాయి. దీంతో ఆయనకు ష్యూరిటీపై బైక్‌ను తిరిగి అప్పగించారు. బైక్ దొంగతనాలు చేస్తున్న దొంగలు తెలివి మీరిపోయారని, రెండు మూడు రోజుల్లోనే బైక్ రూపురేఖలు మార్చేసి లారీలు ఎక్కించి రాష్ట్రాలు దాటించేస్తున్నారని బాధితుడు తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చదవండి: AP: కేఆర్ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
ఐఎన్ఎల్డీ ర్యాలీకి పవార్, నితీశ్, ఠాక్రే
న్యూఢిల్లీ: హరియాణాలోని ఫతేబాద్‌లో ఈ నెల 25వ తేదీన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) తలపెట్టిన ర్యాలీకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే నేత కళిమొళి ఈ సమావేశంలో పాల్గొంటారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. మాజీ ఉప ప్రధాని, ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని చేపట్టే ఈ కార్యక్రమానికి ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా వస్తామని తెలిపారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా చారిత్రక ఘట్టం కానుందని పేర్కొన్నా రు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కూడా ఐఎన్ఎల్ డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానాలు పంపారన్నారు. -
మరో నిర్భయ.. రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం.. ఆ తర్వాత..
రన్నింగ్‌లో రైలులో దారుణం జరిగింది. ఒంటిరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళ(30)పై కన్నేసిన కొందరు మృగాలు రెచ్చిపోయారు. ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేయగా.. ప్రతిఘటించడంతో నడుస్తున్న రైలులో నుంచి బయటకు తోసేశారు. దీంతో ఆమె మృతిచెందింది. ఈ షాకింగ్ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధితురాలు తన కొడుకు(9)తో కలిసి ఫతేబాద్ జిల్లాలోని రోహతక్ నుంచి రైలుతో తోహానాకు వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని కొందరు వ్యక్తులు గుర్తించారు. ఆమెపై కన్నేసి.. లైంగిక దాడియత్నం చేశారు. దీంతో, బాధితురాలు వారిని ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో నిందుతులు ఆమెను.. నడుస్తున్న రైలులో నుంచి బయటకు తోసేశారు. అనంతరం, వారు కూడా రైలులో నుంచి బయటకు దూకేశారు. కాగా, రైలు తోహానా స్టేషన్‌కు చేరుకోగానే ఏడుస్తున్న తన కొడుకును చూసి బాధితురాలి భర్త ఆందోళనకు గురయ్యాడు. తల్లి ఎక్కడ అని అడగడంతో జరిగిన విషయాన్ని అతనికి తెలిపాడు. దీంతో.. ఆమె భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో "తాను(బాధితురాలు) స్టేషన్‌కు 20 కి.మీ దూరంలో ఉన్నపుడు తన మొబైల్‌కి కాల్ చేసింది. స్టేషన్‌కి వచ్చి పికప్ చేసుకోవాలని కోరినట్టు పోలీసులకు వివరించాడు. దీంతో, రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు.. ఆమె కోసం రైల్వే ట్రాక్ వెంట వెతికారు. ఈ క్రమంలో ట్రాక్ పక్కన పొదల్లో ఆమె డెడ్‌బాడీని గుర్తించారు. కాగా, మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వారిలో ఒక నిందితుడిగా సందీప్ (27)ను గుర్తించి అరెస్ట్ చేసినట్టు ఫతేబాద్ పోలీసు చీఫ్ అస్తా మోదీ తెలిపారు. కాగా, బాధితురాల ప్రయాణిస్తున్న సమయంలో రైలు కోచ్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో ఇలా జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం : 8 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్ ఫతేబాద్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెలుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8మంది మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
‘నా భార్యతో నీకేంట్రా పని?’
తన భార్యతో చనువుగా మాట్లాడుతున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని చితకబాదిన భర్తను హర్యానా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పట్టపగలే ఈ దాడి చోటు చేసుకోవటం, పైగా వీడియో వైరల్ కావటం.. దానికితోడు బాధితుడు ఫిర్యాదు చేయటంతో సదరు శాడిస్ట్ భర్తను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే... చండీగఢ్: ఫతేహాబాద్ జిల్లా రటియా పట్టణంలో కరమ్‌జీత్ తన భార్యతో నివసిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం లవ్లీ అనే స్నేహితుడితో బైక్‌పై బస్టాండ్ మీదుగా వెళ్తున్నాడు. ఆ సమయంలో బస్టాండ్‌లో కరమ్‌జీత్ భార్య, మందమ్ సింగ్ అనే వ్యక్తితో మాట్లాడుతూ కనిపించింది. అది గమనించిన కరమ్ వాళ్ల దగ్గరికి వెళ్లి నిలదీశాడు. తాము చిన్ననాటి స్నేహితులమని, క్యాజువల్‌గా కలుసుకున్నామని వాళ్లు వివరణ ఇచ్చే యత్నం చేశారు. అయితే కరమ్ మాత్రం సమాధానం పూర్తయ్యేలోపే మందన్‌పై పిడిగుద్దులు గుప్పించాడు. వద్దని భార్య వేడుకుంటున్నా.. ఆమెను పక్కకు తోసేశాడు. ఇంతలో కరమ్‌కు అతని స్నేహితుడు కూడా తోడు కావటం, ఆపై మరికొందరు స్థానికులు కూడా వాళ్లకు కలవటంతో మందమ్‌ను చిత్తుగా కొట్టేశారు. స్థానికులు వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప.. రక్షించే యత్నం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మందన్‌ను ఆస్పత్రికి తరలించారు. వీడియో కాస్తా వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొట్టింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కరమ్, లవ్లీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని గుర్తించాల్సి ఉందని స్థానిక ఎస్సై తెలిపారు. ఇదిలా ఉంటే అనుమానంతో తన భర్త తరచూ హింసించే వాడని, మందమ్‌ను కొట్టొద్దని వేడుకున్నా కనికరించలేదని కరమ్‌జీత్ భార్య చెబుతున్నారు. ఈ మేరకు భర్తపై వేధింపుల ఫిర్యాదు కూడా ఆమె చేయటం విశేషం. మరిన్ని కథనాలు... మెసేజ్‌లో పెళ్లి ప్రపోజల్.. బావతో పెళ్లి.. అక్క మర్డర్ -
దారుణం : విషం ఇచ్చి మరీ అత్యాచారం..
చండీగఢ్: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. పదోతరగతి చదువుతోన్న ఓ విద్యార్థికి విషం ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి మైనర్, మరో ఇద్దరు బాధితురాలికి బంధువులు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేహాబాద్ జిల్లాలోని భట్టుకలాన్ గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు దుండగులు మంగళవారం కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అనంతరం ఆమెను ఊరి చివర ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెకి విషం ఇచ్చాడు. దీంతో ఆమె స్పృహ కోల్పొంది. అనంతరం ఆమెను ఇంటికి సమీపంలో వదిలి పారిపోయారు. కాగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. కూతురు ఆచూకీ కోసం వెతికారు. ఇంతలోనే ప్రాణప్రాయ స్థితిలో ఉన్న కూతురిని ఇంటి ముందు చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. కాగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గిరిలో మైనర్ బాలుడిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు తప్పించుకున్నారని, హరియాణా డీఎస్పీ(హెడ్‌క్వార్టర్స్) గురుదయాళ్ సింగ్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
హరియాణాలో మరో ఘోరం
ఫతేహాబాద్ : ‘కురుక్షేత్ర నిర్భయ’ ఘటనపై ఆందోళనలు చల్లారకముందే హరియాణాలో మరో ఘోరం జరిగింది. ఫతేహాబాద్ జిల్లా భుథాన్ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు యువకులు దాడిచేసి, పారిపోయారు. ఈ ఘటనపై ఫతేహాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఎస్‌హెచ్‌వో బీమ్లాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. సీఎం స్పందన : రాష్ట్రంలో వరుసగా జరుగుతోన్న హత్యలు, అత్యాచారా ఘటనలపై ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారంటూ ముగ్గురు ఐజీ స్థాయి అధికారులపై బదిలీవేటు వేశారు. వేధింపులపై ఫిర్యాదుచేయాలనుకునే మహిళలు 1090 లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఎం ఖట్టర్ సూచించారు. -
ఇద్దరు యువతుల ఆత్మహత్య
ఫతేహాబాద్: బాగా చదువుకున్న ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న విదారక ఘటన హర్యానాలోని ఫతేహాబాద్ లో సంచలనం రేపింది. కోమల్(27), శిల్ప(25) అనే అక్కాచెల్లెళ్లు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. తమ తండ్రికి చెందిన లైసెన్స్ డ్ రివాల్వర్ తో మంగళవారం ఉదయం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన వీరి సోదరుడు హార్థిక్ రహేజా రక్తపు మడుగులో పడివున్న కోమల్, శిల్పను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఉద్యోగం రాలేదన్న నిస్పృహతో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కోమల్ ఎంకామ్ పూర్తి చేసింది. శిల్ప ఎంబీఏ చదివింది. వీరిద్దరి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. తల్లి సంతోశ్ టీచర్ గా పనిచేస్తోంది. తండ్రి మహేశ్ రహేజా వ్యాపారం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.