
న్యూఢిల్లీ: హరియాణాలోని ఫతేబాద్‌లో ఈ నెల 25వ తేదీన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) తలపెట్టిన ర్యాలీకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే నేత కళిమొళి ఈ సమావేశంలో పాల్గొంటారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు.
మాజీ ఉప ప్రధాని, ఐఎన్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని చేపట్టే ఈ కార్యక్రమానికి ఆర్‌జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా వస్తామని తెలిపారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా చారిత్రక ఘట్టం కానుందని పేర్కొన్నా రు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కూడా ఐఎన్‌ఎల్ డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానాలు పంపారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment