చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హర్యానా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఢిల్లీకి సమీపంలోని బహదూర్‌గఢ్ వద్ద ఆదివారం ఆయన హత్యకు గురయ్యారు. అయితే నఫె సింగ్ హత్యపై ఆయన కుటుంబ సభ్యలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నఫె సింగ్ రాథీ హత్యకు ఓ బీజేపీ నేతకు చెందిన కుటుంట సభ్యులే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారు.
అయితే గతేడాది ఓ బీజేబీ నేత కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి నఫె సింగ్ కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నఫె సింగ్‌ను సదరు బీజేపీ నేత కుటుంబ సభ్యులే అంతమొందించి ఉంటారని ఆరోపిస్తున్నారు. గతేడాది జనవరిలో బహదూర్‌గఢ్‌కు చెందిన మాజీ మంత్రి మాంగే రామ్ నంబార్దార్ కుమారుడు జగదీష్ రాథీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఓ ఆడియోక్లిప్‌ను విడుదల చేశాడు.
‘నఫె సింగ్ రాథీతో పాటు మరికొంత మంది 2019లో నా షాప్, పూర్వికుల నుంచి వచ్చిన కొంత భూమిని నా దగ్గర నుంచి అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. దాని కోసం నన్ను బెదిస్తున్నారు. నఫె సింగ్ రాథీ, ఇతరులపై కేసు కూడా నమోదు చేశాను. అయితే కోర్టులో వారికి ముందస్తు బెయిల్ లభించింది’ అని జగదీష్ రాథీ.. ఆడియోలో మాట్లాడారు. అప్పట్లో ఆ ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. నఫె సింగ్ హత్య కేసులో జగదీష్ రాథీ కుమారుడు గౌరవ్, సోదరుడు సతీష్ ఉన్నారు. నిందితుల్లో బీజేపీ నేత నరేంద్ర కౌశిక్, బహదూర్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సరోజ్ రాఠీ, ఇంకా ముగ్గురు బంధువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
‘నేను ఎప్పటి నుంటో అనుమానస్పద కదలికలను గమనిస్తూ ఉన్నా. అందుకే మా నాన్న(నఫె సింగ్ రాథీ) జిమ్‌కు వెళ్లడాన్ని కూడా అడ్డుకున్న. ఎప్పుడూ నా సోదరులు నాన్నకు భద్రత కల్పిస్తూ ఉన్నారు. చాలా సార్లు నాన్నను టార్గెట్ చేశారు. కానీ, భగవంతుడి దయతో ఆయన బయటపడ్డారు. కానీ, నిందితులు ఒకే అవకాశం కోసం ఎదురు చూశారు’ అని నఫె సింగ్ రాథీ కొడుకు జితేంద్రా మీడియాకు వెల్లడించారు.
మరోవైపు.. నఫే సింగ్ రాథీ హత్యపై హర్యానా ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. సీబీఐ విచారణతో సంతృప్తి చెందుతామని ఎమ్మెల్యేలంతా అనుకుంటే ఈ కేసును తప్పకుండా సీబీఐకే అప్పగిస్తామని ఆయన అసెంబ్లీలో హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment