ఇద్దరు యువతుల ఆత్మహత్య | Haryana: Two sisters allegedly shot themselves because of unemployment | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువతుల ఆత్మహత్య

Published Tue, Apr 5 2016 3:33 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

ఇద్దరు యువతుల ఆత్మహత్య

ఇద్దరు యువతుల ఆత్మహత్య

ఫతేహాబాద్: బాగా చదువుకున్న ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్న విదారక ఘటన హర్యానాలోని ఫతేహాబాద్ లో సంచలనం రేపింది. కోమల్(27), శిల్ప(25) అనే అక్కాచెల్లెళ్లు తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. తమ తండ్రికి చెందిన లైసెన్స్ డ్ రివాల్వర్ తో మంగళవారం ఉదయం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన వీరి సోదరుడు హార్థిక్ రహేజా రక్తపు మడుగులో పడివున్న కోమల్, శిల్పను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

ఉద్యోగం రాలేదన్న నిస్పృహతో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. కోమల్ ఎంకామ్ పూర్తి చేసింది. శిల్ప ఎంబీఏ చదివింది. వీరిద్దరి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. తల్లి సంతోశ్ టీచర్ గా పనిచేస్తోంది. తండ్రి మహేశ్ రహేజా వ్యాపారం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement