చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు.
జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్‌లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్‌మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్.
Comments
Please login to add a commentAdd a comment