Jalebi
-
హర్యానాలో ఆసక్తి రేపుతున్న జిలేబి పాలిటిక్స్
-
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ట్రెండింగ్‌లో ‘జిలేబీ’
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌నిచ్చాయి. ఎగ్జిట్ పోల ఫలితాలతో గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్న హస్తం పార్టీకి అధికారిక ఫలితాలు కోలుకోలేని దెబ్బని మిగిల్చాయి. కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. హర్యానా పోరులో బీజేపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.90 స్థానాలకు గానూ 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.హర్యాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో నెట్టింట జిలేబీ ట్రెండ్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో సందర్భంగా జిలేబీ తయారీపై రాహుల గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. చదవండి:తీర్పును అంగీకరించడం లేదు: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్హర్యానాలోని గోహనలో తయారయ్యే మాతూరాం 'జిలేబీ'లకు చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ జిలేబీ ప్రస్తావన తెస్తూ..పెద్దఎత్తున ఈ జిలేబీలను దేశవ్యాప్తంగా తయారు చేసి అమ్మకాలు జరపాలని, విదేశాలకు సైతం వీటిని సరఫరా చేయాలని అన్నారు. జిలేబీ ఫ్యాక్టరీతో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 20,000 వేల మందిని 50,000 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. మాతూరాం వంటి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.అయితే రాహుల్ చెప్పిన జిలేబీ ఫ్యాక్టరీపై బీజేపీ ఛలోక్తులు విసిరింది. జిలేబీలు వేడివేడిగా తయారు చేస్తారని, అసలు ఆ స్వీట్ తయారీ ఎలాగో కూడా కూడా రాహుల్‌కు తెలియదని విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో హర్యానాలో జరిపిన ఎన్నికల ప్రచారలోనూ గోహన జిలేబి ప్రస్తావన చేశారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే వారివద్ద ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను మార్చే ఫార్ములా ఉందని, ప్రధాని పదవి ఏమైనా మాథురామ్ జిలేబీనా పంచుకోవడానికి అని ప్రశ్నించారు. -
ఒక్క జిలేబీ చాలు.. కుటుంబానికి పండుగే!
కళ, సాహిత్యం, సంస్కృతి, ఆహారం.. ఇవే తాజ్ మహోత్సవ్ ప్రత్యేకతలు. యూపీలోని ఆగ్రాలోగల శిల్పగ్రామ్లో ఫిబ్రవరి 17న తాజ్ మహొత్సవ్ ప్రారంభమయ్యింది. ఇది ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. ప్రస్తుతం జరుగుతున్న తాజ్ మహోత్సవ్‌లో 300లకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ఆహార ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. వీటిలో హరియాణా జిలేబీ స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. హరియాణాకు చెందిన నరేష్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ముందు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ జిలేబీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క జిలేబీ కుటుంబం అంతటికీ సరిపోతుంది. ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబం ఈ ఒక్క జిలేబీని హాయిగా ఆరగించి ఆనందించవచ్చు. 1952లో తన తాత హరిశ్చంద్ర హల్వాయి ఈ జిలేబీని తయారు చేయడం ప్రారంభించాడని నరేష్ తెలిపారు. తమ మూడో తరం కుటుంబ సభ్యులు కూడా జిలేబీ వ్యాపారంతోనే ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. గత 15 ఏళ్లుగా తాజ్ మహోత్సవ్‌లో జలేబీ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసే జిలేబీ బరువు దాదాపు 250 గ్రాములు ఉంటుందని తెలిపారు.ఈ జిలేబీ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని పేర్కొన్నారు. తాజ్ మహోత్సవ్‌ను సందర్శించే ప్రతీఒక్కరూ ఈ జిలేబీని రుచి చూడాలని కోరుకుంటారని, ఒక్కో జిలేబీ ధర రూ. 400 అని స్టాల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. తాము రూపొందించే జిలేబీని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రుచి చూశారని నరేష్ కుమార్ మీడియాకు తెలిపారు. -
నేనింకా అప్డేట్ కాలేదేమో! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా జిలేబీ తయారు చేయడంలో టెక్నాలజీకి సంబంధించి ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో 3డీ ప్రింటర్ నాజిల్‌తో జిలేబీలను తయారు చేసే పాకిస్థానీ స్ట్రీట్ షాప్ వారిని చూడవచ్చు. ఇది చూడగానే మనకు కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా జిలేబీని చేతితోనే వేస్తారు, కానీ ఇక్కడ చూస్తే దీనికి కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. నాకు జిలేబీ అంటే ఇష్టం, వాటిని చేతితో తయారు చేయడం ఒక ఆర్ట్. ఇక్కడ 3డీ ప్రింటర్ నాజిల్ ఉపయోగించి చేస్తుంటే వెరైటీగా.. కొత్తగా అనిపిస్తుంది. నేను టెక్నాలజీ విషయంలో చాలా అప్డేట్గా ఉంటాను. ఈ వీడియో చూస్తుంటే ఇంకా నేను అనుకునేదాన్ని కంటే పాతపద్ధతి దగ్గరే ఉండిపోయానేమో / అప్డేట్ కాలేదేమో అనిపిస్తోందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కేవలం కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూవ్స్ పొందిన ఈ వీడియో వేలసంఖ్యలో లైక్స్ పొందింది. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా.. I’m a tech buff. But I confess that seeing jalebis being made using a 3D printer nozzle left me with mixed feelings. They’re my favourite & seeing the batter squeezed out by hand is, to me, an art form. I guess I’m more old-fashioned than I thought…pic.twitter.com/RYDwVdGc3P — anand mahindra (@anandmahindra) February 21, 2024 -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా
Ghee Rice, Paneer Jalebi Recipes In Telugu: ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నైవేద్యాలుగా పెడుతుంటాము. ఈ దసరాకు ఏటా పెట్టే వాటితోపాటు ఎంతో రుచికరమైన ఈ కింది నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించి మరింత ప్రసన్నం చేసుకుందాం.. ఘీ రైస్ కావలసినవి: ►బాస్మతి బియ్యం – కప్పు ►నెయ్యి – రెండున్నర టేబుల్ స్పూన్లు ►బిర్యానీ ఆకు – ఒకటి ►యాలకులు – రెండు ►లవంగాలు – రెండు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►అనాస పువ్వు – ఒకటి ►మరాటి మొగ్గ – ఒకటి ►జీలకర్ర – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను ►పచ్చిబఠాణీ – అరకప్పు ►స్వీట్ కార్న్ – అరకప్పు ►పచ్చిమిర్చి – మూడు (సన్నగా తరగాలి). తయారీ: ►స్వీట్‌కార్న్, పచ్చిబఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన నెయ్యిలో బాస్మతి బియ్యాన్ని కడిగి వేసి రెండు నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, అరటీస్పూను జీలకర్ర వేసి తిప్పాలి. ►దీనిలో ఒకటిన్నర కప్పులు నీళ్లుపోసి అన్నం పొడిపొడిగా వచ్చేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద మరో బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. ►నెయ్యి వేగాక అరటీస్పూను జీలకర్ర, జీడిపప్పు పలుకులువేసి వేయించాలి. ►ఇవి వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన పచ్చిబఠాణి, స్వీట్ కార్న్ వేసి మీడియం మంటమీద వేయించాలి. ►ఇప్పుడు అన్నం వేసి అన్నింటిని చక్కగా కలిసేలా కలియతిప్పి దించేయాలి. ►నెయ్యి, బాస్మతీల సువాసనలతో కాస్త ఘాటుగా, తియ్యగా ఉండే నెయ్యి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పనీర్ జిలేబీ కావలసినవి: ►పనీర్ ముక్కలు– అరకప్పు ►మైదా – అరకప్పు ►వంటసోడా – చిటికెడు ►కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూను ►ఆరెంజ్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను ►పాలు – పావు కప్పు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా ►పిస్తాపలుకులు – గార్నిష్‌కు తగినంత. సుగర్ సిరప్ కోసం: పంచదార – కప్పు, నీళ్లు – అరకప్పు, కుంకుమపువ్వు రేకలు – ఎనిమిది, నిమ్మరసం – రెండు చుక్కలు, యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ►పనీర్ ముక్కలను బ్లెండర్లో వేసి పేస్టులా గ్రైండ్ చేయాలి ►పనీర్ పేస్టుని ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలోనే కార్న్‌ఫ్లోర్, వంటసోడా, మైదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. ►ఇప్పుడు టేబుల్ స్పూన్ చొప్పున పాలు పోసి కలుపుతూ మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ►పిండి ఎండిపోకుండా తేమగా ఉండేలా పాలు అవసరాన్ని బట్టి పోసి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ►పంచదారను మందపాటి బాణలిలో వేసి నీళ్లు, నిమ్మరసం, కుంకుమ పువ్వు వేసి మీడియం మంటమీద పంచదార తీగపాకం రానివ్వాలి. ►పాకం వచ్చిన వెంటనే యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. ►కలిపి పెట్టుకున్న పిండిముద్దను మౌల్డ్‌లో వేసుకుని నచ్చిన పరిమాణంలో జిలేబీ ఆకారంలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి. ►జిలేబీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి పాకంలో వేయాలి. ►రెండు నిమిషాలు నానాక మరోవైపు తిప్పి మరో రెండు నిమిషాలు నాననిచ్చి పిస్తా పలుకులతో గార్నిష్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ వంటకాలు ట్రై చేయండి: Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! తయారీ ఇలా Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
గ్రేప్స్ జిలేబి తయారీ విధానం తెలుసుకోండి..
ఆనియన్ కీమా కప్స్ కావలసినవి : కీమా – పావు కిలో (ముందుగా ఉప్పు, కారం, మసాలా వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి), ఆనియన్ కప్స్ – 6 (పెద్ద ఉల్లిపాయను మధ్యలోకి కట్ చేసి గుండ్రంగా పెద్దగా ఉండే కప్స్ తీసుకుని పెట్టుకోవాలి),గుడ్లు – 7, పాలు – 2 టేబుల్ స్పూన్లు, కారం, మిరియాల పొడి – అర టీ స్పూన్ చొప్పున, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము – పావు కప్పు చొప్పున తయారీ : ముందుగా గుడ్లు, పాలు, కారం, మిరియాలు, ఉప్పు, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము ఒకదాని తరవాత ఒకటి వేసుకుని బాగా కలుపుకుని.. వెడల్పు పాన్ మీద నూనె వేసుకుని, ఆనియన్ కప్స్ పెట్టుకుని, అందులో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకోవాలి. నిమిషంలోపే ఒక్కో ఆనియన్ కప్‌లో కీమా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకోవాలి. అనంతరం గుడ్ల మిశ్రమంతో కప్స్ నింపుకోవాలి. తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవచ్చు లేదా ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు. ఐస్‌క్రీమ్ బ్రెడ్ కావలసినవి: ఐస్‌క్రీమ్ – 1 కప్పు (మీరు మెచ్చే ఫ్లేవర్), గోధుమ పిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, పంచదార పౌడర్ – పావుకప్పు, రైన్బో స్ప్రింకిల్స్ లేదా చాక్లెట్ చిప్స్ – అభిరుచిని బట్టి తయారీ: ముందుగా ఐస్‌క్రీమ్, పంచదార పౌడర్‌ను హ్యాండ్ మిక్సర్‌తో బాగా కలుపుకుని.. గోధుమ పిండి, బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి రైన్బో స్ప్రింకిల్స్ లేదా చాక్లెట్ చిప్స్ ఆ మిశ్రమంలోనే కలుపుకుని బ్రెడ్ బౌల్లో వేసుకుని బేక్ చేసుకోవచ్చు. లేదా బ్రెడ్ బౌల్లో ఐస్‌క్రీమ్ మిశ్రమం వేసుకుని పైన రైన్బో స్ప్రింకిల్స్ లేదా చాక్లెట్ చిప్స్ వేసుకుని బేక్ చేసుకోవచ్చు. గ్రేప్స్ జిలేబి కావలసినవి: మైదా – 1 కప్పు, శనగ పిండి – 1 టేబుల్ స్పూన్, ద్రాక్ష పళ్లు – 1 కప్పు(మిక్సీపట్టి గుజ్జులా చేసుకోవాలి), గడ్డ పెరుగు, పంచదార – 1 కప్పు చొప్పున, నీరు – సరిపడా, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్ కలర్/ అభిరుచిని బట్టి), నెయ్యి – సరిపడా తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్లోకి మైదా పిండి, శనగపిండి, పెరుగు తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో ద్రాక్ష పళ్ల గుజ్జు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని, పాలలో పంచదార, అర కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ తీగ పాకం రాగానే.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరో కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో ద్రాక్ష–మైదా మిశ్రమంతో జిలేబీలు వేసి.. దోరగా వేగిన వెంటనే పాకంలో వేసుకుంటే సరిపోతుంది. -
తేనెలూరే తెనాలి జిలేబీ.. తింటే మైమరచిపోవాల్సిందే!
తెనాలి జిలేబీని నోట్లో వేసుకున్నామంటే తన్మయత్వంతో కళ్లు మూసుకుంటాం.. నోట్లో కరిగిపోతున్న ఆ జిలేబీ ముక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోతాం. ఒక్కసారి రుచి చూశామా.. ఇక జిహ్వ చాపల్యం చెప్పనలవి కాదు. మళ్లీ మళ్లీ కావాలంటూ మారాం చేస్తుంది. ఆ అద్భుత రుచి కోసం అర్రులు చాస్తుంది. బంగారు వర్ణంతో ధగధగలాడినా.. నలుపు రంగుతో నిగనిగలాడినా.. తేనెలూరే ఆ తెనాలి జిలేబీ టేస్టే వేరు.. తిని తీరాల్సిందే! సాక్షి, తెనాలి: తెనాలిలో బోస్ రోడ్డు నుంచి వహాబ్చౌక్కు దారితీసే యాకూబ్‌హుస్సేన్ రోడ్డును ‘జిలేబీ కొట్ల బజారు’ అంటారు. అక్కడుండే జిలేబీ దుకాణాల వల్ల దానికి ఆ పేరు స్థిరపడింది. 1965 నుంచి ఇక్కడ జిలేబీ వ్యాపారం సాగుతోంది. చీమకుర్తి సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ జిలేబీ తయారీకి ఆద్యుడు. రంగువేయని బెల్లంతో జిలేబి తయారీని ఆరంభించాడు. నలుపు రంగుతో ఉండే ఈ జిలేబీ స్థానంలో రంగు వేసిన బెల్లంతో ఆకర్షణీయ జిలేబీని తెచ్చిన ఘనత మాత్రం బొట్లగుంట రామయ్యకు దక్కుతుంది. 1972లో వ్యాపారంలోకి వచ్చిన రామయ్య.. తెనాలి జిలేబీకి బ్రాండ్ ఇమేజ్ను తెచ్చి ‘జిలేబీ రామయ్య’ అయ్యారు. ఆంధ్రాపారిస్లో తయారైన జిలేబీ అంటే హాట్ కేక్‌లా అమ్ముడుపోతుంది. స్థానికుల దగ్గర్నుంచి, ప్రముఖుల వరకూ లొట్టలేసుకుంటూ తింటారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెనాలిలోని జిలేబీ బజారులో ఆరు దుకాణాలున్నాయి. పట్టణంలో వేర్వేరు చోట్ల మరో ఏడెనిమిదుంటాయి. చక్కెర స్వీట్లతో పోలిస్తే.. జిలేబీనే శ్రేష్టం ఇతర స్వీట్లతో పోలిస్తే ధరలోనూ, నాణ్యతలోనూ జిలేబీనే శ్రేష్టం. పెరిగిన ధరల కారణంగా ప్రస్తుతం కిలో జిలేబీ రూ.140 పలుకుతున్నా, చక్కెర స్వీట్లతో చూస్తే దీని ధర తక్కువే. పైగా బెల్లంతో తయారీ అయినందున శరీరానికి ఐరన్ దొరుకుతుంది. రంగు వేయని బెల్లంతో చేసిన జిలేబీ మరింత సురక్షితం. వేడి వేడి జిలేబీ తింటే విరేచనాలు కట్టుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. అమ్మకానికి సిద్ధంగా రంగు వేయని జిలేబీ తయారీ విధానం.. ► చాయ మినప్పప్పు, బియ్యం పిండి, మైదా సమపాళ్లలో కలిపి 6–8 గంటలు నానబెడతారు. ► కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు కలిపి మెత్తటి ముద్దలా, చపాతీల పిండి కంటే జారుడుగా చేస్తారు. ► చిన్న రంధ్రం కలిగిన వస్త్రంలో మూటగా తీసుకుని, బాణలిలో మరిగిన నూనెలో చేతితో వలయాలుగా పిండుతారు. ► వేగిన తర్వాత వాటిని.. పక్కన వేరొక స్టవ్‌పై ఉండే బాణలిలో వేడిగా సిద్ధంగా ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి.. బయటకు తీస్తారు. ► ఇక వేడి వేడి జిలేబీ రెడీ జిలేబీ తిన్నాకే.. చుట్టుపక్కల దాదాపు వంద గ్రామాలకు తెనాలి కూడలి అయినందున జిలేబీ వ్యాపారం విస్తరించింది. మరిన్ని దుకాణాలు వెలిశాయి. తెనాలి వచ్చిన గ్రామీణులు ముందుగా జిలేబీని తిన్నాకే ఇతర పనులు చూసుకుంటారు. అతిథులకు జిలేబీ ప్యాకెట్ బహుమతిగా ఇవ్వటం సంప్రదాయమైంది. ఈ ప్రాంతం నుంచి విదేశాల్లో స్థిరపడినవారు, బంధువులు వచ్చిపోయేటప్పుడు జిలేబీని తీసుకురమ్మని చెబుతుంటారు. చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం సినీ ప్రముఖులకు తెనాలి జిలేబీ వెళ్లేదని వ్యాపారి సోమశేఖరరావు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ‘మెట్రో’లకే కాదు.. విదేశాల్లోని తెలుగువారికీ ఇక్కడ్నుంచి జిలేబీ పార్శిళ్లు వెళుతుంటాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని నెలలు మూతపడిన జిలేబీ దుకాణాలు, మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక్కో దుకాణంలో సగటున 50 కిలోలపైనే అమ్ముడుపోతోంది. అన్ని దుకాణాల్లో కలిపి నెలకు సుమారు రూ.10.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. అదే మా జీవనాధారం.. మా తాత పేరు జిలేబీ రామయ్య. చిన్నప్పుడు ఆయన దుకాణంలోనే పనిచేశా. పెద్దయ్యాక వేరుగా వ్యాపారం చేస్తున్నా. జిలేబీ ప్రియుల సూచన మేరకు ఇప్పుడు నల్లబెల్లంతో తయారు చేస్తున్నాం. దేశవిదేశాలకూ సరఫరా చేస్తున్నాం. – కావూరి జనార్దనరావు, వ్యాపారి తింటానికే వస్తుంటాను.. తెనాలి జిలేబీని ఒక్క సారి రుచి చూస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తరచూ జిలేబీ బజారుకు వస్తుంటాను. విరేచనాలు కట్టుకోవాలంటే వేడి వేడి జిలేబీ తింటే సరి. – భాస్కరుని లక్ష్మీనారాయణ, వినియోగదారుడు -
మా ఆవిడ జిలేబీ తిననివ్వడం లేదు; నువ్వు ఇంటికి రా!
ముంబై: ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్విటర్ వేదికగా జిలేబీపై ఉన్న ఇష్టం గురించి వెల్లడించడం.. తన భార్య చేత ఇబ్బందులు పడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ సందీప్ మిట్టల్‌కు చిన్నప్పటి నుంచి జిలేబీలు అంటే ప్రాణం. తన చిన్నతనంలో 25 పైసలకే జిలేబీలు కొనుక్కొని తినేవాడు. అలా రోజుకు మూడు నుంచి నాలుగు జిలేబీలు ఎంతో ఇష్టంగా ఆరగించేవాడు. పెరిగి పెద్దయ్యాకా కూడా ఆ ఐపీఎస్ ఆఫీసర్‌కు జిలేబీలపై మక్కువ పోలేదు. తన భార్యకు తెలియకుండా చాలాసార్లు దొంగతనంగా తినేవాడు. అయితే ఈ విషయం తన భార్యకు తెలిసిపోవడంతో అప్పటినుంచి ఆమె అతన్ని జిలేబీలు తిననివ్వడం లేదు. దీంతో తన భార్యపై కోపాన్ని(ఫన్నీవేలో) ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు. '' చిన్నప్పటి నుంచి జిలేబీలు అంటే ఎంతో ఇష్టం. కానీ ఇప్పుడు మా ఆవిడ జిలేబీలు తిననివ్వడం లేదు'' అని ట్వీట్ చేశాడు. భర్త జిలేబీ విషయం తెలుసుకున్న అతని భార్య వినూత్న రీతిలో రిప్లై ఇచ్చింది. ''మీరు ఈరోజు ఇంటికి రండి..'' అంటూ అసంపూర్తిగా కామెంట్ చేశారు. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' బహుశా జిలేబీలు తిని తిని ఆ ఐపీఎస్ ఆఫీసర్‌కు షుగర్ వచ్చిదనుకుంటా.. పాపం ఐపీఎస్ ఆఫీసర్‌ను చూస్తే జాలేస్తుంది.. మీ చిన్నతనంలో జిలేబీల గురించి చెప్పి మాకు ఊరీలు తెప్పించారు..'' అని నెటిజన్లు కామెంట్స్ చేశారు. बचपन में २५ पैसे की एक बड़ी जलेबी आती थी। सोचते थे कि बड़े होने के बाद कमाएंगे और रोज़ तीन-चार जलेबी खाया करेंगे। अब कमाने लगे तो बीवी जलेबी खाने नहीं देती। pic.twitter.com/W9pxYWqnVY — Dr. Sandeep Mittal, IPS 🇮🇳 (@smittal_ips) July 17, 2021 आज आप घर आओ.... https://t.co/bBkz1CjoZi — Office of Dr. Richa Mittal🇮🇳 (@drairicha) July 18, 2021 -
జిలేబీ జర్నీ..! భారత్‌కు ఎలా వచ్చిందో తెలుసా..?
అలసి సొలసి ఇంటికి బయలుదేరుడుండగా... ఓ వీధి దుకాణంలో అప్పుడే తయారుచేసిన వేడి వేడిగా జిలేబీ మీ కంటికి ఎదురైతే.. ఇక మీ అడుగులు ఇంటికి బదులుగా ముందు జిలేబీ దగ్గరకే చేరుకుంటాయి. అంతేనా.. వెంటనే ఒక జిలేబి తీసుకొని తినేంతవరకూ మీ చేతులు కూడా ఊరుకోవు! మరి ఇంతలా మాయచేయగల ఆ తియ్యని జిలేబీ వెనుక ఒక పెద్ద చరిత్రనే ఉంది. చాలా మంది ఇది స్వదేశీ వంటకంగా పిలుస్తుంటారు. కానీ, జిలేబీ జర్నీ వేరే.... వాస్తవానికి, మధ్య– తూర్పు దేశాలైన జలాబియా, పెర్షియన్ నుంచి ’జుల్బియా’గా ఈ వంటకాన్ని దిగుమతి చేశారు. 10వ శతాబ్దాంలో ముహమ్మద్ బిన్ హసన్ అల్–బాగ్దాది రాసిన ’ కితాబ్ అల్ తబీఖ్’ పురాతన పెర్షియన్ వంటల పుస్తకంలో మొదటిగా దీని రెసిపీనీ ప్రస్తావించారు. దీని బట్టే ఇది పెర్షియన్ వంటకంగా పరిగణించొచ్చు. ఇండియాకు ఇలా వచ్చింది.. సాధారణంగా రంజాన్, ఇతర సంప్రదాయ పండుగ రోజుల్లో ప్రజలు సంతోషాన్ని పంచుకునే నేపథ్యంలో వారు తయారు చేసిన తీపి పదార్థాలను ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అలా ఇబ్న్ సయ్యర్ అల్‌వార్రాక్ అనే అరబ్ షెఫ్ రాసుకున్న పుస్తకంలో ఈ వంటకం తనకు బహుమతిగా లభించినట్లు రాసుకున్నాడు. ఆ రుచిని మెచ్చిన ఆ వ్యక్తి తాను కూడా ఆ వంటకం నేర్చుకొని వివిధ దేశాల్లో విస్తరింపజేశారు. ఏది ఏమయినప్పటికీ, జుల్బియా భారతీయ జిలేబీకి భిన్నంగా ఉంటుంది. అక్కడ చక్కెర పాకానికి బదులుగా.. మిడిల్–ఈస్టర్న్ రెసిపీ, తేనె, రోజ్ వాటర్ సిరప్‌ను ఉపయోగించేవారు. ఈ రెసిపీనే పెర్షియన్ వ్యాపారులు భారత ఉపఖండానికి తీసుకువచ్చారు. ‘ప్రియామ్‌కార్న్‌పాకథా’ (క్రీ.శ 1450) – జైనసుర స్వరపరిచిన జైనవచనంలో జిలేబీ గురించి మన దేశంలో మొట్టమొదటగా ప్రస్తావించారు. అక్కడ అతను ఒక భారతీయ వ్యాపారి అందించే విందు మెనులో భాగంగా జిలేబీని పేర్కొన్నాడు. తర్వాత, క్రీ.శ. 1600 లో, సంస్తృత వచనం గుణ్యగుణబోధినిలోనూ ఉంది. అలా...మనోహరమైన జుల్బియా భారతీయ వంటకాల్లో స్వదేశీ ‘జలవల్లికా’ లేదా ‘కుండలికా’గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 15వ శతాబ్దం చివరి నాటికి, జిలేబీ దేశీయ ఉత్సవాల్లో భాగంగా మారింది, అలాగే వివాహాలు, ఇతర వేడుకలు వంటి వ్యక్తిగత సందర్భాలలో కూడా మారింది. దేవాలయాలలో ప్రసాదంగానూ మారింది. భిన్న రూపాలు.. జిలేబీకి చెందిన అనేక అవతారాలు ఇప్పుడు దేశంలోని ప్రధాన భూభాగంలో ప్రాచుర్యం పొందాయి – ఇండోర్ నైట్ మార్కెట్ల నుంచి హెవీవెయిట్ జిలేబాగా.., బెంగాల్ స్వీట్ మేకర్స్ వంటశాలల నుంచి చనార్ జిలిపిగా.., మధ్యప్రదేశ్ మావా జిలేబీ..., హైదరాబాద్ డోపెల్‌గేంజర్ ఖోవా జలేబీ... లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి జాంగ్రిగా ఇలా వివిధ పేర్లతో రకరకాలుగా జిలేబీ మన దేశంలో ఒక భాగంగా నిలిచిపోయింది. -
ఎంతిష్టమో!
ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్. ఒక ఒలింపిక్ మెడల్! ఏమిటి మేరీ కోమ్ విజయ రహస్యం? బాక్సర్‌గా అనుభవమా? ఆమె ఫిట్నెస్సా? రెండూ! రెండిటినీ మించి గెలవాలన్న తపన. అలాగని కోమ్ మరీ గంటల కొద్దీ ప్రాక్టీసేం చెయ్యరు. యువ బాక్సర్లకు రెండు గంటల ప్రాక్టీస్ చాలు. కోమ్‌కి రోజూ 40 నుంచి 45 నిమిషాల సాధన సరిపోతుందట. ఇక శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెలోంచి ఆ పవర్ పంచ్? విల్ పవర్ ఎలాగూ ఉంటుంది. డైట్ ఏమిటి? స్పెషల్‌గా ఏమీ ఉండదట. ఏం తినాలని ఉంటే అప్పటికి అది తినేస్తారట. జన్రల్‌గా కోమ్ తినేది వరన్నం (వరి అన్నం). ‘‘రైస్ లేకుండా నేను బతకలేను. తరచు జిలేబీలు తింటాను. అలాగే ఐస్‌క్రీమ్. ఒక్కోసారి రెండూ కూడా. అయితే నో మసాలా.. నో స్పైసీ ఫుడ్’’ అని చెప్తారు మేరీ కోమ్. ఇవి మాత్రమే కాదు. సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారట. బలమిచ్చే మందులు. డాక్టర్ నిఖిల్ లేటీ ఆమె ఫిజియోథెరపిస్ట్. ఆయన్నడిగితే కోమ్ ఆహారపు అలవాట్ల గురించి మరికొంత వివరంగా చెబుతుంటారు. ఇంట్లో వండిన మణిపురి ఫుడ్. అన్నంలోకి మాంసం, కూరగాయలు. బయట డబ్బాలో లభించే ప్రొటీన్, మల్టీ విటమిన్లు. ఇదీ మేరీ మెనూ. సరే, బాక్సింగ్‌లో ఆడడానికి ఒక వెయిట్ ఉండాలి కదా! ఆ వెయిట్‌ని ఎక్కువా కాకుండా, తక్కువగా కాకుండా కోమ్ ఎలా మేనేజ్ చెయ్యగలుగుతున్నారు? మొన్నటి వరల్డ్ బాక్సింగ్ పోటీలలో మేరీ కోమ్ బంగారు పతకాన్ని కొట్టింది 48 కిలోల కేటగిరీలో. ఇప్పుడు ఆమె గోల్ ఒలింపిక్స్‌లో గోల్డ్ కొట్టడం. అందుగ్గాను ఆమె 51 కిలోల బరువు ఉండాలి. అంటే పెరగాలి. ఆటకు తగ్గట్లు పెరగడం, తగ్గడం కోమ్‌కి కష్టమేం కాదట! బరువు తగ్గడానికి స్కిప్పింగ్, బ్యాడ్మింటన్. పెరగడానికి.. బలమైన ఆహారం. క్రమబద్ధమైన వ్యాయామం. చివరగా ఒక్క విషయం. కోమ్ సాధారణంగా బంగారు పతకాన్నో, ఇంకో బ్రాస్ పతకాన్నో పంటి కింద కొరుకుతూ కనిపిస్తారు కానీ.. ఆహారాన్ని భుజిస్తూ ఎక్కడా కనిపించరు! -
కరకరల హుషార్ గజగజల పరార్
చలికాలం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ చలి గజగజలాడిస్తుంది. చలి వాతావరణంలో రొటీన్ తిళ్లు తినడానికి పెద్దలకే మొహం మొత్తుతుంది. ఇక చిన్నారుల సంగతి చెప్పాలా? అలాంటప్పుడు వేడివేడిగా వెరైటీ చిరుతిళ్లు వడ్డిస్తే... చిన్నారుల్లో కరకరల హుషార్... ఆ దెబ్బకి గజగజలు పరార్... పనీర్ జిలేబీ వేడివేడిగా తింటే రుచిగా ఉండే స్వీట్లలో జిలేబీలదే మొదటి స్థానం అని చెప్పుకోవాలి. వీటిలో పనీర్ జిలేబీల రుచే వేరు. చలికాలంలో వేడివేడిగా వడ్డిస్తే వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కావలసినవి: పనీర్– 400 గ్రాములు, పచ్చికోవా– 400 గ్రాములు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్– చిటికెడు, నెయ్యి– వేయించేందుకు సరిపడా, పంచదార– 1 కిలో తయారీ: తాజా పనీర్‌ను తురిమి ఒక ప్లేటులో వేసి మెత్తని పిండి ముద్దగా చేయాలి. తరువాత అందులోనే పచ్చికోవా, ఏలకులపొడి, రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి తగినన్ని నీళ్లు చల్లి కాస్త జారుగా జిలేబీ మిశ్రమంలా చేయాలి. స్టవ్ మీద మందపాటి గిన్నెపెట్టి అందులో పంచదార వేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు కలిపి పలుచని తీగ పాకం వచ్చాక దించేయాలి. ఇప్పుడు మందపాటి పాలిథిన్ కవరును తీసుకుని దానికి ఓ మూల చిల్లు పెట్టి అందులో జిలేబీ మిశ్రమాన్ని నింపాలి. లేదా పలుచని చేతిరుమాలుకు చిల్లు పెట్టి అందులో పిండిని నింపి అంచుల్ని బిగించి పట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి అందులో ఈ పిండిని గుండ్రంగా జిలేబీల్లా తిప్పుతూ వత్తాలి. వీటిని ఎర్రగా వేయించి తీసి వెంటనే పక్కనే ఉంచుకున్న పాకంలో ముంచి తీసేయాలి. అంతే పనీర్ జిలేబీలు రెడీ. ఫిష్ అమృత్సరీ కావలసినవి: ముళ్లు తీసి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు: అరకిలో, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి తరుగు: రెండు టీస్పూన్స్, పచ్చిమిర్చి: నాలుగు, వాము: అర టీస్పూన్, నిమ్మకాయ: ఒక చెక్క, ఉప్పు: తగినంత, బియ్యప్పిండి: రెండు టీస్పూన్స్, శనగపిండి: మూడు టీస్పూన్స్, కోడిగుడ్డు: ఒకటి, గరమ్ మసాలా: ఒక టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా తయారీ: ఒక పాత్రలో చేపముక్కలను తీసుకుని కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, బియ్యప్పిండి, శనగపిండి, కోడిగుడ్డు, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో చేప ముక్కలను వేసి మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. వీటిని నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఈ చేప ముక్కలను నూనెలో దోరగా వేయించుకుని కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయలతో అలంకరించుకుంటే కరకరలాడే ఫిష్ అమృత్సరీ సిద్ధం. గ్రీన్ పీస్ పాన్‌కేక్స్ కావలసినవి: పచ్చి బఠాణీలు–ఉడికించనవి ముప్పావు కప్పు, బియ్యప్పిండి–అర కప్పు, శనగపిండి– అర కప్పు, పసుపు–పావు టీ స్పూను, ఫ్రూట్ సాల్ట్–అర టీ స్పూను, ఉప్పు–రుచికి తగినంత, నూనె– రెండు టేబుల్ స్పూను,్ల టమాటాలు–పావు కప్పు(సన్నగా తరగాలి), క్యారట్లు–అర కప్పు (తురమాలి), పచ్చి మిరపకాయల తరుగు–రెండు టేబుల్ స్పూన్లు, తురిమిన పనీర్–నాలుగు టేబుల్ స్పూన్లు, నీరు–తగినంత తయారీ: ఉడికించిన బఠాణీలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో బఠాణీల ముద్ద వేసి దానికి బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు చేర్చాలి. తర్వాత కాస్త నీరు పోసి కాస్త చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఫ్రూట్సాల్ట్ వేయాలి. ఫ్రూట్ సాల్ట్ వేసాకా ఎక్కువగా కలపకూడదు.ఎక్కువగా కలిపితే పాన్ కేక్స్ మెత్తగా రావు. ఇప్పుడు ఒక పెనం తీసుకుని వేడి చేసి దానికి నూనె రాయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెతో పాన్కేక్ మిశ్రమాన్ని పెనం మీద కాస్త మందంగా పొయ్యాలి. తర్వాత తురిమిన పనీర్, క్యారెట్, టమాటా వేసి పైన కొంచెం నూనె చిలకరించాలి. పాన్ కేక్ ఒక వైపు కాలాక మరొక వైపు తిప్పాలి. రెండోవైపు కూడా కాలాక పాన్‌కేక్స్ రెడీ. వేడివేడిగా వీటిని వడ్డించడమే. టమాటా సాస్ లేదా చట్నీతో కలిపి వడ్డిస్తే పిల్లలు వీటిని లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ప్రొటీన్లు, విటమిన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఈ చిరుతిండి పిల్లలకు చాలా ఆరోగ్యకరమైనది. ఫ్రాన్ వడ కావలసినవి: పచ్చి శనగపప్పు – ఒకటిన్నర కప్పులు(నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి), రొయ్యలు – 12(శుభ్రం చేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలి), పచ్చిమిర్చి – 3 లేదా 4, ఎండుమిర్చి – 3, ఉల్లిపాయ – 2, అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం – అర టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా పచ్చి శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యలకు ఆ మిశ్రమాన్ని దట్టంగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పకోడా కావలసినవి: బంగాళదుంపలు – 2(మెత్తగా ఉండికించుకోవాలి), పనీర్ తురుము – అర కప్పుఅల్లం పేస్ట్ – పావు టీ స్పూన్పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్కొత్తిమీర తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లుబేకింగ్ సోడా – పావు టీ స్పూన్నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా పన్నీర్ తురుములో బంగాళదుంప గుజ్జును వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, కొత్తిమీర తురుము వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని.. వాటికి బాగా నూనె పట్టించి.. స్టీల్ గ్రిల్ ట్రేపైన పెట్టుకుని ఓవెన్లో ఉడికించుకోవాలి. కడ్కి తాలిపెత్ కావలసినవి: కీరదోసకాయలు – 2(శుభ్రం చేసుకుని, గుజ్జులా చేసుకోవాలి), కరాచీ రవ్వ – ఒకటిన్నర కప్పులు, పండుమిర్చి లేదా పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, గడ్డ పెరుగు – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – సరిపడా, నూనె – తగినంత, కొత్తిమీర తురుము – 1 లేదా 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కరాచీ రవ్వ, కీరదోసగుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గడ్డ పెరుగు, పండుమిర్చి లేదా పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసుకుని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ వేడికాగానే నూనె వేసుకుని ఆ మిశ్రమంతో చిన్న చిన్న అట్లు(కేక్స్) వేసుకోవాలి. ఉడుకుతున్న సమయంలోనే కొద్దికొద్దిగా ఆ కేక్స్‌పైన కొత్తిమీర తురుము వేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. -
అమ్మో! ఎంత పేద్ద జిలేబీయో!!
ముంబై: స్వీటు ప్రియులకు సంతోషం కలిగించే వార్త ఇది. ప్రపంచంలోనే పెద్ద జిలేబీ మనదేశంలోనే తయారైంది. ముంబైలోని సంస్కృతి రెస్టారెంట్ భారీ జిలేబీ తయారు చేసింది. దీని బరువు అక్షరాల 18 కేజీలు. 9 అడుగుల వ్యాసార్థంతో దీన్ని రూపొందించారు. 12 మంది దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. ఇందుకోసం 1000 లీటర్ల పంచదార పాకం, 3500 కేజీల నెయ్యి వినియోగించారు. దీంతో 8.2 అడుగుల వ్యాస్థారంతో గతంలో రూపొందించిన జిలేబీ రికార్డు బద్దలైంది. ఇదే బృందం 37 కిలోల జాంగ్రీ తయారు చేసి గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్ ఈ రికార్డును స్వయంగా వీక్షించారు. భారీ స్వీట్లు తయారు చేసేందుకు 100 రోజుల పాటు రోజుకు 20 గంటల పాటు సాధన చేశామని సంస్కృతి రెస్టారెంట్ ముఖ్య వంటగాడు గౌరవ్ చతుర్వేది వెల్లడించారు. -
హహ్హహహ్హహహ్హహా..!
... వివాహభోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. ఒహ్హొహ్హొ నాకె ముందు! ఔరౌర గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల... ఒహోరే అరిసెలుల్ల... ఇయెల్ల నాకె చెల్ల... పెళ్లి భోజనం ఎలా ఉందో... అధరాన్ని, ఉదరాన్ని మధురంగా ఊదరగొడుతూ పంచేంద్రియాలనూ అదిలించి కదిలిస్తారు ‘మాయాబజార్’ సినిమాలో ఎస్వీ రంగారావు! గారెలు, బూరెలు, అరిసెలేనా? లడ్లు, జిలేబీలు, అప్పడాలు.. పులిహోర దప్పళాలు.. పాయసాలు... ఎన్ని లేవు ఆ లిస్టులో! వాటిల్లో ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని కలిపి ఇవాళ మీ చేత లొట్టలు వేయించబోతోంది ‘ఫ్యామిలీ’! వివాహభోజనానికి ఏ మాత్రం తక్కువకాని ఈ దీపావళి భోజనాన్నిహహ్హహహ్హహహ్హహా... అంటూ ఆరగించండి. మీ ఆత్మీయులకు కొసరి కొసరి తినిపించండి. హ్యాపీ దీపావళి! సజ్జప్పాలు లేదా హల్వా పూరీ కావలసినవి: స్టఫింగ్ కోసం... బొంబాయి రవ్వ - కప్పు; పంచదార - కప్పు; నీళ్లు - రెండున్నర కప్పులు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు పై భాగం కోసం... మైదా పిండి - కప్పు; ఉప్పు - చిటికెడు; నూనె - అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి); నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారీ: బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార జత చేయాలి బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి. జిలేబీ కావలసినవి: మైదా పిండి - కప్పు; బేకింగ్ పౌడర్ - అర టీ; స్పూను; పెరుగు - కప్పు; నూనె - వేయించడానికి తగినంత; పంచదార - కప్పు; కుంకుమ పువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - పావు టీస్పూను; మిఠాయి రంగు - రెండు చుక్కలు; రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసా వంటి దానిలో ఈ మిశ్రమాన్ని పోయాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి (మంట మధ్యస్థంగా ఉండాలి) పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి వేడివేడిగా అందించాలి. అప్పడాల కూర మీకు అప్పడాలంటే ఇష్టం ఉంటే, ఈ కూరను కూడా ఇష్టపడతారు. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. రాజస్థానీయులు ఎక్కువగా తయారుచేసే ఈ కూరను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. కావలసినవి: అప్పడాలు - పావు కిలో; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; నెయ్యి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; ఉల్లి తరుగు - పావు కప్పు; అల్లం ముద్ద - టీ స్పూను; వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; చిక్కగా గిలక్కొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: అప్పడాలను నూనెలో వేయించి నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి (మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు) స్టౌ (సన్నని మంట) మీద బాణలి ఉంచి, నెయ్యి లేదా నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి పెరుగు, కప్పుడు వేడి నీళ్లు జత చేయాలి అప్పడం ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి, కొద్దిసేపు ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీరతో అలంకరించి, అన్నంతో వడ్డించాలి. దప్పళం కావలసినవి: కందిపప్పు - పావు కప్పు; బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - చిన్న కట్ట; చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు - అర కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; దొండకాయ ముక్కలు - పావు కప్పు; అరటికాయ ముక్కలు - పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు - కప్పు; సొరకాయ ముక్కలు - అర కప్పు; సెనగ పిండి - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; కారం - 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - కొద్దిగా తయారీ: పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాక, మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. పేణీ లడ్డు కావలసినవి: సెనగపిండి - కప్పు; పేణీ - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: స్టౌ (సన్న మంట) మీద బాణలి ఉంచి సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చేసి, సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి. పేణీ పాయసం పాలు వేడి చేసి, బెల్లం పొడి జత చేసి కలిపాక, డ్రై ఫ్రూట్ పొడి జత చేయాలి ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి తేనె వేసి బాగా కలిపి బాగా చల్లారాక అందించాలి. కట్టె పొంగలి కావలసినవి: బియ్యం - ముప్పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; మిరియాల పొడి - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చి మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను; జీడిపప్పులు - 10; కరివేపాకు - 2 రెమ్మలు; నెయ్యి - 5 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత తయారీ: బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాక, జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి, అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి చట్నీ, సాంబారులతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. సేకరణ: డా. వైజయంతి -
జిలేబీ
-
మాహీ ముర్గ్