baba
-
ధీరేంద్రశాస్త్రిని ఆస్ట్రేలియా నుంచి రప్పించిన అంబానీ
ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ వేడుకలకు హాజరైన అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది.బాలీవుడ్ సెలబ్రిటీలు మొదలుకొని ప్రపంచంలోని ప్రముఖ గాయకులు, నేతలు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అనంత్ అంబానీ, రాధికలను ఆశీర్వదించేందుకు ప్రముఖ సాధువులు కూడా తరలివచ్చారు. ఈ వివాహానికి తాను ఎలా హాజరైనదీ మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన స్వామీజీ ధీరేంద్ర శాస్త్రి ఒక ప్రసంగంలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన బాబా బాగేశ్వర్ ధామ్ ఫేస్బుక్ హ్యాండిల్లో షేర్ చేశారు.అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి తనకు ఆహ్వానం అందిందని, అయితే తాను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో తొలుత నిరాకరించానని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే అంబానీ తన కోసం ఆస్ట్రేలియాకు విమానాన్ని పంపారని, సకల సదుపాయాలు ఏర్పాటు చేశారని, దీంతో తాను అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యానన్నారు. తనతో పాటు కొందరు శిష్యులు కూడా విమానంలో ముంబై చేరుకున్నామని తెలిపారు. అనంతరం అనంత్, రాధికలను ఆశీర్వదించి, తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయామన్నారు. -
హత్రాస్ తొక్కిసలాట: ‘బోలేబాబా’ లాయర్ సంచలన కామెంట్స్
న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులై 2న హత్రాస్ సత్సంగ్‌లో కొందరు వ్యక్తులు విషపూరిత డబ్బాలను తెరిచారని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు సింగ్ తెలిపారు. ఆదివారం(జులై 7) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడారు. పెరిగిపోతున్న బోలేబాబా పాపులారిటీని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘తొక్కిసలాటకు ముందు 15 మంది దాకా దుండగులు అక్కడ విషపూరిత డబ్బాలను తెరిచారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు నన్ను కలిసి చెప్పారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలిస్తే వారు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక సత్సంగ్ సమీపంలోనే దుండగులు పారిపోయేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి’అని సింగ్ కోరారు.జులై 2న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను కూడా నియమించింది. -
అమర్నాథ్ యాత్ర: కరిగిన మంచు శివలింగం.. భక్తుల నిరాశ
జమ్ముకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. అయితే తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక వార్త వినిపిస్తోంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి కారణంగా మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోజు(శనివారం) అమర్నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్ర ప్రారంభం కానున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడంతో యాత్రికులు నిరాశకు గురయ్యారు.గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. -
లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భోలే బాబాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హథ్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆచూకి తెలియరాలేదు.అయితే ఈ విషాదంపై దర్యాప్తులో భాగంగా ఆయన ఆదాయం, సంపద వెలుగు చూసింది. గత ఇరవై ఏళ్ల కాలంలో భేలే బాబా దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారు. నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో కనిపించే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాస్గంజ్, ఆగ్రా, కాన్పూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు.ఇక భోలే బాబా సూరజ్‌పాల్ మెయిన్‌పురిలోని విలాసవంతమైన హరి నగర్ ఆశ్రమంలో నివాసముంటారు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. రాజభవనాన్ని పోలి ఉన్న ఈ ఆశ్రమాన్ని రూ. 4 కోట్లతో నిర్మించారు.ఆయన భక్తులలో ఒకరు ఈ స్థలాన్ని బాబాకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.ఇందులో భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భోలే బాబా తెల్లటి టయోటా ఫార్చునర్ కారులో వస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తుండగా.. ముందు ఆయన కమాండోలు బైక్‌లపై దారిని క్లియర్ చేస్తారు. అదే విధంగా వెనుక దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్ ఉంటుంది. ఇక భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది.యూపీలోని ఎటా జిల్లా బహదూర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ మొదట తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. తర్వాత పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరి 18 ఏళ్ల పాటు పని చేశాడు. ఈ సమయంలోనే తాను ఇంటలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నట్టు చెప్పుకొని జనాన్ని బురిడీ కొట్టించేవాడు. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటున్న భోలే బాబా 1999లో కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి బోధించడం ప్రారంభించాడు. ఖరీదైన వస్తువులు, కార్లపై ప్రీతి కలిగిన ఆయనకు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వీటిని తన భక్తుల పేర్లతో కొనుగోలు చేసేవాడు.హథ్రాస్‌లోని భోలే బాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కు చేరుకుంది. వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సత్సంగ్‌ను వీరే నిర్వహించారని, కార్యక్రమానికి వీరే అనుమతి పొందారని పోలీసులు చెప్పారు.ఈ కార్యక్రమానికి నిర్వాహకులు కేవలం 80,000 మందికి మాత్రమే అనుమతినివ్వగా.. దాదాపు 2.5 లక్షల మంది అనుచరులు తరలివచ్చారని పోలీసులు తెలిపారు. భోలే బాబా వేదిక నుంచి వెళుతున్న సమయంలో అతని కాన్వాయ్ ద్వారా తన్నిన ధూళిని సేకరించడానికి భక్తుల గుంపు పరుగెత్తుకొచ్చింది, ఇది ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే గుంపును నియంత్రించే ప్రయత్నంలో వాలంటీర్లు, అతని భద్రత సిబ్బంది ప్రజలను వెనక్కి నెట్టడం ప్రారంభించారు. దీంతో అనేక మంది భక్తులు గుంపుగా పడి నలిగిపోయారు. అక్కడి నుంచి పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది.అయితే ఇప్పటి వరకు సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియ రాలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు భోలే బాబా ఆశ్రమానికి వెళ్లగా ఆయన అక్కడ లేరు. ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేనందున ఆయనను అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని విచారించిన తర్వాత అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని తెలిపారు. -
హత్రాస్ తొక్కిసలాట: ఆరుగురి అరెస్ట్, అవసరమైతే బాబాను విచారణ
హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సత్సంగ్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, సేవాదార్లుగా పనిచేస్తున్నారని అలీగఢ్ ఐజీ శలభ్ పేర్కొన్నారు.ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు తెలిపారు. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు. భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్‌కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు. అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
హత్రాస్ తొక్కిసలాట: భయంతో మరో బాబా వినతి
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల సంఖ్య 121 దాటింది. ఈ ప్రమాదం నేపధ్యంలో అప్రమత్తమైన మధ్యప్రదేశ్‌కు చెందిన మరో బాబా తన అనుచరులను ఉద్దేశిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి భక్తులు, అనుచరులు అధిక సంఖ్యలో ఉన్నారు. జూలై నాలుగున జరిగే అతని పుట్టిన రోజుల వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే హత్రాస్ ఘటన నేపధ్యంలో మరోమారు అలాంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు.ఆ వీడియోలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి ‘జూలై 4న నా పుట్టిన రోజు. ఆ రోజు నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గుతుంది. అయితే ఆరోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వీడియో ద్వారా ఒక అభ్యర్థన చేస్తున్నాను. జూలై నాలుగున జరిగే వేడుకలకు దూరప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నవారు తమ ఇళ్లలోనే పూజలు చేసుకోవాలి. ఇప్పటికే ఇక్కడ భక్తుల రద్దీ పెరిగింది. భద్రత దృష్ట్యా ఎక్కడివారు అక్కడే వేడుకలు చేసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. अतिआवश्यक सूचना…पूज्य सरकार द्वारा सभी भक्तों को आवश्यक संदेश….इसे जन जन तक पहुँचाए… pic.twitter.com/GgLledRw4H— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) July 2, 2024 -
మందు బాబుల భరతం పడుతున్న బాబా
-
‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్!
పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి. ఈసారి వారణాసి మార్కెట్లో ‘బుల్డోజర్ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్ ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్ మాట్లాడుతూ బుల్డోజర్ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు. ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్ కైట్ ఎగురుతుందిలా.. -
బాబాల మాయలో మధ్యప్రదేశ్ సర్కార్? ‘ఓట్ల ఆశీర్వాదం’ కోసం పడిగాపులు?
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మత గురువుల ప్రాధాన్యత అంతకంతకూ పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు బాబాల దయ కోసం వెంపర్లాడుతున్నాయి. కొందరు బాబాలు అధికార పక్షం వారిని ఆశీర్వదిస్తుండగా, మరికొందరు బాబాలు ప్రతిపక్షాలపై ఆశీస్సులు కురిపిస్తున్నారు. సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ నుంచి శివరాజ్ సింగ్ వరకు బాబాల వైభవాన్ని కొనియాడుతున్నారు. బాబాలకు భక్తులుగా మారేందుకు పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు కమల్‌నాథ్.. బాగేశ్వర్ ధామ్‌లోని ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో కనిపిస్తుండగా, మరికొన్నిసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రదీప్ మిశ్రా ఆశ్రమంలో సేదతీరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాబాల ఆధిపత్యం అధికంగా కనిపించింది. ఇప్పటి (2023) విషయానికొస్తే కొత్త బాబాలు చాలామంది పుట్టుకు వచ్చారు. ఈ జాబితాలో కంప్యూటర్ బాబా, బాగేశ్వర్ ధామ్ సర్కార్, ప్రదీప్ మిశ్రా, పండోఖర్ సర్కార్, జయ కిషోరి, రావత్పురా సర్కార్, సంత్ రవిశంకర్, కమల్ కిషోర్ నాగర్ తదితరులు ఉన్నారు. వీరిని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీకి హిందుత్వ అనే ట్యాగ్‌లైన్ ఉంది. కాంగ్రెస్ లౌకిక పార్టీ.. అయినా కమల్ నాథ్ మతతత్వవాది. చింద్వారాలో బాబా బాగేశ్వర్‌ను తరచూ కలుస్తుంటారు. ఈ బాబాతో కలిసి హెలికాప్టర్లో తిరుగుతూ చాలాసార్తు కనిపించారు. ఈ బాబా కాంగ్రెస్‌కు మద్దతి ఇచ్చినా, బీజేపీకి కూడా వత్తాసు పలుకుతుంటారు. ఛతర్పూర్ ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది నిత్యం బాబాల సేవలో ఉంటారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతి కార్యక్రమంలో బాబాలను సన్మానిస్తుంటారు. బాబా బాగేశ్వర్ నుండి రుద్రాక్ష్ బాబా (ప్రదీప్ మిశ్రా) వరకు అందరూ బీజేపీని ఆశీర్వదించారు. అయితే ఈ బాబాల ఆశీస్సులను కాంగ్రెస్ కూడా కోరుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త జయ కిషోరిని కూడా తమ వైపునకు తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. కాగా మత ప్రచారకుల మొగ్గు బీజేపీ వైపు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్.. మత పెద్దల ఆశీర్వాదాలను కోరుకుంటోంది. ఈ విధంగా ఓటు బ్యాంకు పెంచుకోవాలని ఆ పార్టీ తాపత్రయ పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఖలీద్ మషాల్ ఎవరు? హమాస్‌తో సంబంధం ఏమిటి? -
బైక్‌కి గుడి గట్టి పూజలు - భారతదేశంలో మరెక్కడా లేదు (ఫోటోలు)
-
కీచక బాబా బాగోతం.. ఆయన టార్గెట్ భర్తతో విడిపోయిన మహిళలే..
వరంగల్: వరంగల్‌నగరంలో కీచక బాబా బాగో తం బట్టబయలైంది. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ.. మహిళలను లైంగికంగా లోబర్చుకుంటున్న దొంగబాబాను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏసీపీ జితేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని ఏనుమామూల ప్రాంతానికి చెందిన షైక్నాలా లబ్బే (58) బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో కుటుంబంలో ఏమైనా కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటే నయం చేస్తానని నమ్మించి పలువురు మహిళలు, యువతులను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ వివాహితపై కన్నేసిన ఆయన.. ఆమెకు తన భర్తతో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకొని పూజలు చేస్తున్నట్టు న టించి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయపడిన ఆమె విషయం ఇంట్లో చెప్పింది. బాధితురాలితో కలిసి కుటుంబ సభ్యులు టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన వారు కీచకబాబాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా తన నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. తమి ళనాడుకు చెందిన షైక్నాలా లబ్బే దాదాపు 40ఏళ్ల క్రితం ఏనుమాముల ప్రాంతంలో స్థిరపడ్డాడని, తాయత్తులతో ప్రజలకు నమ్మకం కలిగించి బాబా గా మారి కీచక పనులు చేస్తున్నట్లు తెలిపారు. అత ని నివాసం నుంచి ధారాలు, తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనమూలికలు, నూనె డబ్బాలతోపాటు రూ.25వేలు స్వాధీ నం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. దొంగ బాబాను పట్టుకోవడంలో ప్ర తిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివా స్రావు, జనార్దన్‌రెడ్డి, ఎస్ఐలు శరత్ కుమార్, లవన్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుళ్లు రాజేందర్, కరుణాకర్, శ్రావణ్‌కుమార్, నాగరాజును సీసీ అభినందించినట్లు ఏసీపీ తెలిపారు. -
గుర్రం బాబా
-
దొంగబాబా...
-
బాబా వల్ల అవకాశాలు తగ్గాయి: మనీషా కొయిరాల
‘‘బాబా’ సినిమా పరాజయంతో సౌత్‌లో నాకు అవకాశాలు తగ్గాయి’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మనీషా కొయిరాల. రజనీకాంత్, మనీషా జంటగా సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘బాబా’ (2002). ఈ చిత్రం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనీషా మాట్లాడుతూ – ‘‘తమిళంలో నేను చేసిన చివరి పెద్ద సినిమా ‘బాబా’నే. ఈ సినిమా విజయంపై భారీ అంచనాలు ఉండేవి. అయితే ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ సినిమా ఫ్లాప్‌తో సౌత్‌లో నా కెరీర్ అయిపోతుందనుకున్నాను. అదే జరిగింది. ‘బాబా’కన్నా ముందు సౌత్‌లో చాలా సినిమాలు చేశాను. అయితే ఈ సినిమా పరాజయం వల్ల అవకాశాలు తగ్గాయి. అయితే ‘బాబా’ని మళ్లీ విడుదల (రజనీ పుట్టినరోజు డిసెంబర్ 12 సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 10న రీ రిలీజ్) చేస్తే, హిట్ కావడం ఆశ్చర్యం అనిపించింది. ఏది ఏమైనా రజనీ సార్‌తో సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు. -
రజనీకాంత్‌తో సినిమా చేశాక నాకు ఆఫర్లు రాలేదు: హీరోయిన్
రజనీకాంత్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో బాబా ఒకటి. ఈ సినిమా ఫలితం ఎలాగున్నా చాలామంది ఇప్పటికీ దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. రజనీ కూడా బాబా చిత్రం తనకెంతో ప్రత్యేకమని అనేకసార్లు నొక్కిచెప్పాడు. ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించింది. దీనికంటే ముందు ఆమె ఇండియన్, బాంబే, ఆలవందన్ వంటి పలు దక్షిణాది హిట్ చిత్రాల్లో నటించింది. అయితే బాబా తర్వాత తనకు సౌత్‌లో స్థానం లేకుండా పోయిందట. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బాబా నా చివరి తమిళ చిత్రం. ఆ రోజుల్లో ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఘోరంగా చతికిలబడింది. సౌత్‌లో నా కెరీర్ ముగిసినట్లే అనుకున్నా.. చివరికి నేను ఊహించిందే జరిగింది. బాబా తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అదేంటో కానీ విచిత్రంగా రీరిలీజ్ చేసినప్పుడు మాత్రం మంచి హిట్ కొట్టింది' అని చెప్పుకొచ్చింది. మణిరత్నం బాంబే సినిమా గురించి చెప్తూ.. 'మొదట బాంబే సినిమా చేయకూడదనుకున్నాను. తల్లి పాత్రలో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందని అందరూ హెచ్చరించారు. కానీ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా మాత్రం మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి నీకేమైనా తెలుసా అసలు? ఆయన సినిమా వద్దుంటున్నావంటే నీ అంత పిచ్చివాళ్లు ఇంకొకరు ఉండరు అని తిట్టాడు. అప్పుడు వెంటనే నా నిర్ణయాన్ని మార్చుకున్న అమ్మ, నేను చెన్నై వెళ్లిపోయాం. బాంబే సినిమా చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది' అని తెలిపింది. 1995లో వచ్చిన బాంబే మూవీ కల్ట్ క్లాసిక్ మూవీలో ఒకటిగా నిలిచింది. బాబా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి రజనీకాంతే స్వయంగా కథ అందించి, నిర్మించాడు. గతేడాది రజనీకాంత్ బర్త్‌డే సందర్భంగా బాబా రీరిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు రాబట్టింది. -
భగభగమండే మంటపై బాబా విన్యాసం.. వేడి ఎంతున్నా చల్లని దీవెనలు!
-
Axar Patel Latest Photos: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అక్షర్ పటేల్ (ఫొటోలు)
-
Hyderabad: ‘దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది.. నన్ను పెళ్లి చేసుకో’
సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్‌ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్‌హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు. నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు. నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి -
జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు
చండీగఢ్: తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకుంటూ అరాచకాలు సాగించిన జిలేబీ బాబా అలియాస్ అమర్‌వీర్ అలియాస్ బిల్లూ అలియాస్ అమర్‌పురి (63) పాపం పండింది. 100 మందికిపైగా మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఓ బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం సెక్షన్ 6 కింద అతనికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు హరియాణాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అదనపు జిల్లా జడ్జి బల్వంత్‌సింగ్ బుధవారం ప్రకటించారు. జిలేబీ బాబాను హరియాణా పోలీసులు 2018లో అరెస్టు చేశారు. అతడి ఫోన్లో 120కి పైగా అశ్లీల వీడియో క్లిప్పింగ్‌లను గుర్తించారు. జిలేబీ బాబా హరియాణాలోని తోహన్ పట్టణంలో బాబా బాలక్‌నాథ్ మందిరం అధినేతగా ప్రాచుర్యం పొందాడు. మహిళలకు మాదకద్రవ్యాలిచ్చి అత్యాచారం చేయడం, ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించడం, వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసి బాధితుల నుంచి డబ్బులు గుంజడం అతని స్టైల్. -
బాబా కోసం తలైవా డబ్బింగ్.. రీరిలీజ్‌కు అడ్వాన్స్ టెక్నాలజీతో రీషూట్
తమిళ సినిమా: గతంలో విడుదలైన చిత్రాలను రీమేక్ చేయడం, రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు. అయితే రీ షూట్ చేయడం, ఆధునిక టెక్నాలజీతో కొత్త హంగులను అద్దడం అరుదైన విషయమే. తాజాగా రజనీకాంత్ చిత్రానికి అదే జరుగుతోంది. ఆయన నటించిన చిత్రాలకు ఎప్పటికీ క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా రెండు దశాబ్దాల క్రితం రజినీకాంత్ కథ కథనాన్ని అందించి కథానాయకుడిగా నటించిన చిత్రం బాబా. దైవానుగ్రహాన్ని జోడించి కమర్షియల్ ఫార్మేట్లో రూపొందింన బాబా చిత్రంలో నటి మనీషా కోయిరాలా నాయకిగా నటించారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎందుకనో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఇది రజనీకాంత్‌కు బాగా నచ్చిన కథ. అందుకే దీన్ని ఆయన వదలలేకపోయారు. చిత్రంలోని లోపాలను పునః పరిశీలన చేసుకుని వాటిని భర్తీ చేసే విధంగా తాజాగా కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మళ్లీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన రీషట్ చేసిన సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశారు. కాగా చిత్ర ట్రైలర్ చసిన తర్వాత ఏమైనా కొత్తగా సంగీత బాణీలను సమకూర్చాలా అన్న ఆలోచనలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఉన్నట్లు సమాచారం. కాగా బాబా చిత్రాన్ని సరికొత్త హంగులతో రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర వర్గాలు ముందు భావించారట. అయితే ఎప్పుడైతే బాబా చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త హంగులు దిద్దుతున్నట్లు ప్రకటించారో అప్పటి నుంచి అభిమానుల్లో వస్తున్న స్పందనను చూసి ఈ చిత్రాన్ని తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది రజనీకాంత్ అభిమానులకు నిజంగా ఆనందాన్ని కలిగించే విషయమే అవుతుంది. కాగా రజనీకాంత్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. తర్వాత విను చక్రవర్తి దర్శకత్వంలో ఒక చిత్రం, ఆయన పెద్ద కూతురు దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో (అతిథి పాత్రలో) నటించనున్నారు. ఈ రెండు చిత్రాలను లైక సంస్థ నిర్మించడం విశేషం. -
Superstar Rajinikanth: మరోసారి తెరపైకి బాబా
సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం బాబా. ఆయనే కథ కథనాలను సమకూర్చారు. ఈ చిత్రానికి అన్నామలై వీరా, బాష వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. నటి మనిషా కొయిరాలా కథానాయకిగా నటించిన ఇందులో గణేష్ సుజాత ఎంఎన్ నంబియార్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, సంగవి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చోటా.కే.నాయుడు చాయాగ్రహణను, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. రజనీకాంత్‌తో దర్శకుడు సురేష్ కృష్ణ 2002 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. అప్పట్లో ఈ చిత్రంపై రాజకీయ వ్యతిరేకత కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఇందులోని మాయా మాయా, శక్తి కొడూ.. కిచ్చూ కిచ్చూ పాటలు ప్రజాధరణ పొందాయి. ఈ పాటలకు నృత్య దర్శకత్వం వహించిన బృందా, ప్రభు దేవా, లారెన్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. చిత్రంలో రజనీకాంత్ తరచూ చేతి వేళ్లతో చూపించే బాబా ముద్ర చిన్న పిల్లలకు రీచ్ అయింది. అలాంటి చిత్రాన్ని నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించి మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర కథలో కూడా మార్పులు చేస్తున్నట్లు, పాటలను కూడా రీమిక్స్ చేసి డాల్ఫీ సౌండ్ సిస్టంలో రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశాయి. -
ప్లీజ్.. ఆ హంతకుడెవరో చెప్పండి బాబా!
భోపాల్: మర్డర్ మిస్టరీని ఛేదించాలంటే.. డాగ్‌స్క్వాడ్ తనిఖీలు, ఫోరెన్సిక్ రిపోర్టులు, విచారణలు ఇలా పోలీసులు మల్లగుల్లాలు పడతారు. కానీ.. చిత్రంలోని పోలీసేమో.. తనకు బాగా నమ్మకమున్న బాబా దగ్గరికి వెళ్లాడు.. ఓ హత్య కేసులోని అనుమానితుల జాబితాను ఆయన చేతిలో పెట్టి... మర్డర్ చేసిందెవరో చెప్పమని కోరాడు. ఈ బాబా కూడా జేమ్స్‌బాండ్ టైపులో లిస్టును ఒకటికి పదిసార్లు పరిశీలనగా చూసేసి.. ఇందులో ఉన్నవారెవరూ కాదు భక్తా.. మరొకడు ఉన్నాడు అంటూ కొంచెం బేస్ వాయిస్‌తో బదులిచ్చాడు. ఈ వీడియో కాస్త.. యూట్యూబ్‌లో వైరలయ్యింది. ఇంకేముంది ఉన్నతాధికారులు.. ఆ ఆఫీసర్ ఎవరా అని ఆరా తీశారు. చివరికి మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా బమితా స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఏఎస్ఐ అనిల్ శర్మగా నిర్ధారణ అయ్యింది. వెంటనే.. సదరు ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏమిటంటే.. జూలై 28న వొతపూర్వ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి హత్యకు గురైంది. గ్రామంలోని ముగ్గురిని అనుమానిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కేసు పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వారిని వదిలిపెట్టారు. చివరికి యువతి మామను అరెస్టు చేశారు. అయితే అతడిని పరిశోధన, సాక్ష్యాల అధారంగానే అరెస్టు చేశామని, బాబా సూచన మేరకు కాదని జిల్లా ఎస్పీ పేర్కొనడం గమనార్హం. Ever imagined cop seeking help of religious guru to crack a case. No, this isn't reel life, but real life. See how ASI of MP's Chhatarpur district police gets help from religious guru Baba Pandokhar Sarkar for cracking murder case. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/RtyKBWSLZD — Anuraag Singh (@anuraag_niebpl) August 19, 2022 -
బాబా మంచివాడంటూ టీచర్ల పోస్టులు.. పోలీసులు రంగంలోకి దిగగానే..
సాక్షి, చెన్నై: చదువు, సంస్కారం నేర్పడం వారి వృత్తి. విద్యార్థులను లైంగిక వేధింపులకు ప్రోత్సహించడం వారి ప్రవృత్తి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఐదుగురు ఉపాధ్యాయినులు సీబీసీఐడీ పోలీసుల కళ్లుకప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై సమీపం కేళంబాక్కంలోని సుశీల్‌హరి పాఠశాల కరస్పాండెంట్ శివశంకర్‌బాబా అక్రమాలు అన్నీ ఇన్నీ కావనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదువుకునే రోజుల్లో తమను లైంగికవేధింపులకు గురిచేసినట్లు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు వాట్సాప్ ద్వారా బహిర్గతం చేశారు. పలువురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇటీవల శివశంకర్ బాబాను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. తరువాత ఈ కేసు సీబీసీఐడీ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. బాబాకు బెయిల్ మంజూరు చేయాలని చెంగల్పట్టులోని పోక్సో ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి తమిళరసి విచారించారు. ఈనెల 13వ తేదీన మరలా విచారణకు రాగా శివశంకర్‌బాబాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినా బెయిల్ మంజూరు కాకపోగా ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య మరలా జైలుకు తరలించారు. అదే పాఠశాలలో పనిచేసే ఐదుగురు ఉపాధ్యాయినులు బాబాను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బాబా మంచివాడని పేర్కొంటూ వెనకేసుకొస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. బాబా మద్దతుగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయినులను విచారించాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. నేరుగా విచారణకు వివరణ ఇవ్వాల్సిందిగా బాబా ఆశ్రమానికి పక్కనే ఉన్న పళనిగార్డెన్ అపార్టుమెంటులో నివసిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయినులకు సమన్లు పంపారు. అయితే ఈ ఐదుగురు హాజరుకాలేదు. ఈనెల 19వ తేదీ తప్పక హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లను స్వయంగా అందజేసేందుకు పోలీసులు శనివారం ఉదయం సదరు అపార్టుమెంటుకు వెళ్లగా ఐదుగురి ఇళ్లు తాళాలు వేసి ఉన్నాయి. పోలీసులు ఐదుగురి ఇళ్ల తలుపులుపై సమన్లను అతికించి వెళ్లిపోయారు. ఐదుగురు ఉపాధ్యాయినులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
వైరల్ వీడియో: వేప, తులసి ఆకులతో ప్రకృతి మాస్క్
-
వైరల్: బాబా మాస్క్ భలే భలే!
లక్నో: కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ తరువాత సెకండ్ వేవ్ మొదలైంది. ఇది ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, డబుల్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జుగాడు బాబా కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి మాస్క్ ధరించాడు. ప్రస్తుతం బాబా ధరించిన వేప, తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను రూపీన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ట్విటర్లో పోస్టు చేస్తూ ‘‘ఈ మాస్క్ కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.కానీ అవసరం తల్లి లాంటిది’’ అని పేర్కొన్నాడు. ఓ వ్యక్తి ఆసక్తితో బాబా వద్దకు వచ్చి ఈ మాస్క్ ఎలా తయారు చేశారని అడిగాడు. దానికి ఆయన బదులిస్తూ.. వేప, తులసి ఆకులు ఏ రకమైన వ్యాధికైనా మంచి ఔషధంగా పనిచేస్తాయనేది మనకు తెలుసు. జనాలు సాధారణంగా ఉపయోగించే మాస్క్‌ల కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నట్టు బాబా తెలిపారు. తులసి, వేప ఆకులతో చేసిన ఈ మాస్క్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా జుగాడు బాబా ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా బస్ స్టాండ్ వద్ద ఈ ప్రకృతి మాస్క్‌తో కనిపించారు. (చదవండి: బంగ్లాదేశ్ మహిళా జర్నలిస్టు విడుదల)