
రజనీకాంత్
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈయన ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఒక్క సినిమాల విషయంలోనే కాదు.. ఆయన వ్యకిగత జీవితానికి కూడా వర్తిస్తుంది. మనసు బాగోలేకపోతే అందరూ గుడికి వెళతారు కానీ రజనీ మాత్రం హిమాలయాలకు వెళతారు. రోజుల కొద్ది అక్కడే ధ్యానం చేస్తూ గడుపుతారు. ఇప్పుడు కూడా హిమాలయాలకు ప్రయాణమవుతున్నారు.
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఇంత వరకు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించని రజనీ తన రాజకీయ ప్రయాణానికి ముందు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకుంటున్నారు. కొద్ది రోజులు హిమాలయాల్లోని బాబా గుహల్లో గడపనున్నారు. చెన్నై నుంచి సిమ్లాకు, అక్కడి నుంచి కేదారినాధ్ మీదుగా హిమాలయాల్లోని బాబా గుహలకు చేరుకుంటారు.